Friday, 4 January 2013

Bonding Beyond Love

Posted by Kumar N on 1/04/2013 02:00:00 pm with No comments


పిన్న వయసులోనే, ఏ అవస్థా పడకుండా చనిపోయినవాళ్ళెవరైనా ఉంటే వాళ్ళను చూసి ఏడవకండి. బి హాప్పీ ఫర్ దెమ్

లేదా

ఈ సినిమా చూడకండి.

అని చెప్పాను స్నేహితులతో, కేవలం ఈ సినిమా కోసమే ఆర్ట్ సినిమాలు వేసే లింకన్ సెంటర్ కి ఓ గంట ప్రయాణం, పదిహేడు డాలర్ల టోల్స్, ముప్పైఆరు డాలర్ల పార్కింగ్, పదమూడు డాలర్ల టికెట్ etc., పెట్టుకోని చూసి వచ్చాను అని తెలిసి, ఎలా ఉందీ అని అడిగితే?

If my childhood taught me one thing, its that the differences between the rich and the poor are nothing. It’s the chasm between the healthy and the sick that you just can’t breach అని అంటుందో పాత్ర Steve Toltz పుస్తకంలో.

How True!

బాండింగ్ అంటూ ఇంకా ఏర్పడకుండా ఉండే ప్రేమలు తెలుసు, ప్రేమ లేకుండా ఉండే బాండింగ్స్ ఉంటాయా? హాపీ టైమ్స్ లోపలినుండి ఫీల్ అవ్వటానికే కాదు, బయటనుండి చూడటానికి కూడా బావుంటాయి. rough times లో ఒక రిలేషన్షిప్ ని ప్రేమ నిలపెట్టగలదేమో, కాని devastating times లో కేవలం ప్రేమ సరిపోదు, అంతకు మించి ఏదో కావాలి. దాన్ని బాండింగ్ అంటారని నా స్నేహితుడి వైఫ్ ఎప్పుడూ నాకు స్కూలింగ్ ఇస్తుంది. ఏ పేరయితేనేం, యాభై, అరవై ఏళ్ళు ఒక రూఫ్ కింద కలిసి బతికితే వచ్చే బంధానికి షార్ట్ కట్స్ లేవు. ఆ సుదీర్ఘ ప్రయాణం కలసి చేయాల్సిందే.

సినిమా అంతా భార్యా భర్తా ఇద్దరే పాత్రలు (మధ్యలో కొద్ది నిమిషాలు వచ్చిపోయే ఓ అరడజను మనుషులు తప్ప). సినిమా మొత్తం ఒకే ఇంట్లో.. ఒక్క రెండు షాట్లు తప్ప. ఇద్దరికీ ఎనభై దాటిన వయసూ, ఏభై ఏళ్ళ పైగా దాంపత్యం, పిల్లలుండేది విదేశాల్లో..

ఓ తెలుగు కధా, దాని మీద తీసిన ఓ తెలుగు సినిమా గుర్తొస్తోందా? అదృష్టవశాత్తూ పోలికలింతటితో ఆగిపోతాయి.

అదృష్టమో, దురదృష్టమో తెలీదు కాని, ఇదే సినిమా నిజజీవితంలో ప్లే అవుతున్నప్పుడు రెండు సార్లు నేను అందులోనే దానికి చాలా దగ్గరగానే ఉన్నాను. అప్పుడు ఆ ఫ్రేమ్స్ లో మాత్రమే ఉన్నాననీ ఆ మూమెంట్స్ లో లేననీ, అదే జీవితం సినిమా తెర పై ప్లే అవుతున్నప్పుడు ఈ సారి ఫ్రేమ్స్ దాటి ఆ మూమెంట్స్ లొకి వెళ్ళానని, ఈ సినిమా చూసేప్పుడు తెలిసొచ్చింది.

వయసులోకెచ్చేప్పుడు, వయసు మీదకొచ్చే మనుషులంతగా కనపడరనుకుంటాను. అదే గది రోజూ దాటుతూ వెళ్తున్నప్పుడో, తిరిగి వస్తున్నప్పుడో ఒక్క రెండు నిమిషాలు రోజుకోసారి తాతయ్య పక్కన కూర్చొని ఉండాల్సిందనీ, ఈ సినిమాలో కూతురికీ నాకూ పెద్ద తేడా లేదేమో అనిపించింది, ఏదో కొన్నిసార్లు మెడిసిన్స్ పట్టుకురావడానికో, హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికో ఉపయోగపడటం తప్ప.

