Thursday, 18 April 2013


NEW WORLDS
1507 లో వచ్చిన Martin Waldeseemuller's Universalis cosmographia కి ముందెప్పుడూ మ్యాప్స్ లో

కనపడని అమెరికా మీద యూరోపియన్స్ కాలుపెట్టపోతున్నారు. గోల్డ్, ల్యాండ్ కోసం యూరప్ రాజ్యాలు బ్రిటన్, స్పెయిన్, ప్రాణాలకి తెగించి అనంతమైన సముద్రాల మీద పడి, అమెరికా(కరేబియన్ తో కలుపుకోని) ఖండాల కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. 

అమెరికా భూభాగాన్ని జయించి, కాలనైజ్ చేయడం చరిత్ర తన మీద తను జరుపుకున్న అతి ముఖ్యమయిన
ఒక సహజప్రయోగం. రెండు వెస్టర్న్ సంస్కృతులని ఎగుమతి చేసి, విశాలమయిన భూభాగాల మీదా, విభిన్న ప్రజల మీదా అమలుపరచి, చివరకి ఏ సంస్కృతి మెరుగ్గా పని చేస్తుందో, బ్రిటన్ ఉత్తర అమెరికా మీదా, స్పెయిన్ మరియు పోర్చుగీస్ లు దక్షిణ అమెరికా మీదా తేల్చి చూసుకున్న ఒక ప్రయోగం. 

వెనక్కి తిరిగి చూస్తే, అసలు పోటీయే లేదన్న సంగతి స్పష్టం. ఇన్ని వందల సంవత్సరాల్లో ఉత్తర అమెరికాదే పైచేయి. ఎలా, ఎందుకు అన్న ప్రశ్నలుదయించక మానవు? ఉత్తరాన మట్టి సారవంతమైనదా? దాని కింద గోల్డ్, ఆయిల్ ఉండిందా? లేక వాతావరణ పరిస్థితులు మెరుగయినవా, నదులు అనువైన ప్రదేశాల్లో ప్రవహించేవా? అదీ కాక, యూరప్ ఉత్తరమెరికాకి దగ్గిరగా ఉండడం వల్లనా? కానీ ఇవ్వేవీ కావు. అలాగే, స్పెయిన్, పోర్చుగీస్ లకి ఇంతకుముందు చాప్టర్స్ లో చూసినట్లుగా ఓరియంటల్, ఒట్టోమాన్ ఎంపైర్స్ కున్న బలహీనతలు కూడా కారణం కాదు. 

వీటన్నిటికన్నా ఒక ఐడియా, ఈ బృహత్తరమైన మార్పుకి కారణం. ప్రజలు తమల్ని తాము ఎలా పరిపాలించుకోవాలి అన్న ఒక సూత్రం. చాలా మంది దీన్ని డెమొక్రసీ అని పొరపడుతుంటారు. ఏ దేశమయినా అలవోకగా ఎన్నికలు నిర్వహించుకోవడం ద్వారా డెమొక్రసీని సాధించుకోవచ్చని భావిస్తుంటారు. నిజానికి డెమొక్రసీ ఎత్తైన కట్టడం మీదున్న గోపురం లాంటిది. దాని మూలాలు పటిష్టమయిన న్యాయవవస్థ, వ్యక్తి స్వేచ్చకున్న పవిత్రతా, ప్రైవేట్ ఆస్థిహక్కుల భద్రతా మొదలగువాటిని కాపాడే రాజ్యాంగబద్దమైన ప్రజాప్రభుత్వం లో దాగుంటాయి. 

***

మన కథ రెండు పడవలతో మొదలవుతుంది. ఒకదాంట్లో 200 లోపే ఊన్న స్పెయిన్ జనాభా. వారి లక్ష్యం, Inca Empire ని జయించి అక్కడున్న విలువయిన మెటల్స్ సంపదని స్పెయిన్ రాజుకి కట్టపెట్టడం. ఈ పడవ ఉత్తర ఈక్వడార్ ని 1532 లో చేరుతుంది. ఆ తర్వాత 138 సంవత్సరాలకి రెండవ పడవ, Carolina 1670 లో అమెరికా లోని South Carolina ని చేరుతుంది. దాన్నిండా ఇంగ్లాండ్ లో తమ పేదరికాన్ని వదిలేసి, దూరతీరాల్లో మెరుగైన బ్రతుకు కోసం బయలుదేరిన సర్వంట్స్. 















conquistador-incan-empire-3
మొదట్లో దక్షిణాన విజయభేరి మోగిస్తున్న స్పెయిన్ ప్రజలకే అన్నీ అనుకూలంగా ఉన్నట్లుగా కనపడుతోంది. మరి వారే కదా ముందు వెళ్లింది. పదహారవ శతాబ్ధంలో ఇంగ్లాండ్ మీమాంసలతో కాలం వెళ్లబుస్తున్న కాలంలో, అమెరికా ఖండాల కాలనైజేషన్ పని Iberian Peninsula (స్పెయిన్, పోర్చుగీస్, ఫ్రాన్స్ లో కొద్ది భాగం ) వారే చేపట్టారు. 1519 నుండి 1521 మధ్యలో Hernan Cortes, మెక్సికో లోని Aztecs ని మట్టికరపించాడు. కేవలం ఓ దశాబ్ధంలోపునే Francisco Pizarro, పెరూ లో Incas Andean empire ని నేలమట్టం చేసాడు.

pizarro-seizing-atahualpa
కేవలం అతికొద్దిమంది బలగంతో ఉన్న Spainards, యాభై  లక్షల నుండీ, ఒక కోటి వరకీ ఉన్న Incas ని, ఎలా అంతమొందించారన్నది ఐదొందల సంవత్సరాల తర్వాత కూడా దిగ్భ్రాంతి కలిగించే విషయం. Spainards దగ్గిర ఉన్నhorses, guns, crossbows ఎంత ఉపయోగపడ్డాయో,వారి వెంట వచ్చిన smallpox, influenza, measles, typhus లాంటి వ్యాధులు, Incas కి అంతకన్నా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించాయి. దీనికి తోడు Incas లో ఉన్న అంతర్గత విభేధాలు కూడా Spainards కి కలసివచ్చాయి. 



కానీ పెరూ ఒక్కరోజులోనో, ఒక్క యుద్దం లోనో వశం కాలేదు. 1535, 1536 & 1539 లో Incas తిరుగుబాట్లు చాలానే జరిగాయి. రెడ్ ఇండియన్ లు బలహీనులేమీ కాదు, అతిగొప్ప గెరిల్లాఫైటింగ్ వీరులు. యురోపియన్స్ యుద్దనైపుణ్యాలని తొందరగా వొంటబట్టించుకున్నారు. దానికి తోడు స్పెయిన్ వలసదారుల అంతర్గత కలహాలు కూడా తోడయ్యి, దాదాపు ముప్పయి సంవత్సరాల అనంతరం అంటే 1572 కి కానీ, Incas ని పూర్తిగా ఓడించలేకపోతారు. 

Storming_of_the_Teocalli_
by_Cortez_and_His_Troops
స్పెయిన్ దాడులకి ఒక సాకుగా Incas క్రిస్టియానిటీ లోకి మారట్లేదని చెప్పినప్పటికీ, నిజానికి గోల్డ్ కోసం Pizarro దండెత్తాడు. దండయాత్రలో బంధింపబడ్డ Incas నాయకుడు Atahualpa తనని విడిపించుకోటానికి తన గది నిండా బంగారాన్నీ, వెండినీ తెప్పిస్తాడు. తద్వారా లబించిన 13,420 pounds of 22 carat gold, 26,000 pounds of silver స్పెయిన్ దండయాత్రికులని ఎంతో ధనవంతులని చేసింది. కాని, ఇంకా ఎన్నో రెట్లు వేచి చూస్తోందన్న విషయం స్పెయిన్ సైన్యానికి తెలుసు. Hispanolia, Zacatecas లో వెండి నిల్వలూ, ముఖ్యంగా Cerro Rico, Potosi లో ప్రపంచం కనీవిని ఎరుగనంత వెండి మైన్స్ లభ్యమవుతాయి. పెరూలో ఎటు చూసినా బంగారం, వెండి నిల్వలు కనిపించడంతో స్పెయిన్ ఆక్రమణదారుల పంటపండుతుంది. క్రమంగా మైన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ని పెంచి, 1500 - 1800 మధ్య ఈరోజు విలువల్లో దాదాపు 109 బిలియన్ల బ్రిటీష్ పౌండ్ల విలువ గల బంగారం, వెండి ఈ కొత్త ప్రపంచం నుంచి, యూరప్ కీ, పసిఫిక్ మీదుగా ఏషియా కీ ఎగుమతి చేయబడింది. 

Silver mines in New Spain

స్పెయిన్ శ్రీమంతులు దక్షిణమెరికాలో ఒక కొత్త నాగరికత కి శ్రీకారం చుట్టారు. వీరున్న నగరాల్లో జనాభా పెరగటం ప్రారంభించింది. 1692 లో మెక్సికో సిటీ లో ఒక లక్షమంది ప్రజలు నివసిస్తూండగా, ఉత్తరమెరికాలోని బోస్టన్ లో కేవలం 6,000 మంది మాత్రమే ఉండేవారన్న గణాంకం ఆ రోజుల్లో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మధ్యనున్న తేడా ఎంతో చెపుతుంది. క్రమంగా స్పెయిన్ వలసదారులు 25 స్పెయిన్ యూనివర్సిటీలు ప్రారంభించారు. Meso-American ఆహారాన్ని ఇష్టపడ్డారు. వందల కొద్దీ వైభవమైన చర్చ్ లు కట్టించారు. కాలక్రమేణా చర్చ్ యొక్క ప్రభావం పెరిగినప్పటికీ, నిజమైన అధికారకేంద్రం మాత్రం స్పెయిన్ రాజకిరిటానిదే. అధికారికంగా భూమి అంతా స్పెయిన్ రాజు పేరు మీదే ఉండేది. 

ఇదిలా సాగుతుండగా, ఉత్తరమెరికా లో ఆస్థి-హక్కులు, ఆస్థి-పంపిణీల విధానం దీనికి పూర్తి భిన్నంగా నడచింది. అదేంటో చూద్దాం.

***

LAND OF THE FREE

1670 లో ఒక పేద ఇంగ్లీష్ Indentured Servants జంట అమెరికాలోని కెరోలీనా ఒడ్డున దిగింది. 17వ శతాబ్ధంలో అమెరికాకి వచ్చిన వలసదారుల్లో 65 నుంచి 75 శాతం వరకీ కూడా Indentured Servants గా వచ్చినవాళ్ళే. (తొలితరం అమెరికా వలసదారుల్లోని Farmers, Planters, Shopkeepers కి పనివాళ్ళు దొరకటం కష్టమయి, యూరప్ నుంచి యువకులని పట్టుకొచ్చేవాళ్ళు. వీరిని Indentured Servants అనేవాళ్ళు. వచ్చే యువకులంతా ఒక నియమిత కాలానికీ, కొన్ని నిబంధనలకీ అంగీకరించి కాంట్రాక్ట్(Indentured document) మీద సంతకం పెట్టి వచ్చేవాళ్ళు. యజమానులు యూరప్ నుంచి, అమెరికాకి ప్రయాణఖర్చులు భరించేట్లుగానూ, Indentured seravnts కొన్ని సంవత్సరాలు కేవలం వసతీ, ఆహారం అనే జీతభత్యాలతో మాత్రమే పనిచేసి, వారి కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక, స్వతంత్రులుగా ఈ కొత్త ప్రపంచంలో భూమిని సాగుచేసుకునే, స్వంతం చేసుకునే హక్కు సంపాదించుకునేట్లుగానూ ఆ కాంట్రాక్ట్స్ ఉండేవి). 

ఈ రకమైన మైగ్రేషన్ దక్షిణమెరికాకి చాలా భిన్నమైనది. స్పెయిన్ వలసదారులకి గుట్టలకొద్దీ వెండి దొరికింది కానీ, ఉత్తరమెరికాలోని కెరోలినా వడ్డున విరిగిపోయిన చెట్లుతప్ప మరేమీ లేవు. 

పైన చెప్పిన జంటలాంటి మిగతా Indentured servants అమెరికాకి వచ్చేప్పుడు చేతిలో ఏమీ తెచ్చుకోలేదు. తెచ్చుకోటానికి కూడా పెద్దగా ఏం లేదు. వారి అట్లాంటిక్ ప్రయాణఖర్చులు సైతం యజమానులే పెట్టుకునేవాళ్లు. కానీ వీరంతా ఎన్నో ఐడియాస్ తో కొత్త ప్రపంచం మీద కాలుపెట్టారు. వాటిల్లో మొట్టమొదటిది: ఆస్థిహక్కుల మీద వారి ఆలోచనవిధానం. రెండవది: ప్రొటెస్టెంట్ ఐడియాలజీ. మూడవది: పన్నులు ఇంగ్లాండ్ రాజు గారి చిత్తప్రకారం విధించకుండా కేవలం పార్లమెంట్ సంస్థ అప్రూవల్ ద్వారా మాత్రమే పన్నులవిధింపు ఆమోదం పొందాలి.

నిజానికి రాజ్యాధికారాన్ని ఇంగ్లాండ్ లో పార్లమెంట్ అప్పటికే సవాల్ చేస్తోంది. 1628 లో పార్లమెంటరీ రాజ్యవిమర్శకులు, పార్లమెంట్ అనుమతి లేకుండా ఏ ఒక్క వ్యక్తీ, ఇంగ్లాండ్ తరపున బహుమతులు కానీ, అప్పులు మంజూరు చేయటం కానీ, పన్నులు విధించటం కానీ చేయకూడదనీ డిమాండ్స్ చేయటం మొదలుపెట్టారు. దానికి కింగ్ చార్లెస్ ఒప్పుకోకుండా తన అధికారాలని ఇంకా విస్తృతపరచాలని ప్రయత్నించటంతో, దేశంలో యుద్దం మొదలయింది. దానికి 30 Jan 1642 న కింగ్ చార్లెస్ అతి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది, తన ప్రాణంతో. ఆ తదుపరి జరిగిన పరిణామాలతో 1688 కల్లా పార్లమెంట్ అనుమతి లేకుండా అసలు రాజసింహాసనానికి డబ్బు ఏ రూపేణా అయినా ఇవ్వటం చట్టవ్యతిరేకమయింది. 



కానీ, 17 వ శతాబ్ధంలో ఇంగ్లాండ్ లో వీటన్నిటికన్నా బలమయిన మార్పు, రాజకీయాల స్వభావం మారటం వల్ల వచ్చింది. ఈ డిబేట్ లో ఒక వైపు Thomas Hobbes with the book Leviathan (1651), మరోవైపు John Locke with First Treatise of Government (1690) నించున్నారు. Hobbes మనుషుల్లో సహజంగా ఉండే డిసిప్లిన్ తక్కువనీ, స్వపరిపాలనలో వ్యక్తి స్వార్థంతో మనుషులు, సమూహాలు ప్రభావితమవుతారని, సమాజ సమిష్టి శ్రేయస్సుకిది పెద్ద అడ్డంకిగా మారుతుందనీ, కేంద్ర స్థానంలో బలమైన శక్తివంతమైన అధికారం ప్రజల్ని భయభక్తులతో పరిపాలించాలని వాదించాడు. ఆ అధికారం కేవలం రాజు కే చెంది ఉండక్కర్లేదనీ, పార్లమెంట్ చేతిలో ఉన్నా పర్లేదని అభిప్రాయపడ్డాడు. 

ఈ వాదనకి సవాల్ విసిరిన రచన John Locke's second Treatise of Government. ప్రజలు 'భయం' ఆధారంగా పని చేసే ప్రభుత్వపు పరిపాలనని ఇష్టపడరనీ, వారి వ్యక్తిగతస్వేచ్చని వ్యవస్థలోంచి తీసేయడం నిరంకుశమనీ, మనిషి సహజంగా హేతుజంతువనీ, సంఘంలో బతకడానికిష్టపడ్డప్పుడు సంఘశ్రేయస్సు వ్యక్తి శ్రేయస్సు కి కూడా ముఖ్యమన్న విచక్షణా జ్ణాణాన్ని కలిగి ఉంటాడనీ వాదించాడు. ఈ సూత్రం మీద నిర్మించబడ్డ సమాజాల్లో అధికారం అనేది ఒక 'సివిల్ సొసైటీ', 'చట్టవ్యవస్థ" ల ద్వారా అమలు చేయబడుతుందనీ, వీటి ప్రధాన నిర్ణయాలన్నీ మెజారిటీ ప్రజల ఆమోదం ఆధారంగా జరుగుతాయనీ/జరగాలనీ వాదించాడు. 

Hobbes అధికారమంతా కేంద్రీకృతమయి, అవిభాజ్యంగా ఉండాలన్న వాదనకి వ్యతిరేకంగా, Locke, Executive, Federative, Legislative branches విడివిడిగా ఉండాలనీ వాదించాడు. కానీ Legislative branch కి మిగతా వ్యవస్థలకన్నా ఎక్కువ అధికారం ఉండాలనీ, జడ్జ్ లని నియమించే అధికారం, న్యాయ, చట్ట నియమాలని తయారు చేసే అధికారం కలిగి ఉండాలనీ వాదించాడు. 

