ఈ బ్లాగు నా పేరు మీద ఉన్నప్పటికీ, సృష్టించినవాడికే అన్ని హక్కులూ అన్నట్లుగా నడిపించే దేవుడి ప్రిన్సిపుల్ ప్రకారమైనా, అదే సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టే కాపిటలిజం ప్రిన్సిపుల్ ప్రకారమయినా ఈ బ్లాగు మీద సర్వహక్కులన్నీ ఓ స్నేహశీలికి దక్కుతాయి.
కరుణతో బహుమతి నా చేతుల్లో పెట్టగానే చేతులు పట్టుకోని కృతజ్ణతలు చెప్పేస్తూ, ఆ బరువుని మెల్లిగా అవతలి చేతుల్లోకి జారుస్తూ, ఇది నువ్విచ్చిందే కాబట్టి, ఇది నీదే అని తప్పుకోబోతున్న నా అతితెలివిని కనిపెట్టి, 'ఇచ్చింది నేనే కాని పెంచాల్సింది తమరే... మానవా' అని హెచ్చరిస్తూ డిటాచ్డ్ గా దూరంగా నిలబడిపోయిన తనకోసం ఏదైనా ఒక పోస్టు రాసి జారుకుందాం అని తలచి చేతులు మడచి కూర్చుంటే, అసలు చేయి కదలదే?!
ఏం రాస్తాం? అసలు రాయడానికేముందని నా దగ్గిర? ఎంగిలి ఆలోచనలూ, ఎకో ఛాంబర్స్ లోని రెటరిక్కూ తప్ప.
"వ్యాక్యమేదైనా రాసినప్పుడు సంగీతస్వరంలా అనిపించాలి.. దాన్లో రాగాల తూగుండాలి..వానవిల్లుమీద నడిచి మేఘాల్లో తేలినట్టుండాలి..అప్పుడే స్కూలుకొచ్చిన పిల్లలు ప్రభాత వేళ ప్రార్థన సమయంలో లైనుకట్టి నిల్చున్నట్టుండాలి. అప్పుడప్పుడూ భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతుచెయ్యాలి " అంటారు అరుణపప్పు.
అదంతగా గుర్తుండిపోయాకా, ఏవయినా బుర్రలోకి వచ్చినా ఇంకేం రాస్తాను, రాయగలను?
*** *** ***
ఏం రాయగలనా అని ఆలోచిస్తే Empty Rhetoric కీ, Rantings కీ, Identity based divisions కీ వాటిని
బేస్ చేసుకోని రాసే నిజాయితీలేని కథలు కాని కథలకీ అంతే లేదు. సరే దొడ్డిదారులు వెదుక్కుందామని చూస్తే.. సినిమాలూ, పుస్తకాలూ, రంగుల దళసరి పలకల్లోంచి అందంగా కనిపించి..అందర్నీ మోసం చేసే నాస్టాల్జియాలూ ఎట్సెట్రా కనిపించాయి.అప్పుడయితే స్వంతంగా ఏం ఆలోచించక్కర్లేదు, చూసిందాన్నో, చదివినదాన్నో, మసక మసగ్గా మంచి విషయాలు మాత్రమే గుర్తుంచుకునే మెమోరీ లోంచే రాసేస్తే పోలా అనిపించినా, వాటిక్కూడా చాలా నైపుణ్యం కావాలి. ముందు చదివినదాన్నో, చూసినదాన్నో ఆకళింపు చేసుకోవాలి, సెంట్రల్ పాయింట్ ఏంటో గ్రహించుకోవాలి, దాని చుట్టూ అల్లినవేవో, చూపినవేవో గుర్తుపెట్టుకోని సమగ్రంగా మనమాటల్లో ఇరికించి, పూర్తిగా చెప్పీ చెప్పకుండా, మనం రాసింది చదివి ఊరుకోకుండా, అసలు రచనేదో చదివించేలా రాయగలగాలి.
ఉఫ్..
