నెలకి వచ్చే జీతానికి ఒక పది శాతం ఇంక్రిమెంట్ ఇచ్చారనుకోండి మానేజ్మెంట్ వాళ్ళు? మనం ఎంత సేపు, ఎంత సంతోషంగా ఉంటాము?
అలా కాక జీతంలో అదే పది శాతం కోత విధిస్తున్నామని బాస్ పిల్చి చెప్పాడనుకోండి! ఎంత రోజుల వరకి ఇరిటేట్ అవుతూనే ఉంటాం ?
మనల్ని ఎవరన్నా అప్రిషియేట్ చేసారనుకోండి ? మనకి ఎంత సేపు సంతోషంగా ఉంటుంది? దీన్నే ఫ్లిప్ చేసి చూస్తే, పది మందిలో మనల్ని ఎవరన్నా ఒక మాటన్నారనుకోండి ఇన్సల్టింగ్ గానో, లేక ఈవెన్ ఫెయిర్ ఎనఫ్ క్రిటిసిజంగా అయినా; అది మన మూడ్స్ ని ఎంత సేపు అతలాకుతలం చేస్తూనే ఉంటుంది! ఎంత సేపు దాని మీదే రూమినేట్ అవుతుంటాం! ఎంత గింజుకుంటాం! ఎన్ని రోజులు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది!
పై వాటికి ఆన్సర్స్ ఆర్ ఆబ్వియస్. యూజువల్ గా మనం నెగెటివ్ ఇన్పుట్స్ కి ఎక్కువ రెస్పాండ్ అవుతాం, బోత్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్. వి ఆర్ హార్డ్ వైర్డ్ దట్ వే. అది ఎవల్యూషనరీ రెస్పాన్స్ అయి ఉండవచ్చు . కారణం ఏదయితేనేం కాని, రెండిటికీ మన రెస్పానెస్ ఆర్ నాట్ సిమెట్రికల్ ఇన్ నేచర్ ఆర్ ఇన్ మాగ్నిట్యూడ్.
దాదాపు ప్రతి మనిషీ జీవితంలో ఎపుడో ఒక క్షణంలో అబ్బా ఎందుకీ లైఫ్ అనో, దిస్ ఈజ్ అన్ బేరబుల్ అనో అనుకుంటాడు. ఎంత సేపూ, ఎన్ని సార్లు అలా అనుకుంటారనేది వాళ్ల ఫిజియాలజికల్, బయాలాజికల్, న్యూరలాజికల్, ఎమోషనల్, సోషల్, మెంటల్ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పెయిన్, బాధ, దుఖం, సఫరింగ్ ని తప్పించుకోలేని మానవ జన్మ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. మానవ జన్మ అనే కాదు, ఎనీ సెంటినెంట్ బీయింగ్ పరిస్థితి అయినా అదే.
అసలు టు లివ్ హ్యుమన్ లైఫ్ ఈజ్ వర్త్ ఆ కాదా, ఆర్ టు స్టార్ట్ అ హ్యూమన్ లైఫ్ ఈజ్ వర్త్ ఆ కాదా? అనే కాంటెంప్లేషన్ రెండున్నర వేల సంవత్సరాల క్రితమే బుద్దిజం మూలాల్లో, గ్రీకు నాటకాల్లో కనపడ్డప్పటికీ, 2006 లో డేవిడ్ బెనటార్Better Never to Have Been అనే పుస్తకం రాసినప్పటినించీ మెయిన్ స్ట్రీమ్ లో ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా యాంటై-నాటలిజం అనే పదం ఎక్కువ వినపడుతోంది. దాంతో పాటే ప్రొ-మార్టలిజం, డీ-నాటలిజం లాంటివి కూడా.
