Random scribbling on a lazy afternoon.
ఏ మూడు,నాలుగు నెలల క్రితమేమో, అలవాటుగా ప్రతీ గురువారం ఇంటికెళ్ళడానికి ఏయిర్పోర్ట్ కి డ్రైవ్ చేసేప్పుడు మధ్యలో ఆగే దగ్గిరే ఆగాను. ఎప్పుడూ కనపడగానే హే.. అని పలకరించే చార్లెస్ లేడా రోజు. He is a tall, black, army veteran, fearless, an academic and a well-read person who could fluently talk about sociology and history. ప్రతీ వారం వస్తూంటానని, BN ఇచ్చే standard membership discount 10% కాకుండా, customer loyalty అని అక్కడ ఒక నోట్ రాసి, అప్పుడప్పుడూ additional గా కాస్త discount ఇచ్చేవాడు..ఎనీ వే ఐ డైగ్రెస్.
కానీ, meanwhile I was trying to read more about white working class
స్థూలంగా చెప్పాలీ అంటే, ఇది ఒక వైట్ వర్కింగ్ (పూర్) క్లాస్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి కథ. అది చివరకి అందంగా, అచ్చమైన అప్పర్ క్లాస్ తెలుగమ్మాయి ని పెళ్లి చేసుకోవటంతో ప్రస్తుతానికి చివరి పేజీ పడుతుంది.
యూజువల్ గా మనకి సాధారణంగా వినపడే statistics, stereotype story lines ఏంటంటే, బ్లాక్ కమ్యూనిటీస్ లో poverty ఎక్కువ, marriage-rate తక్కువ, single-moms, many father figures at home or no father figures at all at home , un-employment, under-employment అని వింటూంటాం. అలాగే హిస్పానిక్ కమ్యూనిటీస్ గురించి కూడా statistics కొద్దో, గొప్పో మనకి తెలుసు.
వైట్ వర్కింగ్ క్లాస్ ఇబ్బందులూ, life-styles కాస్తో, కూస్తో తెలిసినా ఈ మధ్య వరకీ వాళ్ల గురించి ఎక్కువగా focused-stories బయటకి రాలేదు, వచ్చినా ఇంత decibals లో వినపడలేదు . white working-class story line ఇంతగా perculate అవలేదు.
ఈ పుస్తకంలో తను పుట్టిన ప్రదేశం , పెరిగిన ఊరూ, తిరిగిన వీధుల గుండా, వాళ్ల అమ్మమ్మా, తాతయ్యా ఇళ్లల్లోంచీ, అమ్మ పడిన అవస్థల్లోంచీ, పెట్టిన బాధల్లోంచి, అక్కయ్య అమ్మగా, తాతయ్య నాన్నగా, చివరకి అమ్మమ్మ సమస్థంగా మారడం లోంచి, తన ఊరూ, స్నేహితుల కుటుంబాల అల్లకల్లోల పరిస్థితుల్లోంచి, జాగ్రత్తగా మనల్ని తన చేత్తో పట్టుకొని నడిపించుకుంటూ తీసికెళ్తాడీ అబ్బాయి.
యూజువల్ గా ఇలాంటి కథల్లో pretensions, sympathy పిండుకునే factors, cheesy lines వాడకం కనపడుతుంది. కాని ఇతను అలాంటి జోలికి పోకుండా, చాలా నిజాయితీతో appalachian white-working classes ని,, families ని,, cultur ని, తన కథతో పరిచయం చేస్తాడు. పరమ పల్లెటూరు లోయర్ మిడిల్ (పూర్) క్లాస్ నేపథ్యం ఉన్న నాకే, ఒక్కసారిగా కెంటకీ కి వెళ్లి, అక్కణ్నుంచి వాళ్లతో ఒక ఎడ్లబండి మీద ఒహయో దాకా ఒక థాంక్స్ గివింగ్ జర్నీ చేయాలి అనిపించింది. Well, not exactly ఎడ్లబండి, but a pickup truk(however, I have to say I am scared of their culture of guns).
ఇండియాలో ఎంత పూర్, వర్కింగ్ , లోయర్ మిడిల్ క్లాసెస్ లోంచి వచ్చినా కూడా, కొన్ని ఊళ్లల్లో ఎంత కల్చరల్ అండర్ టోన్ బాడ్ వర్డ్స్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నా కూడా, ఈ ఫ్యామిలీస్ లో అలవోకగా మాట్లాడుకునే భాషా, మాటలూ నన్ను కొన్ని చోట్ల ఉక్కిరిబిక్కిరి చేసాయి. అప్పటిదాకా మా అమ్మాయికిచ్చి ఈ పుస్తకం చదువు అని చెప్పాలనుకున్నవాణ్ణల్లా కొన్ని నిమిషాలు ఆగిపోయాను. కానీ, హైస్కూల్స్ లో mandatory reads లో ఉండే పుస్తకాల్లో ఎంత "లాంగ్వేజ్" ఉంటుందో తెలుసు కాబట్టి, i did not hesitate to ask her to read.
అమ్మమ్మ ఎంత టఫ్ మనిషో చెపుతూ, తాగొస్తున్న భర్తకి చివరిగా విసిగిపోయి ఇంకోసారి తాగి వచ్చావంటే నిన్ను చంపేస్తా అన్న బెదిరింపు , వట్టి బెదిరింపుగా తనెలా వదిలెయ్యలేదో, తనేం చేసిందో చెప్పినప్పుడు, కళ్ళు విప్పార్చి భయంతో .. ఓహ్ మైగాడ్ అనుకోకుండా ఉండలేం. తోటి స్నేహితునితో తను కూడా డ్రగ్స్ వాడానని తెలుసుకున్న అమ్మమ్మ, 'ఇంకోసారి వాళ్లతో తిరిగి కనపడ్డావంటే, వాళ్ళని కార్ కింద నలిపేస్తా వెధవా, ఇంకో మనిషికి తెలీకుండా ' అన్న బెదిరింపు, తనని నిజంగా మళ్లీ అటు వైపు వెళ్లకుండా ఎలా ఆపేసిందో చెప్తున్నప్పుడు, నా మనసులో వాళ్ల అమ్మమ్మనీ, ఆమె ధారాళంగా వాడే filthy-language నీ ఎంత ఇష్టపడలేకుండా ఉన్నప్పటికీ ఆవిడంటే కాస్త గౌరవభావం కలిగింది.
తను పెరిగిన ఒహయో మిడిల్ టౌన్లో , ఒక స్టీల్ మిల్ ఆ ఊరినంతా ఒకప్పుడు ఎలా ఫైనాన్స్ చేసిందో, ఎన్నో కుటుంబాలకీ, వాళ్ల జీవితాలకీ ఎంత ఆలంబనగా ఉండిందో, ప్రతీ హైస్కూల్ గ్రాడ్యుయేట్ కూడా, స్కూల్ అయిపొయాక ఆ ఫ్యాక్టరీ లో పనిచేసే వాళ్ల బాబాయో, పిన్నో, అత్తయ్యో, అమ్మమ్మో ఎవరో ఒకరిని పట్టుకొని, చాలా సుళువుగా స్టీల్ మిల్ జాబ్ లోకి ఎలా వెళ్లిపోగలం అన్న నమ్మకంతో బతికేవాళ్లో చాలా వివరంగా చెప్తాడు. జాబ్ లో ఉన్నప్పుడే కాకుండా, రిటైర్ అయ్యాక కూడా మంచి హెల్త్ కేర్, పెన్షన్స్ ఉన్న లైఫ్స్ కాస్తా, అసలు ఊళ్ళల్లోంచి ఆ ఫ్యాక్టరీలే మూసుకొని పోయినప్పుడు, వేల కొద్దీ కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయో చూపిస్తాడు.
