Sunday, 4 January 2015

చిన్నప్పుడెప్పుడో కథ చదువుకున్నాం గుర్తుందా? యమధర్మరాజు తన కోసం భూమ్మీదకొచ్చినప్పుడు తప్పించుకునేందుకై, ఒక ప్రఖ్యాత నైపుణ్యుడైన శిల్పి తనలాంటి ఏడు విగ్రహాలని తయారు చేసి వాటి మధ్యలో తనూ ఒక శిలలా నించున్నాడనీ, వాటిని చూసిన యముడికి అందులో ఎవరు సజీవమైన మనిషో, ఏది నిర్జీవమైన శిలయో గుర్తుపట్టలేక నీరుగారిపోయాడనీ, పరాజితుడై పోలేక చిట్టచివరకి ఒక ఉపాయం తట్టి అతిశయాలంకారలతో శిల్పిని పొగిడి ఔరా ఈ శిల్పి ఎవరని ఆశ్చర్యపోతే, పొగడ్తలు తలకెక్కిన శిల్పి , అది...

Saturday, 3 January 2015

Art of Storytelling in Art

Posted by Kumar N on 1/03/2015 04:49:00 pm with 2 comments
ఒక కథ చెప్పాలనుకున్నారనుకోండి, ఎలా చెప్తాం? అనగనగా అని మొదలుపెట్టి అంచెలంచెలుగా ముందుకెళ్లొచ్చు, లేదంటే అప్పుడేమయిందంటే అని చెప్పి, అలా ఎందుకయిందో చెప్పడానికి వెనక్కెళ్లొచ్చు. అదీ కాదంటే అక్కడక్కడా చెపుతూ టీజ్ చేస్తూ ఒక మేజ్ లోకి తీసుకొచ్చి తననే మొత్తం దారినీ, తద్వారా కథలోని పాత్రలతో ఎంపథీనీ వెతుక్కోమని పాఠకుణ్ణి వదిలేయచ్చు.ఇలా ఇంకా చాలా రకాలుగా చెప్పొచ్చు. వరస సరే,మరి కథ చెప్పే పద్దతీ, టోన్? వీటికసలు అంతే లేదు.. బాగా వర్షం పడ్డాక పుట్టుకొచ్చి...