కొన్ని తెలిసిన విషయాలు చూద్దాం:
1. ఏ మనిషికి కూడా సఫరింగ్/పెయిన్ తప్పవు
2. పెయిన్/సఫరింగ్ ఇచ్చేంత ఫిజికల్/ఎమోషనల్ బాధ , ప్లెజర్ మనిషికి ఇచ్చే హాప్పీనెస్ కన్నా ఎక్కువ . ఆ రెండింటి మధ్య ఉన్న అసిమెట్రీ ని మనం తీసేయలేం
3. ఏదైనా ఒక మనిషి జీవితం లో పెను మార్పులు రాగలిగే నిర్ణయాలూ, మార్పులూ తీసుకోవాల్సి వచ్చినపుడు మనం వాళ్ల కన్సెంట్ ని తీసుకుంటాం, తీసుకోవాల్సిన మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనకుంది , సో ఒక మనిషికి జన్మనిచ్చి భూమ్మీద కి తీసుకొచ్చి ఒక జీవితకాలపు పొడుగూతా వస్తూనే ఉండే పెయిన్స్, డిసప్పాయింట్మెంట్సూ, దుఖాల్లోంచి వాళ్లని వెళ్ళమని చెప్పేంత ఎక్జిస్టెన్షియల్-లెవెల్-ఆఫ్-మాగ్నిట్యూడ్ ఉన్న డిసిషన్ తీసుకునేప్పుడు వాళ్ళ కన్సెంట్ తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది, కాని అసలు పుట్టని శిశువు ని ఎలా అడగ్గలం? కాబట్టి అది ఇంపాజిబుల్
4. పోనీ అలా కాదు, చాలా మంది జీవితాల్లో పెయిన్ ఉన్నా కూడా అది టెంపరరీ, మళ్లీ లైఫ్ లో ప్లజర్, హాప్పీనెస్ ఫేజ్ వస్తుంది కాబట్టి, టెంపరరీ పెయిన్ ఈజ్ వర్త్ ఇట్ ఫర్ ద ప్లజర్స్ టు కమ్ అని అనుకుందాం కాసేపు. చాలా మంది *బతికి ఉన్న వాళ్ళు* అలాగే అనుకుంటారు కూడా. ఫెయిర్ ఎనఫ్. మరి, అలా ప్లజర్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉండే లైఫ్ ని అలాగే కంటిన్యూ చేయకుండా ఆ దేవుడు సడెన్ గా మనిషిని ఎందుకు చంపేస్తున్నట్లు చివర్లో? మరీ ముఖ్యంగా కాస్త వయసు దాటేప్పటికి మనుషుల్ని కంప్లీట్ గా డీజనరేట్ చేసి, ఇన్ కెపాసిటేట్ చేసి , చివరకి టర్మినేట్ చేసి, ఆ డెత్ వల్ల చుట్టూ ఉన్న వాళ్ల లైఫ్స్ లో సఫరింగ్ ట్రిగ్గర్ చేసి!! ఏంది ఇదంతా?? క్రూయల్ గా లేదూ? దేవుళ్లు చేయాల్సిన పనులేనా ఇవి?
ఓహ్, వెయిట్ , ఎవరు చేస్తున్నారు ఈ పనులు? దేవుళ్లా, మనమా?
పై కారణలూ ఇంకా కొన్ని ఇలాంటి కారణాల వల్ల యాంటై నాటలిస్టిక్ ఫిలసాఫికల్ ఔట్ లుక్ ఏమంటుందంటే, మనిషి జన్మ అనేదే లేనప్పుడు అసలు సఫరింగ్/పెయిన్ కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు కదా అంటుంది.