శాంతీ, స్థిరత్వం లేని తన కుటుంబం తనని ఎప్పుడూ fight-or-flight mode లో ఉంచి, ఆందోళనల్లో ముంచెత్తిందో, దాని వల్ల తన గ్రేడ్స్ ఎలా పడిపోయి చివరకి 2.1 GPA కి చేరుకున్నాయో చెప్తున్నప్పుడు బాధనిపించక మానదు. చిట్టచివరకి అమ్మనీ, మారుతున్న నాన్నలనీ వదిలేసి , అప్పటికే తాతయ్యని వదిలేసిన నాన్నమ్మ ఇంట్లో ఉన్న ఒక మూడేళ్ల కాలంలో మొదటిసారిగా మనశ్శాంతి ఎలా ఫీల్ అయ్యాడో, ప్రతీ రోజూ స్కూల్ అయ్యాక ఒకే ఇంటికి రాగలగడం, ఒకే మనిషిని చూడగలగటం అన్న అతి చిన్న చేంజెస్, తనకి డబ్బు లేకపోయినా ఆ relative stability వల్లా, help చేసిన ఒకరిద్దరు మంచి టీచర్స్ వల్లా తన గ్రేడ్స్ ఇంప్రూవ్ చేసుకొని, రీజనబుల్ SAT స్కోర్ తెచ్చుకొని, లోకల్ ఒహయో స్టేట్ యూనివర్సిటీ కి ఎలిజిబిలిటీ తెచ్చుకోగలిగాను అని చెప్తున్నప్పుడు, శభాష్ అనాలనిపిస్తుంది.
కానీ అమ్మమ్మతో కూర్చుని కాలేజ్ అప్లికేషన్ ఫామ్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫామ్స్, ఈ ఫామ్, ఆ ఫామ్ అంటూ చిర్రెత్తించే పేపర్ వర్క్ అంతా ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు, నాకూ అమ్మమ్మకీ అసలదొక చిట్టడవి లాగా ఎంత కాంప్లికేటెడ్ గా అనిపించిందో అని తను చెప్తున్నప్పుడు, ఆ ఇగ్నొరెన్స్ లెవెల్స్ మనల్ని భయపెట్టక మానవు.
కాలేజ్ కి వెళ్లాలి అని అతను సీరియస్ గా ఆలోచిస్తున్నప్పుడు, ఆ కోర్స్ లోడ్ లో ఉండే కష్టం, తప్పనిసరిగా డెడ్ లైన్స్ మీట్ అవ్వాల్సిన అవసరం, ఆ కాంప్లెక్సిటీ, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మీదపడబోయే బోల్డంత అప్పు, ఇవన్నీ తల్చుకొని, ఇవి నా వల్ల కావు అనుకొని అతను మనసు మార్చుకొని ఆగిపోయినప్పుడు, ఇంటర్మీడియట్ అయ్యాక ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినా కూడా సంవత్సరానికి ఐదువేల రూపాయల ఫీజ్, ఆపై లివింగ్ కర్చులూ కట్టే స్థోమత మనకి లేదని మా నాన్నా, నేను ఒస్మానియా యూనివర్సిటీ కాంపస్ లోంచి సీట్ వదిలేసి ఊరికి వెళ్లిపోయిన రోజున మా అమ్మ కళ్ళు గుర్తొచ్చి, భారంగా అయిపోయింది నా మనసు.
అప్పుడప్పుడే వికస్తిస్తున్న అతని వ్యక్తిత్వం, స్వంత ఆలోచనతో తను కాలేజ్ కి కాకుండా మెరైన్స్ లోకి వెళ్ళాలని తను నిర్ణయించుకున్నాక, మెరైన్స్ లో జాయిన్ అవుతే అప్పుడే ఇంకా విస్తరిస్తున్న ఇరాక్ వార్ లోకి మనవడు వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుందని గ్రహించిన అమ్మమ్మ ఎంతగా వ్యతిరేకించిందో, అయినా బలమైన సంకల్పంతో తను ముందుకెళ్లిపోయిన వైనం, వెళ్లిపోయాక మెరైన్ లైఫ్ లో ఉండే క్రమశిక్షణా, ఆ కామ్రేడరీ లో దొరికిన మంచి అడ్వైస్, ట్రెయినింగ్ లో భాగంగా బలపడ్డ శారీరక ధృఢత్వం, పెంపొందించుకున్న నాయకత్వ లక్షణాలూ, ఇరాక్ వార్ లోకి వెళ్లాక అనుకోకుండా మీదపడ్డ ఒక ఆపర్చ్యునిటీ వల్ల ప్రెస్, కెమెరాల ముందూ, పెద్ద లీడర్స్ ముందు తనని తను హాండిల్ చేసుకొని తన జాబ్ నిర్వర్తించిన తీరూ, అన్నిటికన్నా ముఖ్యంగా అదే వార్ లో భాగంగా యుద్దంతో చితికిపోయిన ఇరాక్ గ్రామాల్లో చిధ్రమయిపోయిన పిల్లలని దగ్గిరగా చూసినప్పుడు, తన బాల్యం ఎంత దుర్భరంగా గడిచినప్పటికీ ప్రపంచంలో ఎన్నో దేశాల్తో ఎన్నో కోట్ల కోట్ల పిల్లలతో పోలిస్తే 'నేను ఎంత అదృష్టవంతుణ్ణీ" అని మొట్టమొదటిసారిగా తను ఫీలయ్యిన ఆ మూమెంట్ గుర్తుపెట్టుకొన్న కథా, అన్నిటినీ ఈ పుస్తకంలో చెప్తాడు.
నాలుగు సంవత్సరాల మెరైన్ లైఫ్ తరువాత, మెంటల్ హరైజన్ బ్రెడ్త్, డెప్త్ ఇంప్రూవ్ అయిన ఒక కొత్త వ్యక్తిగా, మా జీవితాలూ, సమాజాలూ అన్నీ డెడ్ అని, బయట ఉన్న ప్రపంచం, urban elite, liberals అందరూ మమ్మల్ని అణచివేయడానికే అన్న అపనమ్మకాలతో నిండి ఉన్న అదే సమాజం లోకి ఈ కొత్త మైండ్ తో వెళుతున్నప్పుడు అసలీ సమాజంలో కష్టపడడానికి సిద్దంగా ఉంటే ఎన్ని ఆపర్చ్యునిటీస్ ఉన్నాయో తెలిసొచ్చిన వ్యక్తిగా, మొట్టమొదటిసారిగా తనకి హోప్ ఒక్కటే కాదు, i will definetly make it అన్న అంతులేని కాన్ఫిడెన్స్ తనని ఎలా నింపేసిందో చెప్తాడు.
అక్కణ్ణుంచి తను ఒహయొ స్టేట్ యూనివర్సిటీ లోకి కాలేజ్ కి వెళ్లి, RI Bill ద్వారా కాలేజ్ ఫీజ్ బెనిఫిట్స్ తీసుకొని, కాలేజ్ లో చదువుకుంటూ, మెరైన్ లైఫ్ లో నేర్చుకొని వచ్చిన hardwork and descipline ని extend చేసుకొని ఒక దశలో మూడు part-time jobs simultaneous గా చేసుకుంటూ, రోజుకి కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ, అండర్ గ్రాడ్ Double Major తో, కేవలం ఒక సంవత్సరం, పదకొండు నెలల్లో Summa cum laude గా గ్రాడ్యుయేట్ అయినప్పుడు....... వావ్.... అనుకోకుండా ఉండలేకపోయాను.
