Monday, 15 April 2013

ముందు పోస్టులో చెప్పినట్లుగా Niall Ferguson - Civilization, The West and the Rest పుస్తకంలో దాదాపు అర్ధసహస్రాబ్ధం క్రితం పశ్చిమ యూరప్ సమాజంలో మొదలయిన ఎదుగుదలనీ, వివిధ రంగాల్లో పాశ్చాత్యసమాజపు వేసిన గణనీయమైన ముందడుగులనీ, షుమారు ఐదొందల సంవత్సరాల అప్రతిహత, అవిశ్రాంత ప్రగతి, తద్వారా పశ్చిమార్ధపు దేశాలు భూగోళం మీద సాధించిన ఆధిపత్యానికి గల కారణాలనీ వెతుకుతారు. పదిహేనవ శతాబ్ధం వరకీ నాగరికతలో, సాంకేతిక జ్ణానంలో, తత్వవిచారణలో, వివిధ పౌరవ్యవస్థల్లో ఎంతో ముందున్న తూర్పు, మధ్యప్రాచ్యపు దేశాలు క్రమంగా వెనకబడటానికి గల కారణాలని కూడా అన్వేషిస్తారు.చివరగా పాశ్చాత్యప్రపంచపు పలుకుబడి ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టడాన్ని గుర్తిస్తూనే, తూర్పుప్రపంచపు అద్భుతంగా సాధించిన అభివృద్ధినీ, ప్రపంచం ముందు రాబోతున్న సవాళ్లని తనదైన రీతిలో ముందుంచుతారు.

ఈ పుస్తకంలో ఆరు చాప్టర్లు, నాలుగువందల పేజీలు ఉన్నాయి. ఎన్నో వివరాలూ, విశ్లేషణలూ, అభిప్రాయాలూ, రెఫరెన్సులూ, సుదీర్ఘవివరణలూ ఉన్నాయి.

ఒక్కొక్క చాప్టర్ లో కల ముఖ్యమైన పాయింట్లనీ, విషయాలనీ.. అటూఇటూ కాని సంకర తెంగ్లీష్ భాషలో ఇక్కడ పొందుపరుద్దామని ఓ ప్రయత్నం.

క్రితం పోస్టులోనే చెప్పినట్లుగా, ఈ ప్రయత్నం కాపీయింగ్ హక్కుల ఉల్లంఘన అన్న అనుమానమూ, నమ్మకమూ లేకపోలేదు. కాని అదే సమయంలో పుస్తకపరిచయాలు/సమీక్షలు బ్లాగు రచయిత కోణం లోంచి మాత్రమే చదివి, ఆ పుస్తకాలు చదవలేని/చదవని ఎందరో మిత్రుల కోసమూ, నా కోసమూ కూడా పుస్తకం లో ఉన్నదున్నట్లుగా రాస్తే పోలా అన్న ఆలోచనే.. నాతో ఈ కొన్ని వ్యాక్యాలు రాయిస్తోంది. పైగా నా గొంతూ, నా బయాస్ లు తీసేసి రాసినట్లుగా కూడా ఉంటుంది, అందువల్ల చదువరులు స్వంతగా అభిప్రాయలనేర్పరుచుకుంటారు అన్న ఒక ఆలోచన కూడా ఉంది.

పైన చెప్పినట్లుగా ఎన్ని కారణాలు చెప్పుకున్నా,ఈ డ్రాఫ్ట్ రాసేసి రెండు వారాలు దాటిపోయినా కూడా, మనసులో ఉండే క్షోభ మాత్రం పోలేదు. ఇలా చేయటం తప్పు అన్న భావం నా కాళ్లను గట్టిగా కట్టేసింది. well I should say 'చేతుల్ని".

చివరకి రాసినదాన్ని చెత్తబుట్ట దాఖలు చేయడం ఇష్టం లేక, పబ్లిష్ అనే బటన్ ని కొట్టలేక సందిగ్ధంలో పడి చివరకి ఉండబట్టలేక ఈ పుస్తక రచయితకి, నేను చేయబోయే ఈ దుశ్చర్య గురించి ముందే సమాచారాన్ని, ఈ బ్లాగు లింకు తో సహా, ముందస్తు కృతజ్ణతలనీ, క్షమాపణలనీ అందచేయడం జరిగింది.