అది చెప్పే ఒక థాట్ ఎక్స్పరిమెంట్ చూద్దాం: ఒక బాబు పుట్టాడనుకొని బాబు పేరు mortal అనుకుందాం కాసేపు (ఈ పేర్లు మన సొంత పైత్యం). సో, mortal లైఫ్ లో పెయిన్ ఉండటం "బాడ్" అనీ, ప్లజర్ ఉండటం"గుడ్" అనీ అనుకుందాం. సరే, ఇంకో కేస్ లో అసలెప్పుడూ పుట్టని ఒక బాబు ని ఊహించుకొని పేరు amortal అని పెట్టుకుందాం. ఇపుడుamortal లేడు కాబట్టి తన లైఫ్ లో రాబోయే పెయిన్ కూడా లేదు సో దట్స్ 'గుడ్' , కాని ప్లజర్ కూడా లేదు కదా మరి లేని లైఫ్ లో లేని ప్లజర్. పెద్ద బాడ్ ఏం కాదు కదా? సో దాన్ని "నాట్ బాడ్" అని డిఫైన్ చేస్తుంది యాంటై నాటలిజం ఫిలాసఫీ. ఎందుకని "నాట్-బాడ్" మాత్రమే అంటోంది, "బాడ్" అనకుండా? ఎందుకంటే ఉన్న ప్లజర్స్ ని తీసేసుకుంటే డిప్రైవ్ చేసినట్లు కాని లేని లైఫ్ లో లేని ప్లజర్స్ ని ఎవరి దగ్గర్నుంచి ఏమీ డిప్రైవ్ చేయట్లేదు కదా!, సో ఇటీజ్ డిఫైండ్ యాజ్ "నాట్-బాడ్"
సో, సమ్మింగ్ ఇట్ అప్, పుట్టిన mortal కేస్ లో "బాడ్", "గుడ్" రెండూ ఉన్నాయి, కాని పుట్టని amortal కేస్ లో "గుడ్" అండ్ "నాట్ బాడ్" ఉన్నాయి. 'గుడ్' అండ్ 'బాడ్' కన్నా, 'గుండ్' అండ్ 'నాట్-బాడ్' బెటర్ కదా? సో ఈక్వేషన్ ఈజ్ వెయిటెడ్ టువార్డ్స్ 'అన్ బార్న్" ఆర్"నెవర్ బార్న్" సైడ్. అవునా?
అదొక్కటనే కాదు, ఎక్కడయినా ఎవరయినా సఫర్ అవుతున్నప్పుడు మనిషిగానో, సంఘం గానో పెయిన్ ని తీసేయ్యగలిగితే తీసేయటం మనకున్న మోరల్ ఆబ్లిగేషన్ అని అనుకుంటాం. కాని ఎవరో లైఫ్ లో ప్లజర్ నీ, హాప్పీనెస్ ని తీసుకురావాలన్నది మోరల్ ఆబ్లిగేషన్ ఏం కాదు కదా!
సో, ఏమంటావు ఇపుడు నువ్వు ? అందరం చచ్చిపోవాలంటావా ఏంటి? ఇదేదో డిప్రెస్సింగ్ పోస్ట్ అన్నా కూడా చదువుతా ఉంటే నువ్వేంది జోన్స్ టౌన్ ఇన్సిడెంట్ లోలా మాతో కూల్ ఏయిడ్ తాగించి, మాతో మాస్ సూసైడల్ నోట్ రాపించేట్లున్నావే! ఎవడో చదివాక కీకరకాయ అన్నాడట అలా ఉంది నీ యవ్వారం అనుకుంటున్నారా?
హోల్డ్ ఆన్.
ప్రో-మోర్టలిజం వేరూ, యాంటైనాటలిజం వేరు. ప్రో-మోర్టలిజం ప్రకారం, సిన్స్ దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ సఫరింగ్ ఇన్ ఆల్ లైఫ్స్, లైఫ్ ఎంత తొందరగా ఎండ్ చేస్తే అంత సఫరింగ్ ని అవాయిడ్ చేయోచ్చు కాబట్టి అదే బెటర్ అని సింగిల్-డైమెన్షన్ ఔట్లుక్ తో మాట్లాడుతుంది.
యాంటై నాటలిజం ఆ మాట చెప్పదు. అసలది చెప్పేదే సఫరింగ్ ని అవాయిడ్ చేయమని, డెత్ బ్రింగ్స్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ సఫరింగ్, సో వై వుడ్ ఇట్ అడ్వైస్ డెత్ ఈజ్ బెటర్ అని? కదా? ఇట్ నెవర్ డజ్. అది ఏమంటుదంటే ఒకసారి పుట్టాక చివరి దాకా ప్రయాణం చేయాల్సిందే అంటుంది , ఎందుకంటే ఒకసారి బతుకు మొదలయ్యాక దాన్ని కంటిన్యూ చేయటం లో ఉండే బెనిఫిట్స్, దాన్ని అబ్ రప్ట్ గా ఎండ్ చేస్తే వచ్చే నష్టాల కన్నా ఎక్కువ కాబట్టి. డెత్ బ్రింగ్స్ సఫరింగ్ టు ద పీపుల్ అరౌండ్ టు బిగిన్ విత్, అండ్ మెనీ మోర్ సచ్ కాన్స్వీక్వెన్సెస్ . సో, డోంట్ డూ ఇట్.. ప్లీజ్ కంటిన్యూ టు లివ్ అండ్ లెట్ లివ్ అనే చెప్తుంది. కాని ఇక ముందు కిడ్స్ ని పట్టుకు రాకపోవడమే మంచిది ఈ భూమ్మీదకి అని మాత్రం అభిప్రాయపడుతుంది.