అక్కణ్ణుంచి తను Yale Law School కి ఎలా వెళ్లాడూ, ఆ మధ్యలో లోకల్ సెనేటర్ ఆఫీస్ లో పనిచేసినప్పుడు Govt. welfare schemes తన లాంటి వాళ్లకి ఎలా బెనిఫిట్ చేస్తాయి, కొన్ని సార్లు అనుకోకుండా ఎలా harm చేస్తాయి అన్నవి చెప్తాడు. ఫైనల్ గా Yale Law School కి వెళ్ళాక, తనకి మొదటిసారిగా అసలింకో ప్లానెట్ మీదకి వెళ్లినట్లుగా కల్చర్ షాక్ ఎలా తగిలిందో, Tony Blair, Laury Summers లాంటి వ్యక్తులు routine గా corridors లో ఎలా తగుల్తారో, అసలే మాత్రం pretention లేకుండా, straight-faces తో ఆ లా స్కూల్ లోని స్టూడెంట్స్ మేము మిడిల్ క్లాస్ అనీ మా అమ్మ డాక్టర్, నాన్న ఇంజనీర్ అని చెప్తూన్నప్పుడు వీళ్లు నన్ను ఆట పట్టిస్తున్నారా, లేక అబద్దం చెప్తున్నారా అని తను ఆశ్చర్యపడ్డాడో, అసలు నన్నేమనుకుంటారు వీళ్లు అని తన ఫ్యామిలీ బాక్ గ్రవుండ్ గురించి అబద్దం ఎలా చెప్పాడో, చివరకి ఆ అబద్దాలతో వల్ల కాక తన రియాలిటీ ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడో, ఆ లా స్కూల్ లో ఒక written-assignment లో భాగంగా ఒక పేపర్ సబ్మిట్ చేసినప్పుడు Yale Professor అసలెకణ్ణుంచి వస్తారీ స్టేట్ యూనివర్సిటీ kids మా దగ్గిరకి , మాకు తల్నొప్పీ వీళ్ళకి రైటింగ్ స్కిల్స్ నేర్పించడం మా జాబ్ కాదు అని తను విసుక్కోవడం తనకి ఎలా బాధగలిగించిందో చెప్తాడు.
అదే స్కూల్ల్ లో తెలుగమ్మాయి ఎలా పరిచయమయిందో, Yale Elite atmosphere లో ఉక్కిరి బిక్కిరవుతున్నప్పుడు , అదే Yale లో undergrad చేసి, Law కూడా చేస్తున్న ఆ అమ్మాయి తనని అడుగడుగునా ఎలా ఆదుకుందో, తోటి స్టూడెంట్ గా, ఆల్మోస్ట్ ఒక spiritual mentor గా తన మీద ఎలా ఆధారపడ్డాడో చెప్తాడు.
ఇదంతా ఒక వైపు స్టోరీ అయితే, తను ఇప్పటికీ కన్సర్వేటివ్ అని ఎక్స్ ప్లెయిన్ చేస్తూ, కాని తన వైట్ వర్కింగ్ క్లాస్ సినికల్ గా ఎంత దూరం వెళ్లిపోయిందో అని బాధపడతాడు. ఉదాహరణగా తన కమ్యూనిటీ లోంచి తను రెగ్యులర్ గా వినే మాటలూ, వచ్చే ఈమెయిల్స్ చూపిస్తాడు.
1. 32 % ఆఫ్ conservatives ఒబామా ఒక ముస్లిం అనీ, వేరే దేశం లో పుట్టాడనీ అమెరికాలో పుట్టలేదనీ, 19% we are not sure అని నమ్ముతారనీ, అంటే 51% ఒబామా కనీసం అమెరికన్ అని కశ్చితంగా నమ్మట్లేదనీ అదెంత విచారకరమో అని వాపోతాడు.
చివరగా తన పెళ్లయ్యాకనో, అయ్యే ముందో ఒకసారి ఆ తెలుగమ్మాయి (ఉషా) ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడి కల్చర్ లో అమ్మా నాన్నా, ఒకరి వెనకాల ఒకరు బాడ్ గా మాట్లాడుకోకపోవటం, ముఖ్యంగా వదినా ఆడపడుచులూ పదిముందు ముందే అరుచుకుంటూ పోట్లాడుకోకపోవటం, ఫ్యామిలీ లో అసలెవ్వరూ కుటుంబాన్ని వదిలేసి పారిపోయిన వాళ్లు లేకపోవటం, bad words routine గా వినపడకపోవటం, అన్నింటికన్నా ముఖ్యంగా Ivy League లో undergrad and grad-school కి వెళ్లగలిగిన కూతుళ్లని వాళ్ల నాన్న, 'No, they are not smart, they just work hard' అని అనగలగడం ఇవన్నీ తనకి ఎలాంటి కల్చర్ షాక్ ని ఇచ్చాయో చెప్పినప్పుడు మురిపంగా నవ్వుకోకుండా ఉండలేం.

ఎదురుగా ఈ పుస్తకం కనపడింది. Usual గా అయితే కనీసం ఒక few seconds flip చేస్తా కాని, ఆ కవర్ చూస్తే అస్సలు ఇంట్రస్టింగ్ గా అనిపించలేదు. ఏందోలే ఏదో గోల అని ముందుకు వెళ్లిపోయా. కట్ చేస్తే, కొద్ది వారాల్లోనే.. ఎక్కడ చూసినా, ఏ టివి చానెల్ తిప్పినా, ఏ న్యూస్ పేపర్ లోకి వెళ్లినా ఈ పుస్తకం, ఈ రచయితా కనపడుతా ఉన్నారు. సో మైండ్ కాస్త కాస్త ట్యూన్ అవ్వటం మొదలయ్యింది. అప్పటికి పార్టీ కన్వెషన్స్ అయిపోయి, జనరల్ ఎలక్షన్స్ సీజన్ మొదలయ్యింది. Trump ఎలా పార్టీ నామినీ అయ్యాడా అన్న ఆశ్చర్యమే ఇంకా పూర్తిగా పోలేదు కానీ, చాలా మంది లాగే ఈ burn down the barn, erratic, chaotic, filthy-filled talk strategy లు జనరల్ ఎలక్షన్స్ లో పని చేయవు, he needs to be more desciplined and sombre అని అనుకునేవాణ్ణి. కాని సపోర్ట్ ఎక్కణ్ణుంచి వస్తుందా అని చూసినప్పుడు, It was very clear. Non-college educated, White working-class rustbelt, Appalachian area లో తనకి కమాండింగ్ లీడ్స్ వస్తున్నాయని డాటా చెప్తోంది. కానీ ఎంత డాటా చూసినా కూడా, అతని కాండిడసీ, కాంపయిన్ ఒక జోక్ లానో, ఒక జెర్రీ స్ప్రింగర్ బఫూనరీ రియాలిటీ షో టైప్ లోనో నడూస్తూండేప్పటికి, అతని వాగుడు క్రియేట్ చేసే దిన దిన గండాల్లో, ఏదో ఒక సుడిగుండం ఆ మనిషిని నిలువునా మింగేసేట్లుగానే కనపడింది. ఐ డైగ్రెస్ అగయిన్.
కానీ, meanwhile I was trying to read more about white working class
***
స్థూలంగా చెప్పాలీ అంటే, ఇది ఒక వైట్ వర్కింగ్ (పూర్) క్లాస్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి కథ. అది చివరకి అందంగా, అచ్చమైన అప్పర్ క్లాస్ తెలుగమ్మాయి ని పెళ్లి చేసుకోవటంతో ప్రస్తుతానికి చివరి పేజీ పడుతుంది.