అలాగే, వ్యక్తులు సంఘం/దేశంలో కలసి భాగమయ్యి, పరిపాలించబడడానికి ఇష్టపూర్వకంగా సమ్మతం వ్యక్తపరచడానికి అతి ముఖ్యమైన సూత్రం: ఏ అధికార కేంద్రమయినా తమ ఇష్టానుసారంగా వ్యక్తి స్వేచ్చ ని తోసిపుచ్చదన్న నమ్మకమూ, తనూ, తన మనుషులూ, "వ్యక్తిగత ఆస్థులూ" , ఇల్లూ, వస్తువులని ఏ అధికారశక్తో అమాంతంగా కబ్జా చేయకుండా, సమాజ చట్ట/న్యాయ వ్యవస్థలు భధ్రంగా కాపాడతాయన్న నమ్మకమే అని అభిప్రాయపడ్డాడు. వ్యక్తి "ప్రాపర్టీ"ని కాపాడలేని ఏ వ్యవస్థా అంతిమంగా నిలవజాలదనీ Locke అభిప్రాయపడ్డాడు. వ్యక్తి అనుమతి లేకుండా తన 'ప్రాపర్టీ " ని ప్రభుత్వం తీసుకోరాదనీ హెచ్చరికలు జారీ చేసాడు. వ్యక్తి ప్రాపర్టీకి భధ్రతని ఇచ్చినప్పుడే, ప్రభుత్వానికి పన్నులు విధించే అధికారం లభిస్తుందనీ/లభించాలనీ, ఆ హక్కుల్ని కల్పించలేనినాడు వ్యక్తులు పన్నులు కట్టకూడదనీ/కట్టడానికిష్టపడరన్న వాదన, కొత్తగా ఆవిర్భవిస్తున్న అమెరికాలో ఎంతో బలమైన ప్రభావాన్ని కనపరచింది. 

ఈ కొత్త ప్రపంచం వెస్టర్న్ మోనార్కీస్ కి బోల్డంత భూభాగాన్ని జతకూర్చడంతో కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దక్షిణాన స్పెయిన్ ఉత్తరాన ఇంగ్లీష్ వలసదారులకి ఈ కొత్త భూమి మీద యాజమాన్యపు హక్కులని ఎలా సర్ధాలి అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానం భవిష్యత్తు వెస్టర్న్ ప్రపంచపు నాయకత్వాన్ని నిర్ణయించదనడంలో అతిముఖ్యమయిన పాత్ర పోషించింది.

కారోలినా మీద అడుగుపెట్టిన మొట్టమొదటి పడవలకి కెప్టెన్ అయిన జాన్ లాక్ , ఈ కొత్త ప్రపంచం కోసం ఒక వ్యవస్థీకృతం చేయబడ్డ ఒక నమూనా ని పట్టుకొచ్చాడు. The fundamental constitution of Carolina ని March 1669 లో రచించింది సాక్షాత్తూ జాన్ లాక్. అయితే దీంట్లో పాత ఇంగ్లాండ్ రాజరికపు చాయలెన్నో ఉన్నాయి. కొత్త ప్రపంచంలో కూడా అరిస్టోక్రసీ ని క్రమంగా వ్యాపింపచేసే సూచనలని కాలనిస్టులు తెలివిగా త్రోసిపుచ్చారు. అయితే రాజకీయవ్యవస్థల్లో ప్రాతినిధ్యానికీ, ఆస్థిహక్కు కీ సంబంధం ఉండాలన్న సూచన మాత్రం అమలులోకి తీసుకున్నారు. జాన్ లాక్ రచించిన కారోలినా రాజ్యాంగం ఆర్టికల్ 4 లో అరవైఆరుశాతం భూభాగం ప్రజలకి చెందాలనీ, పార్లమెంట్ మెంబర్ అవ్వాలంటే కనీసం ఐదువందలఎకరాలకి స్వంతదారు అయ్యి ఉండాలనీ, అదేసమయంలో ఏభైఎకరాలకి తక్కువున్న ప్రజలకి పార్లమెంట్ సభ్యుణ్ణి ఎన్నుకునే ఓటింగ్ హక్కు ఇవ్వకూడదని ప్రతిపాదించాడు. దాంతో ఈ భూభాగం ఎలా విడగొడబట్టుతుందీ దాని సంపాదనా హక్కులెలా నిర్ణయించబడతాయి అన్న ప్రశ్న కీలకమయింది.

ఆ ప్రశ్నకి సమాధానంలో భాగంగా ముఖ్యమైనది "గ్యారంటీడ్ మినిమమ్" నియమం. వలస వచ్చిన ప్రతి 'free man" కి వంద ఎకరాలు శాశ్వతంగా ఇవ్వబడతాయి. మరి ఇంత పెద్ద భూభాగాన్ని పంచుకోడానికి సరిపడా "free men" రాకపోతే? ఈ ప్రశ్నకి సులువయిన సమాధానమే దొరికింది. Indentured Servants వారి వారి ఒప్పందాల 
కాలపరిమితి(సాధారణంగా 5,6 సంవత్సరాలు) పూర్తి చేసాక, వారికి కూడా భూమి పంచబడుతుంది. 

ఉదాహరణగా Millicent How and Abraham Smith లని చూద్దాం. ఇంగ్లాండ్ లో వారి జీవితం కష్టంగా సాగుతోంది. కారోలినా కి వలసవెళ్దామా అన్న ఆలోచనని, అట్లాంటిక్ ని దాటి వెళ్ళి కొత్త భూభాగం మీద పడబోయే కష్టాలు భయపెట్టకమానలేదు. కానీ పొందబోయే అవకాశాలు, తీసుకోబోయే రిస్క్ లని అధిగమించాయి. నిజానికి ఆ కాలంలో ఇంగ్లాండ్ లో ఆస్థిహక్కులు పటిష్టంగానే ఉన్నప్పటికీ, ఆస్థి అంతా కొద్ది మంది జనాభా మధ్యే కేంద్రీకృతమయి ఉండేది. (1436 లో కేవలం 6,000-10,000 కుటుంబాలు 45 శాతం భూమిని, 20 శాతం చర్చ్, రాజకోట ఒక 5 శాతాన్నీ ఆక్రమించుకోని ఉన్నాయి) కానీ కొత్తగా ఏర్పడిన అమెరికాలో సంఘంలోని అతిక్రింద వర్గాలకి చెందిన వారికి కూడా ఆస్థిహక్కునిచ్చెన మీద పాదం పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయం అర్ధమవడంతో Millicent How and Abraham Smith లు మరో ఆలోచన లేకుండా పడవమీద కాలు పెట్టారు. ఒక మనిషి ఎంత భూమిని దున్ని, నాట్లు వేసి, మెరుగుపరచి, వ్యవసాయానికి అనువుగా చేసి దాని ప్రతిఫలాన్ని పొందుతాడో, ఆ భూమికంతా అతనే స్వంతదారుడవుతాడన్న జాన్ లాక్ మాటల్ని గమనిస్తే , అభివృద్ది కోసం ఏ ఓనర్ లేకుండా వేచి చూస్తున్న ఎంతో భూమిని సాగుచేసి స్వంతం చేసుకోవడం కోసం వలసదారులు పోటీపడి కష్టపడ్డారన్న విషయం ఊహకందనిది కాదు. 

 పైన చెప్పిన నియమాల ప్రకారం, మొట్టమొదటి సెటిలర్స్ కాలం నుంచీ జరిగిన ప్రతి భూమి ట్రాన్సాక్షన్ నీ North Charleston Conveyancing office లో నమోదు చేయడం జరిగింది. Indenture deed term పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తికీ ఇచ్చిన చిన్నా, పెద్ద జాగా ల విషయాలని కూడా నమోదు చేసారు. Millicent How కి100 ఎకరాలూ, Abraham Smith కి 270 ఎకరాలు ఇవ్వబడినవన్న విషయం ఈ రికార్డులుచూసి గమనించొచ్చు. జాన్ లాక్ Fundamental Constitutions of Carolina లో చెప్పినట్లుగా పొలిటికల్ పవర్ కేవలం భూమి స్వంతదారులకి మాత్రమే ఉంటుందన్న నియమం Millicent How, Abraham Smith ల లాంటి వారికి పొలిటికల్ ప్రాతినిధ్యాన్ని సంపాదించిపెట్టింది. Abraham Smith ఇప్పుడు తన ఇష్టానుసారంగా పార్లమెంట్ మెంబర్ లేక జ్యూరీ మెంబర్ అవ్వచ్చు. (ఆసక్తికరంగా ప్రతి జ్యూరీ మెంబర్ కీ, పార్లమెంట్ మెంబర్ కీ ఎన్ని వందల ఎకరాలున్నా కూడా ఒకే ఒక్క వోట్ ఉండేది).

ఈ "ఆస్థిహక్కుదారుల ప్రజాస్వామ్యం " క్రమంగా ఊపందుకుంది. ఇలా ఏర్పడిన పొలిటికల్ రిప్రజింటేటివ్ సంస్థలు క్రమంగా గవర్నమెంట్ లో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టాయి. 

Abraham Smith లాంటి ఒక అతి సాధారణమయిన వ్యక్తి , ఓ కొత్త భూమ్మీదున్న ప్రకృతిలో కాలుపెట్టి కొద్ది కాలంలోనే ఆస్థిహక్కుదారుడయ్యి, వోటర్ గా కూడా ఎదగడమనేది ఈ కొత్త వ్యవ్యస్థలో అతికీలకమయిన విషయంగా పరిగణించవచ్చు. ఆ కాలంలో అమెరికాలోని పదమూడూ కాలనీల్లో ఏడింట, వోటింగ్ హక్కు ఆస్థియాజమానులకీ లేక ఆస్థిపన్ను కట్టే ప్రజలకి మాత్రమే ఉండేది. 

Jeronimo de Aliaga
దీనికి సరిగ్గా వ్యతిరేకంగా దక్షిణాన స్పానిష్ కాలనీల్లో భూమిహక్కులు పంచబడ్డాయి. 11 August 1534 న జారీచేయబడ్డ డిక్రీ లో Francisco Pizarro ఓ అందమైన Ruringuaylas Peruvian అనే లోయని Jeronimo de Aliaga కి మంజూరు చేయడం జరిగింది. ఈ లోయ(valley) చాలా సారవంతమైనది, దీంట్లో ఉన్న గుట్టలనిండా విలువైన లోహముడిసరుకులున్నాయి. ఈ విలువైన వనరులని ఎలా ఉపయోగించుకోవాలా అన్నదే ఇప్పుడు Aliaga ముందున్న ప్రశ్న. దీనికి సమాధానం John Locke ఉత్తరమెరికాలో ప్రవేశపెట్టిన నమూనాకి పూర్తిగా భిన్నమైనది. మొదటగా గమనించవలసిన విషయమేమిటంటే, సాంకేతికంగా Aliaga కి మంజూరు చేయబడిన 
హక్కు ఈ లోయలో ఉన్న భూమి మీద కాదు. ఇందులో ఉండే స్థానిక 6,000 ఇండియన్ ప్రజల శ్రమ మీద. ఈ లోకల్ ఇండియన్ ప్రజలు స్పెయిన్ వలసదారులు రాకముందు Inca empire కి పనిచేసేవాళ్లు, ఇప్పుడు Spainards కి పనిచేస్తారు అంతే తేడా. Aliaga ఈ ఇండియన్ ప్రజలని తన ఇష్టానుసారంగా భూమి దున్నడానికైనా, గోల్డ్ తవ్వడానికైనా, సిల్వర్ వెలికితీయడానికైనా ఉపయోగించుకోవచ్చు. ఉత్తరాన బ్రిటీష్ కాలనీలయిన కారోలినాల్లో జరిగినదానికి వ్యతిరేకంగా దక్షిణాన ఏర్పడుతున్న స్పానిష్ అమెరికాలో అతికొద్దిమంది elite వర్గాలకే స్థానిక ఇండియన్ ప్రజల శ్రమ మీద అధికారాలు ధారధత్తం చేయబడ్డాయి. అయితే లోకల్ ఇండియన్ ప్రజలని అబ్యూస్ చేస్తున్నారన్న ఆరోపణలెక్కువయి ఈ రకమైన వ్యవస్థలో 1542 లో కొద్ది మార్పు వచ్చింది. ఇకనుంచీ ఇండియన్ ప్రజల శ్రమ మీద హక్కులని మంజూరు చేసే అధికారం స్పెయిన్ రాయల్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. ఈ కొత్తగా వచ్చిన Castilian Law ప్రకారం, భూమిహక్కు అధికారాలు రాయల్ క్రౌన్ కి మాత్రమే చెందుతాయనీ, ఏ భూమికీ చుట్టూ ఫెన్స్ వేయరాదనీ ప్రకటించడం జరిగింది. అయితే కాలక్రమేణా ఈ వ్యవస్థ వల్ల అతికొద్ది మంది ధనవంతులుగానూ, అత్యధికప్రజలు చిన్న చిన్న ముక్కలయిన ప్లాట్స్ కి ఓనర్స్ గానూమిగిలిపోయారు. 

1700 లలో కూడా స్పానిష్ అమెరికాలో ఉన్న జనసాంద్రత ఉత్తరమెరికా కన్నా చాలా ఎక్కువే. ఈ కారణం వల్ల యూరప్ నుంచి Indentured Servants ని దిగుమతి చేసుకునే అవసరాలెక్కువ ఉండేవి కాదు. నిజానికి పదహారవ శతాబ్ధపు మొదట్లో స్పానిష్ ప్రభుత్వం అమెరికా కాలనీస్ కి వెళ్తూన్న మైగ్రేషన్ కి కట్టుబాట్లువిధించింది. ఇలా ఏర్పడిన వ్యవస్థ వల్ల సాంఘికంగా పైకి ఎదగడానికి బ్రిటీష్ అమెరికా లో ఉన్నన్ని అవకాశాలు స్పానిష్ పరిపాలనలో లభ్యమయ్యేవి కాదు. 

స్పానిష్ పరిపాలనలో ఇంకో ముఖ్యమైన విషయం Roman Catholicism. Catholicism చెడ్డదేమీ కాదు. నిజానికి స్థానిక ఇండియన్ ప్రజల మీద జరుగుతున్న అబ్యూసెస్ ని వెలుగులోకి తెచ్చింది Dominican Missionary Fray Pedro de Cordoba. కానీ Catholicism ఒక రకమయిన మోనోపోలి ఉన్న వ్యవస్థ. దీనికి భిన్నంగా ఉత్తరమెరికా నిండా ఎన్నో ప్రొటెస్టెంట్ వర్గాలు వెలిసాయి. భిన్నత్వం, అసమ్మతి అనేవి బ్రిటీష్ సెటిల్మెంట్ లో ఆర్గనైజింగ్ ప్రిన్సిపుల్స్ అయ్యాయి. దీనివల్ల జరిగిన నష్టాలు లేకపోలేదు కానీ స్థూలంగా చూస్తే religious and political freedom కోసం బద్దులైన merchants and farmers తో నిండి ఉన్న ఒక సంఘం ఉత్తరమెరికాలో ఏర్పడింది. 
***
AMERICAN REVOLUTIONS:



1775 వచ్చేప్పటికల్లా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఆర్ధిక, సాంఘిక తారతమ్యాలెన్ని ఉన్నప్పటికీ, అవి రెండూ కూడా సుదీరతీరాన ఉన్న రాజుల ఆధీనంలో ఉన్న కాలనీలు మాత్రమే. ఆ పరిస్థితి మారబోతోంది.



2nd July 1776 న మొట్టమొదటిసారిగా సౌత్ కెరోలినా ప్రభుత్వం తన స్వతంత్రప్రకటన చేసింది. ఆ తరవాతి నలభై సంవత్సరాలకి లాటిన్ అమెరికాలో స్పానిష్ పరిపాలన అంతమయింది. అయితే ఒక తిరుగుబాటు వ్యక్తి ప్రైవేట్ ఆస్థి మీద ప్రజాస్వామిక హక్కులని మరింత పఠిష్టం చేసే దిశగా సాగి భవిష్యత్తు వంద సంవత్సరాల్లో భూమ్మీద అత్యంత ధనికదేశంగా ఎదిగితే, Rio Grande కి దక్షిణాన ఉన్న అమెరికా విప్లవాలన్నీ కూడా రెండు శతాబ్థాల విభజనకీ, అస్థిరతకీ, అరకొర అభివృద్దికీ దారితీసింది. ఎందువల్ల?


Comunero Revolt
స్పానిష్, బ్రిటీష్ సామ్రాజ్యాలు రెండూ కూడా ఉత్తర, దక్షిణమెరికాల్లో పద్దెనిమిదవ శతాభపు చివర్లో సంక్షోభాలని ఎదుర్కొన్నాయి. అట్లాంటిక్ మీదుగా నడచిన వాణిజ్యం మీద మితిమీరి పెంచిన రెగ్యులేషన్స్ రెండు ఖండాల్లోనూ తిరుగుబాట్లని లేవదీసాయి. 1770s లో బ్రిటీష్ వారి ఉత్తరమెరికాలోనే కాదు, స్పెయిన్ సామ్రాజ్యంలో కూడా Tupac Amaru II యొక్క Andean Rebellion, New Granada లో Comunero Revolts జరిగాయి.


అయితే ఉత్తరమెరికాలోని 13 కాలనీలు స్వాతంత్రం ప్రకటించుకోవడమనేది , బ్రిటీష్ రాజ్యం పరిధికి మించి అధికారాలని విస్తరించుకుంటోవటం మీదా, అమల్లో ఉన్న Taxation without representation మీదా తిరుగుబాటొక్కటే కాదు. అమెరికన్ రివల్యూషన్ లో భూమి హక్కు అనేది ముఖ్యమయిన పాత్ర పోషించింది.

