Sunday 24 March 2019

Reminiscing Heart - The Silent Song

Posted by Kumar N on 3/24/2019 12:17:00 am with No comments





"మరి నువ్వు రాకపోతే?" 


"నాకిష్టం లేదని అర్ధం" అని జవాబు వినిపిస్తుందా అమ్మాయికి, అప్పటికే వెనక్కి తిరిగిన బైక్ మీదనుంచి


రాలేకపోతే? అన్న ప్రశ్న తట్టని నమ్మకాల చెలిమీ, వయసూ 


అడగని ప్రశ్న గుమ్మం తెరిచి ఎటో ఈడ్చుకెళ్తున్నప్పుడు, 


ఇచ్చిన జవాబు ఆఖరుదనుకుంటుందేమో అనుకొని ప్రాణాలకి తెగిస్తాడా ఆ అబ్బాయి. 


పైమెట్టు అంచున నల్ల చీర జరీ అంచునానించి వేచిచూస్తున్న అమ్మాయికి అర్ధమయ్యేలోగానే 


తన ప్రాణం జారిన అదే మెట్ల మీదుగా, అమ్మాయిలో నయగరా విరిగి జారి నీరయిపోతుంది 


***


యుగాల ఐస్ ఏజ్ కమ్మేసిన కాలం లో.. 


చుట్టూ ఉన్న వాళ్ళ కోసం గడ్డ కట్టుకుపోయినవన్నీ చుట్ట చుట్టుకుని 


పరాయి దేశం వెళ్ళిపోయాక చాన్నాళ్లకి 


*** 


చలికి కొంగు చుట్టుకుని కూర్చున్నప్పుడు మెడ పక్కన కనిపించిన పరాయి చెయ్యికి అదాటుగా తలతిప్పి చూస్తే రెండో భుజం మీదుగా కూడా నిండా దుప్పటి కప్పి వెళ్తున్న అతను.


అసలెవరితను? 


ఎగరగలిగీ తనెళ్ళేదాకా తనకోసం పంజరం లోపలే ఉండిపోయిన తోటి పావురం కాదూ ? 


స్నేహం చేయలేని నాకు, కంపరమేస్తోందన్న నామీద, ఈ కరుణకి 


ధమనుల్లో కంపన తో మొదలయిన రాగమేదో ఎగసి గొంతులోనే ఆగిపోయినపుడు కళ్లల్లో ఊరిన ఆ పాట 


పాడిన నిశ్శబ్ధ గీతం కృతజ్ఞతా లేక కరుగుతోన్న ఘనీభవ స్థితా 


*** 


ఎవరిక్కావాలి, నీకా తనకా అన్న ప్రశ్నలకి 


లేదు అంతా ఆ అమ్మాయికే అనకుండా బరువు తన మీద వేసుకొని సమాధానాలన్నీ అతనే చెప్పినపుడు, తన కళ్లల్లో చలనం తనకైనా తెలిసిందా? 


*** 


మనసుకు కష్టం కలిగినపుడు దిశ లేకుండా గొణుక్కుంటూ బయటకి నడ్చుకుంటూ వెళ్ళడమే తెలిసిన తనకి,, అతనికి కష్టం వచ్చినపుడు తను మొట్టమొదటిసారిగా గుడికి వెళ్ళి నిశ్శబ్ధంగా దేవుడి ముందు నిలపడ్డప్పుడు స్నేహానికి మించిన బంధమేదో పరిచయమవుతుంది ఆ అమ్మాయికీ 


*** 


పసుప్పచ్చ వెలుతురూ, నల్లటి నీడలూ, అందమైన ఇల్లూ, మధ్యలోకి తెరుచుకుని తిరిగే ఇంత పెద్ద తలుపూ, ఫైన్ వుడ్ గోడలూ, రూఫ్ టాప్ కి మెట్లూ, 


బీటిల్స్ వింటూ వంట చేసే అమ్మాయీ, తను పిల్లోస్ తో చేసిన లేయిడ్ బాక్ సెటప్సూ, ఇద్దరే మనుషులూ, ఒకరికొకరు ఇచ్చుకునే స్పేసూ 


***


అంతగా తెలియని ఊరు, పైగా చివర్లో ప్లాన్ మారి ఒక్కణ్ణే వెళ్ళాల్సి వచ్చింది. సినిమా హాల్ తలుపులు తెరిచాకా ఎక్కడ నడుస్తున్నానో, ఎక్కడికెళ్తున్నానో, అసలు నడుస్తున్నానో తేలుతున్నానో ఉనికి తెలియని ఒక ట్రాన్స్. మనుషులెవరూ లేని ఒక ప్రాంతం గుండా కదుల్తున్నానని మాత్రం తెలుస్తోంది. చుట్టూ చల్లగా, కాదు కాదు వార్మ్ గా.. లోపలెక్కడో ఫైర్ ఐస్క్రీం గుండె గోడల మీదుగా జారుతున్నట్లుగా ఒక ట్రాన్సెండంటల్ స్టేట్, "నేను" అన్నదంతా ఆవిరయి ఒక మేఘం లా మారి వెన్నెలంతా తాగుతున్న ఒక స్థితి. అలా చాలా సేపు గడిచాకా గజిబిజి జనాల సమ్మర్ధంలో భగభగ మండే ఎండలో మిర్యాలగూడ అనే ఒక ఊరులో నడుస్తున్నానని అర్ధమయింది. 