హబ్బా... ఒక్క పోస్టు రాయడం ఇంత కష్టమా? అంత టాలెంట్ లేదే నా దగ్గిర?!! 'మరందుకే గబుక్కున చేతులు చాపి తీసుకోని థాంక్స్ చెప్పొద్దురా కుమార్ బాబూ' అని అనుకున్నవాడిని, అలానే ఊరుకోకుండా ఇలా బయటకోస్తే ఇంతే గతి.
సో, ఇహ చిట్టచివరిగా నీతి మాలిన పని చేద్దామని నిర్ణయించేసుకున్నా. ఏ పుస్తకాన్ని పరిచయం చేసినా గమనించిందేంటంటే అత్యధికశాతం అది కొనుక్కొనో, తీసుకొనో చదవరు(నాతో సహా). కారణాలనేకం. ఆసక్తి పుస్తకపరిచయం చదవటంకన్నా ఎక్కువ లేకపోవటం, పుస్తకం దొరక్కపోవటం, ఖరీదు ఎక్కువగా ఉండటం, ఇతర ప్రాధాన్యాల ముందు ఈ పుస్తకం చదవాలి అనుకున్న నిర్ణయం కిందకి జారిపోవటం ఎట్సెట్రా...ఎట్సెట్రా...
అందుకని పుస్తకపరిచయం కన్నా, అసలు పుస్తకం లోని విషయాలే డైరక్టుగా రాస్తే పోలా? పరిచయాలేవో చదివిన వాళ్లే చేసుకుంటారు, అంచనాల నిచ్చెనలేవో వాళ్లే వేసుకుంటారు, మోయాల్సిన బరువులేవో, కొలవాల్సిన కొలతలేవో వాళ్లే నిర్ణయించుకుంటారు.
కాని తప్పు కదా? ఎన్ని రెపరెన్స్ లిచ్చి, ఎన్ని డిస్క్లెమయిర్లు పెట్టి అక్కడక్కడి పేరాగ్రాఫులు రాసినా, కాపీయింగ్ ని కాపీయింగ్ అనే అంటారు.
సరే ఇలాక్కాదని, పుస్తక రచయిత కి ఈమెయిల్ రాసాను.
"ఆర్యా..మీ పుస్తకం నాకు నచ్చింది. నా మాతృభాషలో మీ పుస్తకం గురించి నాలుగు పేరాగ్రాఫుల పరిచయం కాకుండా, ఇంకొంచెం విపులంగా రాస్తే మీర్రాసిన నాలుగు విషయాలు వేరేభాష మాట్లాడే/చదివే వాళ్ళకందడమే కాకుండా, స్వామి కార్యమూ స్వకార్యమూ కలసి వచ్చేలా మీ రీచ్ కూడా ఎక్కువవుతుంది కదా అన్న తలపుతో...మీర్రాసిన ముఖ్యమయిన పాయింట్స్ నేను కాపీకొట్టబోతున్నాను...అదే.. నా భాషలో రాయబోతున్నాను. ఇది మీకు సమ్మతమే అని ఆశిస్తున్నాను కానిచో నాకు తెలిపినయెడల నేనీ దుర్మార్గానికి తలపెట్టను, ఏదయినా తెలియపరచండీ" అని విన్నపాన్ని పంపాను.
అనుకున్నట్లుగానే సైలెన్స్.
మళ్ళీ ఓ రిమైండర్ కూడా పంపి, రెండు వారాలు వేచి ఉన్నాను. ఈ లోపల నా చౌర్యపు పనిని కొనసాగిస్తూ..
ఇప్పటివరకీ ఏ రిప్లై రానందున, ప్రస్తుతానికి ఇది పబ్లిష్ చేయడానికే డిసైడ్ చేసుకున్నాను.