North-America1763

Appalachians కి పశ్చిమంగా సెటిల్ మెంట్స్ చేయరాదన్న బ్రిటీష్ ప్రభుత్వపు తీర్మానం, పశ్చిమాన అనంతంగా కన్పిస్తున్న భూమ్మీదకి విస్తరిద్దామని ఆశిస్తున్న అమెరికన కాలనిస్టులకీ ముఖ్యంగా ప్రాపర్టీ స్పెక్యులేటర్స్ అయిన జార్జ్ వాషింగ్టన్ లాంటి వారికీ అశనిపాతంలా తగిలింది. బ్రిటన్ తో జరిగిన "Seven years war" లో బ్రిటీష్ ప్రభుత్వం ఇండియన్ తెగలతో కుదుర్చుకున్న భూమి ఒప్పందాలన్నీ కూడా యుద్దసమయంలో ఇండియన్ తెగలని తమవైపు తిప్పుకోవడం కోసం బ్రిటీష్ వారు చేస్తూన్న తాత్కాలిక (కు)యుక్తులు మాత్రమే అని భావించిన జార్జి వాషింగ్టన్, 1763 లో జారీ చేసిన బ్రిటీష్ రాయల్ ప్రొక్లెమేషన్ ఇండియన్లకి వారి భూముల మీద శాశ్వత హక్కులని మంజూరు చేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

ఫ్రెంచ్ కెనడా, అమెరికా భూభాగంలో ఉన్న Illinois, Indiana, Michigan, Ohio, Wisconsin వరకీ తాము విస్తరించే అధికారాలు తమకి కట్టబెడుతూ , ముఖ్యంగా Francophone Catholics కి ఫ్రీడం ఆఫ్ వర్షిప్ జారీ చేస్తూ1774 లో జారీ కాబడిన Quebec Act తో పరిస్థితి మరింత విషమించిందని వాషింగ్టన్ భావించాడు. ఇలాంటి క్రియలన్నింటినీ అమెరికాలోని New Englanders, Intolerable Acts లా పరిగణించడం లో ఆశ్చర్యం లేదు.

వెనక్కి తిరిగి చూస్తే సరయిన సమయంలో Tax and representation లో కొన్ని వెసులుబాట్లని కలిగించటం ద్వారా లండన్ ప్రభుత్వం, యుద్దాన్ని నివారించగలిగేదేమో. మరింత డిప్లమసీ తో వ్యవహరించినట్లయితే 1781 లో ఫ్రాన్స్ తో Yorktown లో ఓటమిని చవిచూసేది కాదేమో. నిజానికి యుద్దకాలంలోనూ, యుద్దానంతర కాలంలోని మితిమీరిన ద్రవ్యోల్భణం, సగానికి పడిపోయిన తలసరి ఆదాయం, GDPలో 62% శాతానికి చెరుకున్న కొండంత అప్పు లాంటి విషమ పరిస్థితుల్లో పదమూడు కాలనీలు విచ్చిన్నమయ్యి, విడిపోయే ప్రమాదం ఊహించగలం, కానీ అలాంటిదేమీ జరగలేదు. Articles of Confederation ని దాటి రివల్యూషన్ విస్తరించకపోయినట్లయితే సంయుక్త ఉత్తరమెరికా కథ కూడా దక్షిణమెరికా లా చిన్నచిన్నముక్కలుగా మిగిలిపోయేది.


వీటన్నిటి పరిణామమే, 1787 లో నిర్మించుకున్న మానవచరిత్రలోని అత్యంత పఠిష్టమయిన రాజ్యాంగం. ఈ గ్రంధం John Lock ప్రతిపాదించిన Executive, Bicameral, Legislature and Supreme Court ల అధికారాలనివ్వడమే కాకుండా, single currency, single army, single trade policy లతో పాటుగా, ఆస్థికన్నా అప్పు ఎక్కువున్న ప్రజలకి single law of bankruptcy అధికారాన్ని కట్టబెట్టింది. అంతేకాకుండా ప్రభుత్వం "unreasonable searches and seizures" చేపట్టకుండా వ్యక్తి స్వేచ్చని కాపాడిన అత్యంత ముఖ్యమయిన Fourth amendment కూడా జరిగింది.

మూలాల్ని పరిశీలిస్తే జరిగిందంతా, ప్రాపర్టీ గురించే, ప్రాపర్టీ ని కాపాట్టం గురించే.

జార్జ్ వాషింగ్టన్ స్వంత ఆస్థే ఒక ఉదాహరణ. 1768 లో తన స్వశక్తి వల్లా, తన మారేజ్ వల్ల సంక్రమించిన 45,000 ఎకరాల ఆస్థి, 1800 కల్లా Virginia, Pennsylvania, Maryland, New York, Kentucky, Ohio Valley, Alexandria లలో 52,194 ఎకరాలకి విస్తరిస్తుంది.

Land కీ, Liberty కీ ఉండే ఎంతో దగ్గర సంబంధానికీ ఇంతకన్నా మంచి ఉదాహరణ అమెరికా తొలినాళ్ళల్లో దొరకదు. సౌత్ అమెరికాలో ఇండియన్స్ భూముల మీద కనీసం పని చేసారు. ఉత్తరమెరికాలో ఏకంగా అవి కోల్పోయారు.

***
Simon Bolivar

Simon Bolivar సౌత్ అమెరికా వాషింగ్టన్ అని చెప్పొచ్చు. అతను కూడా స్పానిష్ ఎంపైర్ ని కూలదోసాడు. కాని United States of South America ని అతను తయారుచేయలేకపోయాడు.

American revolution మాజీ బ్రిటిష్ కాలనీల ప్రజలని సంఘటితం చేసి ఏకం చేయడమే కాకుండా, తద్వారా సంపాదించుకున్న Independence, కనీ వినీ ఎరుగని సంపదకీ, అపార శక్తికీ మార్గమేసింది.

కానీ అదే స్పెయిన్ నుంచి సాధించుకున్న ఇండిపెండెన్స్ సౌత్ అమెరికాని ఘర్షణా, పేదరికం, అసమానతల్లోకి నెట్టింది. మరి లాటిన్ అమెరికా లో కాపిటలిజం, డెమొక్రసీ పరిణతి దిశకి ఎందుకు ఎదగలేదు? ఇదే ప్రశ్న హార్వర్డ్ లోని నా కొలీగ్ ని అడిగానోసారి? అసలు Simon Bolivar లాటిన్ అమెరికా వాషింగ్టన్ ఎందుకు కాలేక పోయాడని?

July 1783 లో ఒక ధనిక వెనిజులా ప్లాంటర్ కి జన్మించిన Bolivar, తన పదవ ఏడాది దాకా అనాధగానూ, పద్నాలుగో ఏటకి ఒక సైనికుడిగాను మారతాడు. Bolivar విద్య స్పెయిన్ లోనూ, ఫ్రాన్స్ లోనూ గడుస్తుంది. 1804 లో food shortage వల్ల మాడ్రిడ్ లోని విదేశీయులని అందరినీ బహిష్కరించినప్పుడు Bolivar పారిస్ లో కాలం గడుపుతాడు. Napolean Phase of French revolution ని చూసి ఉత్తేజితుడై, స్పానిష్ పరిపాలన మీద తీవ్ర విముఖత తో 1807 లో వెనిజులా కి తిరిగి ప్రయాణం కడతాడు.

అప్పటికే అతను, ఉత్తరమెరికాల్లోంటి మార్పులు దక్షిణమెరికాల్లో కూడా తీసుకు రావాలని కలలుగంటూంటాడు.

కాని చివరకు విప్లవమొచ్చేప్పటికల్లా జరిగిన పరిణామాలు వేరే. ఆ విప్లవం ఒక క్రమపద్దతిలో రూపొందించబడిన ప్రణాళీక తో జరిగిన పోరాటం అనటం కన్నా , నెపొలియన్ స్పెయిన్ మీద 1808 లో దాడి చేసినప్పుడు ఉద్భవించిన పవర్ వ్యాక్యూమ్ వల్ల వచ్చిన ఒక గందరగోళ స్పందన అని చెప్పడం సబబు. అది జరిగిన సరిగ్గా రెండు సంవత్సరాలకి స్పెయిన్ కాలనీస్ మీద ఫ్రెంచ్ అటాక్ కి వ్యతిరేకంగా బ్రిటీష్ మద్దతు కోసం, Bolivar పంపబడతాడు. బ్రిటీష్ సపోర్ట్ లభించనప్పటికీ అక్కడ తనకి Venezuela Independence కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న Francisco Miranda పరిచయమవుతాడు. వారిద్దరూ వెనిజులా తిరిగి ప్రయాణమయ్యి July 1811 లో మొట్టమొదటి వెనిజులన్ రిపబ్లిక్ ని ప్రకటిస్తారు.

ఆ రిపబ్లిక్ విఫలమవుతుంది. 1811 లో ఏర్పరుచుకున్న రాజ్యాంగం వోటు హక్కు ఉత్తరమెరికాలో లాగే కేవలం ప్రాపర్టీ యజమానులకే పరిమితం కాబడుతుంది. కాని ఫలితం మాత్రం వేరే. ముందే చూసినట్లుగా మొత్తం జనాభాలో సౌత్ అమెరికాలో ప్రాపర్టీ ఓనర్స్ శాతం, నార్త్ అమెరికా కన్నా తక్కువ. ఫలితంగా ఆస్థి లేకుండా మిగిలిపోయిన అధిక శాతం జనాభా, స్వతంత్రం లభించిన new slaves (pardos) తో కలసి స్పానిష్ రాయల్టీ వైపు మరలి పోరాడుతారు. చివరకి Royalists, Puerto Cabello ని కూడా స్వాధీనపర్చుకున్న తర్వాత Bolivar కి, Miranda మీద ఉన్న భ్రమలు తొలగిపోయి, తనని మోసం చేసి స్పానిష్ యజమాన్యానికి చిక్కిస్తాడు.

తదుపరి New Granada కి పారిపోయి అక్కణ్ణుంచి రెండవ సారి స్వాతంత్ర పోరాటం కొనసాగిస్తాడు.

Second Republic ని డిక్టేటర్ రోల్ లో తనదిగా ప్రకటించుకొని, Spain Royalists ని Merida, Bogota, Caracas & Trujillo ల లోంచి తరిమికొడతాడు. Spanish Tyranny కి వ్యతిరేకంగా ఏ spaniard అయినా పోరాడకపోతే వారు విధిలేక ఫైరింగ్ స్క్వాడ్ తో షూట్ చేయబడతారని 1813 లో జారీచేస్తాడు. Prisoners రొటీన్ గా చంపబడేవారు, ఒకసారి గరిష్టంగా 800 మంది చంపబడతారు. ఇంత టెర్రర్ సృష్టించినా కూడా, Non-whites లో అత్యధిక శాతం Royalists వైపు defect అవడం ఆగలేదు. అదే సమయంలో చర్చ్ ఇండిపెండెన్స్ మూవ్ మెంట్ ని సపోర్ట్ చేయలేదు. 1812 లో వచ్చిన భూకంపం పదివేలమందిని చంపేసిన సంఘటనని చర్చ్, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి వ్యతిరేకంగా అభివర్ణించింది. తలవొగ్గని వీరుడయిన Bolivar " ప్రకృతి మమ్మల్ని వ్యతిరేకిస్తే, మేం దానితో పోరాడి మా ఆజ్ణలకి అనుగుణంగా నడచుకునేలా దాని కొమ్ములు వంచుతాం " అనే భీరాలు పోయాడు.

కాని Bolivar ప్రధాన సమస్య ప్రకృతి నించి రాలేదు. Jose Tomas Boves అనే spaniard నుంచి వచ్చింది. ఇండియన్స్, పారిపోయిన slaves , అసమ్మతిదారుల తో Jose తయారు చేసుకున్న సైన్యం, Bolivar కి కొరకరాని కొయ్య అయ్యి కూర్చుంది. Jose సాధించిన వరస జయాలతో Bolivar ఈ సారి Jamaica కి పారిపోక తప్పలేదు. Haiti లో తను గడిపిన కొద్ది కాలంలో కాని Bolivar కి, తన పోరాటంలో Venezuelan slaves ని కూడా చేర్చుకోవాలన్న విషయం అర్ధం కాలేదు. Blacks కీ, White creoles కీ కూడా పోరాట ఫలితాల్లో భాగం ఉండేలా లక్షాలని మార్చిన తరవాత కానీ గెలుపుమీద ఆశ లభించదు Bolivar కి. ఈ సారి Venezuela కి మాత్రమే కాకుండా South America అంతటికీ పిలుపునందిస్తాడు.

ఈ సారి సఫలీకృతమవుతాడు, కనీసం కొద్ది కాలం. పొలిటికల్ రిప్రజెంటేషన్ దొరుకుతుందన్న లక్షం తో Pardos(slaves) Bolivian Army లో చేరుతారు. ఇదే సమయంలో స్పెయిన్ లో రాయల్ అథారిటీ ని మరింత బలపర్చాలన్న ఆశయానికి మద్దతు తగ్గటం ప్రారంభమవుతుంది. 1820 లో Cadiz లో 14,000 సైన్యాన్ని అట్లాంటిక్ దాటించి సౌత్ అమెరికా ని రీ-కాలనైజ్ చేద్దామనుకున్న తరుణంలో, ఆ సైన్యంలో అంతర్గత తిరుగుబాటు మొదలవుతుంది.

Bolivar కి వ్యతిరేకంగా ఉన్న శక్తుల తిరోగమనం క్రమంగా ప్రారంభమవుతుంది. ఇదే సరయిన సమయమని తలచిన Bolivar మరింత బలపడటం కోసం విదేశాల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అనుకోకుండా ఆ మద్దతు బ్రిటన్ ద్వారా లభ్యమవుతుంది.

1810 and 1825 మధ్యలో దాదాపు 7,000 బ్రిటీష్, మరియు ఐరీష్ వాలంటీర్స్ స్పెయిన్ నుంచి సౌత్ అమెరికా ని లిబరేట్ చేయడానికి సైనప్ చేస్తారు. వీరిలో అత్యధిక శాతం యుద్ద శిక్షణ లేని వారే. ఎంతో మంది ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోతారు. 1815 కల్లా లిబరేషన్ కనుచూపుమేరలో కనపడటం ప్రారంభమవుతుంది. ఈ రీతిన సైనప్ వారిలో మిలిటరీ సర్వీస్ కి ప్రతిఫలంగా భూమి దొరుకుతుందన్న వాగ్ధానం వల్ల చేరిన వారు కూడా ఉన్నారు. Manchester నుంచి వచ్చిన Thomas Ferrier అందులో ఒకడు. Orinoco River ఒడ్డున ఉన్న Bolivar base అయిన Angostura కి వస్తాడు. 

నాలుగు సంవత్సరాల పాటు తనూ, తన బలగమూ అట్లాంటిక్ తీరం నుండి, పసిఫిక్ తీరం దాకా నిరంతర పోరాటాలని కొనసాగిస్తారు. 1819 లో Battle of Boyaca తరువాత Bolivar, Republic of Columbia ని ప్రకటిస్తాడు. చిట్టచివరకి 24 June 1821 న, వెనిజులా విముక్తి కోసం జరుపుతున్న తన సుదీర్ఘ పోరాటంలో నిర్ణయాత్మకమయిన గెలుపు లభిస్తుంది.

New Granada, Venezuela, Quito (Modern Ecuador) లు కలిపి ఉన్న సామ్రాజ్యానికి తను Master of Gran Colombia గా ప్రకటించుకుంటాడు. April 1825 కల్లా తన సైన్యం పెరూ లోంచి కూడా స్పానిష్ సైన్యాన్ని తరిమేస్తుంది. ఉత్తర పెరూ ని తన గౌరవార్ధం బొలీవియా గా నామకరణం కావించబడుతుంది. తదుపరి అడుగు పెరూ, బొలీవియా, Gran Colombia లన్నీ కలిపిన Confederation ని స్థాపించడమే.

కాని ఆ కల పూర్తిగా సాధ్యపడదు. ఎందువల్ల? పైపైన చూస్తే అధికారం కేంద్రీకృతం కావడం, local war lords ప్రతిఘటన ని ఇవ్వడం అనేవి సమాధానాలుగా కనపడ్డప్పటికీ, తరచి చూస్తే మూడు కారణాలు కనపడతాయి.

  • మొదటి కారణం: చరిత్రని తవ్వి చూస్తే సౌత్ అమెరికన్స్ కి ప్రజాస్వామికంగా నిర్ణయాలని తీసుకోవటం లో ఉత్తరమెరికాలోని కాలనీ అసెంబ్లీస్ లాంటి అనుభవం లేదు. దాన్ని Bolivar 1815 లో చెప్పిన మాటల్లోనే చూడవచ్చు. New Granada లో అంతర్గత ఘర్షణ లని చూసి Bolivar విచలితుడవుతాడు. వీటన్నిటికీ కారణం సిస్టమ్ ఆఫ్ టాలరెన్స్ అని తను భావిస్తాడు. అది బలహీనమయిన వ్యవస్థని సృష్టిస్తుందనీ, సెల్ఫ్ గవర్నమెంట్ అనేది దీర్ఘకాలంలో నిలబడలేదని అభిప్రాయబడతాడు. చివరకి USA constitution ని కూడా విమర్శిస్తాడు. అలాంటి రాజ్యాంగం సాధారణపౌరులతో నిలబడలేదని, అలా జరగాలంటే ఒక దేశం ఒక republic of saints అయి ఉండాలని అంటాడు. క్రమంగా Bolivar కల డెమొక్రసీ నుంచి నియంతృత్వం వైపు కొనసాగుతుంది.
  • రెండవ కారణం: అసమానంగా పంచబడిన ప్రాపర్టీ. సాక్షాత్తూ Bolivar family కి, 120,000 ఎకరాల్లో విస్తరించబడిన ఐదు అతి పెద్ద ఎస్టేట్స్ లభిస్తాయి. స్వాతంత్రానంతర వెనిజులా లో కేవలం 1.1 శాతమయిన పదివేల జనాభా దాదాపు దేశంలో ఉన్న భూమికి యజమానులవుతారు. ఇది ఉత్తరమెరికాలో జరిగిన స్వాతంత్రానంతర పరిణామానికి పూర్తి భిన్నమైనది. స్వాతంత్రం వచ్చిన తరవాత ఉత్తరాన కొత్త సెటిలర్స్ కి భూమి లభించడం మరింత సులువయింది. కాని దక్షిణాన పరిస్థితి పూర్తి వ్యతిరేకం. మెక్సికో, అర్జెంటీనా ల్లో రూరల్ జనాభాకి భూమి మీద స్వంత హక్కు లభించలేదు. అత్యధిక శాతం ప్రాపర్టీ , అత్యల్పశాతం జనభాకి పరిమితమయింది.
  • మూడవ కారణం: సౌత్ అమెరికాలోని Racial Heterogeneity కూడా ముఖ్యమయిన కారణాల్లో ఒకటి. ఉత్తరమెరికాల్లో British red coats కి వ్యతిరేకంగా Patriots ని సమకూర్చడం సులువయింది. కాని సౌత్ అమెరికాలో సాక్షాత్తూ Bolivar జాతయిన Creoles కీ, peninsulares కీ ఏ మాత్రం పడేది కాదు. Pardos, Slaves కీ Creoles అంటే స్నేహభావమేం లేదు. చివరకి Bolivar, Blacks support కోసం చేసిన ప్రామిసెస్ ఏవీ కూడా Racial Equality అనే ప్రిన్సిపుల్ ని నమ్మి చేసినవేవీ కాదు. యుద్దకాలంలో గెలుపు కోసం చేసిన వాగ్ధానాలు మాత్రమే. Literates కి మాత్రమే వోటు హక్కు అని అతను రూపొందించిన రాజ్యాంగం, దేశంలోని స్థానిక ప్రజలని ఒక పొలిటికల్ నేషన్ లో భాగం లేకుండా చేసింది.

revolution and war in latin america

చివరకి Bolivar కలగన్న United South America అసాధ్యమయింది. New Granada, Venezuela, Quito లలో జరిగిన తిరుగుబాట్లతో, వాటన్నిటినీ కూడుకొని ప్రతిపాదించిన Andean Confederation తిరస్కరించబడింది. Bolivar మాజీ మిత్రుడూ, సహచరుడూ అయిన Jose Antonio Paez , కుదించబడిన వెనిజులా పటం ప్రతిపాదించి విజేతగా అవతరిస్తాడు. Tuberculosis తో డిసంబర్ 1830 లో మరణించే ఒక నెల ముందు Bolivar , President, Captain-General పదవులకి రాజీనామా చేస్తూ నిరాశపూరితమయిన లెటర్ రాస్తాడు.