కాపీయింగ్ రైట్స్ హక్కుల్ని అతిక్రమించనంతవరకీ, పుస్తక రచయితకి క్రెడిట్ దక్కినంత వరకీ, తన పుస్తక అమ్మకాలకి విఘాతం ఏర్పడనంత వరకీ, రచయితకీ, పుస్తకానికీ మరింత ప్రచారం లభించేంతవరకీ, తన పుస్తక సమాచారాన్ని వేరే భాషలో మరింతమంది ప్రజలు తెలుసుకుంటారన్న విషయం ఏ పుస్తకరచయితకి అయినా సంతోషకరమయిన వార్త కాకపోయినా, టాలరేట్ చేసేంత ఆమోదయోగ్యమేమో అని నమ్ముతున్నాను. అందుకే ముందుకు సాగుతున్నాను.

కాని చివరగా ఈ మాట చెప్పకతప్పదు. రచయితకి రెండు సార్లు ఈమెయిల్ ఇచ్చి, అందులో స్పష్టంగా.. ఈ బ్లాగులో తన పుస్తకం గురించీ, అందులోని పేరాగ్రాఫ్ లూ/పేజీలని నేరుగా తెలుగు(?) లో టైప్ చేయడం గురించి, దాని వెనుక ఉద్దేశాల గురించీ చెప్పి, ఏ మాత్రం అభ్యంతరమున్నా తెలియచేయమని సవినయంగా మనవి చేయడం జరిగింది. అయితే రిప్లై రాలేదు, దాన్ని రచయిత ఆమోదంగా పరిగణించడం భావ్యం కాదు. తప్పు కూడాను.

కాని రెండు వారాల వెయిటింగ్ తర్వాత నెగటివ్ రిప్లై కూడా రాలేదన్న వంచనతో ముందుకెళ్ళడానికి నిశ్చయించుకోవడం జరిగింది. కావున ఏ రోజయినా అభ్యంతరమనేది వస్తే, ఈ పోస్టులు వెంటనే డిలీట్ చేయడం జరుగుతుంది.

ఇహ ఈ సోది ఆపి, పుస్తకం లోకి.

గమనికః ఈ కింద రాసిందంతా రచయిత టోన్, నాది కాదని మనవి.
_____________________________________________________________________
1411 ప్రాంతంలో ఓ సారి ప్రపంచయాత్ర చేసొస్తే కనక మనకీ కింది విషయాలు కనిపించేవి:

One of the greatest eras of orderly government and social stability in human history గా పేరొంది, చైనా ని 276 సంవత్సరాలు పరిపాలించిన మింగ్ సామ్రాజ్యం, బీజింగ్ లో Forbidden City ని కట్టడం మొదలయ్యింది.


అదేచైనాలో, 1700 కిలోమీటర్ల పొడుగుతో, ప్రపంచంలో అతి పెద్ద మానవనిర్మిత కెనాల్ అయిన Grand Canal ని, సమూలంగా మార్చేసి మెరుగు పరచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.



Ottoman చక్రవర్తులు Constantinople మీదకి దండెత్తటానికి సన్నాహాలు మొదలెట్టారు. (చిట్ట చివరకి 1453 లో ఆక్రమించేయడంతో ప్రపంచ చరిత్రలో అతి శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన Ottoman Empire అవతరిస్తుంది )
 

Byzantine Empire (Eastern Roman Empire) చివరి దశలో ఉంది. 



చరిత్రకారుల అంచనాల ప్రకారం అప్పటి ప్రపంచంలో దాదాపు అయిదు శాతం (ఒక కోటిన్నర జనాభా) ని తన దండయాత్రలకి బలితీసుకోని, ఒకానొక టైమ్ లో ఏషియానీ, ఆఫ్రికానీ, యూరప్ లో కొద్ది భాగాన్నీ గడగడలాడించి, ఈజిప్ట్ నీ, సిరియా నీ, ఢిల్లీ ని, విస్తరిస్తున్న Ottoman Empire నీ ఓడించి, సాక్షాత్తూ Ming Dynasty మీదకే దండెత్తిన ముస్లిం రాజు Timur 1405 లో చనిపోవటంతో, మధ్య ఏషియా నుంచి దాడులకి వచ్చే ముష్కర సేనల ప్రమాదం మింగ్ సామ్రాజ్యానికీ, ఒట్టోమాన్ ఎంపైర్ కీ తప్పిపోయింది.