యూజువల్ గా మనకి సాధారణంగా వినపడే statistics, stereotype story lines ఏంటంటే, బ్లాక్ కమ్యూనిటీస్ లో poverty ఎక్కువ, marriage-rate తక్కువ, single-moms, many father figures at home or no father figures at all at home , un-employment, under-employment అని వింటూంటాం. అలాగే హిస్పానిక్ కమ్యూనిటీస్ గురించి కూడా statistics కొద్దో, గొప్పో మనకి తెలుసు.
వైట్ వర్కింగ్ క్లాస్ ఇబ్బందులూ, life-styles కాస్తో, కూస్తో తెలిసినా ఈ మధ్య వరకీ వాళ్ల గురించి ఎక్కువగా focused-stories బయటకి రాలేదు, వచ్చినా ఇంత decibals లో వినపడలేదు . white working-class story line ఇంతగా perculate అవలేదు.
ఈ పుస్తకంలో తను పుట్టిన ప్రదేశం , పెరిగిన ఊరూ, తిరిగిన వీధుల గుండా, వాళ్ల అమ్మమ్మా, తాతయ్యా ఇళ్లల్లోంచీ, అమ్మ పడిన అవస్థల్లోంచీ, పెట్టిన బాధల్లోంచి, అక్కయ్య అమ్మగా, తాతయ్య నాన్నగా, చివరకి అమ్మమ్మ సమస్థంగా మారడం లోంచి, తన ఊరూ, స్నేహితుల కుటుంబాల అల్లకల్లోల పరిస్థితుల్లోంచి, జాగ్రత్తగా మనల్ని తన చేత్తో పట్టుకొని నడిపించుకుంటూ తీసికెళ్తాడీ అబ్బాయి.
యూజువల్ గా ఇలాంటి కథల్లో pretensions, sympathy పిండుకునే factors, cheesy lines వాడకం కనపడుతుంది. కాని ఇతను అలాంటి జోలికి పోకుండా, చాలా నిజాయితీతో appalachian white-working classes ని,, families ని,, cultur ని, తన కథతో పరిచయం చేస్తాడు. పరమ పల్లెటూరు లోయర్ మిడిల్ (పూర్) క్లాస్ నేపథ్యం ఉన్న నాకే, ఒక్కసారిగా కెంటకీ కి వెళ్లి, అక్కణ్నుంచి వాళ్లతో ఒక ఎడ్లబండి మీద ఒహయో దాకా ఒక థాంక్స్ గివింగ్ జర్నీ చేయాలి అనిపించింది. Well, not exactly ఎడ్లబండి, but a pickup truk(however, I have to say I am scared of their culture of guns).
అమ్మంటే ఒక అన్నపూర్ణ అనే ఇమేజ్ బిల్డ్ చేసిన సమాజం లోంచి, an icon of love గా పెరిగొచ్చిన కల్చర్ లోంచి వచ్చిన మన లాంటి వాళ్లకి, ఈ అమ్మలు కాస్త ఇబ్బంది కలిగిస్తారు. తనకి తెలిసే పదిహేను మంది పార్ట్నర్స్ ని మార్చిన అమ్మ, revolving door for fathers ని పరిచయం చేసిన అమ్మ, ఐదవ హజ్బండ్ ఇంట్లోకి హఠాత్తుగా మకాం మార్చి నాకు ఊపిరాడకుండా చేసిన అమ్మ, చక్కటి హెల్త్ కేర్ ఉద్యోగం ఉండి కూడా డ్రగ్ అడిక్షన్ కి బానిసయ్యి ఎన్నో సార్లు ఉద్యోగం పోగొట్టుకొని అరెస్ట్ అయ్యి పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి, తిరిగించిన ఈ అమ్మ, ఊడిపోబోయే ఉద్యోగం కాపాడుకోవడానికి డ్రగ్ టెస్ట్ కోసం ఒకసారి తన యూరిన్ ఇవ్వకుండా, దానికి బదులుగా కొడుకు క్లీన్ యూరిన్ నింపివ్వమని బాటిల్ ఇచ్చి బలవంతపెట్టిన ఈ అమ్మ అనే మనిషి నాకు జీవితంలో ఎప్పుడూ తారసపడక పోతే ఎంత బాగుండు అని తను అనుకున్నప్పుడు ఒక్కసారిగా కళ్ళల్లోకి నీళ్ళు చిప్పుల్లుతాయి.
ఇండియాలో ఎంత పూర్, వర్కింగ్ , లోయర్ మిడిల్ క్లాసెస్ లోంచి వచ్చినా కూడా, కొన్ని ఊళ్లల్లో ఎంత కల్చరల్ అండర్ టోన్ బాడ్ వర్డ్స్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నా కూడా, ఈ ఫ్యామిలీస్ లో అలవోకగా మాట్లాడుకునే భాషా, మాటలూ నన్ను కొన్ని చోట్ల ఉక్కిరిబిక్కిరి చేసాయి. అప్పటిదాకా మా అమ్మాయికిచ్చి ఈ పుస్తకం చదువు అని చెప్పాలనుకున్నవాణ్ణల్లా కొన్ని నిమిషాలు ఆగిపోయాను. కానీ, హైస్కూల్స్ లో mandatory reads లో ఉండే పుస్తకాల్లో ఎంత "లాంగ్వేజ్" ఉంటుందో తెలుసు కాబట్టి, i did not hesitate to ask her to read.
అమ్మమ్మ ఎంత టఫ్ మనిషో చెపుతూ, తాగొస్తున్న భర్తకి చివరిగా విసిగిపోయి ఇంకోసారి తాగి వచ్చావంటే నిన్ను చంపేస్తా అన్న బెదిరింపు , వట్టి బెదిరింపుగా తనెలా వదిలెయ్యలేదో, తనేం చేసిందో చెప్పినప్పుడు, కళ్ళు విప్పార్చి భయంతో .. ఓహ్ మైగాడ్ అనుకోకుండా ఉండలేం. తోటి స్నేహితునితో తను కూడా డ్రగ్స్ వాడానని తెలుసుకున్న అమ్మమ్మ, 'ఇంకోసారి వాళ్లతో తిరిగి కనపడ్డావంటే, వాళ్ళని కార్ కింద నలిపేస్తా వెధవా, ఇంకో మనిషికి తెలీకుండా ' అన్న బెదిరింపు, తనని నిజంగా మళ్లీ అటు వైపు వెళ్లకుండా ఎలా ఆపేసిందో చెప్తున్నప్పుడు, నా మనసులో వాళ్ల అమ్మమ్మనీ, ఆమె ధారాళంగా వాడే filthy-language నీ ఎంత ఇష్టపడలేకుండా ఉన్నప్పటికీ ఆవిడంటే కాస్త గౌరవభావం కలిగింది.