This is about a book called 'Civilization - The West and the Rest' by Neill Ferguson. ఇంతకీ ఈ పుస్తకమే ఎందుకూ అంటే పెద్దగా సమాధానం ఏమీ లేదు. తెలుగు బ్లాగుల్లో కనపడే రెటరిక్ పరిధి దాటి కాస్త ముందుకేమన్నా వెళ్ళడానికి పనికొస్తుందేమో అన్న ఆశ అంతే. ఇదే సబ్జక్ట్ మీద Ian Morrison రాసిన పుస్తకాలూ కూడా పరిచయం చేయాలన్న ఆశ కూడా ప్రస్తుతానికి ఉంది. ఏ దృష్టికోణమూ పరిపూర్ణము కాదు కాబట్టి, దీనికి వ్యతిరేకంగానో, టాంజెన్షియల్ గానో ఉండే ధీసిస్ లు కనపడితే అవి చదివి పరిచయం చేయాలన్న ఆశ కూడా ఉంది, కాని అసలు ఈ పుస్తకమే పూర్తి చేస్తానో లేదో అనుమానం కాబట్టి, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిన చందాన నా ప్రగల్బాలన్నీ ఇంతటితో ఆపేస్తే మంచిది.
ఎనీవే, ఇహ సోది ఆపేసి...నెక్స్ట్ పోస్ట్ రాస్తూ కూర్చుంటా...అంటే...పైన చెప్పిన పుస్తకం గురించి :)
Disclaimer:
The upcoming blog post(s) will have some introduction articles about the book "Civilization - The West and the Rest' by Neill Ferguson. As part of introducing I have written some paragraphs/pages from the book in Telugu language. The author of the book has already been informed about this attempt. However, If any copyright acts are violated, please let me know, and I will delete these blog post(s).
కుమార్ గారు ఈ పోస్ట్ చదివినదాని కన్నా ఇక్కడ ఏమి కామెంట్ పెట్టాలి, అసలు పెట్టాలా లేదా అని ఆలోచించటానికి కనీసం 5 ఫోల్డ్స్ టైం తీసుకున్నాను. అసలు ఇంత అందమైన అక్షరాలకి సరైన స్పందన నా మాటల్లో చెప్పగలనా అని నా ఆలోచన. కానీ నేను చెప్పే రెండు ముక్కలు మీరు మరింతగా వ్రాయటానికి ఏ మాత్రం ఉపయోగపడినా చాలు అన్న ఆలోచనతో చివరకి వ్రాయటానికి ధైర్యం చేసా :-)
ReplyDeleteఒక సారి మీరే ఏదో సందర్భం లో చెప్పారు Richard Nixon coin చేసిన phrase "Silent Majority" గురించి. అదే ఇక్కడ కూడా వరిస్తుంది. ఇలా వ్రాయగలిగి అది చేయకపోవటం కూడా అదే కోవలోకి వస్తుంది. ఎలా అనేది నేను మీకు చెప్పనక్కర్లెదు:-)
I am very happy to see you here !Keep writing sir !
తర్వాత పోస్ట్ కోసం ఎదురు చూస్తుంటాం
ReplyDeleteఎదురు చూస్తుంటాం:))))
ReplyDelete
ReplyDelete"అసలు పుస్తక పరిచయం నెమ్మదిగా చేద్దురు గానీ ఇలాంటి ముందు మాటలు ఒక నాలుగైదు పార్ట్స్ రాయండీ!" అని రిక్వెస్ట్ చేద్దామనిపించిందండీ.. టూ లేట్ ః)
ఇంగ్లీష్ లో ఫిక్షన్ తప్ప మిగతావి చదివినవి చాలా తక్కువ.
ReplyDeleteతెలుగులో చాలా మట్టుకు రివ్యూల మీద రివ్యూ లే కనిపిస్తాయి. ఒకరిద్దరి రివ్యూ లను తమ భాషలో వ్రాయడమన్నమాట.
ఇప్పుడు మీరు, మహా భారతం లో సంజయ ఉవాచ లాగ అన్నమాట. ఎదురు చూస్తున్నాం ......దహా.
ఇంట్రో అదుర్స్ :))
ReplyDeleteనెక్స్ట్ పోస్ట్ చాల పెద్దగా ఉంది..తీరిగ్గా చదువుతాను.....
I love your style of expressing feelings.You are awesome Kumar Ji :))