ఏమో, ఇకముందు కూడా పెద్ద తేడా ఉండదేమో కూడాను, తెర అవతలి పక్కకింకోసారి వెళ్ళినప్పుడు!

స్వీయసోది వదిలి సినిమా విషయానికొస్తే...Michael Haneke దర్శకత్వం వహించి, ఇద్దరు ఫ్రెంచ్ నటులు Emmanuelle Riva, Jean-Louis Xavier Trintignant లు నటించిన సినిమా Amour(Love). ఈ సినిమాకి Cannes Film Festival లో Palme d'Or అవార్డ్ వచ్చింది. European Film Awards లో best picture, best director, best actor and best actress వచ్చాయి. The National Society of FIlm Critics వాళ్ళు best film of 2012 గానూ US Critics' film of the year గా ఎంపిక చేసారు.

సినిమాకి Love అని పేరు పెట్టారు కానీ, Life beyond love అని పేరు పెడితే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది.

అద్భుతనటన అనే పదం అండర్ స్టేట్మెంట్ అన్నట్లుగా నటించిన Emmanuelle Riva(Anne), అంతే ధీటుగా ఆమె భర్తగా నటించిన Trintignant(Georges).

Body deterioration నీ తద్వారా వచ్చే Human Suffering నీ, అది Human Psyche మీద వేసే impact నీ, ఇంత ఫిజికల్ గా చూపెట్టటం డైరక్టర్ సాహసమనే చెప్పాలి. సాధారణంగా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి రోల్ పాసివ్..దాన్ని అధిగమించి ప్రేక్షకుణ్ణి తెరలోపలికి తీసుకెళ్ళి పాత్రల మధ్యలో నిలపడానికే థ్రీ డి లూ, ఫోర్ డిలూ. కాని అవేవీ అవసరం లేకుండానే వాటికన్నా ఇంకో ఎక్కువ డైమన్షన్ ని ప్రేక్షకులకి ఇచ్చి అందులోంచి వచ్చే అసహనాన్ని కూడా తీసుకురావటానికి డైరక్టర్ కొన్ని క్లెవర్ టెక్నిక్స్ ఉపయోగించాడు.

Michael Haneke గురించి Trintignant ఓచోట ఇలా చెప్పాడు. "Often, directors ask us to show what we feel, and with Haneke, no, above all you mustn't show what you feel. You have to just feel, and he does the rest." అని. అది ఏ మాత్రమూ అతిశయోక్తి కాదనీ Riva ని చూస్తుంటే తెలిసింది.

ఇంతకీ కథెంటో చెప్పలేదు కదూ. Anne అండ్ Georges ఇద్దరూ ఎనభైల్లో ఉన్న రిటైర్డ్ కపుల్. Ann మ్యూజిక్ స్టూడెంట్ Alexandre ఒక సక్సెస్ ఫుల్ ఫ్రెంచ్ పియానిస్ట్. .అతని concert కి వెళ్ళడంతో కథ ప్రారంభమవుతుంది. (ఇంకా అంతకుముందు షాట్ తోటే మొదలవుతుంది కాని spoil చేయటిష్టం లేక చెప్పట్లేదు ). ఆ మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గిర కూర్చొని Georges, Anne మాట్లాడుకునే సమయంలో, Georges వేసిన ఓ ప్రశ్నకి Anne దగ్గర్నుంచి response ఏమీ రాదు..రెండు సుదీర్ఘమయిన నిమిషాల సేపు తనలా stare చేస్తూ ఉండిపోతుంది. తర్వాత కొద్ది సేపటికి మనకర్దమవుతుంది, Anne కి brain stroke వచ్చిందనీ. తన బాడీలో రైట్ సైడ్ అంతా paralyse అయిందనీ, జరిగిన సర్జరీ తనకి హెల్ప్ చేయకపోగా హాని చేసిందనీ, తనింకెప్పటికీ వీల్ చెయిర్ లోనే ఉండబోతుందని.