తను పెరిగిన ఒహయో మిడిల్ టౌన్లో , ఒక స్టీల్ మిల్ ఆ ఊరినంతా ఒకప్పుడు ఎలా ఫైనాన్స్ చేసిందో, ఎన్నో కుటుంబాలకీ, వాళ్ల జీవితాలకీ ఎంత ఆలంబనగా ఉండిందో, ప్రతీ హైస్కూల్ గ్రాడ్యుయేట్ కూడా, స్కూల్ అయిపొయాక ఆ ఫ్యాక్టరీ లో పనిచేసే వాళ్ల బాబాయో, పిన్నో, అత్తయ్యో, అమ్మమ్మో ఎవరో ఒకరిని పట్టుకొని, చాలా సుళువుగా స్టీల్ మిల్ జాబ్ లోకి ఎలా వెళ్లిపోగలం అన్న నమ్మకంతో బతికేవాళ్లో చాలా వివరంగా చెప్తాడు. జాబ్ లో ఉన్నప్పుడే కాకుండా, రిటైర్ అయ్యాక కూడా మంచి హెల్త్ కేర్, పెన్షన్స్ ఉన్న లైఫ్స్ కాస్తా, అసలు ఊళ్ళల్లోంచి ఆ ఫ్యాక్టరీలే మూసుకొని పోయినప్పుడు, వేల కొద్దీ కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయో చూపిస్తాడు.
శాంతీ, స్థిరత్వం లేని తన కుటుంబం తనని ఎప్పుడూ fight-or-flight mode లో ఉంచి, ఆందోళనల్లో ముంచెత్తిందో, దాని వల్ల తన గ్రేడ్స్ ఎలా పడిపోయి చివరకి 2.1 GPA కి చేరుకున్నాయో చెప్తున్నప్పుడు బాధనిపించక మానదు. చిట్టచివరకి అమ్మనీ, మారుతున్న నాన్నలనీ వదిలేసి , అప్పటికే తాతయ్యని వదిలేసిన నాన్నమ్మ ఇంట్లో ఉన్న ఒక మూడేళ్ల కాలంలో మొదటిసారిగా మనశ్శాంతి ఎలా ఫీల్ అయ్యాడో, ప్రతీ రోజూ స్కూల్ అయ్యాక ఒకే ఇంటికి రాగలగడం, ఒకే మనిషిని చూడగలగటం అన్న అతి చిన్న చేంజెస్, తనకి డబ్బు లేకపోయినా ఆ relative stability వల్లా, help చేసిన ఒకరిద్దరు మంచి టీచర్స్ వల్లా తన గ్రేడ్స్ ఇంప్రూవ్ చేసుకొని, రీజనబుల్ SAT స్కోర్ తెచ్చుకొని, లోకల్ ఒహయో స్టేట్ యూనివర్సిటీ కి ఎలిజిబిలిటీ తెచ్చుకోగలిగాను అని చెప్తున్నప్పుడు, శభాష్ అనాలనిపిస్తుంది.
కానీ అమ్మమ్మతో కూర్చుని కాలేజ్ అప్లికేషన్ ఫామ్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫామ్స్, ఈ ఫామ్, ఆ ఫామ్ అంటూ చిర్రెత్తించే పేపర్ వర్క్ అంతా ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు, నాకూ అమ్మమ్మకీ అసలదొక చిట్టడవి లాగా ఎంత కాంప్లికేటెడ్ గా అనిపించిందో అని తను చెప్తున్నప్పుడు, ఆ ఇగ్నొరెన్స్ లెవెల్స్ మనల్ని భయపెట్టక మానవు.
ఆరవ తరగతి వరకీ ఎలక్ట్రిసిటీ, ఇండోర్ ప్లంబింగ్, సరైన మంచినీళ్ళ బావి, ఇంట్లో నేల మీద కనీసం బండరాళ్లు కూడా లేని, బస్ సౌకర్యం అసలే లేని, రోడ్ కనెక్టివిటీ కూడా సరిగ్గా లేని ఊళ్లో పెరిగిన నాకు ఇలాంటి ఇగ్నోరెన్సే ఉండేది.
కాలేజ్ కి వెళ్లాలి అని అతను సీరియస్ గా ఆలోచిస్తున్నప్పుడు, ఆ కోర్స్ లోడ్ లో ఉండే కష్టం, తప్పనిసరిగా డెడ్ లైన్స్ మీట్ అవ్వాల్సిన అవసరం, ఆ కాంప్లెక్సిటీ, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మీదపడబోయే బోల్డంత అప్పు, ఇవన్నీ తల్చుకొని, ఇవి నా వల్ల కావు అనుకొని అతను మనసు మార్చుకొని ఆగిపోయినప్పుడు, ఇంటర్మీడియట్ అయ్యాక ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినా కూడా సంవత్సరానికి ఐదువేల రూపాయల ఫీజ్, ఆపై లివింగ్ కర్చులూ కట్టే స్థోమత మనకి లేదని మా నాన్నా, నేను ఒస్మానియా యూనివర్సిటీ కాంపస్ లోంచి సీట్ వదిలేసి ఊరికి వెళ్లిపోయిన రోజున మా అమ్మ కళ్ళు గుర్తొచ్చి, భారంగా అయిపోయింది నా మనసు.
అప్పుడప్పుడే వికస్తిస్తున్న అతని వ్యక్తిత్వం, స్వంత ఆలోచనతో తను కాలేజ్ కి కాకుండా మెరైన్స్ లోకి వెళ్ళాలని తను నిర్ణయించుకున్నాక, మెరైన్స్ లో జాయిన్ అవుతే అప్పుడే ఇంకా విస్తరిస్తున్న ఇరాక్ వార్ లోకి మనవడు వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుందని గ్రహించిన అమ్మమ్మ ఎంతగా వ్యతిరేకించిందో, అయినా బలమైన సంకల్పంతో తను ముందుకెళ్లిపోయిన వైనం, వెళ్లిపోయాక మెరైన్ లైఫ్ లో ఉండే క్రమశిక్షణా, ఆ కామ్రేడరీ లో దొరికిన మంచి అడ్వైస్, ట్రెయినింగ్ లో భాగంగా బలపడ్డ శారీరక ధృఢత్వం, పెంపొందించుకున్న నాయకత్వ లక్షణాలూ, ఇరాక్ వార్ లోకి వెళ్లాక అనుకోకుండా మీదపడ్డ ఒక ఆపర్చ్యునిటీ వల్ల ప్రెస్, కెమెరాల ముందూ, పెద్ద లీడర్స్ ముందు తనని తను హాండిల్ చేసుకొని తన జాబ్ నిర్వర్తించిన తీరూ, అన్నిటికన్నా ముఖ్యంగా అదే వార్ లో భాగంగా యుద్దంతో చితికిపోయిన ఇరాక్ గ్రామాల్లో చిధ్రమయిపోయిన పిల్లలని దగ్గిరగా చూసినప్పుడు, తన బాల్యం ఎంత దుర్భరంగా గడిచినప్పటికీ ప్రపంచంలో ఎన్నో దేశాల్తో ఎన్నో కోట్ల కోట్ల పిల్లలతో పోలిస్తే 'నేను ఎంత అదృష్టవంతుణ్ణీ" అని మొట్టమొదటిసారిగా తను ఫీలయ్యిన ఆ మూమెంట్ గుర్తుపెట్టుకొన్న కథా, అన్నిటినీ ఈ పుస్తకంలో చెప్తాడు.
నాలుగు సంవత్సరాల మెరైన్ లైఫ్ తరువాత, మెంటల్ హరైజన్ బ్రెడ్త్, డెప్త్ ఇంప్రూవ్ అయిన ఒక కొత్త వ్యక్తిగా, మా జీవితాలూ, సమాజాలూ అన్నీ డెడ్ అని, బయట ఉన్న ప్రపంచం, urban elite, liberals అందరూ మమ్మల్ని అణచివేయడానికే అన్న అపనమ్మకాలతో నిండి ఉన్న అదే సమాజం లోకి ఈ కొత్త మైండ్ తో వెళుతున్నప్పుడు అసలీ సమాజంలో కష్టపడడానికి సిద్దంగా ఉంటే ఎన్ని ఆపర్చ్యునిటీస్ ఉన్నాయో తెలిసొచ్చిన వ్యక్తిగా, మొట్టమొదటిసారిగా తనకి హోప్ ఒక్కటే కాదు, i will definetly make it అన్న అంతులేని కాన్ఫిడెన్స్ తనని ఎలా నింపేసిందో చెప్తాడు.