ఏ రకంగా చూసినా రానున్న భవిష్యత్తు అంతా, చైనా Yongle Emperor కీ, Ottoman Sultan Murad II కీ వెలిగిపోతూ కనిపించేది.

                                                                   

అదే కాలం లో పశ్చిమ యూరప్ సమాజం ఎలా ఉందో చూద్దాం:


1347 నుంచీ 1351 వరకీ వ్యాప్తి చెందిన Black Death పశ్చిమయూరప్ సమాజం జనాభాని సగానికి తగ్గించేసింది. (యూరప్ జనాభా తిరిగి పూర్వపు స్థాయికి రావడానికి దాదాపు నూటయాభై సంవత్సరాలు పట్టింది ). ప్లేగ్ వ్యాధి సమసిన తర్వాత కూడా అది వదిలి వెళ్ళిన అపరిశుభ్ర నగరాలతో, అనారోగ్యపరిస్థితులతో యూరప్ తల్లడిల్లింది.

ఇంగ్లాండ్ Richard II రాజు ని చంపేసి, సింహాసనాన్ని ఎక్కిన Henry IV తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఎన్నో తిరుగుబాట్లనీ, హత్యాప్రయత్నాలనీ తప్పించుకోని రాజ్యమేలి, కుష్టు వ్యాధితో బాధపడుతూ అంతిమదశలో ఉన్నాడు.


వంద సంవత్సరాల ఆంగ్లో - ఫ్రెంచ్ వార్ కి జరుగుతున్న కాలమది. ఫ్రాన్స్ దేశం Duke of Burgundy అనుచరలకీ, Duke of Orleans అనుచరలకీ మధ్య నలుగుతున్న ప్రాక్స్తీ యుద్దం లో నలిగిపోతొంది. ఈ యుద్ధంతో పోల్చితే ఇతర యూరప్ ప్రాంతాలయిన Aragon, Castile, Navarre, Portugal and Scotland లో పరిస్థితులు కొంచెం మెరుగ్గా ఉండేవి.

ఏ మధ్యప్రాచ్యంలోనో, తూర్పుదేశంలోనొ కాదు, ఏకంగా యూరప్ లో పశ్చిమాన ఉండే Spain లోని Granada ని ఒక ముస్లిం రాజు ఇంకా పరిపాలిస్తున్నాడు. 



స్కాటిష్ రాజు James I ఇంగ్లాండ్ పైరేట్ల దాడిలో చిక్కుకొని, ఇంగ్లాండ్ లో బంధింపబడి ఉన్నాడు. ఆ వార్త విన్న అతని తండ్రి King Robert III గుండెపోటుతో మరణించాడు.

18 సంవత్సరాల దీర్ఘ బంధింపు తర్వాత 1424 లో కానీ James I విడుదల కాలేదు.


యూరప్ మొత్తం మీద సిరిసంపదలున్న ప్రదేశాలుగా చెప్పుకోతగ్గవి ఉత్తర ఇటలీ నగరసంస్థానాలయిన Florence, Genoa, Pisa, Siena and Venice లు మాత్రమే.





ఇక అదే పదిహేనవ శతాబ్ధంలో ఉత్తర అమెరికా పరిస్థితి చూస్తే:
Aztecs, Mayas and Incas ఎత్తైన టెంపుల్స్, రహదారుల్తో నిండి ఉన్న మధ్య, దక్షిణ అమెరికాలతో పోలిస్తే, అమెరికా ఓ ఆటవిక సమాజం. రెడ్ ఇండియన్ల తెగలతో నిండిపోయిన ప్రదేశం. అసలొక పూర్తి దేశం కూడా కాదు.
   

ఇలా ఒక్కొక్క ప్రదేశం అనే కాకుండా అయినా, మొత్తంగా చూస్తే కూడా 1500 లో ఫ్యూచర్ వెస్టర్న్ ఇంపీరియల్ పవర్స్ కంట్రోల్ లో కేవలం పదిశాతం ప్రపంచభూభాగం మాత్రమే ఉండేది. అది 1913 కల్లా పదకొండు వెస్టర్న్ ఎంపైర్స్ కలసి ప్రపంచంలో దాదాపు ఐదింట మూడు భాగాల్ని కంట్రోల్ చేయటం మొదలుపెట్టాయి.

సరే, ఇలా ఖండాలన్నీ తిరిగి, ప్రపంచ యాత్ర ముగించుకునేసరికి ఒక్క విషయం స్పష్టంగా కనపడేది. 

పదిహేనవ శతాబ్ధపు మధ్యలో, తూర్పు దేశాల్లోని జీవనప్రమాణాలూ, ఆ సమాజాల్లోని సుస్థిరతా, పాశ్చాత్యదేశాల్తో పోలిస్తే చాలా మెరుగని అర్ధమయ్యేది. 

ఆ కాలంలో ఎవరైనా వచ్చి , భవిష్యత్తులో పశ్చిమ సమాజాలు, ప్రపంచాధిపత్యాన్ని సాధిస్తాయని అంటే అతను/ఆమె అవాస్తవ ప్రపంచంలో బతుకుతున్న మనిషిలాగా కన్పించేవారు. 

కానీ, అదే జరిగింది.
పదిహేనవ శతాబ్ధం లో ఒక పేద్ద సివిలైజేషన్ కి అంకురార్పణ మొదలయింది. ఈ పశ్చిమ నాగరికత ఇంతింతై వటుడింతై పెరిగి ఓరియంటల్ మహా సామ్రాజ్యాలనీ, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలేషియా ని జయించి రాజ్యాల్ని పరిపాలించడమే కాకుండా, ధరించే బట్టల విధానం, విద్యనభ్యసించే విధానం, రోగనిర్ధారణా, చికిత్సా, సంరక్షణా విధానం దగ్గర్నుంచి మొదలుకొని న్యాయవవస్థా, పౌరసమాజపు వివిధ వ్యవస్థల పరిపాలనా విధానాల వరకీ సైతం, వారి పాశ్చ్యాత్య నాగరికత జీవన విధానాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేసింది. 


మరి ఏ కారణాల వల్ల పశ్చిమ సమాజం అభివృద్ది ఊర్ధ్వదిశగా సాగింది? 

1. కేవలం అదృష్టం కలసిరావటం వల్లా?

2. భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలసి రావటం వల్లా?

3. లేక కరెబియన్ ఐలాండ్స్ లో అనుకోకుండా కాలుపెట్టి అధిక కెలోరీలుండే షుగర్ ని సులభంగా పండించుకోవటం వల్లా?

4. లేక తమ వాతావరణంలో కాటన్ కీ, కోల్ కి అనువుగా లేని భూములు కొత్తగా అడుగుపెట్టిన దేశాల్లో దొరకటం వల్లా?

5. లేక sod's law వల్ల కోల్ డిపాజిట్స్ ని మైన్ చేయడం చైనాకి కష్టతరంగా మారటం వల్లా?

6. లేక తమ గెలుపే తమకి ఒక వల లాగా తయారయిందా చైనాకి? మిగులు ఉత్పత్తి సాధ్యం కాక, అపారమయిన జనాభాకి సరిపోయినంత మాత్రమే కెలోరీస్ సమకూర్చుకోగలిగారా?

7. లేక బ్లాక్ డెత్ మిగిల్చిన అపరిశుభ్ర వీధులూ, వ్యాధితో నిండిపోయిన ఊళ్ళూ, సమాజంలో దిగువ వర్గాలని ఊడ్చేసి, కేవలం ఆరోగ్య, ధనిక వర్గాలు మిగలటం వల్ల, తరువాతి తరాలకి పాస్ అయిన వారి జీన్స్ వల్లా?

Samuel Johnson, Prince of Abissnia లో Rassela అడిగిన ప్రశ్నలో ఈ కారణాలన్నిటినీ తోసిపుచ్చుతాడు. అసలెందువల్ల యూరోపియన్స్ ఆసియానీ, ఆఫ్రికానీ అంత సులభంగా వ్యాపారార్ధం సందర్శించగలిగి, జయించగలుగుతున్నారు? వాళ్ళ తీర ప్రాంతాల్లో దిగి, వారి పోర్టుల్లో కాలనీలు నిర్మించగలుగుతున్నారు? అని అడుగుతాడు. 