"...ఇరవై సంవత్సరాలు పరిపాలించిన తరవాత నేను నేర్చుకున్న విషయాలివి.
  • south america is ungovernable 
  • those who serve a revolution plough the sea 
  • the only thing one can do in america is to emigrate 
  • this country will fall inevitably into hands of the unbridled masses and then pass into the hands of petty tyrants. 
  • Once we have been devoured by every crime and extinguished by utter ferocity, the Europeans will not even regard us as worth conquering ............"

దురదృష్టవశాత్తూ ఆ మాటలన్నీ వచ్చే 150 సంవత్సరాల వరకీ నిజమయ్యాయి. కొత్తగా అవతరించిన దేశాలన్నీ ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనేదే లేకుండా తమ ప్రయాణం ప్రారంభించాయి. ఫలితంగా తిరుగుబాట్లూ, తిరుగుబాట్లపై తిరుగుబాట్లూ, విప్లవాలూ ప్రతి-విప్లవాలూ, కుట్రల పైన కుట్రలూ నిరంతరంగా సాగాయి.

డెమొక్రసీ ప్రయోగాలేమాత్రం కనిపించినా సమాజం లోని ఉన్నత వర్గాలు, హింస ద్వారా వాటిని అణచివేసాయి.



Chavez & Simon Bolivar
Bolivar ని అమితంగా గౌరవించే Hugo Chavez తనకి తాను Bolivar అనుచరుణ్నని ప్రకటించుకోవడంలో ఆశ్చర్యం లేదు. పొలిటికల్ థియేటర్ కండూతి గల Hugo Chavez Bolivar ఆత్మ, తన స్పిరిట్ తో ఐక్యమవ్వాలని 2010 లో టెలివిజన్ కెమెరాల ముందు Bolivar Tomb ని తెరిపిస్తాడు. Venezuela లో Caracas నిండా పక్కపక్కనే ఉన్న Bolivar, Chavez ల నిలువెత్తు కటౌట్ల దృశ్యాలీ రోజు సర్వ సాధారణం. 

కానీ Chavez పరిపాలిస్తున్న రాజ్యం లోని ప్రజాస్వామ్యం ఒక డొల్ల. తన రాజకీయ ప్రత్యర్థుల మీద పోలీస్, మీడియా శక్తులని ఉసిగొల్పడంలో Chavez తన శక్తులని రొటీన్ గా దుర్వినియోగ పరుస్తాడు. ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఉన్న హక్కుల ఉల్లంఘన కూడా సాధారణమైపోయింది. సిమెంట్ తయారీదారులతో మొదలుకొని, టెలివిజన్ స్టేషన్స్ , బ్యాంక్స్ వరకీ తన ఇష్టానుసారంగా నేషనలైజ్ చేయటం Chavez కి పరిపాటి. చరిత్రలో ఎంతో మంది నియంతల వలె Rule of law నీ, Constitution నీ తన స్వలాభం కోసం తరచూ మార్పులు చేసి పరిహాసం చేయటం Chavez కి అలవాటు. 1999 లోనే కాదు, 2009 లో కూడా తను మరోసారి president గా ఉండటం కోసం రాజ్యాంగం లో ఉండే అత్యధిక term-limits ని నిర్మూలించాడు.

వెనిజులా స్వాతంత్రానంతరం 26 కొత్త రాజ్యాంగాలని ఏర్పరుచుకున్నది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వాతంత్రానంతరం రాజ్యాంగానికి 27 మార్పులని(amendments) జతకూర్చుకున్నది!!. రెండు విప్లవాల ఫలితాల గురించి చెప్పాలనుకుంటే ఇంతకన్నా పెద్ద ఉదాహరణ దొరకదనుకుంటాను.

****

రాబోయే తరాల సుదీర్ఘమయిన కాలం పాటు నిలబడిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే ముందు, ఒక్క క్షణం ఆగి ఆత్మపరిశోధన చేసుకోక తప్పదు. ఒక్క విషయంలో మాత్రం నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కన్న ఏ రకంగానూ సుపీరియర్ కాదు. ముఖ్యంగా అమెరికన్ రివల్యూషన్ తరవాత వైట్స్ కీ, బ్లాక్స్ కీ మధ్య జాతివైరుధ్యాలు మరింత బలపడ్డాయి. అతి గొప్ప రాజ్యాంగంగా మనం శ్లాఘిస్తున్న అమెరికన్ రాజ్యాంగం స్లేవరీ ని ఆమోదించి ఆ వైరుధ్యాలనీ, విభజననీ వ్యవస్థీకృతం చేసింది. ఇది కొత్తగా అవతరించిన అమెరికన్ రిపబ్లిక్ మొట్టమొదటి పాపమని చెప్పక తప్పదు. ఈ భాగం మొదట్లో చెప్పబడిన ఏ Charleston, South Carolina మెట్ల మీదనుంచయితే స్వతంత్ర ప్రకటన చేయబడిందో , రాజ్యాంగం లోని ఆర్టికల్ 1, సెక్షన్ 9 ఇరవైసంవత్సరాల పాటు slave trading ని ఆమోదించడం వల్ల, అదే మెట్ల సాక్షిగా 1808 వరకీ slaves అమ్మకాలు కొనసాగాయి.

అదే రాజ్యాంగం each slave ని ఒక సంపూర్ణమైన స్వేచ్చాయుత వ్యక్తిగా కాక, కేవలం 3/5 ths of a free man గానే పరిగణించింది. ఈ లెక్కల ఆధారంగానే కాంగ్రెస్ లో ప్రతి రాష్ట్రానికీ రిప్రజెంటేషన్ శాతం నిర్ణయించబడేది.

విచిత్రమేమంటే, అట్లాంటిక్ కి ఆవల బ్రిటీష్ ప్రపంచంలో slavery ని abolish చేయాలన్న movement పరాకాష్ట దశకి చేరుకుని గణనీయంగా సమాజ ఆమోదం లభిస్తున్న సమయంలో, ఏ స్వేచ్చ కోసమైతే వెస్టర్న్ సివిలైజేషన్ లో జరిగిన అత్యంత విజయవంతమైన రివల్యూషన్ జరిగిందో, ఆ రివల్యూషన్ చాలా వరకీ slave owners వల్ల జరగటం, ఆ స్వేచ్చ ఫలితాలు slaves కి లభించకపోవటం అనే paradox ని ఎలా అర్ధం చేసుకోవాలి?

***
THE FATE OF GULLAHS

ఇంకో కథ చూద్దామా? Senegal నుంచి Americas కి బయలుదేరిన రెండు ఓడల్లో విభిన్నమైన ఇమ్మిగ్రంట్స్ ఉన్నారు. మొదటిది బ్రెజిల్ కి, రెండవది సౌత్ కెరోలినా కి బయలుదేరింది. రెండింట్లోనూ ఆఫ్రికన్ స్లేవ్స్ ఉన్నారు. 1450 నుంచి 1820 మధ్యలో రమారమి ఎనభై లక్షల ఆఫ్రికన్ స్లేవ్స్ తరలించబడ్డారు.

స్లేవరీ నార్త్, సౌత్ అమెరికాల్లో కామన్ గా ఉండే వ్యవస్థగా మొదటి చూపులో కనిపిస్తుంది. ఎప్పుడయితే ఆఫ్రికన్ స్లేవ్స్ , యురోపియన్ indentured servants కన్నా చౌకగా లభ్యమవ్వడమే కాక, వారికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పని చేపించవచ్చని, అమెరికా లోని సదరన్ టొబాకో ఇండస్ట్రీ, బ్రెజిల్ లోని షుగర్ కేన్ పరిశ్రమ గ్రహించిందో , అప్పటి నుంచీ స్లేవ్స్ ఇంపోర్ట్ పెరిగింది.

ఆఫ్రికా లో స్లేవ్స్ ని అమ్మే King of Dahomey కి, స్లేవ్స్ ని ఎవరు కొంటున్నారన్న పట్టింపేమీ లేదు. కొనేవారు పోర్చుగీస్ అయినా, బ్రిటీషర్స్ అయినా, అసలు ఆఫ్రికన్ స్లేవ్స్ ని మొట్టమొదటగా కొనటం మొదలుపెట్టిన అరబ్స్ అయినా వారు అంతే సంతోషంగా అమ్మే వారు.

ఆ పడవల్లో ఉన్న ఒక ఆఫ్రికన్ స్లేవ్ కోణం లోంచి చూస్తే, నార్త్ అమెరికా కి వెళ్ళే పడవయినా, సౌత్ అమెరికాకి వెళ్ళే పడవయినా ఒకటే. మార్గమధ్యం లో ఆరింట ఒకరు మరణించటం ఖాయం.
slave ships
slave-ship-planking

కానీ, ఈ కొత్త ప్రపంచంలో వివిధ రకాల స్లేవరీ మధ్య తేడాలు ముఖ్యమయిన తేడాలు ఉత్పన్నమవ్వడం మొదలయ్యాయి. Mediterranean economy లో మొదటి నుంచీ స్లేవరీ ఒక అంతర్భాగం. క్రూసేడ్స్ జరిగిన కాలంలో అది తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే కాలంలో ఇంగ్లాండ్ లో స్లేవరీ అంతమొందింది.

పోర్చుగీస్ వారు వెస్ట్ ఆఫ్రికన్ నుంచి మెడిటేరియన్ ప్రాంతాలకి కొత్త సముద్రపు మార్గాలని వేస్తున్నప్పుడు వారు ఏర్పరుచుకున్న common law లో, స్లేవరీ పాతకమైనదన్న స్పృహ కొరవడింది.

slaves in tobacco forms
మొట్టమొదటి ఆఫ్రికన్ స్లేవ్స్ బ్రెజిల్ లో 1538 కల్లా అడుగుపెట్టారు. ఆ తరవాత డెబ్బై, ఎనబై ఏళ్ళకి అంటే 1619 వరకీ స్లేవ్స్ USA కి రావటం మొదలుపెట్టలేదు. ఆ కాలంలో ఉత్తరమెరికా లో షుగర్ ప్లాంటేషన్స్ ఉండేవి కాదు. సౌత్ అమెరికా లోని Bahia, Pernambuco లో ఉండే pre-industrial sugar cultivation లో working conditions చాలా కఠినంగా ఉండేవి. ఆ మాటకొస్తే బ్రెజిల్ లోని గోల్డ్ మైన్స్ లోని పరిస్థితులయినా, కాఫీ ప్లాంటేషన్స్ లో అయినా పరిస్థితులు ఏ మాత్రమూ మెరుగు కాదు.







ఆ కాలంలో ఉత్తరమెరికాకన్నా బ్రెజిల్ కి ఎన్నో రెట్లెక్కువ స్లేవ్స్ బదిలీ చేయబడ్డారు. స్లేవ్స్ మీద ఆధారపడిన బ్రెజిల్ షుగర్ పరిశ్రమ కొద్ది కాలంలోనే ఏడాదికి 16,000 టన్నుల షుగర్ ప్రొడక్షన్ తో, ప్రపంచంలో అత్యధికంగా షుగర్ ని ఉత్పత్తి చేసే కరేబియన్ ప్రాంతాన్ని అధిగమిస్తుంది.

కాలక్రమేణా ఎకానమీ మైనింగ్, కాఫీ పెంపకం, మాన్యుఫాక్చరింగ్ లాంటి ఇతర రంగాలకి విస్తరించినప్పటికీ స్లేవ్స్ దిగుమతి ఏ మాత్రం తగ్గలేదు. స్లేవరీ దాదాపు ప్రతీ రంగంలోనూ సాధారణమయింది. బ్రెజిల్ కి ఎంతో ముఖ్యమైపోయిన ఈ స్లేవ్స్ ఇంపోర్ట్ వల్ల, 1825 కల్లా బ్రెజిల్ జనాభాలో 56 శాతం ఆఫ్రికన్ మూలాలున్న ప్రజలతో నిండిపోయింది. వీరితో పోలిస్తే 22 శాతం మాత్రం స్పానిష్ అమెరికన్స్, 17 శాతం నార్త్ అమెరికన్స్ ఉండేవారు.

ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచం లో స్లేవరీ అంతమొందిన చాలా కాలానికి కూడా బ్రెజిలియన్స్ స్లెవ్స్ ఇంపోర్టింగ్ కొనసాగింది. 1808 నుంచి 1888 మధ్యలో దాదాపు పది లక్షల స్లేవ్స్ బ్రెజిల్ కి దిగుమతి అయ్యారు. 1850 కల్లా బ్రిటీష్ నావల్ ఫోర్సెస్ అట్లాంటిక్ మీదుగా జరుగుతున్న స్లేవరీ ట్రేడ్ ని , సీరియస్ గా అడ్డుకోవడం మొదలుపెట్టేవరకీ ఆ దిగుమతి నిరాటంకంగా కొనసాగింది. కాని అప్పటికే బ్రెజిల్ లో ఉన్న స్లేవ్ పాపులేషన్ 1793కల్లా రెట్టింపయింది.

కానీ pre-revolutionary Latin America లో స్లేవ్స్ పరిస్థితి మరీ దయనీయమయినది కాదు. Royal, religious authorities కలగచేసుకొని స్లేవ్స్ జీవన పరిస్థితులని మరింత దిగజారకుండా అడ్డుపడ్డారు. Roman Catholic వ్యవస్థ, స్లేవరీని ఒక necessary evil గా పరిగణించి ఉండవచ్చు గాక. కానీ స్లేవ్స్ కి కూడా Souls ఉంటాయన్న సత్యాన్ని కాదనలేకపోయారు. ఉత్తరమెరికా లోని వర్జీనియా టొబాకో ఫార్మ్స్ లోని స్లేవ్స్ తో పోలిస్తే , లాటిన్ అమెరికా లోని స్లేవ్స్ తమకి తాము స్వేచ్చ (manumission) ని సులభంగా పొందగలిగే అవకాశముండేది.

Bahia లో స్లేవ్స్ తామే స్వయంగా యాభై శాతం manumissions ని కొనుక్కోగలిగారు. 1872 కల్లా బ్రెజిల్ లో మూడోంతుల Blacks and Mulattos స్వేచ్చా జీవులు అయిపోయారు. క్యూబా, మెక్సికో లలో బ్లాక్స్ తమ స్వేచ్చ కి ఖరీదు ని ప్రకటించి, వాయిదా పద్దతుల మీద తీర్చి ఫ్రీ పీపుల్ అయ్యేవారు. బ్రెజిల్ లోని స్లేవ్స్ కి, బ్రిటీష్ వెస్టీండీస్ లోని స్లేవ్స్ తో పోలిస్తే సంవత్సరానికి ప్రతి ఆదివారం సెలవు దినమే కాకుండా 35 అదనపు సెలవలు దొరికేవి. బ్రెజిల్ తో మొదలయ్యి, లాటిన్ అమెరికా అంతా స్లేవ్స్ కి తమ స్వంత భూమి ఉండటమనేది ఆచరణలోకి వచ్ఛింది.


వీటన్నింటినీ చూసి తొందరపడి అంతా సవ్యంగానే ఉందన్న అభిప్రాయానికి రాకూడదు. ఎక్స్ పోర్ట్స్ ఎక్కువున్న సీజన్ లో వారానికి ఏడు రోజులూ, ఇరవైనాలుగ్గంటల పని గంటలు సర్వసాధారణం చేసి, స్లేవ్స్ తో చచ్చే చాకిరీ చేపించేవారు. చాలా సార్లు ఈ పనిగంటలూ స్లేవ్స్ ప్రాణాలమీదకొచ్చేవి. కరేబియన్ ప్రాంతాల్లోలానే బ్రెజిల్ లోని షుగర్ ప్లాంటేషన్ ఓనర్స్ కూడా , ఏ క్షణాన స్లేవ్స్ తిరగబడతారేమో అన్న భయంతో గడిపేవారు.