ఈ రెండు ఫిలసాఫీస్ కూడా హ్యుమన్ లైఫ్ కెన్ నాట్ ఎస్కేప్ సఫరింగ్ అన్న విషయం మీద అగ్రీ అవుతాయి. పేచీ లేదు. కాని డిసగ్రిమెంట్ అల్లా , యాంటై-నాటలిజం ఉన్న లైఫ్ ని కంటిన్యూ చేసి కొత్త లైఫ్ ని తీసుకు రావద్దు అంటుంది. ప్రో-మోర్టలిజం ఏమో ఒకసారి సఫరింగ్ ఈజ్ ఇనెస్కేపబుల్ అనుకున్నాక ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లో అది ఇంకా ఎక్కువ కాబట్టి లైఫ్ ఎంత తొందరగా ఎండ్ చేస్తే అంత బెటర్ అందరికీ అంటుంది. యాంటై-నాటలిజం ఏమో అలా క్కాదు బాస్, ఉన్న లైఫ్ ఎండ్ అవుతే తన వాళ్ళకి ఎంతో సఫరింగ్ ఇవ్వటమే కాక, ఆల్రెడీ తన కి ఏవో గోల్స్, ఆశలూ టార్గెట్స్, కొన్ని కావాలనుకున్న ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఉంటాయి , వాటన్నిటినీ డిప్రైవ్ చేయటం "బాడ్" కిందకి వస్తుంది కాబట్టి వి షుడ్ నాట్ అడ్వకేట్ ఇట్ అంటుంది.
ఈ రెండింటి మధ్యా ఉన్న డిఫరెన్సెస్ ని పూడ్చటానికి ఎపిక్యూరన్ వ్యూ ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సడెన్ గా ఒక మనిషి చనిపోతే పైన చెప్పిన "బాడ్' లు ఉన్నాయి కాబట్టి, భూమ్మీద ఉన్న అందరూ మనుషులూ ఒకేసారి వారికి తెలీకుండా టక్కున ప్రాణాలు వదిలే స్విచ్ ఒకటి ఉంటే కనక, వారి వారి నార్మల్ లైవ్స్ లో ఉండగానేనో పడుకున్నాకో ఎవరికీ ఏ పెయిన్ రాకుండా, ఇంకెవరూ మిగిలి ఉండకుండా, చనిపోబోతున్నాం అనే విషయం ముందు ఏ మాత్రం తెలీకుండా నిద్రలోనో ఎపుడో ఆ సో కాల్డ్ స్విచ్ నొక్కి ఫ్యూజ్ లాగేస్తే , అపుడు పైన చెప్పిన "బాడ్" లు ఉండవు కదా, సో యాంటై-నాటలిజం కీ, ప్రో-మార్టలిజం కి మధ్యనున్న గాప్ ని ఇలా బ్రిడ్జ్ చేయొచ్చు అంటుంది. ఈ ఎపిక్యూరన్ లైన్ ఒక Reductio Ad Absurdum ఆర్గ్యుమెంట్. నిజానికి ఈ యాంటై-నాటలిజమ్, ప్రో-మార్టలిజమ్ లే ఒక పెద్ద రిడక్టివ్ ఆర్గ్యుమెంట్స్. బట్ స్టిల్ దేర్ పాయింట్స్ రెజోనేట్ విత్ మి.