అలాంటి భావనలున్న ప్లేన్ లోకి అంతసేపు నన్ను తీసికెళ్లగలిగిన ఒకే ఒక్క సినిమా అది. దాదాపు ముప్పై రెండేళ్ల తరువాత మొన్న చూసినపుడు కూడా అద్భుతం అనుకున్నాక అపుడు నా వయసున్న ఇప్పటి అమ్మాయికి చూపించినపుడు, Meh అనకుండా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ నాన్నా అన్నప్పుడు ఎక్కడో ఏదో సర్కిల్ కంప్లీట్ అయిన తృప్తి.



Image result for mouna ragam tamil songs panivizhum

Friday 4 January 2019

సిటీ లైఫ్

Posted by Kumar N on 1/04/2019 12:26:00 pm with No comments















పొద్దున్నే తొడుక్కున్న బిజినెస్ అట్టయిర్ బ్లాండ్నెస్,


టైట్ గా పొట్టని పట్టుకున్న బెల్ట్ డిస్కంఫర్ట్


ఎంత విదిల్చుకున్నా తిరిగొచ్చి వేళ్ళకి గుచ్చుకుని పైకి పాకే ఈమెయిల్స్


చీకట్లో నల్ల పిల్లిని చూసామని పలికే గుడ్డివాళ్ళతో,


విన్నామని చెప్పే చెవిటివాళ్ళతో నిండిన కాంఫరెన్స్ కాల్స్


ఎప్పటికీ డెడ్ అవ్వని డెడ్ లైన్స్, బాగ్రవుండ్ లో సదా నడిచే సఫకేటింగ్ సొద లన్నిటినీ


సక్సెస్ఫుల్ గా దాటి ప్రభువు - ద సేవియర్ చెఫ్ - రొట్టెముక్కలు విసిరే వేళ కోసం ఎదురుచూసి


హైస్పీడ్ ఎలివేటర్స్ లో చెవులు దిబ్బడెసె లో గ్రావిటీతొ అరవై సెకండ్లలో అరవైఆరు అంతస్థులు జారడానికి


సెల్ సిగ్నల్స్ సైతం దూరని సొరంగం లో దూరి ఎవరూ రాని ఏకాంతమెపుడైనా దొరికితే కళ్ళు మూసుకుంటానా,


సైలెన్స్ ని హాండిల్ చేయలేని సైకాటిక్ హ్యూమన్ సొసైటి మేకర్స్ , సిటీ డిజైనర్స్ అందులో కూడా స్క్రీన్స్, న్యూస్ తో సోల్ బ్రేకింగ్


జీసస్,... వైట్ హౌస్ లో ఫ్రాంకెస్టైన్ క్రీచర్ , హారర్ షో నెవర్ స్టాప్స్ డియర్


తలవంచుకొని లిఫ్ట్ లోంచి బయటపడ్తే బయటకెళ్లనివ్వని చలీ భయపెట్టె పనీ పక్కనే ఉన్న మెగా కెఫెటెరియాలోకి తోస్తాయి


సుషీ , సాటే , పనీని , బరిటో, షెల్డ్ ఎగ్ స్ప్రెడ్స్, బ్లాకెండ్ పెపర్ చికెన్, ఎండ్ లెస్ చాయిస్


తాగడానికి లోటెడు లాట్టే, లేదంటే ఇంఫ్యూస్డ్ స్పార్క్లింగ్ ఆక్వా, పంటికిందకి హ్యాలోపినో క్రాకర్స్


నోట్లోకెళ్ళాల్సిన చేయి కాచప్ స్క్రోలింగ్ తో బిజీగా ఉంటే,


దాని సివిలైజ్డ్ రీప్లెస్మెంట్ తినిపిస్తుంది


అవాయిడ్ చేయలేని అలవాటయిన కార్బ్స్ లోడ్ కి, యాక్టివ్ అయిన పాంక్రియాస్, ట్రిగ్గర్ అయిన ఇన్సులీన్ డంప్..