తిరగబడకుండా ఉంచటానికి బ్రెజిల్ లోని యజమానులు కొన్ని క్రూరపద్దతులవంభించేవారు. వరసగా వారం, పది రాత్రుల పాటు కొరడాలతో కొడుతూ, మధ్యమధ్యలో గాయాలకి యూరిన్, సాల్ట్ ని రుద్దడం లాంటి అమానవీయ చేష్టలు చేసేవారు. అరుదుగా రోడ్ల మీద స్లేవ్స్ మొండెం నుంచి వేరు చేయబడిన తలలు కూడా కనిపించేవి. ఇవన్నీ జరిగే 1850 ల కాలంలో బ్రెజిలియన్ స్లేవ్ సగటు ఆయుపరిమితి ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఒక స్లేవ్ కేవలం ఐదు సంవత్సరాలు పని చేసినా చాలు, యజమానికి తన పెట్టుబడి మీద రెండింతలు లాభమొచ్చేది.


అయితే నాణేనికి మరో వైపు చూసినట్లయితే, బ్రిటీషర్స్ కింద పని చేసే స్లేవ్స్ కి లేనిపెళ్ళ్ చేసుకునే హక్కు బ్రెజిలియన్ స్లేవ్స్ కి ఉండేది. కాలక్రమేణా స్లేవ్స్ పై పోర్చుగీస్, స్పానిష్ నియమ నియంత్రణలు సడలించబడుతూ వచ్చాయి.

ఉత్తరమెరికా లో పరిస్థితి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉండేది. స్లేవ్స్ కి ఏ రకమయిన మానవహక్కులు వర్తించనట్లుగా ఉండేవి యజమానుల ప్రవర్తన. స్లేవ్స్ సంఖ్య పెరిగినకొద్దీ వారి మీద నియంత్రణ మరింత కఠినతరం చేయబడ్డది. యూరప్ నుంచి వచ్చే white indentured labourers కి ఐదూ, ఆరు సంవత్సరాల్లో ఆర్ధికంగా విముక్తి లభించి భూమికి స్వంతదారులవుతూంటే, దిగుమతి చేయబడ్డ స్లేవ్స్ మాత్రం జీవితాంతం ప్లాంటేషన్స్ లో , ఫార్మ్స్ లో పని చేయాల్సి వచ్చేది.

  • 1663 లో మేరీలాండ్ రాష్ట్రం నీగ్రోలందరూ కూడా జీవితాంతం (Durante Vitae) యజమాని కింద స్లేవ్ గా పని చేయాల్సిందేననీ, నీగ్రోలకి పుట్టిన సంతానమంతా కూడా స్లేవ్స్ కిందే పరిగణించబడతారనీ, చట్టాన్నీ రూపొందించింది.
  • 1669 లో వర్జీనియా రాష్ట్రం, ఒక యజమాని తన స్లేవ్ ని చంపినప్పటికీ, దాన్ని Felony కింద పరిగణించక్కర్లేదని చట్టాన్ని ఏర్పరుచుకుంది. 
  • 1726 లో సౌత్ కెరోలినా, స్లేవ్ యజమాని యొక్క స్వంత-ఆస్థి (chattel) అని పేర్కొంది.

ఈ పరిస్థితి ఎంతవరకీ వెళ్ళ్ందంటే, కెరోలినా నుంచి స్లేవ్స్ వివిధ మార్గాల ద్వారా తప్పించుకొని పరారయి, అప్పటి కాలంలో స్పానిష్ కంట్రోల్ లో ఉన్న ఫ్లోరిడాలో తలదాచుకునే ప్రయత్నం చేసేవారు. కెథాలిసిజం లోకి మార్పిడి చేసుకున్నట్లయితే ఫ్లోరిడా గవర్నర్ వీరందరికీ స్వతంత్రప్రతిపత్తి కలిగిఉండేలా చట్టం రూపొందించడం ప్రారంభించారు.

స్లేవ్స్ ని స్వంత-ఆస్థి కింద పరిగణించే స్లేవరీ ఇంగ్లాండ్ లో శతాబ్ధాల ముందరనుంచే అంతరించడం మొదలయినప్పుడు, బ్రిటీష్ వలసవాదుల అమెరికాలో స్లేవరీ పరిస్థితి ఇంత అమానవీయంగా ఉండడం జీర్ణించుకోలేని వాస్తవం.

స్లేవరీ కి వ్యతిరేకంగా పోరాడే abolitionists లేకేంకాదు. కాని వారి ఉనికీ, పోరాట ఫలితాలు చాలా తక్కువ పరిధిలో ఉండేవి, లేక స్లేవ్స్ మీద అత్యంత అమానుష దాడులు జరిగినప్పుడు కాని స్లేవ్ ఓనర్శ్ మీద దాడి చేసే వారు కాదు. ఉదాహరణకి, లివర్ పూల్ షిప్ కెప్టెన్ Zong 1782 లో తన షిప్ లో మంచినీళ్ళ కొరత ఉందని 133 స్లేవ్స్ ని గొలుసులతో కట్టేసి మరీ సముద్రం లోకి సజీవంగా విసిరేసాడు. Granville Sharp లాంటి abolitionists ఇలాంటి రాక్షస కృత్యాలకి వ్యతిరేకంగా పోరాడేవారు.










నార్త్ అమెరికా కీ, సౌత్ అమెరికాకీ మరో ముఖ్యమయిన తేడా interracial marriages లో ఉండేది. ఉత్తరమెరికాలో interracial marriages ని నిషిద్దం చేయడమే కాక, racial interbreeding వల్ల పుట్టిన సంతానానికి సమాజంలో సమాన స్థానం లభించేది కాదు. వారికి miscegenation అనే ముద్ర వేసేవారు.

లాటిన్ అమెరికా మాత్రం interracial unions ని ఆపలేమన్న వాస్తవాన్ని గ్రహించి, చాలా ముందు నుంచే సమ్మతించడం ప్రారంభించింది. (Spanish Men-Indian Women కి పుట్టిన వారిని Mestizos అనీ, Creoles, Blacks కి పుట్టిన వారినీ Mulattos అనీ, Indians, Blacks కి పుట్టిన వారిని Zambos అని పిలిచేవారు. ). Inca Empire ని మట్టి కరపించిన Pizzaro సైతం, Inca woman ని భార్యగా స్వీకరించాడు. 1811 కల్లా ఇలాంటి inter-racial ప్రజలు మొత్తం Spanish America లో మూడవ వంతుకు చేరుకున్నారు.

USA లో మాత్రం ఇలాంటి inter-racial unions ఏర్పడకుండా విస్తృతంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయితే పరిస్థితుల్లో ఇంత వ్యత్యాసముండడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఉత్తరమెరికాకి వలసవెళ్ళ్ న బ్రిటీషర్స్ సాధారణంగా తమ తమ భార్యలని వెంట తీసుకుని వెళ్ళేవారు. స్పానిశ్, పోర్చుగీస్ మగవారు మాత్రం ఒంటరిగా వలసపోయేవారు.

ఉదాహరణకి, 1509-1559 కి మధ్యలో Catalogo de Pasajeros a Indias లో రికార్డ్ చేయబడిన 15,000 పేర్లలో కేవలం పది శాతం మాత్రం మహిళలవి.

దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడటానికి పెద్ద కష్టపడక్కర్లేదు. Andres Ruiz-Linares లాంటి సైంటిస్టులు చేసిన DNA studies లో లాటిన్ అమెరికాలో యురోపియన్ మెన్, ఆఫ్రికన్ వుమెన్ ని మేట్స్ కింద తీసుకున్నారని స్పష్టంగా బోధపడింది.

ఇలాంటి miscegenation ఉత్తరమెరికాలో జరగలేదని కాదు. సాక్షాత్తూ Thomas Jefferson స్లేవ్స్ తో పిల్లల్ని కన్నాడు. కలోనియల్ టైమ్ లో బ్రిటీష్ అమెరికాలో దాదాపు 60,000 mulattos ఉండేవారని అంచనా. ఈ రోజు దాదాపు ఇరవై నుంచి ఇరవై అయుదు శాతం బ్లాక్స్ DNA మూలాలు యూరోపియన్స్ కి చెందినవిగా గమనించవచ్చు. 

కాని బ్రిటీష్ అమెరికాలో అమలులో ఉన్న మోడల్ వేరేగా ఉండేది. గ్రాండ్ పేరేంట్స్ లో ఎటు వేపేనా ఒక్క బ్లాక్ రక్తపు చుక్క కలసినా, చర్మపు రంగు ఎంత తెల్లగా ఉన్నా కూడా శాశ్వతంగా "బ్లాక్ " గా ముద్ర పడేది.

1630 వరకీ వర్జీనియా లో inter-racial marriage, శిక్షార్హమైన నేరంగా పరిగణించేవారు. 1662 వరకీ నిషేదముండేది. అమెరికా ఆవిర్బవించిన వంద సంవత్సరాల వరకీ ముప్పై ఎనిమిది రాష్ట్రాల్లో ఈ నిషేదముండేది. 1915 వరకీ కూడా 28 రాష్ట్రాల్లో ప్రాక్టికల్ గా సంఘంలో లేకపోయినా కనీసం చట్టపుస్తకాలలో నిషేదం కొనసాగింది.

వీటన్నిటివల్లా ఆ కాలానికే లాటిన్ అమెరికా ఒక racial melting pot అయ్యింది, కానీ ఉత్తరమెరికా లో మాత్రం వైట్స్ కీ, బ్లాక్స్ కీ మధ్య స్పష్టమైన విభజన కొనసాగింది.

వెనక్కి తిరిగి చూస్తే John Lock ప్రైవేట్ ప్రాపర్టీ గురించి కెరోలినా లో వాదించినప్పుడు, తన దృష్టిలో కేవలం భూమి మాత్రమే లేదన్న విషయం సుస్పష్టం. నిజానికి " fundamental constitutions " పుస్తకంలో ఆర్టికల్ 110 లో ఎంతో స్పష్టంగా ఈ కింది విషయం పేర్కొన్నాడు. "Every freeman of carolina shall have absolute power and authority over his negro slaves, of what opinion or religion soever". ఆయన దృష్టిలో ఆస్థి అంటే భూమి మాత్రమే కాదు, నీగ్రో లుగా పిలవబడే మనుషులు కూడా. తరవాతి తరాల్లోని చట్టాలు కూడా ఇదే నిర్వచనాన్ని కొనసాగిస్తూ వచ్చాయి.

ఇలాంటి చట్టాల దుష్పలితాలు ఈ రోజుకు కూడా వెన్నాడటం కొన్ని చోట్ల అమెరికాలో గమనించొచ్చు. The Gullah Coast, Sandy Island Carolina నుంచీ Amelia Island, Florida వరకీ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి తమకంటూ ప్రత్యేక cuisine, musical style, patois ఉన్నాయి. కొంత మంది ఆంథ్రపాలజిస్టులు Gullah అనే పదమే Angola నుంచి వచ్చి ఉండవచ్చనీ, తొలి తరం నీగ్రోల దిగుమతి అక్కణ్ణుంచే ప్రారంభమయి ఉండవచ్చనీ అభిప్రాయపడతారు. అది సంభవమే. పదిహేడవ శతాబ్ధపు మధ్యనుంచి వచ్చిన స్లేవ్స్ లో దాదాపు 44 శాతం Angola దాని పరిసరప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఈ రోజుకీ సౌత్ కెరోలీనా లో Angola ప్రతిధ్వనులు, ఉదా: Kimbundu భాష తో సహా వినిపించటం విశేషమే. Gullah culture ఈ రోజుకీ మిగిలి ఉండటం, సౌత్ కెరోలినా లాంటి రాష్ట్రాల్లో గడచిన కాలంలో చర్మపు రంగురేఖల విభజన ఎంత పఠిష్టంగా నిలదొక్కుకుందో ఎత్తి చూపే సాక్షం.

ఈ పరిస్థితికి వ్యతిరేకంగా సౌత్ అమెరికా కి వెఌన Angolians కి స్లేవరీ నుంచి విముక్తి పొంది స్వతంత్రంగా బతకడానికి, చిన్న చిన్న స్వతంత సొసైటీస్ ని రూపొందించడానికి అవకాశాలు చాలా ఎక్కువుండేవి.

నార్త్ అమెరికాలో ఒక Gullah అయిన Jack Pritchard వైట్స్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీయడానికి Charleston 1822 లో ప్రయత్నించినప్పుడు, అతణ్ణి ఉరితీయడం జరిగింది.

దురదృష్టవశాత్తూ, ఈ రోజు Land of the free అని ఏ దేశాన్నైతే పిలుచుకుంటున్నామో, అదే దేశం కొద్ది కాలం పాటు, తనలో ఉన్న ఇరవై శాతం జనాభాకి Land of the Permanently Unfree అయ్యిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక దశలో Rio Grande కి ఉన్న ఉత్తరప్రాంతమంతా కూడా స్లేవరీ వంశపారంపర్యం చేయబడింది.

****

చివరకి ఒక పెద్ద, గొప్ప free-society తనకున్న మాయని మచ్చని వదిలించుకోడానికి అంతర్యుద్దం లోంచి వెళ్ళక తప్పలేదు. anti-slavery states అయిన నార్త్ , pro-slavery states అయిన సౌత్ ల మధ్య యుద్దం తో కాని స్లేవరీ మహా పిశాచాన్ని వదిలించుకోలేకపోయింది. సౌత్ మీద యూనియన్ సేనల విజయం అమెరికా చరిత్రలో అతి పెద్ద ఘట్టం.



సివిల్ వార్ ముగిసిపోవచ్చు గాక, కాని వచ్చే దాదాపు వంద సంవత్సరాల వరకీ, ఎంతో మంది అమెరికన్స్, ముఖ్యంగా సదరన్ ప్రాంతాల్లోని అమెరికన్స్ , సౌత్ అమెరికన్ దేశాలతో పోలిస్తే తాము గడించిన అభివృద్ది, సంపదా, prosperity అంతా కూడా వైట్, బ్లాక్స్ మధ్య ఉన్న విభజన వల్ల సాధ్యమయిందని నమ్మారు.

సివిల్ వార్ తరువాతి తరాల్లోని white supremacists, కేవలం వైట్, బ్లాక్ జనాభా వేరు వేరుగా ఉంచడం (segregation) వల్లనే అమెరికా బాగుపడిందనీ, సంపద సృష్టించబడిందనీ నమ్మి, ప్రచారం చేసేవారు.

1963 ల్లో కూడా ఈ సుప్రీమసీ కేకలినపడటం అరుదేమీ కాదు. Alabama Governor George Wallace తన 'Segregation Now, Segregation Tomorrow, Segregation Forever" అన్న స్లోగన్స్ తో ఎన్నికల ప్రచారం చేసాడు. ఈ రోజునున్న సమాజంలో ఏ రాజకీయనాయకుడూ అలాంటి మాటలని రాజకీయంగా బతికి బట్ట కట్టలేడు.


కాని ఆ రోజున అవి వింతవాదనలేమీ 
కావనటానికి George Wallace గవర్నర్ గా ఎన్నికవ్వడమే  సాక్షం.

అంతే కాదు, 1968 లో అతనికి, అతని ఇండిపెండెంట్ పార్టీకి 10 మిలియన్ల ఓట్లు పడ్డాయి.


కాని, యునైటెడ్ స్టేట్స్ సక్సెస్, racial segregation lines మీదనుంచి వచ్చిందన్న వాదన ఒక పూర్తి నాన్సెన్స్. ఒక అర్ధం లేని, సెన్స్ లేని వాదన. వెనిజులా, బ్రెజిల్ లలో మాదిరిగా కాక neighborhoods, hospitals, schools, colleges, workplaces, parks, swimming pools, restaurants and even cemeteries లలో వైట్స్, బ్లాక్స్ కీ మధ్య segregation పాటించడం వల్లే యునైటెడ్ స్టేట్స్ prosper and stable అయ్యిందని నమ్మిన George Wallace లాంటి వారు మూర్ఖులు.

వీరి నమ్మకానికి పూర్తి వ్యతిరేకంగా, విస్తృతంగా అందించబడిన ప్రైవేట్ ప్రాపర్టీ హక్కులు, డెమొక్రసీ లతో నిండి ఉన్న బ్రిటీష్ మోడల్ , సంపదంతా కేంద్రీకృతమయ్యి, ఏకచ్చత్రాధిపత్య అధికార పాలసీలతో నిండి ఉన్న స్పానిష్ మోడల్ కన్నా మెరుగ్గా పనిచేయడం వల్ల మాత్రమే, యునైటెడ్ స్టేట్స్ prosper అయ్యిందన్న విషయం చరిత్ర లోంచి నేర్చుకోవచ్చు.

ఒక ఆఫ్రికన్ బ్లాక్ ఫాదర్ కీ, అమెరికన్ వైట్ మదర్ కీ జన్మించి, Simon Bolivar రోజుల్లో Casta అని పిలవబడే వ్యక్తి, ఈ రోజు అమెరికాకి ప్రసిడెంట్ గా ఎన్నికయ్యాడు. తను ఓడించింది ఆషామాషీ వ్యక్తి ని కాదు. ఒక డెకరేటెడ్ వార్ -హీరో. Maverick గా, Independent streak ఉన్న వ్యక్తిగా, నిజాయితీకి, నిక్కచ్చికి ఎంతో పేరుండి, అవసరమైనప్పుడూ తన పార్టీని సైతం ఎన్నో సార్లు విమర్శించిన ధైర్యసాహాసాలున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఒక Classic Scottish-Irish origin కి చెందిన స్వచ్చమైన white మనిషి ని ఓడించి, ప్రసిడెంట్ గా ఎన్నికయ్యాడు.

కేవలం ముప్పై సంవత్సరాల క్రితం వరకీ సుదూరతీరాల్లో కూడా కనిపించని ఒక అందమైన స్వప్నమది.

అమెరికా లో ఉన్న racial attitudes గత నలబై, ఏభై ఏళ్ళలో గణనీయంగా మారాయి. ఒక రోజు పబ్లిక్ గా మాట్లాడగలిగిన మాటలు , పబ్లిక్ డొమెయిన్ లోంచి ఈ రోజు అదృశ్యమయ్యాయి.