ఇంకా చైల్డ్ ఫ్రీ అని, డీ-నాటలిజం అనీ ఉన్నాయి. పైన కారణాలతో ఏకిభవించక పోయినా ఇవే ఫలితాలొచ్చే వేరే కారణాల మీద డిపెండ్ అయిన ఆర్గ్యుమెంట్స్, మూమెంటమ్ పికప్ అవుతున్నా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి, అందులో ముందుండేవి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ వి. క్లైమేట్ చేంజ్ తీసుకురాబోయే అంతాన్ని బిలీవ్ చేసేవాళ్లు , ఆ అంతానికన్నా ముందు రాబోయే అతి భయంకరమయిన లివింగ్ కండీషన్స్ లోంచి ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లల్ల్ని తీసుకెళ్ళటం ఇమ్మోరల్ కాబట్టి ఇకముందు పిల్లల్ని కనకూడదు అనే ఆర్గ్యుమెంట్ తో చాలా మందే రెజోనేట్ అయ్యేవాళ్లు ఉన్నారు. క్లైమెట్ చేంజ్ వల్ల కాకపోయినా, ఈ ఎర్త్ మీద రాబోయే భూకంపాలూ, హరికేన్సూ, వరదలూ, ఉత్పాతాలూ, యుద్ధాలు వాటి వల్ల డిస్ప్లేస్ అయ్యే పిల్లల జీవితాలూ, ఇంకా ముందుకెళ్తే ఏదో రోజు ఈ భూమ్మీద ఏ తిక్కవెధవ నాయకత్వం వల్లనో, యాక్సిడెంటల్ గానో ట్రిగ్గర్ కాబోయే న్యూక్లియర్ ఆర్మగడ్డెన్ లో ధ్వంసం అయి, కాలిపోబేయే బతుకులూ, న్యూక్లియర్ హాలోకాస్ట్ తర్వాత మిగిలే వేస్ట్ లోంచి వచ్చే టెరిబుల్ బయాలజికల్, ఫిజికల్ కండీషన్స్ లో చావలేక ఈడ్చే బతుకులూ, కనీసం ఆ కారణాల వల్లయినా కొన్ని ప్లేసేస్ లో ఉన్న వాళ్లయినా పిల్లల్ని కనపడకపోవటమే బెటర్ అని వాదించి నమ్మేవాళ్ళున్నారు
****
సరే ఈ ఇజాలూ, ఆ బీజాలూ తీసేసినా కూడా నాకు ఎప్పుడూ అర్ధం కాని విషయమొకటుండేది, ఎవర్నీ అడగలేదు ఆన్సర్ ఉండదు అని తెలుసు కాబట్టి, కాని ఎవరన్నా ఈ టివిల్లోని హిందూ"మహా పాండిత్య" ప్రవచనకారులు, ఈ సంసారచక్రం ఒక భావోద్వేగాల ఊబి, ఒక మాయ, తప్పించుకోలేని, తప్పనిసరిగా తప్పించుకోవాల్సిన ఒక వలయం. మనిషి అల్టిమేట్ ఎయిమ్, ఈ జనన మరణ చక్రం లోకి రాకుండా ఉండటమే, అది కేవలం ఎన్నో జన్మల సుకృతాల తర్వాత కాని సాధ్యం కాదు అని చెప్తున్నప్పుడు, అవునా, అంత కష్టం ఎందుకు ఇద్దరు మనుషులు కాస్త జాగ్రత్తగా ఉంటే సరి కదా, నెక్స్ట్ వచ్చే చెయిన్ మొత్తం అవాయిడ్ చేసి ఎంతో మందిని అలా జననమరణ చక్రం నుంచి మనమే తప్పించొచ్చు కదా, అంత సింపుల్ దానికి అన్ని జన్మల కష్టం ఎందుకూ?, ఇలా ప్రతీ జన్మలో వీక్లీ బాత్రూమ్లూ క్లీన్ చేసుకోవడాలు ఎందుకు? అసలీ గుళ్లెందుకూ, ప్రదక్షిణలూ, దక్షిణలూ ఎందుకు? అసలు మీరెందుకు ఫస్టాఫ్ ఆల్? అసలు హిందూ మతంలో ఉన్న వాళ్లంతా స్టెరిలైజ్ చేసేసుకోండి అని ఒక మతనియమం పెడితే మీరు చెప్పే ఫిలాసఫీకి, మీ నియమాలకి సమన్వయం కుదురుతుంది కదా? పైగా రాబోయే వందల కోట్ల జనాభా సఫరింగ్ ని అవాయిడ్ చేసినందుకు మీకూ మాకూ బోల్డంత పుణ్యం కూడాను కదా.. అని అడగాలనిపిస్తుంది :)
బట్ సిల్లీ జోక్స్ అపార్ట్, సీరియస్లీ, మన హిందు ఫిలాసఫీ చెప్పేది అదే కదా! అల్టిమేట్ గా భూమ్మిదకి రాకుండా ఉండే వరమివ్వమని, ఎన్నో జీవితకాలాల సత్ప్రవర్తనతో దేవుణ్ణి ప్రార్ధించాలి, అంటే ఈ భూమ్మీదకి రావడమంత దారుణమయిన నరకం ఇంకోటి లేదనే కదా? మరి ఒక వైపు అది చెప్తూ ఇంకో వైపు నుంచి'శీఘ్ర సంతాన ప్రాప్తిరస్తూ" అని దీవిస్తారేంటి, కాంట్రాడిక్షనో, కాగ్నిటివ్ డిసొనెన్సో కాకపోతే?
ఐ యామ్ సారీ, ఐ యామ్ గోయింగ్ రోగ్ :)
****
సరే ఇదంతా ఒక థాట్ ఎక్స్పరిమెంట్ గానో, ఫిలసాఫికల్ డిస్కషన్ గానో తీసుకుంటాం కాబట్టి పర్లేదు, బట్ మనమంతా యుటిలేటిరియన్ ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి, ప్రతీ దానికీ, అది వస్తువయినా, థాట్ అయినా, ఈస్థటిక్ సెన్స్ అయినా, ఫిలాసఫీ అయినా దానికి యుటిలిటీ ఉండకపోతే, దాన్ని సమ్ హౌ మానిటైజ్ మోడల్ లోకి ఇరికించకపోతే వ్యాల్యూ లేదనే కాలంలో ఉన్న మనుషులతో నిండి ఉన్న ప్రపంచం కాబట్టి, అసలేమన్నా ఉపయోగం ఉందా పై ఆలోచనలకి అనే ప్రశ్న అసమంజసమేం కాదు.
ఈ ఆలోచనలూ, ఫిలాసఫీస్ వల్ల మెటీరియల్స్టిక్ ఉపయోగాలేం ఉండవు కానీ, కొన్ని సంఘటనల్లోనో, కొన్ని లైఫ్స్ లోనో పర్స్పెక్టివ్ షిఫ్ట్ తీసుకు రాగలదా కనీసం?
లెట్స్ సీ.
ఒక మనిషి టీనేజ్ లోనో, యంగ్ ఏజ్ లోనో ఏ యాక్సిడెంటో అయ్యి అకస్మాత్తుగా చనిపోతే అయ్యో పాపం ఎంత ఫ్యూచర్ లైఫ్, ఎన్ని కలలూ కోల్పోయాడూ అనీ; అలా కాక ఇంకో మనిషికి మిడిల్ ఏజ్ లో ఏ చికిత్సా లేని న్యూరాలజికల్ డిజనరేటివ్ డిసీజో వచ్చి ప్రతి అవయవమూ క్రమక్రమంగా పనికి రాకుండా పోతూంటే, దాని వల్ల అన్ బేరబుల్ సఫరింగ్తో ఉన్న ఆ మనిషి అకస్మాత్తుగా చనిపోతే, పోన్లే పాపం అదృష్టం తొందరగానే పోయాడు అనీ అనుకుంటాం. కానీ మొదటి యంగ్ ఏజ్ కేస్ లో అబ్బా అదృష్టవంతుడు ఫ్యూచర్ లో ఎంత సఫరింగ్ తప్పించుకున్నాడూ అని అనుకోం. అలా సఫరింగ్ కే కాదు, మన రెస్పాన్సెస్ డెత్ కి కూడా అసిమెట్రికల్ గానే ఉంటుంది.