హాస్పటల్ నుంచి వచ్చాక Anne అడుగుతుంది. "Georges ఒక్క సహాయం చేయగలవా ప్లీజ్" అని. "ఇంకెప్పుడూ నన్ను మళ్ళీ హాస్పిటల్ కి పంపించకు దయచేసి" అంటుంది. మొదట్లో resist చేసినా చివరకి జార్జ్ ప్రామిస్ చేస్తాడు "సరే " అని.

Anne ని చూసుకోవడానికి Georges అన్ని సేవలూ చేస్తాడు, చేస్తూనే ఉంటాడు.. వీల్ చెయిర్లో ఇంట్లోనే తిప్పటం, బెడ్ మీద నుంచి దింపడం, బట్టలు తొడగటం, టాయిలెట్ కి వెళ్ళినప్పుడు నిలపెట్టటం, కూర్చోపెట్టటం, అండర్ వేర్స్ వేయటం, ఫ్లష్ చేయటం...well you get the idea!. తను take care చేసే విధానానికి, ఓసారి గ్రాసరీస్ తీసుకొచ్చి ఇచ్చినతను చెపుతాడు కొన్ని మాటలు, ఇంత ఘాడంగా ప్రేమని సేవ ద్వారా వ్యక్తపర్చేవాళ్ళని చూడలేదన్న అర్ధంలో.

Anne పరిస్థితి రోజు రోజుకీ ఇంకా దిగజారుతూనే ఉంటుంది. రెండవ సారి కూడా stroke వస్తుంది. ఎక్కువ కాలం bedridden అయిపోతుంది. పక్కలు తడుపుకోవటం మొదలవుతుంది. ఒకవైపు అనారోగ్యం, అశక్తతా, ఇంకోవైపు ఇలాంటివన్నీ అవుతున్నందుకు హ్యుమన్ డిగ్నిటీ కోల్పోయినట్లుగా, హ్యుమిలియేటింగ్ గా ఫీల్ అవుతుంది తను. No big deal అని Georges చెప్తూనే ఉన్నప్పటికీ.

ఇంకొద్ది రోజులకి మాట కూడా పడిపోతుంది. భర్తే తన ప్రపంచంగా మిగిలిపోయిన Anne కి , ఉన్న ఒక్క ప్రపంచంతో కమ్యూనికేషన్ తెగిపోతుంది. ఎన్నో చెప్పాలనుకోని చెప్పలేకపోయిన సన్నివేశాల్లో Anne నటనకి తలలొంచి నమస్కరించాల్సిందే. Georges కి Anne ని తనొక్కడే చూసుకోవటం కష్టమవుతుంటూంది. నర్స్ లని పెడతాడు చూసుకోటానికి. వాళ్ళిద్దరూ ఎలా cope up అవుతారన్నది సినిమాలో చూడాల్సిందే.

కథ లోంచి బయటకొస్తే...

జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోని నెమరేసుకునే సమయాల్లో Anne అంటుందో చోట Georges ని సరదాగా ఏడిపిస్తూ.. you're a monster sometimes, but very kind అని. నిజంగానే Georges చాలా కైండ్ అని చివర్లో తెలుస్తుంది.

మామూలుగా ఇలాంటి సినిమాల్లో సెంటిమెంట్ పిండడానికీ, Kleenex బాక్స్ లని ఖాళీ అయ్యేలా చేయటానికి చాలా అవకాశముంటుంది. అసలా జోలికే పోలేదు డైరక్టర్. సైలెంట్ గా మన లోపలకొచ్చి సఫర్ చేయడం తప్ప.

చివరగా నటీనటులకీ ముఖ్యంగా Riva కీ, డైరక్టర్ కీ ఓ మంచి సినిమా అందించినందుకు మనసులోనే థాంక్స్ చెప్పుకుంటూ..

సినిమా అనేది ఆర్ట్ అయినప్పుడు, Catharsis ఈ ఆర్ట్ కి కూడా కి apply అవ్వాలీ అనుకున్నప్పుడూ, Catharsis కి ఉన్న artistic definition ఏమో కాని కొన్ని సినిమాలు చూసినప్పుడు దాని Medical Definition గుర్తుకొచ్చేలా చేసే మన డైరక్టర్లందరికీ ఈ నా పోస్టు అంకితం చేస్తున్నాను ;)
 
(Jan 2013)