రోజులు గడచిన కొద్దీ అమెరికా లోని melting pots అవుతున్న పెద్ద నగరాల్లోని మనుషులు , రంగు రూపు రేఖల్లో సౌత్ అమెరికాల్లోని మనుషుల్లాగా కనిపిస్తున్నారు. లాటిన్ అమెరికా నుంచి, ముఖ్యంగా మెక్సికో నుంచి దిగుమతవుతున్న ఇమ్మిగ్రేషన్ ఇలాగే కొనసాగితే, non-Hispanic traditional whites అమెరికాలో యాభై శాతం కన్నా పడిపోయి మైనారిటీగా మిగిలిపోవడానికి ఇంకో నలభై సంవత్సరాల కన్నా ఎక్కువ పట్టకపోవచ్చు.

అప్పటికల్లా దేశం లీగల్ గా కాకపోయినా, ప్రాక్టికల్ గా bi-lingual మారుతుంది. 

అమెరికన్ సొసైటీ racial గా కూడా blend అయిపోతోంది. mixed-race couples 1990 కీ, 2000 కీ మధ్య నాలుగింతలయ్యారని సెన్సస్ డేటా చెపుతోంది.

ఇదే కాలంలో జరుగుతున్న మరో పరిణామం, ఎన్నో రంగులూ, జాతులు కలగలసిన బ్రెజిల్ లో దూసుకుపోతున్న ఆర్థిక ప్రగతి. దాదాపు వంద సంవత్సరాల ప్రొటెక్షనిస్టు పాలసీలు, ఆర్థిక విధానాల్లో ప్రభుత్వ అంతరాయాల తరవాత సడలించిన ఆర్థిక విధానాలూ, ప్రైవేటేజేషన్, విదేశీ పెట్టుబడులూ, పెరిగిన ఎగుమతులతో లాటిన్ అమెరికా 1980 తరువాత గణనీయమైన ఆర్థిక ప్రగతి సాధించింది.

1950 లో మొత్తం సౌత్ అమెరికా GDP, US GDP లో ఐదవ వంతు ఉండేది. ఈ రోజు అది మూడవ వంతుకు చేరుకుంది.

షుమారు 500 సంవత్సరాల క్రితం ప్రారంభమయిన conquest and colonization తర్వాత, Anglo-America, Latin-America కి మధ్యనున్న అంతరం క్రమక్రమంగా అంతరించడం ప్రారంభమయినట్లుగా గోచరిస్తోంది.

సమీప భవిష్యత్తులో భూగోళపు పశ్చిమార్దమంతా ఒకటే అమెరికన్ సివిలైజేషన్ ఏర్పడబోతుందేమో అనిపించక మానదు. కాని అవి మితిమీరిన అంచనాలా కాదా అన్నది వేచి చూడాలి.








Wednesday, 17 April 2013



ఏడవ శతాబ్ధంలో అరేబియన్ ఎడారుల్లో ఇస్లాం పుట్టినప్పటి నుంచీ West కీ, East లో ముఖ్యభాగమైన ఇస్లాం సొసైటీస్ కీ మధ్య చాలా ఘర్షణలే జరిగాయి. మొహమ్మద్ అనుచరులు, క్రైస్ట్ అనుచరుల మీద జిహాద్ ప్రకటించటమూ, దానికి సమాధానంగా క్రిస్టియన్స్ క్రూసేడ్స్ జరపడమూ, తద్వారా స్పెయిన్ నీ, పోర్చుగల్ నీ తిరిగి స్వాధీనం చేసుకోవడమూ మనందరికి తెలిసిన విషయమే. దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు జరిగిన ఘర్షణల్లో అడపాదడపా ఓటమి చవిచూట్టము తప్ప, ఈ Clash of Civilizations లో West క్రమం తప్పకుండా నెగ్గుకుంటూ వచ్చింది.

దీనికి ఒక ముఖ్యకారణం Western Science యొక్క పైచేయి. అయితే, ఈ ఆధిక్యం West కి మొదటినుంచీ లేదు.
అదెలాగో చూద్దాం.

మొహమ్మద్ అనుచరులు ఎనిమదవ శతాబ్ధంకల్లా ఇటు స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా, అరేబియన్ ప్రాంతాలలో, ఉత్తరాన సిరియా, తూర్పున పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ల వరకీ ఒక Caliphate (an Islam state ruled by Muhammad's successor) ని నిర్మించారు.
అలా ఏర్పడిన వాటిల్లో Abbasid Caliphate ఆ కాలంలో సైన్స్ లో అందరికన్నా ముందుండేది.


An artist imagination of Science & Technology in Abbbasid Caliphate
 
Modern Al-Karaouine Bayt al-Hikma


















  • తొమ్మిదవ శతాబ్ధంలో Caliph Rashid బాగ్దాద్ లో నిర్మించిన Bayt al-Hikma (House of wisdom) లో గ్రీక్ లో రాసిన అరిస్టాటిల్ రాసిన గ్రంథాలన్నీ అరబిక్ భాషలోకి అనువదించబడి ఉండేవి.
  • Caliphate ఆ కాలంలోనే ఆస్పత్రులని నిర్మించాయని చెపుతారు. ఉదాః 707 లో Damascus లో Caliph al-Waleed నిర్మించిన bimartisan. 
  • AD 859 లో Fez స్థాపించిన University of Al-Karaouine ని ఉన్నత చదువుల సంస్థగా పరిగణించేవాళ్ళు.
 గ్రీక్ మాథమేటిక్స్ మూలాల మీదే కాకుండా, ముఖ్యంగా Indian Mathematical Foundations ఆధారంగా ముస్లిం మాథమేటిషియన్స్ Algebra (from the arabic al-jabr, meaning 'restoration') ని నిర్మించగలిగారు. క్రీ.శ.820 లోనే మొట్టమొదటి ఆల్జీబ్రా పుస్తకం (Hisab al-Jabr W'al-Musqabalah) ని అరబిక్ భాషలో పర్షియన్ స్కాలర్ Muhammad ibn Musa al-Khwarizmi రచించాడు.

మొట్టమొదటి Experimental scientist ఒక ముస్లిం అయిన Abu Ali al-Hasan ibn al-Haytham (AD 965-1039). అప్పటివరకీ "కళ్ళు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి కాబట్టి, చూడగలుగుతామనే" లాంటి ఎన్నో మూఢనమ్మకాలని ఆయన రచించిన Book of Optics తోసిపారేసింది. ఇతనే మొట్టమొదటి సారిగా నక్షత్రాలు, Solid-Bodies కావనీ గుర్తించాడు. అంతే కాదు, ఈ రోజుకి కూడా స్కూలు పిల్లలకి Optics ని పరిచయం చేసేప్పుడు ఉపయోగించే pinhole camera ని ఈయనే నిర్మించాడు.

Cartography, Medicine, Philosophy, Mathematics and Optics లో అప్పటివరకీ ముస్లిం ప్రపంచం సాధించిన ప్రగతికీ, అలాగే గ్రీకుల Claasical Wisdom ని భధ్రపరచినందుకూ కూడా ముస్లిం ప్రపంచానికి, West ఒక విధంగా ఋణపడి ఉంది. English Thinker Roger Bacon 'Phioslophy is drawn from Muslims' అన్న మాటల్లో ఆ విషయాన్ని గమనించవచ్చు.

మరి Science లో ముస్లిం ప్రపంచం, వెస్ట్ కన్నా ఎలా వెనకపడిపోయింది? ఆ ప్రశ్నకి సమాధానమూ, అలాగే సైన్సులో వచ్చిన విప్లవాలు వెస్టర్న్ సివిలైజేషన్ కి, మిలిటరీ రంగంలోనూ, శాస్త్రీయ రంగంలోనూ ప్రపంచం మీద ఎలా ఆధిపత్యాన్ని అందించాయో తెలుసుకోవాలంటే పదిహేడవ శతాబ్ధం కి వెళ్ళిరావాలి.

***

 THE SIEGE

అది 1683వ సంవత్సరం.

1529 లో జరిగినట్లుగానే Ottoman సైన్యం, వియన్నా ద్వారాల వద్ద మరోసారి మోహరించి ఉన్నది. 

The vienna siege 1683

1453 లో Constantinople ని ఆక్రమించుకున్నప్పటినుంచీ Ottomans ఇస్లాం కి ప్రతినిధులయ్యారు. ఇస్లాంని , Christian భూభాగాలైన Bulgaria, Serbia, Hungary లోకి వ్యాప్తి చెందించారు. 1521 లో Belgrade Ottomans చేతుల్లోకి వచ్చేసింది. Buda 1541 లో. బాగ్ధాద్ నుంచీ బాస్రా వరకీ, ఎర్రసముద్రం ముఖద్వారం లోని Van నుంచీ Aden వరకీ, Barbery Coast లో Algiers నుంచీ Tripoli వరకీ వ్యాప్తి చెందిన సామ్రాజ్యం తో Suleiman-the-Magnificient, ఇస్లాం రాజుల్లోకెల్లా రారాజయ్యాడు. స్వయాన కవీ కూడా అయిన సులేమాన్, చాకచక్యంగా మతాన్నీ, పొలిటిక్స్ నీ, ఎకానమీని కలిపి పరిపాలించగలిగాడు. అంత పెద్ద రారాజయిన తనకి Roman Emperor Charles-V కేవలం వియన్నాకి రాజుగా మాత్రమే కనపడ్డాడు. అలాగే పోర్చుగీస్ వ్యాపారులు సముద్రపు దొంగలుగానూ గోచరించారు.

పదిహేడవ శతాబ్ధం వచ్చేకల్లా Ottoman సామ్రాజ్యం ఇంకా విస్తరించింది. 1669 లో Crete పడిపోయింది. Western Ukraine లోకి కూడా సుల్తాన్ చొచ్చుకొని పోగలిగాడు. 1682 లో సుల్తాన్ తన మొదటి పావు కదిపి తన బలగాలని వియన్నా వైపు నడిపించాడు.

13 July 1683 కల్లా వియన్నా ద్వారాల వద్ద 60,000 సిపాయిలు, 80,000 ఇతర మిలిటరీ సిబ్బందీ తిష్టవేసారు.
Byzantium నుంచి వచ్చిన ముస్లిం సైన్యాలు రోమ్ లోని క్రిస్టియన్లకి హడలెత్తించాయి. యముడి మహిషపు లోహ ఘంటలు యూరప్ నిండా మోగాయి. విజయం తథ్యమన్న నమ్మకంతో Kara Mustafa తన టెంట్ ముందు గార్డెన్ నిర్మించుకున్నాడు. Viennese కి ఆహారపదార్ధాల ద్వారాలని మూసివేసి, వారిని లొంగుబాటుకు గురిచేయగలమన్న నమ్మకం Turks లో వచ్చింది. ఆ సంగతి వారి యుద్ద విన్యాసాల్లో, కదలికల్లో, యుద్దభేరుల్లో స్పష్టంగా వియనీస్ కి తెలుస్తూనే ఉంది. Turks, 25th July న తమ శత్రువు మొట్టమొదటి రక్షణశ్రేణులని ఛేధించారు. ఇంకో భారీ విస్ఫోటనం తో Austrians entrenchment at ravelin తో , త్రిభుజాకారంలో బంధించారు. 4th September న ఏకంగా సెంట్రల్ ఫోర్ట్ మీదనే దాడి చేసారు.

కాని అప్పుడే Kara Mustafa కాస్త తత్తరపడ్డాడు. శీతాకాలపు తొలి ఘడియలు మొదలయ్యాయి. ఆయన సైన్యాలకి కావలసిన అత్యవసర సామాగ్రి నిల్వలు తగ్గుమొఖం పట్టాయి. అప్పుడే రోమ్ రాజు Leopald పోలండ్ రాజుతో పరస్పరం రక్షించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మరుక్షణం 60,000 పోలిష్ సైన్యం వియన్నా వైపు యుద్దనడక మొదలెట్టింది. 12 September 1683 కల్లా ఎదురుదాడి రాకెట్ ఫైర్ తో మొదలయ్యింది. రోజంతా సాగించిన ఎదురుదాడిలో ముఖ్యమైన స్థావరాలని కైవసం చేసుకోని, ఆ సాయంత్రం కల్లా పోలిష్ దళాలు వియన్నా ఎదురునున్న కొండ పైనుంచి శత్రుశిబిరంలోకి ఉరకలు పెట్టాయి. రాత్రికల్లా Kara Mustafa టెంట్ లోకి చొరబడ్డాయి. అప్పటికే Kara Mustafa పరారయ్యాడు. చివరకి Ottomans వియన్నాని ఆక్రమించే ప్రయత్నం, ముస్తాఫా పరారీతోనూ, ఓటమిలో Kara Mustafa తనకు తను మృత్యుదండనని విధించుకోవడంతోనూ ముగుస్తుంది. ఈ రెండవ ఆక్రమణ వైఫల్యం, Ottoman empire పతనానికి నాంది పలుకుతుంది. ఆ తరవాత జరిగిన వరస యుద్దాల్లో, Ottomans ని యూరప్ లో సులేమాన్ ఆక్రమించిన దాదాపు ప్రతీ ప్రాంతం లోంచి తరిమికొడతారు. Hungary , Transylvania ని వదులుకోవాల్సి రావటం Ottoman కి భారీ అవమానం.

శతాబ్ధాల క్రిస్టియన్ - ముస్లిం సంఘర్షణలో వియన్నా ఓటమి ఒక పెద్ద మలుపు. West rising లో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ తరవాత జరిగిన ఘర్షణల్లో కూడా వెస్ట్ కి వరసగా పై చేయి లభించడానికి కారణాలని జాగ్రత్తగా అన్వేషిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. 1.సైన్స్ ద్వారా సాధించిన ప్రగతి మిలటరీ రంగంలో ఉపయోగించడమూ, 2) మతనిర్దేశన కన్నా హేతువు కి ప్రభుత్వం పెద్దపీట వేయడం.


 
Ottoman వియన్నా ఆక్రమణ వైఫల్యం జరిగిన 1683 ప్రాంతంలోనే, యూరప్ లో ఫిలాసఫీ, పొలిటికల్ థియరీ రంగాల్లో అతివేగవంతమైన మార్పులు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో సైన్స్ ఫిలాసఫీ లో ఒక భాగం. 1687 లో న్యూటన్ తన Principia of Mathematics ప్రచురించాడు. మూడేళ్ళ తర్వాత John Locke, Second Treatise of Government ని ప్రచురించాడు


 ***

MICROGRAPHIA

 యూరప్ లో సైంటిఫిక్ విప్లవానికి మూలాలు Church - State ని సెపరేట్ గా ఉంచాలన్న ఆదర్శంలో ఉన్నాయి. "Render therefore to Caesar the things that are Caesar's; and unto God the things that are God's" (Matthew 2.2:21) అన్న సూక్తి, ఖురాన్ లో 'Indivisibility of God's law as revealed to Prophet' సూత్రానికి ఎంతో భిన్నమైనది.

యూరప్ 1500 లకి ముందు కనీళ్ళల్లో మునిగి ఉండేదేమో కానీ అజ్ణానంలో కాదు. Muslim world తో సంపర్కం Renaissance period లో claasical learning కి బాగానే దోహదపడింది. 12 వ శతాబ్ధంలోనే Polophany ని కనుక్కోవటం, 15వ శతాబ్దంలో Brunelleschi పెయింటింగ్ లో ఒక linear perspective నీ కనిపెట్టటం జరిగింది. మొట్టమొదటి నవల La vida de Lazarillo de Tormes (1500) లో రాయడం జరిగింది. కానీ Reanaissance పీరియడ్ కన్నా ముఖ్యమైన మలుపులు 1517 తర్వాత క్రిస్టియానిటీ ముక్కలు ముక్కలుగా విడిపోయిన వైనంలోనూ, దాంట్లో జరిగిన మార్పుల ద్వారానూ వచ్చాయి.

ఇంత గొప్ప మార్పుకు కారణం ప్రింటింగ్ ప్రెస్. ఇండస్ట్రియల్ రివల్యూషన్ లో అత్యంత ప్రభావితమైన ఇన్నొవేషన్.

Gutenberg printing-press Gutenberg printing-press workshop















గూటెన్ బర్గ్, మెటల్ తో నిర్మించిన కదిలే ప్రింటింగ్ ప్రెస్ చైనీస్ ప్రింటింగ్ ప్రెస్ కన్నా ఎన్నో రెట్లు సౌలభ్యవంతమైనదీ, అధునాతనమైనదీ. ఎంతో శక్తివంతమైన ఈ టెక్నాలజీ, గూటెన్ బర్గ్ ఆశించినట్లుగా మొనాపలీగా ఉంచలేకపోయారాయన. ఇది కనుక్కున్న కొన్నేళ్ళల్లోనే యూరప్ నిండా కనీసం పదహారు నకళ్ళు బయలుదేరాయి. 1500 కల్లా ఒక్క జర్మనీ లోనే 200 ప్రింటింగ్ షాప్స్ వచ్చాయి. 1519 కల్లా ఒక వెయ్యి ప్రచురణలు మార్కెట్ లోకి వచ్చాయి.