ఏడెమినిదేళ్ల క్రితం ఏమో, Amour మూవీ చూసొచ్చాక ఈ లైన్స్ రాసుకున్నాను ఒక పోస్ట్ లో"పిన్న వయసులోనే, ఏ అవస్థా పడకుండా చనిపోయినవాళ్ళెవరైనా ఉంటే వాళ్ళను చూసి ఏడవకండి. బి హాప్పీ ఫర్ దెమ్" అని. అప్పటికింకా యాంటై-నాటలిజం అనే పదం కూడా తెలీదు నాకు.
ఎవరైనా పిల్లలు చనిపోయిన తల్లిదండ్రుల్ని చూసినపుడు ఎంత బాధగా ఉంటుందనేది మాటలకతీతం. కాని పైకి చెప్పలేనోమో కాని కనీసం మనసులో అనుకుంటానిపుడు నేను. డోంట్ క్రై ఫర్ దెమ్, దే వర్ స్పేర్డ్ సో మచ్ ఆఫ్ సఫరింగ్ ఇన్ దేర్ లైవ్స్, బి హాప్పీ ఫర్ దెమ్ అని. ఐ నో ఇట్ సౌండ్స్ క్యాల్లస్. అట్ లీస్ట్ ఆ పర్పెక్టివ్ షిఫ్ట్ కొన్ని క్షణాలో, నిమిషాలో ఊరటనివ్వగలిగినా , కనీసం పెయిన్ ని పోగొట్టగలిగినా చాలు కదా అని అనుకుంటాను.
అలాగే పిల్లలు పుట్టని పేరెంట్స్ ఎంత కుమిలిపోతుంటారో లోపల ఉన్న పెయిన్ తో, బయటనుంచి వచ్చే పెయిన్ తో అనేది మనకి తెలిసిన విషయమే. ఒకప్పుడైతే ఏమో కానీ, ఇపుడయితే అనుకుంటాను ఆ పేరెంట్స్ కారణజన్ములని. వాళ్లు ఎంతో పుణ్యం చేసుకోని ఉంటే కాని రాబోయే వందల వేల కిడ్స్ ని సో కాల్డ్ జనన-మరణ చక్రం నుంచి తప్పించగలిగిన శక్తి దేవుడు వాళ్లకివ్వడు అని. ఐ నొ, ఐ నో ఐ సౌండ్ ఇన్సేన్!! ఒక అంచనా ప్రకారం ఒక కపుల్ కి ముగ్గురు కిడ్స్ ఉంటే ఆ చెయిన్ ఫ్యూచర్ లో 82,000+ మనుషుల్ని భూమ్మీదకి తీసుకొస్తుందిట. సో హిందువులు వాళ్ల మతం చెప్పేది కనక నిజంగా నమ్మితే 82,000 మందినో కనీసం అందులో సగం మందినో ఆ పిల్లలు కలగని పేరెంట్స్ సేవ్ చేసినట్లే కదా!
కనీసం కొన్ని క్షణాలైనా పైన చెప్పిన పర్స్పెక్టివ్ తో చూస్తే, ఆ సంఘటనల్లో మిగిలి ఉన్న వాళ్లకి అయినా సఫరింగ్ కాసింత సేపైనా దూరంగా ఉంటుందేమో అనే ఒక ఆశ.
PS:
1. పైన చెప్పిన వాటి రిఫరెన్సెస్ అన్నీ గూగుల్ లోమ్చి తీసుకున్నవే. ఇంకా డిటెయిల్స్ కావాలంటే ఈ బుక్ చూసుకోవచ్చు https://www.amazon.com/Better-Never-Have-Been-Existence/dp/0199549265
2. ఇదంత తమాషా ఆర్హ్యుమెంట్స్ ఏం కావనీ, కొంతమంది సీరియస్ గానే ఆలోచిస్తున్నారని తెలుసుకోవటానికి, ముంబై లో ఒకతను వాళ్ల పేరెంట్స్ ని స్యూ చేసాడు. అదిక్కడ చూడొచ్చు
I wish I'd never been born: the rise of the anti-natalists
3.