అక్కణ్ణుంచి తను ఒహయొ స్టేట్ యూనివర్సిటీ లోకి కాలేజ్ కి వెళ్లి, RI Bill ద్వారా కాలేజ్ ఫీజ్ బెనిఫిట్స్ తీసుకొని, కాలేజ్ లో చదువుకుంటూ, మెరైన్ లైఫ్ లో నేర్చుకొని వచ్చిన hardwork and descipline ని extend చేసుకొని ఒక దశలో మూడు part-time jobs simultaneous గా చేసుకుంటూ, రోజుకి కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ, అండర్ గ్రాడ్ Double Major తో, కేవలం ఒక సంవత్సరం, పదకొండు నెలల్లో Summa cum laude గా గ్రాడ్యుయేట్ అయినప్పుడు....... వావ్.... అనుకోకుండా ఉండలేకపోయాను.
అక్కణ్ణుంచి తను Yale Law School కి ఎలా వెళ్లాడూ, ఆ మధ్యలో లోకల్ సెనేటర్ ఆఫీస్ లో పనిచేసినప్పుడు Govt. welfare schemes తన లాంటి వాళ్లకి ఎలా బెనిఫిట్ చేస్తాయి, కొన్ని సార్లు అనుకోకుండా ఎలా harm చేస్తాయి అన్నవి చెప్తాడు. ఫైనల్ గా Yale Law School కి వెళ్ళాక, తనకి మొదటిసారిగా అసలింకో ప్లానెట్ మీదకి వెళ్లినట్లుగా కల్చర్ షాక్ ఎలా తగిలిందో, Tony Blair, Laury Summers లాంటి వ్యక్తులు routine గా corridors లో ఎలా తగుల్తారో, అసలే మాత్రం pretention లేకుండా, straight-faces తో ఆ లా స్కూల్ లోని స్టూడెంట్స్ మేము మిడిల్ క్లాస్ అనీ మా అమ్మ డాక్టర్, నాన్న ఇంజనీర్ అని చెప్తూన్నప్పుడు వీళ్లు నన్ను ఆట పట్టిస్తున్నారా, లేక అబద్దం చెప్తున్నారా అని తను ఆశ్చర్యపడ్డాడో, అసలు నన్నేమనుకుంటారు వీళ్లు అని తన ఫ్యామిలీ బాక్ గ్రవుండ్ గురించి అబద్దం ఎలా చెప్పాడో, చివరకి ఆ అబద్దాలతో వల్ల కాక తన రియాలిటీ ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడో, ఆ లా స్కూల్ లో ఒక written-assignment లో భాగంగా ఒక పేపర్ సబ్మిట్ చేసినప్పుడు Yale Professor అసలెకణ్ణుంచి వస్తారీ స్టేట్ యూనివర్సిటీ kids మా దగ్గిరకి , మాకు తల్నొప్పీ వీళ్ళకి రైటింగ్ స్కిల్స్ నేర్పించడం మా జాబ్ కాదు అని తను విసుక్కోవడం తనకి ఎలా బాధగలిగించిందో చెప్తాడు.
అదే స్కూల్ల్ లో తెలుగమ్మాయి ఎలా పరిచయమయిందో, Yale Elite atmosphere లో ఉక్కిరి బిక్కిరవుతున్నప్పుడు , అదే Yale లో undergrad చేసి, Law కూడా చేస్తున్న ఆ అమ్మాయి తనని అడుగడుగునా ఎలా ఆదుకుందో, తోటి స్టూడెంట్ గా, ఆల్మోస్ట్ ఒక spiritual mentor గా తన మీద ఎలా ఆధారపడ్డాడో చెప్తాడు.
చివరకి జాబ్ ఇంటర్వ్యూ కోసం మొదటిసారిగా ఒక expensive restaurant కి వెళ్లినప్పుడు, కట్లరీ ఎలా వాడాలో కూడా తెలీక వెనక్కెళ్లి ఉషా ని అడగాల్సి వచ్చేది అని చెప్తాడు.
ఇదంతా ఒక వైపు స్టోరీ అయితే, తను ఇప్పటికీ కన్సర్వేటివ్ అని ఎక్స్ ప్లెయిన్ చేస్తూ, కాని తన వైట్ వర్కింగ్ క్లాస్ సినికల్ గా ఎంత దూరం వెళ్లిపోయిందో అని బాధపడతాడు. ఉదాహరణగా తన కమ్యూనిటీ లోంచి తను రెగ్యులర్ గా వినే మాటలూ, వచ్చే ఈమెయిల్స్ చూపిస్తాడు.
1. 32 % ఆఫ్ conservatives ఒబామా ఒక ముస్లిం అనీ, వేరే దేశం లో పుట్టాడనీ అమెరికాలో పుట్టలేదనీ, 19% we are not sure అని నమ్ముతారనీ, అంటే 51% ఒబామా కనీసం అమెరికన్ అని కశ్చితంగా నమ్మట్లేదనీ అదెంత విచారకరమో అని వాపోతాడు.
2. తనకొచ్చే ఈమెయిల్స్ లో , Obamacare ప్రోగ్రామ్ పేషంట్స్ బాడీల్లోకి ఒక మైక్రోచిప్ ని ఇన్సర్ట్ చేయడానికి ఉద్దేశించిన స్కీమ్ అనీ, ఇది end-times కి సంకేతమనీ, ఇదంతా బైబిల్ లో ముందే చెప్పబడిందనీ, ప్రపంచం అంతమయ్యే టైమ్స్ లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మనిషి బాడీస్ లోకి వెళ్తుందని biblical prophecy చెప్పిందనీ ఎంతో మంది తన ఫ్రెండ్స్ నమ్ముతారని తనకి తెలిసిందని చెప్తాడు
3. Newtown Sandyhook Elementary School gun shooting లో తీయబడిన 26 ప్రాణాలు, ఒబామా గవర్నమెంట్ కావాలని అరేంజ్ చేసిందనీ, తద్వారా ప్రజల ఒపీనియన్స్ ని గన్ లాబీకి against గా షేప్ చేసి, గన్స్ అన్నీ లాక్కోవడానికి చేసిన గవర్నమెంట్ కుట్ర అనీ ఈమెయిల్స్ వస్తూంటాయని చెప్తాడు
4. ఒబామా మూడవసారి కూడా ప్రసిడెంట్ అవ్వడానికి తొందర్లోనే మార్షల్ లా విధించబోతున్నాడన్న రూమర్స్ తనకి రెగ్యులర్ గా తన కమ్యూనిటీ లో వినపడడం గురించీ చెప్తాడు (నిజానికి ఈ రూమర్ మా పిల్లలు కూడా స్కూల్స్ లో విన్నారు) అసలు ఇలాంటివన్నీ నిజం కాదనీ ఎన్ని న్యూస్ చానెల్స్ లో చూపించినప్పటికీ, చివరికి రిపబ్లికన్ బయాస్ తో నిండిపోయిన fox-news సైతం ఇవి నిజం కాదని చెప్పినప్పటికీ, మా వాళ్లు ఎలా నమ్మరో, మైండ్స్ ఎలా క్లోజ్ చేసేసుకుంటారో అని చెప్పినప్పుడు మాత్రం భలే విచారమనిపిస్తుంది.
