సుదీర్ఘ సుషుప్తావస్థల తరువాత
తప్పని foraging కోసం మళ్లీ ఎగరటం మొదలెడతాం.
మళ్లీ,
అదే ఒడిశెల, అదే రాయి
తేలుతూ పోతోన్న ప్రాణి రెక్కని ఒక్కసారిగా విరగ్గొడుతుంది.
బ్లీడింగ్ రెక్కల్నీ,
రేసింగ్ హార్ట్ నీ,
గాస్పింగ్ లంగ్స్ నీ ,
స్పైరల్ ఫ్రీ ఫాల్ లో ఉన్న శరీరాన్నీ,
మే-డే కాల్ చేసిన ప్రాణాన్నీ సేవ్ చేయడానికి,
సిస్టం ఒక్కొక్క నాన్ ఎమర్జెన్సీ యుటిలిటీని షట్ డౌన్ చేయడం మొదలెడుతుంది
గాయం అభౌతికమే అయుండొచ్చేమో, కాని ఫలితం బయాలజీ లో కనపడుతుంది.
వొరిగిపోయిన దేహాన్నీడ్చుకొని , కలుగులోకి దూరిపోయి , గాయాల్ని లిక్ చేసుకుంటూ
గోయింగ్ ఇన్ టు దట్ నైట్
జంటిల్ గా జారనిమ్మని వేడుకునే లోపు, ప్రాణం పాస్ అవుట్ అవుతుంది
అదొక న్యూరాలజికల్ రెస్పాన్స్
హమ్మయ్య అని విడిచిపెట్టి పోయిన లోకం లోకి,మళ్లీ పంపబడ్డ మెలకువలు.
ఎంత క్షోభ అనీ!
***
హీలింగ్ కావాలి,
కనీసం ఈ భూమ్మీద ఎక్కడో సంజీవని ఉన్న వాళ్లు అదృష్టవంతులు, ఎవరూ లేకపోతే మనమే హనుమంతులమవ్వొచ్చు,
అసలా మొక్కే లేకపోతే?.
రిజైండ్ స్టేట్,
చీకటిచ్చిన కంఫర్ట్,
తెల్లార కూడని రాత్రుల్లో థెరపీ లా, ఎదుట త్రిపుర
పక్షులు,
వలస పక్షులు,
థెరప్యూటిక్ గానం
"...ఆ బుధవారం సాయంకాలం, ఘనీభవించిన చిరు అల లాగా వచ్చి కిటికీ అంచు మీద... ప్రతిమ లాగా కూర్చుంది"
బూటి!
'టెరిబుల్ బాధల' గత జన్మలనొదిలి... బౌద్దం తిరిగిన ట్రింకోమలీ, మౌల్మీన్ లల్లోంచి ఈ చీకట్లోకి నడచొచ్చిన బూటీ
వళ్ళంతా ఉబికి, మసిలి, బయటకి జారుతూ అర్ధమేదో మిగిల్చిపోయే చివరి కన్నీళ్లని గుర్తుపట్టగలిగే బూటీ
అర్దం లేదనే అర్ధాన్ని కంక్లూడ్ చేయటంలో కాంట్రడిక్షన్స్ ని అర్ధం చేసుకునే బూటీ
కంఫర్ట్స్ నీ, కన్న వాళ్లనీ కావాలనుకునే క్రీచర్స్, ఈ హ్యూమన్స్
ప్రేమా, ఇష్టం, బంధం, కట్ చేసుకోలేని ఒక అంబ్లికల్ కార్డ్ కనెక్ట్ అయిన మనిషితో, మనుషులతో
సుఫలమైనా, అఫలమైనా, విఫలమైనా, విషాదఛాయల వలయాల మధ్య వాటన్నిట్లోంచి మునకలేసినా,
చివరికి అన్ని కమిట్మెంట్ల అంతిమ గమ్యం దుఖం నుంచి తప్పించుకోలేని అశక్తతని సానుభూతితో చూడగలిగే బూటీ
****
మైగ్రేషన్స్ పక్షులకే కాదు, మన మెదళ్లకి కూడా
బర్డ్స్ లాగా మెంటల్ ఫేజెస్ సీజనల్ అయి ఉండకపోవచ్చేమో కాని వచ్చినపుడు ఆ లీప్స్ ఆర్ పాల్పబుల్.
ఆ పారాగ్లైడ్స్ లో సంచరించే
బాబుట్టి!
'మెల్లగా అడుగు మీద అడుగు వేస్తూ ద్వారం దగ్గర్నుండి నడిచి వచ్చి... కూచుంది. ఆ కూర్చోవడం లో ఎంత గ్రేస్'
ఆకృతేదో తెలుసుకునేలోపే మాయమయిపోయిన మేఘంలా కనిపించెళ్లిపోయే బాబుట్టి
ఈ సారి ఈ చీకట్లో నా తల పక్కనే.. ఆర్ తల లోపలా?