ఈ టెక్నాలజీతో అన్నిటికన్నా ఎక్కువ లాభపడిన రచయిత థియాలజీ ప్రొఫెసర్, ఒకప్పటి ప్రీస్ట్ అయిన Martin Luther. ఇతనూ, Johann Grunenberg కలిపి రోమన్ కాథలిక్ చర్చ్ ప్రాక్టీసెస్ మీద రాసిన విమర్శల శీర్షికలతో  జర్మన్ మార్కెట్ ని నింపేసారు (ref: Theologia Deutsch, Seven Penitential Psalms)

Luther చర్చ్ కి వ్యతిరేకంగా రాసిన Ninety-Five Theses మొదట్లో ప్రచురించకపోయినా, కొన్నేళ్ళలోనే ఆ పత్రాలన్నీ జర్మనీ అంతా లభ్యమయ్యాయి. నిజానికి చర్చ్ కి వ్యతిరేకంగా రచనలు కొత్త ఏమీ కాదు. అంతకు చాలా ముందే Jan Hus పోప్ ని, చర్చ్ ప్రాక్టీసెస్ నీ సవాల్ చేస్తూ రాసాడు, కానీ అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులో లేకపోవటం వల్ల, వాటిని సామాన్య ప్రజలకి విరివిగా అందుబాటులోకి రాకుండా దారుణంగా అణచివేయగలిగారు. ప్రింటింగ్ ప్రెస్ ఆ అణచివేతని అసాధ్యం చేయడమే కాక, Luther works ని దేశం నలుమూలలా ఉన్న ప్రజల చేరువలోకి తెచ్చింది. 1517 నుంచి 1520 మధ్యలో ఆయన ప్రచురించిన 370 editions లో, ఒక్కొక్క edition కి వెయ్యి కాపీలు ప్రింట్ చేసినా, దాదాపు మూడు లక్షల ప్రతుల రచనలు సర్కులేషన్ లోకి వచ్చాయి. 1521-1545 మధ్య క్రిస్టియానిటీ రిఫార్మ్ స్ రచనల్లో సగం Martin Luther వే.

గమ్మత్తేమిటంటే, ఇదే కాలంలో New Testament మొట్టమొదటిసారిగా 1526 లో ప్రింట్ చేయబడింది. మత అతివాదులకి Scriptures ఇలా సామాన్యులకి చదువుకోవడానికి అందుబాటులోకి రావడం ఇష్టం లేకపోయినప్పటికీ, ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ శక్తితో పోటిపడలేకపోయారు. చివరకి వాళ్లు కూడా ఆ ప్రింట్ ప్రపంచపు పోటీలోకి రాక తప్పలేదు. ఇవేకాదు, ఎక్కడో స్కాలర్స్ కి మాత్రమే అందుబాటులో ఉండే అరిస్టాటిల్ రచనలూ, Pro-reform humanists Nicolaus Marschalk, George Sibutus రచనలూ కూడా సామాన్య ప్రజల ముంగిట్లోకి వచ్చేసాయి. 1500 ల తొలినాళ్ళల్లో ఒక వెయ్యి మాధమేటికల్, సైంటిఫిక్ రచనలు ప్రింట్ లోకి వచ్చాయి. 
వీటిల్లో ముఖ్యమైనవి: 1417 లో కనిపెట్టబడిన Luretius' De natura rerum, Roman compiliation of Greek Medical Science, Latin versions of Archimedes works. ఇటాలియన్ ప్రింటర్స్ ఎన్నో arithmetical and accounting techniques రచనల ని ప్రింటింగ్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు ఉదా: Treviso Arithmetic (1478) Luca Pacioli's Suma de arithmetica, geometria.

అయితే ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చినదంతా మానవ సమూహ సజ్ణానానికి సహాయం చేసిందని చెప్పలేం. పదహారవ, పదిహేడవ శతాబ్ధాల్లో బోల్డన్ని వినాశకర రచనలు ప్రచురించబడ్డాయి. 1487-1669 మధ్యలో Malleus maleficarumలో Witches ని అంతమొందించాలన్న సందేశంతో యూరప్ లో 12000-45000 మందిని, అందులో ఎక్కువశాతం మహిళలని చంపేయడం జరిగింది. ఇలాంటి ఉదాహరణలే ఇంకా గమనించవచ్చు.

ఇక్కణ్ణుంచి ముందుకెళ్తే 1665 లో Robert Hooke ప్రచురించిన Micrographia గ్రంధం, Scientific Empiricism సాధించిన విజయాల సెలబ్రేషన్స్ కి చిహ్నం. టెలిస్కోప్ ద్వారా ఎంత దూరం చూడొచ్చో, మైక్రోస్కోప్ ద్వారా అంత లోతుల్లోకీ చూడొచ్చన్న విషయం అర్ధమయ్యాక, మానవ మేధకి ఎంతో కొత్త ప్రపంచం తెరుచుకుంది. Organic Matter యొక్క అతిచిన్న యూనిట్ కి Hooke ఉపయోగించిన పదం 'cell', తదుపరి జరిగిన ఎన్నో పెనువిప్లవ అన్వేషణలకీ నాంది పలికింది. 


సైంటిఫిక్ విప్లవం, గ్రహాల కదలికల అధ్యయనంతోనూ, Blood Circulation Studies తోనూ మొదలయ్యే ఉండొచ్చు గాక, కానీ Hooke's microscope అప్పటివరకీ మానవుడి కంటికందని ప్రపంచాన్ని, తనముందుకు అధ్యయనానికి తీసుకొచ్చింది.

అయితే కొత్తగా దూసుకొస్తూన్న సైన్స్ కేవలం అబ్జర్వేషన్ కి సంబంధించిందే కాదు. గెలీలియో తో మొదలయిన సిస్టమేటిక్ ప్రయోగాలు, కొత్త మాధమేటికల్ రిలేషన్ షిప్స్ ని తెరమీదకి తీసుకొచ్చాయి. ఈ మాధమేటిక్స్ ని న్యూటన్, లెబ్నిజ్ ఇంకా విస్తృతపరచారు. సైంటిఫిక్ రివల్యూషన్ ఫలితాలు ఫిలాసఫీ లో కూడా విప్లవాలని తీసుకొచ్చాయి. Descartes, Spinoza అప్పటివరకి Perception, Reason మీద నెలకొని ఉన్న సిద్దాంతాలని తోసిపుచ్చారు. ఈ కాలంలో జరిగిన ఎన్నో ఇంటలెక్చువల్ ఇన్నోవేషన్స్ , ఈరోజు మనకి తెలిసిన మోడర్న్ అనాటమీ, ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, జామెట్రీ, మేధమేటిక్స్, మెకానిక్స్, ఫిజిక్స్ లకి జన్మనిచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ రివల్యూషన్ యొక్క ప్రభావం, లక్షణం 1530 to 1789 మధ్యలో జరిగిన అతి ముఖ్యమయిన 29 కీలకమయిన ఇన్నోవేషన్స్ చూసి తెలుసుకోవచ్చు. (*లిస్ట్ ఈ పోస్ట్ చివరన కింద ఇవ్వబడింది).

ప్రపంచపు హిస్టరీ ఆఫ్ సైన్స్ అన్ని పుస్తకాలలో కనపడే 369 అతి ముఖ్యమైన సైంటిఫిక్ మలుపుల్లో, అత్యధికంగా...38 శాతం సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, Reformation period నుంచీ French Revolution మధ్యకాలంలో జరిగినవే అంటే, ఈ పీరియడ్ ప్రభావాన్ని అంచనా వేసుకోవచ్చు.



1600 మధ్యలో కల్లా, ప్రింటింగ్ ప్రెస్, పోస్టల్ సర్వీసెస్ ల సహాయంతో సైంటిఫిక్ నాలెడ్జ్ యూరప్ అంతా, అతివేగంగా విస్తృతమవుతూ వచ్చింది. ఇంత వేగంగా వచ్చిన సైంటిఫిక్ విప్లవాల ఫలితాలని, అప్పటివరకీ స్థిరపడిపోయి ఉన్న
Christian Doctrine తో సంధానం చేసుకోవడం మహామహులకే కష్టతరమయింది. సాక్షాత్తూ Newton, Hooke లే ఎంతో ఇబ్బందిపడ్డారు. కానీ ఈ ఇంటలెక్చువల్ రివల్యూషన్, దాదాపు ఒక శతాబ్దపు ముందు వచ్చిన రిలీజియస్ రివల్యూషన్ కన్నా ఎంతో శక్తివంతమైనదీ, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులని సంఘంలో తీసుకొచ్చింది అని చెప్పకమానదు.

Eurocentrism అన్నమాట అంటే చాలు కొంతమంది ఉలిక్కిపడతారు. అదొక ప్రిజుడిస్ పదమనీ, డిస్టేస్ట్ ఫుల్ పదమని కొంతమంది భావన. కానీ సైంటిఫిక్ రివల్యూషన్ పూర్తిగా ముమ్మాటికీ Eurocentric దే. ఏరకంగా కొలిచి చూసినా, సైంటీఫిక్ రివల్యూషన్ లో జరిగిన 80 శాతం ఇన్నోవేషన్స్ , Glasgow, Copenhagen, Krakow, Naples, Marseille and Plymouth లతో చుట్టుకొని ఉన్న ఒక చిన్న hexagon ఆకారంలో ఉండే ప్రాంతంలో జరిగాయి. ఇవే కాదు, దాదాపు మిగతావన్నీ కూడా వీటికి వంద మైళ్ల చుట్టూ ఉన్న ప్రాంతంలోనే జరిగాయి.

దీనికి పూర్తి వ్యతిరేకంగా, ఈ కాలంలో Ottoman ప్రపంచంలో సైంటిఫిక్ ప్రొగ్రెస్ ఏమాత్రమూ కనపడదు. ముస్లిం ప్రపంచం మీద మతానికున్న పట్టు, సైన్స్ లో ప్రగతికి విరోధంగా మిగిలిందనేది చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. పదకొండవ శతాబ్దపు తొలినాళ్ళనుంచే ఇస్లామిక్ క్లరిక్స్ గ్రీక్ ఫిలాసఫీ భోధనలు, ఖురాన్ భోధనలతో సరిపడవని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. భగవంతుని సృష్టినీ, విశ్వాన్ని నడిపించే శక్తులనీ అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం Blasphemy గా పరిగణించబడేది. Abu Hamid al-Ghazali రచించిన The Incoherence of the Philosophers లో ఈ foreign science ని చదువుకున్నవాళ్ళు, మతాన్ని వదిలేయకుండా ఉండడమనేది అరుదని ప్రమాదహెచ్చరికలు చేస్తాడు. మతాధికారుల పర్యవేక్షణలో ఫిలాసఫీ ప్రాచుర్యం కాకుండా అడ్డుకోవడమూ, పుస్తకాలని తగలపెట్టటమూ, free-thinkers ని అంతమొందించటమూ నిరాటంకంగా సాగిపోయాయి. యూరోపియన్ యూనివర్సిటిస్, తమ విద్యార్ధుల సంఖ్యని పెంచుకోని, విద్యార్ధులకి స్కాలర్ షిప్స్ పెంచే కాలంలో, ముస్లిం ప్రపంచంలో మద్రాస ల పలుకుబడి పెరిగింది. చివరకి ప్రింటింగ్ ని కూడా అరికట్టాలని చూసారు.

Ottomans కి Script పవిత్రమైనది. పెన్ కీ, కాలిగ్రఫీకి, స్కాలర్ ఇంక్ కీ ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రింటింగ్ కి ఇవ్వలేదు. 1515 లో Sultan Selim ప్రింటింగ్ ప్రెస్ ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు కనపడితే వారికి మరణశిక్ష విధించబడుతుందన్న ఆదేశాలని జారీచేసాడు!!. ఒకప్పుడు యూరోపియన్ స్కాలర్స్ కి  ఐడియాస్ నీ, ఇన్స్పిరేషన్ నీ అందించిన ముస్లిం సైంటిస్ట్ లు, సైంటిఫిక్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పులు తెలుసుకోలేకుండా, వాటినుంచి దూరం చేయబడ్డారు. 

ఇస్లాం ని, సైంటిఫిక్ ప్రొగ్రెస్ తో అనుసంధానం చేయకపోవడం ఒక చారిత్రకవిషాదంగా పరిణమించింది.

పద్దెనిమిదవ శతాబ్దపు చివరివరకీ, కేవలం ఒకే ఒక్క వెస్టర్న్ బుక్ మిడిల్ ఈస్టర్న్ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేయబడిందంటే, మిడిల్ ఈస్టర్న్ ప్రపంచం మిగతా ప్రపంచంతో ఎంతగా డిస్కనెక్ట్ అయి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇంతకీ ఆ పుస్తకం ఏంటని మీకు కుతూహలంగా ఉందా? సమాధానం: సిఫిలిస్ ని ఎలా ట్రీట్ చేయాలన్న మెడికల్ బుక్.

Takiyuddin observatory - an artist imagination
ఈ కాలంలో రెండు నాగరికతల్లో ఉన్న తేడాని, 1570 లో Istanbul లో నిర్మించిన obseravtory కథ చెప్పినంతగా మరేది చెప్పలేదు. Takiyuddin al-Rasid, సిరియా లో 1521 లో జన్మించాడు. డమస్కస్, కైరో లలో చదువుకున్న శాస్త్రవేత్త. ఆస్ట్రానమీ, మేథమేటిక్స్, ఆప్టిక్స్ లలో ఎంతో కృషి చేసాడు. తను స్వయానా astronomical clocks నిర్మించినవాడు. 1570 లో తను సుల్తాన్ తో ఎంతో లాబీయింగ్ చేసి అబ్జర్వేటరీ నిరించగలిగాడు. కానీ, 1577 వచ్చేప్పటికల్లా పరిస్థితులు మారాయి. Takiyuddin ఆకాశానికవతల అనంతలోకాల్లో ఉన్న రహస్యాలని ఛేధించటం, దైవదూషణతో సమానమని సీనియర్ క్లరిక్ Sheikh ul-Islam Kadizade, సుల్తాన్ ని ఒప్పించగలిగాడు. ఫలితంగా సుల్తాన్ 1580 లో observatory ని సమూలంగా కూలగొట్టించేస్తాడు. ఆ తరవాత దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు ఇస్తాన్ బుల్ ఏ అబ్జర్వేటరీకి నోచుకోదు.

సైన్స్ మీదా, పరిశోధనా, అన్వేషణా, శాస్త్రీయ తృష్ణ మీద క్రిస్టియన్ చర్చ్ తన పట్టుని క్రమక్రమంగా సడలించిన కాలంలోనే, పై రకమైన విధానాలతో, చర్యలతో ముస్లిం మతాధిపతులు Ottoman సైంటిఫిక్ అభివృద్దిని అడ్డుకుంటారు.

పంతొమ్మిదివ శతాబ్ధపు చివరలో కూడా Huseyin Rifki Tamani, the head teacher of Muhendishane-i Cedide "విశ్వం గోళాకారంలోనూ, భూమి దాని కేంద్రంలోనూ, సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతారని బోధించేవారంటే, సైన్స్ నీ, అది కనుక్కొన్న ఫలితాలని గుర్తించటానికి ఎంతగా నిరాకరించారో అర్ధం చేసుకోవచ్చు.


దీనికి పూర్తి వ్యతిరేకంగా పదిహేడవ శతాబ్ధపు ద్వితీయార్ధంలో యూరప్ లో ఉన్న రాజ్యాధికారులందరూ, క్రిస్టియన్ మత పెద్దల నసుగుళ్ళని పక్కకుతోసి సైన్స్ కి పెద్దపీట వేసారు.

Greenwich Royal Observatory
July 1662 లో King Charles II, Royal Society of London for Improving Natural Knowledge కి Physico-Mathematical Experimental Learning సంస్థ స్థాపించటం కోసం నగదు మంజూరు చేసాడు. ఆ తరవాత నాలుగు సంవత్సరాలకి పారిస్ లో Academie Royale des Sciences ఏర్పాటు చేయబడింది. 1675 లో Charles-II Greenwich లో Royal Observatory ని నిర్మించమని ఆదేశిస్తాడు. Royal Society ని ఏర్పాటు చేయడంలో ముఖ్యోద్దేశం ఏ రాజకీర్తికోసం ప్రాకులాటో కాదు, నూతన ఆలోచనలనీ, ఐడియాలనీ, సంక్లిష్టమయిన సైంటిఫిక్ సమస్యలని కలసికట్టుగా ఎదుర్కోవాలన్న సదుద్దేశం. దానికి ఉదాహరణే, గురుత్వాకర్షణశక్తి ప్రిన్సిపుల్. తన ముందు Hooke కృషి ఫలితాలు లేనట్లయితే న్యూటన్ గురుత్వాకర్షణశక్తిని సమీకరించలేకపోయేవాడు.

ఇదంతా చెప్పటం, యూరప్ లో సైంటిస్టులంతా సౌహార్ద్రసంబంధాలని కలిగిఉన్నారన్న అభిప్రాయాన్ని కలిగించటం కోసం కాదు. నిజానికి సైంటిస్టుల మధ్య ఆనాడైనా, ఏనాడైనా పోటీ ఉధృతమే. ఉదా: Inverse-square law of gravity ని ముందు ఎవరు కనుక్కొన్నారన్న విషయం పై Newton, Hooke హోరాహోరీ దెబ్బలాడుకునేవారు. అలాగే Leibniz తన gravity principle ని తీసిపారేసాడన్న కోపంతో Newton, Leibniz తో కూడా హేయమైన పోట్లాటకి దిగేవాడు

ఏదేమైనా experimental methods, patient observation టెక్నాలజీ లో ఎంతో ముందడుగు వేయడానికి తోడ్పడి, చివరకి ఇండస్ట్రియల్ రివల్యూషన్ కి దారి తీసాయి. న్యూటన్ నియమాల మొదలు, థామస్ న్యుకోమెన్ స్టీమ్ ఇంజన్ వరకి ప్రయాణం అతితక్కువ కాలంలో, ఏ మూలమలుపుల చుట్టూ సాగకుండా నేరుగా నడచింది. ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన ఇన్నొవేషన్స్, జేమ్స్ వాట్ అధునాతన స్టీమ్ ఇంజన్(1764), జాన్ హారిసన్ క్రోనోమీటర్(1761), రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్(1769) ఒకే దేశంలోంచి, ఒకే దశాబ్దం లో రావటం కాకతాళీయమేమీ కాదు.