పొలిటికల్, పాలసీ స్టఫ్ వదిలేసినా కూడా అసలు మా వాళ్లు కష్టపడటం ఎప్పుడో మానేసారనీ, కేవలం మేం కష్టపడతాం అని ఊరికే భ్రమలతో నిండి ఉంటారనీ చెప్తాడు. ట్రేడ్ డీల్స్, ఎకానమీ ట్రబుల్స్, జార్ఝ్ బుష్ నీ, ఒబామానీ ఎంత తిట్టుకున్నా కూడా, ఈ ప్రపంచం లో ఇంకా చాలా ఆపర్చ్యునిటీస్ ఉన్నాయనీ, సోమరిపోతు తనం, మోటివేషన్ లేకపోవటం, అవిచ్చే elderly figures bad behavior లో ఎంగేజ్ అయి ఉండటం, cynical views, drug addiction, chasing girls లాంటి పిచ్చి బిహేవియర్స్ వదిలేసి హైస్కూల్ పాస్ అయ్యి ముందుకి వెళ్లడం మీద ఫోకస్ చేస్తే, జీవితాలు మరీ ఇంత దరిద్రంగా ఉండవనీ వాపోతాడు. ఫ్యాక్టరీలూ, మిల్స్, ఎంప్లాయమెంట్ ఆపర్చునిటీసే ఎన్ని వచ్చినా రాకపోయినా, అంత కన్నా ముందు మన attitudes కూడా shift అవ్వాలని చెప్పడానికి ప్రయత్నిస్తాడు.
పొలిటికల్, పాలసీ స్టఫ్ వదిలేసినా కూడా అసలు మా వాళ్లు కష్టపడటం ఎప్పుడో మానేసారనీ, కేవలం మేం కష్టపడతాం అని ఊరికే భ్రమలతో నిండి ఉంటారనీ చెప్తాడు. ట్రేడ్ డీల్స్, ఎకానమీ ట్రబుల్స్, జార్ఝ్ బుష్ నీ, ఒబామానీ ఎంత తిట్టుకున్నా కూడా, ఈ ప్రపంచం లో ఇంకా చాలా ఆపర్చ్యునిటీస్ ఉన్నాయనీ, సోమరిపోతు తనం, మోటివేషన్ లేకపోవటం, అవిచ్చే elderly figures bad behavior లో ఎంగేజ్ అయి ఉండటం, cynical views, drug addiction, chasing girls లాంటి పిచ్చి బిహేవియర్స్ వదిలేసి హైస్కూల్ పాస్ అయ్యి ముందుకి వెళ్లడం మీద ఫోకస్ చేస్తే, జీవితాలు మరీ ఇంత దరిద్రంగా ఉండవనీ వాపోతాడు. ఫ్యాక్టరీలూ, మిల్స్, ఎంప్లాయమెంట్ ఆపర్చునిటీసే ఎన్ని వచ్చినా రాకపోయినా, అంత కన్నా ముందు మన attitudes కూడా shift అవ్వాలని చెప్పడానికి ప్రయత్నిస్తాడు.
చివరగా తన పెళ్లయ్యాకనో, అయ్యే ముందో ఒకసారి ఆ తెలుగమ్మాయి (ఉషా) ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడి కల్చర్ లో అమ్మా నాన్నా, ఒకరి వెనకాల ఒకరు బాడ్ గా మాట్లాడుకోకపోవటం, ముఖ్యంగా వదినా ఆడపడుచులూ పదిముందు ముందే అరుచుకుంటూ పోట్లాడుకోకపోవటం, ఫ్యామిలీ లో అసలెవ్వరూ కుటుంబాన్ని వదిలేసి పారిపోయిన వాళ్లు లేకపోవటం, bad words routine గా వినపడకపోవటం, అన్నింటికన్నా ముఖ్యంగా Ivy League లో undergrad and grad-school కి వెళ్లగలిగిన కూతుళ్లని వాళ్ల నాన్న, 'No, they are not smart, they just work hard' అని అనగలగడం ఇవన్నీ తనకి ఎలాంటి కల్చర్ షాక్ ని ఇచ్చాయో చెప్పినప్పుడు మురిపంగా నవ్వుకోకుండా ఉండలేం.
PS1. ఈ పుస్తకం ఒక పర్సనల్ స్టోరీ. కాని వైట్ అమెరికా, ముఖ్యంగా వైట్ వర్కింగ్ క్లాస్ అమెరికా ఎలా డిసింగ్రేట్ అయ్యి, చక్రాలూడిపోయి కూలిపోతోందో facts, statistics తో సోషల్ కామెంటరీ చూడాలీ అనుకుంటే I would recommend Charles Murray's 'Coming Apart'. అది కొన్నాను కానీ ఇంకా పూర్తిగా చదవలేదు నేను. ఫస్ట్ టూ చాప్టర్స్ అయ్యాయి. Murray goes after numbers one after another after another after another to the point of becoming tedious :)
PS2: అలాగే అసలు original american idea ఒక class hierarchy లేని సొసైటీ ని క్రియేట్ చేసుకోవాలనీ, ఒకప్పుడు ఆ సొసైటీ ఉండిందని అందంగా నమ్మేవాళ్లకోసం Award winning LSU Professor Nancy Isenberg , అసలు నాలుగు వందల సంవత్సరాల అమెరికన్ క్లాస్ చరిత్ర వివరిస్తూ రాసిన పుస్తకం White Trash. I have the book but it looks so dry for me to dive into it. But I guess it gives a good understanding of various factors involved and they shaped the class system.
