Saturday, 8 November 2014

Enchantment of an unknown!

Posted by Kumar N on 11/08/2014 04:57:00 am with No comments
 ".... మెట్లు ఎక్కుతూంటే ఆ మెట్ల దగ్గిర ఒక ప్రేమికుడు పారవశ్యంతో ఫిడేలు వాయిస్తున్నాడు. అతడు యాచకుడు కాదు, దాత. జీవితానందం నుండి తాను పొందిన సమస్త ఉత్తేజాన్ని దోసిళ్లతో విరజిమ్ముతున్న ఆనందప్రదాత. మిత్రులారా, ఆనాటి ఆ ....... ఆ సంగీత వాద్యాలు, ఆ జనసందోహం ఇవన్నీ ఒకుమ్మడిగా నా ఆత్మపైని మీటిన ఆనందసంగీతాన్ని నేను మీకు ఎట్లా వివరించగలను? "  --  అనంటాడు చినవీరభధ్రుడు తను తిరిగిన దారుల్లో ఒకచోట.  న్యూయార్క్ సిటీలోనో, లేక ఫిలడెల్ఫియా, చికాగో లాంటి మహానగరాలలోనో జనసమ్మర్ధం గల ప్రాచుర్యం పొందిన కూడళ్లల్లో ఎప్పుడయినా ఎవరయినా కూర్చోనో,...