Newton Monument in Westminster Abbey
న్యూటన్ 1727 లో చనిపోయినప్పుడు లండన్ లోని ప్రముఖ చర్చ్ Westminster Abbey లో నాలుగురోజుల పాటు ప్రజల సందర్శనార్ధం ఉంచి, అందులోనే burie చేస్తారు.  తన అంత్యక్రియలకి ఇద్దరు డ్యూక్స్ తో పాటూ, లార్డ్ చాన్సలర్ సైతం హాజరయ్యారు. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్, సమాజపు పైతరగతుల్లోంచి రాని ఒక శాస్త్రవేత్తకి అంతటి గౌరవాన్నివ్వడం చూసి అచ్చెరువొంది "ఒక మేథమేటిక్స్ ప్రొఫెసర్, కేవలం తన వృత్తిలో గొప్పవాడిగా రాణించినందువల్ల, తన మృతికి ఒక రాజమరణపు గౌరవార్దాన్నందివ్వడం నేనీరోజు తిలకించానని" రాసుకున్నాడు. 

Westminster Abbey లోని న్యూటన్ మాన్యుమెంట్ కింద రాసిన ఈ మాటలు న్యూటన్ కి ఇచ్చిన విలువకి అద్దం పడతాయి. "Here is buried Isaac Newton, Knight, who by a strength of mind almost divine, and mathematical principles peculiarly his own, explored the course and figures of the planets, the paths of comets, the tides of the sea, the dissimilarities in rays of light, and, what no other scholar has previously imagined, the properties of the colours thus produced. Diligent, sagacious and faithful, in his expositions of nature, antiquity and the holy Scriptures, he vindicated by his philosophy the majesty of God mighty and good, and expressed the simplicity of the Gospel in his manners. Mortals rejoice that there has existed such and so great an ornament of the human race! He was born on 25th December 1642, and died on 20th March 1726".

వెస్ట్ లో గవర్నమెంట్, సైన్స్ పార్టనర్షిప్ లోకి ప్రవేశించాయన్న విషయం ఇలాంటి ఎన్నో ఉదాహరణల్లో చూడవచ్చు. ఈ భాగస్వామ్యాన్ని చాటి చెప్పే ఇంకో అతి గొప్ప ఉదాహరణ వోల్టేర్ స్నేహితుడయిన King of Prussia 'Frederick the great' ది. అది ఈ కింది భాగంలో చూద్దాం.

***

OSMAN AND FRITZ

ఈ భాగం లో రచయిత Ottoman Empire వియన్నాని ముట్టడించిన తర్వాత 70 సంవత్సరాలకి ఉన్న పరిస్థితులని వివరిస్తాడు.Ottomoan Empire ఎలా వరస సమస్యలబారిన పడిందీ, పన్నులరాబడి తగ్గిపోయి ప్రభుత్వ ఖజానా నిండకపోవటమూ, సుఫీ మిస్టిక్స్ కీ, అతివాదమతపెద్దలకీ మధ్య ఘర్షణలూ, అవినీతిపెరిగిపోవటమూ, అంతర్గత తిరుగుబాట్లతో ఐదుగురు సుల్తాన్ లని పీఠం నుంచి తప్పించటమూ, ఇద్దరు సుల్తాన్ లని హత్యచేయటమూ, బహుభార్యత్వం వల్ల వారసులెక్కువయి రాజ్యాసనం కోసం కుట్రలూ, కుతంత్రాలూ ఇత్యాది సమస్యలతో Ottoman Empire ఎలా వీగిపోయిందో ఈ సెక్షన్ లో గమనించవచ్చు.


Frederick the great, a music lover loved philosophical discussions with Voltaire and others

ఇదే కాలంలో Prussia లో Frederick the Great ప్రష్యాని సమూలంగా మార్చేసి, ప్రజల సమస్యలకి ప్రముఖ పాత్రనిచ్చిన విధానమూ, ప్రభుత్వసిబ్బందిని తగ్గించిన విధానమూ, తన తండ్రిబాటలో కాక హిస్టరీ, మ్యూజిక్, ఫిలాసఫీ(వోల్టేర్ తనకి దగ్గరిమిత్రుడు) లలో తనకున్న ఆసక్తీ గురించీ, రాజసింహాసనం మీద కూర్చున్నాక ఆయన మిలటరీ రంగంలో సాధించిన అద్వితీయమైన ప్రగతీ, విజయాలూ, ఆస్ట్రియానీ ముట్టడించి, సిలిసియాని జయించటం గురించీ, అతను మరణించే సమయానికి తన రాజ్యాన్ని పోలిష్ సరిహద్దులవరకీ విస్తరించటం గురించీ వివరిస్తాడు. 

Frederick తండ్రి రాజాస్థాననానికి ఎంతో రాబడి తెచ్చి, ఎన్నో ఆస్థులని సమకూరుస్తాడు. కానీ Frederick ఆ ఆస్థులన్నిటినీ తిరిగి ప్రజల కోసం ఖర్చుపెడతాడు. ఒపేరా హౌసెస్, కేథడ్రల్స్ ని ఎన్నిటినో నిర్మిస్తాడు. ఎన్నో ఉదారవాద రాజశాసనాలని ఆదేశిస్తాడు. ఆ రోజుల్లో Frederick జారీ చేసిన శాసనాల్లోని మతసామరస్యం, ఇమ్మిగ్రేషన్ పట్ల సుముఖతా, పాత్రికేయస్వేచ్చా గురించీ కూడా మనం ఈ సెక్షన్ లో గమనించవచ్చు. స్వేచ్చా, విదేశసందర్శకులతో ప్రష్యా సంస్కృతి ఇనుమడించిన విధానమూ, ప్రష్యా జ్ణాన తృష్ణా, ఎన్నో పుస్తకాల విక్రయకేంద్రాలూ, చర్చావేదికలూ, సైంటిఫిక్ సంస్థలతో వర్ధిల్లిన విధానమూ గురించి ఈ భాగం లో చదువుకోవచ్చు.

ఈయన పరిపాలనాకాలంలోనే ఫిలసాఫర్ Immanuel Kant (Critique of Pure Reason (1781)) పద్దెనిమదవ శతాబ్దపు అతిగొప్ప ఫిలాసఫర్ గా ఎదిగిన విధానమూ, Frederick the great ఇలాంటి ఫిలాసఫర్స్ కీ, మేధావుల తెలివితేటలకీ ఇచ్చిన ప్రాముఖ్యతా, అదే సమయంలో ఆ మేధావులు ఏ సమాజపు దిగువ వర్గాల నుంచి వచ్చారా, ఎగువతరగతికి చెందినవారా ఇట్లాంటి విషయాల పట్ల తనకున్న విముఖతను గురించీ వివరిస్తాడు.

ఇదే కాలంలో యూరప్ అంతా ఫిలాసఫీ విస్తరించిన విధానమూ, అదే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ వల్ల పెరిగిన పుస్తకాలూ, మాగజైన్సూ, విప్లవాత్మకంగా పెరిగిన అక్షరాస్యతా, తద్వారా పెరిగిన చదువరుల సంఖ్య గురించి చెపుతాడు.. జ్ణానం కేవలం చదవడం వల్లే విస్తరించలేదనీ,. ఖండమంతా విస్తరించిన ఆర్ట్ ఎక్జిబిషన్లూ, మ్యూజిక్ థియేటర్సూ వల్ల సోషల్ సైన్సెస్ ప్రజలకి అందిన విధానమూ తద్వారా జరిగిన ఎడ్యుకేషన్ గురించి కూడా చదువుకోవచ్చు.

ఈ పీరియడ్ లో Reason కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఎన్ని ముఖ్యమైన ఫిలాసఫికల్, సైంటిఫిక్ గ్రంధాలొచ్చాయో, క్రిస్టియన్ మతచాందసత్వం మీద Reason దాడిని గమనించవచ్చు.ఇతర యూరప్ మోనార్క్ ల వలె, Frederick the great మతం నుంచీ, సమాజంలో ఇతర వర్గాల సంకెళ్ళ నుంచీ, ఇంటలెక్చువల్స్ కి స్వేచ్చనిచ్చాడనీ, వోల్టేర్ కి తన ఇంటిపైన ఆశ్రయాన్నివ్వటమే కాదు, Royal Science Society లాంటిదాన్ని ప్రష్యాలో కూడా ఒకటి స్థాపించమని ఆహ్వానించాడనీ కూడా ఈ భాగంలో రచయిత చెపుతాడు.  ఇదే సెక్షన్ లో Frederick కి మ్యూజిక్ రచనల గురించీ, ఇతర రచనల గురించీ ఉన్న ఆసక్తి గురించి తెలుసుకోవచ్చు. అలాగే ప్రష్యాలోని Potsdam ఈరోజున ఉన్న స్థితి గురించి కూడా రచయిత వివరిస్తాడు.


సైన్స్ లో సాధించిన ప్రగతి, ఆయుధసాంకేతికతలో ఎలా ముందడుగులు వేపించిందీ, తద్వారా మిలటరీ ఆధిపత్యం ఎలా సిద్దించిందీ, గన్స్, ఆర్టిలరీ సాంకేతికత ఎలా అభివృద్ది చెందిందీ ఇవన్నీ కూడా వివరిస్తాడు.

TANZIMAT TOURS

ఈ భాగం లో ముస్లిం ప్రపంచం యూరప్ లో జరుగుతున్న సైన్స్ రివల్యూషన్ నీ తద్వారా యూరప్ యుద్దరంగంలో సంపాదించిన ఆధిక్యతనీ గమనించి, తమముందు మరే మార్గమూ లేదనీ, సైన్స్ ని దగ్గరకి తీసుకోకతప్పదన్న సత్యాన్ని గ్రహించడం గురించి కొన్ని ఉదాహరణలు చూపుతాడు. వెస్టర్న్ ప్రపంచం నుంచి శాస్త్రవేత్తలనీ, నిపుణులనీ ఇస్తాన్బుల్ కి ఆహ్వనించిన సందర్భాలూ, మార్పు కోసం చేసిన ప్రయత్నాలు పొలిటికల్ వ్యతిరేకత వల్ల మాటిమాటికి విఫలం చెందిన వైనాల గురించి కూడా చెపుతాడు. 

Abdulmecid-I
చిట్టచివరకి 1826 లో సంస్కరణలని పెద్ద ఎత్తున చేపట్టిన సుల్తాన్లు గా పేరొందిన Mahmud II మరియు Abdulmecid-I లు మార్పుని వ్యతిరేకిస్తున్న పొలిటికల్ శక్తుల మీద యుద్దాన్ని ప్రకటించి, ఆర్మీని శక్తివంతం చేయటానికి సమూలమైన మార్పులు చేపట్టటం గురించీ, కొత్త ఆయుధాలని సమకూర్చుకోవటం, అల్లాపేరున మోగే యుద్దభేరి ఆర్మీ బాండ్ ని యూరోపియన్ స్టైల్ బాండ్ కింద మార్చటం, చివరకి ఆర్మీ యూనిఫామ్స్ కూడా యూరోపియనైజ్ చేయటం గురించీ రచయిత వివరిస్తారు.

యూరప్ లో వచ్చిన సైంటిఫిక్ విప్లవం తర్వాత 200 సంవత్సరాలకి వెస్టర్న్ నాలెడ్జ్ ని ఇస్లామిక్ ప్రపంచంలోకి తీసుకురావటానికి చేసిన ప్రయత్నాలూ, ఏర్పరిచిన సంస్థల గురించి కూడా రచయిత వివరిస్తారు.

 

ISTANBUL TO JERUSALEM

ఈ సెక్షన్ లో టర్కీ తన విధానాలని మార్చుకోన్న వైనం గురించి వివరిస్తారు. టర్కీ అరబిక్ స్క్రిప్ట్ నుంచి, తన ఆల్ఫబెట్స్ కి మారిన విధానం గురించీ, తద్వారా టర్కీ ఇరవైయ్యవ శతాబ్ధంలోకి దూసుకొచ్చిన విధానమూ, fez నీ, turban నీ వదిలేసి స్త్రీ పురుషులు ధరించే దుస్తుల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులూ , వెస్టర్న్ కాలండర్ ని అమలుపరచడమూ, అన్నిటికన్నా ముఖ్యంగా టర్కీ దేశాన్ని మతపరమైన దేశంగా కాక, సెక్యులర్ దేశంగా ప్రకటించటమూ, షరియా లా ని నిర్మూలించి స్విట్జర్లాండ్ చట్టాన్ని అనుసరించి సివిల్ కోడ్ ని ప్రిపేర్ చేసుకోవటమూ, మతాధిపత్యం ఒట్టోమాన్ ఎంపైర్ ని ఎంత వెనకంజవేసిందో టర్కీ గ్రహించిన సంగతి గురించి చెపుతారు.


అలాగే, ఇజ్రాయిల్ సైంటిఫిక్, టెక్నాలజీ రంగంలో తన చుట్టూ ఉన్న అరబిక్ దేశాలకన్నా ఎంత ముందున్న విషయం గురించి కొన్ని ఉదాహరణలు పేర్కొంటారు.

*************************
చివరగా, ఇస్లాం దేశాలు కూడా ఆధునిక కాలంలో సైన్స్ కి ఆహ్వానం పలికి, తమ తమ దేశాల్లో క్రమక్రమంగా సైంటిఫిక్ సంస్థలనీ, అత్యాధునిక యూనివర్సిటీలనీ, పరిశోధనశాలల మీదా దృష్టి కేంద్రీకరించడాన్నీ గమనించొచ్చు.

ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ ప్రతి ఏటా రెండు సైన్స్ ఫెస్టివల్స్ ని నిర్వహిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం పద్దెనిమిది మిలియన్ల డాలర్లతో అబ్జర్వేటరీని నిర్మిస్తోంది. గమ్మత్తేమిటంటే, షరియా లా ని ఎంతో ఖశ్చితంగా అమలుపరచాలని ఆరాటపడే శక్తులున్న దేశంలో 70 శాతం సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు అమ్మాయిలు కావడం ఎంతో సంతోషించాల్సిన విషయం. అటు టెహరాన్ నుంచీ రియాద్ వరకీ, ఇటు సౌదీ నుంచి వెస్ట్ లండన్ వరకీ అమ్మాయిల చదువు పట్ల విముఖత గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ విషయం.

అయితే ఇరాన్ సమకూర్చుకూంటోన్న శాస్త్రీయ విజ్ణానం, ఏ ఫలితాలకోసం ఉపయోగిస్తుందో వేచి చూడాల్సిందే. మతశక్తుల చేతిలో విస్ఫోటనవిజ్ణానం ఆందోళనకి ఆస్కారమిచ్చే విషయమే. ఈ విషయంలో పాకిస్తాన్ సైంటిస్ట్ AQKhan  ఎంత భాధ్యతారహితంగా ప్రవర్తించారో గుర్తుకురాకమానదు.

ఈరోజు, వియన్నా ముట్టడి తర్వాత దాదాపు మూడు వందల సంవత్సరాలకి, వెస్ట్ సైంటిఫిక్ రంగంలో మిగతా ప్రపంచం కన్నా ముందంజని ఇకముందు కూడా కొనసాగించగలదా, లేదా?

ఇదే ప్రశ్నని ఇంకోవిధంగా కూడా వేసుకోవచ్చు.

నాన్ వెస్టర్న్ ప్రపంచం, వెస్టర్న్ ప్రపంచపు కేంద్రస్థంభాలయిన Rule of Law, Property Rights, True representative form of government ని తిరస్కరించి, కేవలం వెస్టర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ ని మాత్రమే తీసుకోని ఆ లాభాలని విస్తృతంగా అమలుపర్చి, ప్రపంచాధిపత్యాన్ని సాధించగలదా?

అది తరవాతి చాప్టర్స్ లో చూద్దాం.
**********************************************************************



*1530 to 1789 మధ్య అతి ముఖ్యమయిన break-throughs.

1530 Paracelsus pioneers the application of chemistry to physiology and pathology

1543 Nicolaus Copernicus' De revolutionibus orbium coelestium states the heliocentric theory of the solar system
Andreas Vesalius' De humani corporis fabrica supplants Galen's anatomical textbook

1546 Agricola's De natura fossilium classifies minerals and introduces the term 'fossil'

1572 Tycho Brahe records the first European observation of a supernova

1589 Galileo's tests of falling bodies revolutionize the experimental method

1600 William Gilbert's De magnete, magnetisque coporibus describes the magnetic properties of the earth and electricity

1604 Galileo discovers that a free-falling body increases its distance as the square of the time

1608 Hans Lippershey and Zacharias Janses independently invent the telescope


1609 Galileo conducts the first telescopic observations of the night sky

1610 Galileo discovers four of Jupiter's moons and infers that the earth is not at the centre of the universe

1614 John Napier's Mirifici logarithmorum canonis descriptio introduces logarithms

1628 William Harvey writes Exercitatio anatomica de motu cordis et sanguinis in animalibus, accurately describing the circulatino of blood

1637 Rene Descartes 'La Geometrie' an appendix to his Discours de la methode, founds analytic geometry

1638 Galileo's Discorsi e dimonstrazioni matematiche founds modern mechanics

1640 Pierre de Fermat founds number theory

1654 Fermat and Blaise Pascal found probability theory

1661 Robert Boyle's Skeptical Chymist defines elements and chemical analysis

1662 Boyle states Boyle's Law that the volume occupied by a fixed mass of gas in a container is inversely proportional to the pressure it exerts

1669 Issac Newton's De analysi per qequationes numero terminorum infinitas presents the first systematic account of the calculus, independently developed by Gottfried Leibniz

1676 Antoni van Leeuwenhoek discovers micro-organisms

1687 Newton's Philosophiae naturalis principia mathematica states the law of universal gravitation and the laws of motion

1735 Carolus Linnaeus' Systema naturae introduces systematic classification of genera and species of organisms

1738 Daniel Bernoulli's Hydrodynamica states Bernoulli's Principle and founds the mathematical study of fluid flow and kinetic theory of gases

1746 Jean-Etienne Guettard prepares the first true geological maps

1755 Joseph Black identifies carbon dioxide

1775 Antoine Lavoisier accurately describes combustion

1785 James Hutton's 'Concerning the System of the Earth ' states the uniformitarian  view of the earth's development

1789 Lavoisier's Traite elementarie de chimie states the law of conservation of matter