Now, that the story is over, a few questions:
ఓ అందమైన కథా, ఒక నాలుగు ప్రశ్నలన్నాను కదా. ప్రస్తుతానికి genuine economic anxiety లోకీ, పెరుగుతున్న health-insurance premiums create చేసిన helpless mindset లోకీ, raw-anger లోకీ, pure-despair లోకీ, racial-resentment లోకి, subtle-sexist attitudes లోకి tap చేయగలిగి barely electoral college గెలుపయితే వచ్చింది కానీ, manufacturing jobs ఎలా తెప్పిద్దామని? trade-deals re-negotiate చేసి కొన్నింటిని తెప్పించినా అసలు వందల వేల కొద్దీ ఒకప్పటీలా ఫ్యాక్టరీ జాబ్స్ ఎక్కడివి, అవెప్పుడో పోయాయి కదా? చైనా లో ఐపాడ్ చేసే foxconn ఫ్యాక్టరీయే చైనా labor-expensesమా వాళ్ల కాదు, మేం రోబోట్స్ పెట్టబోతున్నాం అని అనౌన్స్ చేస్తూంటేనూ? ఒకవైపు టాక్స్ కట్స్, మరో వైపు ఒక ట్రిలియన్ డాలర్ infrastructure తో వచ్చే డెఫిసిట్స్ ని ఎలా మానేజ్ చేద్దామని? అసలు బడ్జెట్ బాలన్స్ బిల్ క్లింటన్ చేసాక దాని ఊసెత్తరెవ్వరూ ఎందుకని? అంటే ఇలాగే ఖర్చు పెట్టేసి , టెంపరరీ sugar rise లాగా construction jobs create చేసి , longrun లో ఎలాగూ two-terms కన్నా గెలవలేం, deficit management అంతా next government నెత్తిన వేయటం ఎంత irresponsible? సరే అవన్నీ ఎలాగోలా economy grow అయ్యి, deficits పెద్ద matter మాటర్ అవ్వవు అనుకుందాం కాసేపు, కానీ 'నేను హైస్కూల్ కన్నా ఎక్కువ చదువుకోను, ఇంట్లో మూడు, నాలుగు ఫాదర్ ఫిగర్స్ తో, అప్పుడప్పుడూ చిలక్కొట్టుళ్లతో, డ్రగ్స్ తో గడుపుతూ, నేను ఎక్కడికీ వెళ్లనూ, ఇక్కడే ఉంటాను ఇదే ఊరి దగ్గర్లోకి నాకు ఫ్యాక్టరీ రావాలి, హైస్కూల్ డిప్లొమాతో ఉద్యోగం రావాలీ, కనీసం సర్వీస్ సెక్టర్స్ లో జాబ్ దొరికే ఆపర్చ్యునిటీస్ ఉన్న అర్బన్ ఏరియాల్లోకి నేను వెళ్లను' అని కూర్చుంటే ఎంత కాలమిలా? ఎవరు ఎవర్ని మోసం చేసుకుంటున్నారు, చేస్తున్నారు? ఒకవేళ మంచి మాన్యూఫక్చరింగ్ జాబ్స్ వచ్చాయనే అనుకుందాం.. ఈ జాబ్స్ అన్నీ $13 - $18 or max $20 per hour pay చేసే జాబ్స్. వాటితో నీ జనరేషన్ నీ, నీ ఫ్యూచర్ జనరేషన్ నీ ఎంతకాలం, ఎంత దూరం తీసుకెళ్దాం అనీ? కనీసం బెర్నీ ఒక్కడూ అసలు సొల్యూషన్ గురించి మాట్లాడాడు. సరే, ఆ సొల్యూషన్స్ కి డబ్బులెక్కణ్ణుంచి వస్తాయి అని డిబేట్ చేసుకోవచ్చు, ఆయన సోషలిస్ట్ అని మీదపడి రక్కొచ్చు కానీ కనీసం ఇంటలెక్చువల్ గా ఆయన, దీనికి సరైన solution మీరు కాలేజ్ కి వెళ్ళడం, అది వెళ్లడానికి నేను ఫ్రీ స్టేట్ కాలేజ్ చేస్తాను అనిమొత్తుకున్నాడు. Atleast I respect him, although he is too far left for me . కాలేజ్ ఫ్రీగా చేయలేం మనమిప్పుడు, కానీ జాబ్స్ అన్నింటిని వెనక్కి తేలేము ఎందుకంటే ఆటోమేషన్ అనేది అన్నింటినీ మింగేస్తోంది, సో ఆ ఆటోమేషన్ స్కిల్స్ కోసం కంప్యూటర్ ప్రోగ్రామింగో, లేక రోబోటిక్స్ స్కిల్సో, లేక వొకోషన్ స్కిల్సో ఇప్పించే కమ్యూనిటీ కాలేజెస్ ని ఫ్రీగా చేద్దాం అని కనీసం ఒబామా మొత్తుకున్నాడు. ఈ సొల్యూషన్స్ కి అయ్యే ఖర్చు గురించి అగ్రీ అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు, కాంప్రమైజ్ అవ్వచ్చూ, ఏమైనా చేయొచ్చ్చు కానీ, at least they are talking about sensible path . మోసం చేయట్లేదు, మీ జీవితాలు బాగు పడాలీ అంటే చదువూ, స్కిల్స్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. raw anger మంటల్ని క్రియేట్ చేసి వాటిలో నెయ్యి పోయకుండా.
ఇదంతా ఒకవైపయితే, అసలు అన్నింటికన్నా ముఖ్యమయిన విషయం కల్చరల్ ఆటిట్యూడ్స్ గురించి ఏ పొలిటీషియన్, ఏ లీడర్ మాట్లాడడెందుకని? ఇట్లా ఓ ఫ్యామిలీ లేకుండా, రెస్పాన్సిబుల్ ఫాదర్స్ లేకుండా, డ్రగ్స్ ట్రై చేస్తూ, ఎడ్యుకేషన్ లేకుండా ఉండే కల్చర్, డేంజరస్ పాథ్ అనీ, ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా, ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చినా ఇదొక సూసైడల్ ట్రెండ్ అనీ, ముందుగా మీ మనసులూ, మీ బాటలూ మార్చుకోవాలనీ ఎవ్వరూ పెదవి విప్పరేం పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ మీద? పైగా ఇమ్మిగ్రంట్స్ బూచి ఒకటి.
ఈ tax-cuts ఇవన్నీ so-called elites గా పిలవబడే, immigrants గా ఈ దేశానికొచ్చిన నాలాంటి వాళ్లకి హెల్ప్ చేసేవే తప్ప , ఈ వర్కింగ్ క్లాస్ కి హెల్ప్ చేసేవి కావని ఎందుకు ఎక్కదు.
అసలు ఈ దేశంలో 70% కి కాలేజ్ డిగ్రీ లేదు. హైస్కూల్ తో ఆపినంత కాలం high-skilled immigrants ని మీరు ఆపలేరనీ, అసలు వాళ్ళతో పోటీ పడలేరనీ, అసలు మీరే రెడ్ కార్పెట్ వేసి మరీ వాళ్ళని పిలవాల్సి వుంటుందనీ, అలా పిలిస్తే వచ్చిన వాళ్ళే ఇపుడున్న immigrants అని, వాళ్ల hardworking attitudes తో మీరిలా ఉన్నంత కాలం మీ జీవితమంతా తలక్రిందులుగా తపస్సు చేసినా వాళ్ల దరిదాపుల్లోకి కూడా రాలేరనీ, వీళ్లకెవరు చెప్తారు?
అసలు western-civilization ఇంత పైకెళ్లడానికి తోడ్పడ్డ కారణాల్లో protestant work-ethic అని గర్వంగా మనందరం కాస్తో, కూస్తో అంగీకరించే కారణం కదా , ఆ work-ethic ఈ immigrants నరనరానా జీర్ణించుకుపోయిందనీ, ఆ పిల్లల అస్థిత్వం లో అది భాగమని వీళ్ళకి ఏ పొలీటీషియన్, ఏ సోషల్ లీడర్ చెప్తాడు?
ఈ రోజుకీ అమెరికాలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సరైన పీపుల్ దొరకట్లేదనీ వీళ్ళనెవరు నమ్మించగలరు? పరిస్థితి బాగు పడాలంటే there are two sides that need to improve. Economy growth and the resulting jobs growth ఒక వైపయితే, Cultural attitudes, Cultural practices మారాల్సిన అవసరం ఇంకో వైపు. ఐ యామ్ సారీ రెండో దాంట్లో నాకు hope కనపడట్లేదు. I hope someone breaks that news to the working class. . సింపుల్ స్టాటిస్టిక్ ఏంటంటే, ఇదే అమెరికాలో 1960స్ లో, white upper class లో మారేజ్ రేట్ 94%, white working class లో 84%, ఈ రోజున అదే upper class లో 80-85%, working-class లో 47%.
అదొక్కటీ చాలు, ఇంక ఎక్కువగా చెప్పక్కర్లేదు. Yes, Scandinavian countries have managed decent stable societies without high marriage rates, but they take parenting seriously, and there are many social systems that act as real safety nets, all of them are loathed by the right-wing in this country. Sigh. (డిస్క్లమయిర్: నేను సెంటర్-రైట్ పర్సన్ ని, ఫార్ లెఫ్ట్ వింగ్ నా కప్ ఆఫ్ టీ కాదు)
Thans for the write up Kumar garu. మీరు ఎప్పుడు ఏం రాసిన నాలుగు ముక్కలు వ్రాసి వదిలెయ్యకుండా. వీలైనంత డీప్ ఇన్ సైట్ ఇస్తారు.
ReplyDelete