అదొక చేతకాని మత్తు


స్లగ్గిష్ శరీరాన్ని మోసుకుంటూ పోస్ట్ లంచ్ మీటింగ్ ల ధర్డ్ డిగ్రీ టార్చర్ రూమ్స్ లో పడేసి దొర్లించి


మధ్యమధ్యలో కఫెన్ షాట్స్ తీసుకొని, దొరికీ దొరకని ఆన్సర్స్ ఇచ్చి, గాసిప్స్ గ్రీజ్ తో బండి లాగిస్తూ


తలెత్తి చూస్తానా ***



కిటికీ పక్కగా సాగుతున్న బిల్డింగ్స్ మీదుగా, కింద చీమల గుంపులుగా బయటపడుతున్న మనుషుల మధ్యగా వెళ్లిపోతున్న రోజూ


భూమ్యాకాశాల హరైజన్స్ లో షెర్విన్ విలియమ్స్ చార్ట్ లో లేని కలర్స్ ని స్ప్రే చేసుకుంటూ మెరుస్తూ జారుతున్న సూర్యుడూ


అనదర్ డే


ముడేయాల్సిన వదుళ్లనీ, , మూవ్ అవ్వని వర్క్ మీద లిప్ స్టిక్ లనీ , సివైఏ లన్నీ ముగించుకొన్నాక


నడిచే దూరానికి నడవాలనిపించక ఊబర్ కాబ్ లో టేక్ మీ టు లేక్ షోర్ అని, అదొచ్చాక


లైఫ్ టైమ్ ప్లాటినమ్ మెంబరని అల్లుడి లాగా చూసుకునే హోటల్ ప్రతీ వారం ఇచ్చే లేక్ సైడ్ సూట్లో బాగ్లూ, బట్టలూ వదిలించుకొని


బయటకొస్తాను ***



అప్పటిదాకా కమ్ముకున్న మేఘ్హాలన్నీ తొలగి ఆకాశంలోంచి నల్లటి సీత్రూ కర్టెన్స్ జారి నగరం నిండా పరచుకుంటాయి


ఈవినింగ్ షవర్లో బడలికలన్నీ వాష్ చేసుకున్న నగరం, ఆ కర్టెన్స్ జరిపి కాలు బయటపెడుతుంది


అంతటి అట్రాక్షన్ కి ఆగలేని స్టార్స్ ఆకాశాన్ని వదిలొచ్చి ప్రతీ విండో దగ్గిరా చేరతాయి


లక్ష కాండిల్స్ లుమెన్స్ తో సిటీ స్ట్రీట్స్ ప్లెషర్ పర్స్యూయల్ లో ఇంద్రలోకాన్ని కిందకి లాక్కొస్తాయి






లైట్స్


సిటీలైట్స్


సోల్ స్ట్రోకింగ్ బ్లర్రీ ట్వింకిల్స్






ఎవరో వివాల్డీ ఫోర్ సీజన్స్ ప్లే చేస్తూ ఉంటారు,


లోపలెక్కడో ఏదో కట్ అయ్యే స్పేసెస్ లోకి స్లో గా బ్లడ్ సీప్ ఇన్ అవుతూంటుంది


మరెక్కణ్ణుంచో తేలుతూ వస్తోన్న యో యో మా చెల్లో (Yo Yo Ma Cello),


చెప్పలేని భావంతో గుండెనీ కళ్ళనీ ఏకకాలంలో నింపుతూ ఉంటుంది,






చలికి వణుకుతోన్న నీళ్లల్లోంచి డైమండ్స్ డాన్స్ చేస్తూ కలర్స్ మారుస్తూంటాయి


వేళ్ళు ముడేసుకున్న చేతుల్లో బిగుసుకున్న మాటలు పెదాల మీదుగా ప్రేమికుల కిసెస్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి


వీది చివర ట్రక్ లో చీప్ ఫుడ్, పెయిడ్ ఎక్స్పెన్సెస్ లేని విజిటర్స్ కడుపులు నింపుతుంటాయి






చీకటి తెరలిచ్చే కంఫర్ట్ లో రివర్ వాక్ ఒక ఎక్స్పీరియన్స్,


డాగ్ వాక్స్, హెడ్ నాడ్స్, ప్లజంట్ స్మైల్స్


కొండొకచో కొన్ని సెరెండిపిటీస్






అకస్మాత్తుగా దయానిధి గుర్తొస్తాడెందుకో


కనపడని గడ్డిపోచల్లో జీవితం కనపడుతుంది


అర సెకండో.. ఆరు సెకండ్లో .. అంతే






నెక్స్ట్ టర్న్ లో ఎల్లో షైన్ , వైన్ సిప్ కి ఇన్వైట్


ఏవో ఇంటర్నల్ క్వారెల్స్,


ఎప్పటికీ రొద ఆపని ఇన్నర్ వాయిసెస్,


కెథార్సిస్ కోసం క్వెస్ట్






అన్నీ కలసిన ఉద్వేగాలు


వెరసి
నక్షత్రమండలం దిగొచ్చిన రాత్రి, నగరం నన్నేదో చేస్తుంది