సమాజపరిణామ శాస్త్రం ఇంకిపోయిన సారం లోంచి వచ్చిన జ్ణానం ఇచ్చిన స్వేచ్చ ,
ఆర్డర్ ని పక్కకి తోసేసి, ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్డర్ లో సోల్ ని వెతుక్కునే దారుల్లోంచి నడచి అక్కడ కూడా అది దొరక్క సోల్ ని గొంతు పిసికేసి, నిహిలిస్టిక్ అంచుల్లో తచ్చాడి,
కాలం-స్థలం-ప్రాణం అనే ఇల్యూషన్ కావల ఉన్నది తెలిసినా వెళ్ళలేక, ఆ ఇల్యూషన్ ఇటు పక్కా, అటూ పక్కా అన్న మీమాంసలో పడే మైండ్ బాగా పరిచయమున్న బాబుట్టి,
నీరూ, మొక్కా, వెలుతురూ, నేనూ, నువ్వూ, పక్షీ, కొండా, నక్షత్రం, చీకటీ, శూన్యం, పదార్థం, వీటంతటా నిండిన చైతన్యం - వాటి లోపల్నుంచి బయటపడి,
బయటున్నదేదీ బయటది కాకపోయేంత దూరాల్ని దూకాక, అనేకం అనేది లేని ఏకత్వంలోకి వెళ్లిపోయే క్షణాలు అర్ధమయినా, అదే అధివాస్తవమనే అనుభవం కూడా అభూతకల్పనేమో అని అనుమానపడి, పెండ్యులం లా వెనక్కొచ్చే బాబుట్టి,
చూడగానే డయాగ్నైజ్ చేసే తొందరపాటుతో చివరికి మిస్-డయాగ్నైజ్ చేసే డాక్టర్లలా బాబుట్టి
****
'అక్కడే ఎదురుగా కుర్చీలో కుబ్బ'
కౌమార, నవయవ్వన ప్రభావ పునాది ఆశయాల తెరల్లోంచి నడచొచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్న కుబ్బ.
అలనాడు ఖాజీపేట్ రైల్వే స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి రెడ్డి , ఎంజిఎం హాస్పిటల్ పిడియాట్రిషియన్ రామనాధం ల బద్లా హత్యల అంతిమయాత్రల్లోంచి,
మిడ్ నైట్ దక్షిణ్ ఎక్స్ప్రెస్ లోంచి బయటకి లాగబడి రైల్వే ట్రాక్ మీద పొడిచి చంపేసిన దగ్గరి దోస్తు అన్న చెంచారపు రవీందర్ రెడ్డి బాడీ ని దాటూతూ స్కూల్ కెళ్లిన కాలాల్లోంచి,
పక్కింటి చిత్తరంజన్ ని చూస్తూండగానే,
అక్కడే ఆడుకుంటున్న తన దోస్తుల్ని దాటి వచ్చి గన్ షాట్ తో చంపేసి వెళ్లిపోయిన రోజుల్లోంచి,
ఎక్కడెవర్ని చంపడానికి ఉపయోగపడ్డాయో కాని,
స్కూటర్లే కనిపించని ఊర్లో ఒకేసారి మూడు, క్రికెట్ ఆడుకుంటున్న పక్కనే చెట్లకింద ప్రత్యక్షమయిన అయోమయ ఘడియల్లోంచి,
వదిలొచ్చిన ఊళ్లల్లో అన్నలెవరో, అన్నల్లోకెళ్లిందెవరో తెలియని అపనమ్మకపు, భయపు దశల్లోంచి,
ఖాకీ కాళ్ల కింద నలిగిన పల్లెల్లోంచి, కేవలం యువకులయిన పాపానికి చుట్టబడ్డ లేతజీవితాల్లోంచి
వరంగల్, ఆర్ ఎస్ యూ లూ, ఆర్ ఈ సీ ల లోంచి,
సమసమాజభావన కి అడ్డొస్తే దైవాన్ని సైతం రోడ్డుకీడ్చే దమ్ముల్లోంచి
ఉద్వేగం గొంతునిండా నిండి, రక్తమంతా తిరిగిన పాటల్లోంచి
పతనమయిపోయిన ఎర్రటి భూలోకస్వర్గాల్లోంచి
వయసు కరిగిపోగా,
ఏవో, ఏవేవో అర్ధమయి,
స్థిరంగా,
సాటి మనిషి మీద దయ కోల్పోని
.
కుబ్బ
***
PS:
నాకు త్రిపుర వలసపక్షుల గానం బాగా, బా...గా...నచ్చిన కథనం, అనే దాని కన్నా అదొక థెరపీ అనటం మోర్ అప్రాప్రియేట్.
ఇంకా ఉంది, ఏదో, చెప్పాలని,
కాని ఈ రాత్రికి,
ఇంతే, ఇక
.
మనసూ, నేనూ మిగిలుంటే.. మళ్లెప్పుడైనా..మిగతాతో
.
With Love for my fellow man and woman, for all their perceived and unperceived sufferings
0 comments:
Post a Comment