Wednesday, 29 October 2014

మౌంట్ విసూవియస్

Posted by Kumar N on 10/29/2014 10:37:00 am with No comments
మౌంట్ విసూవియస్... ఇదొక వోల్కానో. మునుముందు ఎరప్ట్ అవబోయేదిగా పరిగణించబడే ఒక యాక్టివ్ వోల్కానో. రోమ్ కి సమీపదూరంలో పాంపే, హెర్కులేనియం నగరాలని  సమూలంగా నేలమట్టం చేసి, ఆ నగర పౌరులని సజీవసమాధి చేసిన అగ్నిపర్వతంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది సుపరిచితం. 79AD సంవత్సరంలో హిరోషిమా, నాగసాకి బాంబ్స్ కన్న ఒక లక్షరెట్ల ఎక్కువ వేడితో ఈ పర్వతం లావానీ, యాష్ నీ, మౌంటెన్ రాక్స్ నీ ఎగచిమ్మి ఆకాశాన్నంటి, అటుపై పక్కనున్న పాంపేని ఇరవై అడుగుల లోహపొడిలో ముంచెత్తింది. అప్పుడు పైకెగసి న మోల్టెన్ రాక్ మెటీరియల్ , యాష్ తో కలిసి అతి సన్నటి బూడిదలా తయారయిన ఆ పదార్థం...

Wednesday, 8 October 2014

తను తిరిగిన దారుల్లో

Posted by Kumar N on 10/08/2014 03:28:00 am with 2 comments
"సుదూరం లోకి సాగిపోయ్యే రైలు పట్టాల మీద మధ్యాహ్నపు వేళల ఎండ గీసిన వెండి అంచు గీతలూ, దడదడలాడే బోగీల చప్పుళ్లూ, ఇంజన్ కూతలూ, గాల్లోకి అలముకునే పొగా, ఇనపతలపుల వాసనా......................, " అంతే , ఆ ఇనపకిటికీల వాసన ఎంత బలంగా ముక్కుని తాకిందంటే,  ఏ వాసనా లేని, చుట్టూ కళ్ళకింపు రంగులతో నింపబడి, ఖరీదైన కలర్ కాంబినేషన్ల దుస్తుల్లోని అందమైన మనుషులు 'నేనే' ముఖ్యం వాళ్లకి అన్నట్లుగా నవ్వుతూ పలకరించే వాతావరణం మధ్య కూర్చుని, కొద్ది నిమిషాలల్లో...