దానికి Imlac అనే ఫిలసాఫర్ ఈ కింది విధంగా సమాధానాన్ని వెతుక్కుంటాడు.

"ఒక్క ముక్కలో చెప్పాలంటే యూరోపియన్స్ ఎక్కువ శక్తివంతులు, ఎందుకనగా వారెక్కువ తెలివైనవారు(wiser), జ్ణానమెప్పుడూ శక్తివంతమైనది, అజ్ణానం మీద ఆధిక్యాన్ని కలిగి ఉంటుంది. దానికి ఉదాహరణ మనిషి జంతువుల మీద ఆధిక్యాన్ని ప్రదర్శిస్తాడో చూసి తెలుసుకోవచ్చు. కాని యూరోపియన్స్ నాలెడ్జ్ మనకన్నా ఎక్కువ ఎందుకుందీ అంటే, నేను చెప్పలేను, బహుశా దైవ ఇచ్చ అలాఉందేమో అన్న సమాధానం తప్ప" 

కానీ ఇది నిజమేనా? యూరోపియన్స్ నిజంగా ఎక్కువ నాలెడ్జబులా? బహుశా ఏ 1759 లో ఆ మాటంటే సబబనుకోవచ్చు ఎందుకంటే 1650 తర్వాత వచ్చిన సైంటిఫిక్ ఇన్నోవేషన్ అత్యధికశాతం వెస్టర్న్ ప్రపంచానికి సంబంధించిందే. కాని 1500 లో? 

నిజానికి పదిహేనవ శతాబ్ధపు చివరి కాలానికి, చైనీస్ టెక్నాలజీ, ఇండియన్ మాథమేటిక్స్, అరబ్ ఆస్ట్రానమీ మిగతా దేశాలకన్నా చాలా ముందంజలో ఉన్నాయి. 

మరి ఏది? ఏ కారణం వల్ల ఇంత పెద్ద మార్పు సంభవించింది?

దీనికి చాలా మంది చాలా కారణాలు చెపుతారు/చెప్పారు. ఉదాహరణకి

1. కల్చరల్ డిఫరెన్సెసే కారణమని Max Weber అన్నాడు. 
2. The wealth and poverty of the nations అనే పుస్తకంలో David Landes ఏమంటాడంటే: స్వతంత్ర ధోరణి కలిగిన మేధోపరమైన విచారణా, సైంటిఫిక్ సిద్దాంతాల్నీ ప్రయోగాలతో నిరూపించుకోవడం, హేతువు మూలంగా చేసుకోని జరిగిన శాస్త్రపరిశోధన ఇత్యాదివి వెస్టర్న్ యూరప్ మిగతా ప్రపంచం కన్నా ముందంజ వేసి తద్వారా ఆధిపత్యాన్ని సాధించాయని ప్రతిపాదిస్తాడు. 

కానీ, తను కూడా చివరకి..వీటన్నిటినీ మించి ఏదో కారణం ఉండే ఉండాలి, బహుశా ఇవన్నీ ఒక ఎత్తయితే, పశ్చిమ సమాజాల్లోని పౌర వ్యవస్థలు (institutions) మరొక ఎత్తు, వాటివల్లనే పాశ్చాత్యదేశాలు పైవాటిలోని మంచి ఫలితాలని సమాజంలోని ప్రజలందరికీ అందజేయగలిగాయని అంటాడు. 

దీనికి ఒక మంచి ఉదాహరణ ఇరవై శతాబ్ధం లో, మానవ సమాజం తనమీద తనే అనుకోకుండా జరిపిన ప్రయోగం లాంటి చరిత్రలో కనపడుతుంది. 

1. పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ 
2. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా
3. చైనా లోపలి చైనీస్ ప్రజలూ, చైనా బయట ఉన్న చైనీస్ ప్రజలూ

ఒకే జాతి ప్రజల్ని, దాదాపు ఒకే సంస్కృతి ఉన్న ప్రజల్ని రెండు పరస్పర విరుద్ద వ్యవస్థల్లో పెడితే ఎలాంటి ఫలితాలొస్తాయో, ప్రజల ప్రవర్తన ఎలా మారుతుందో చెప్పటానికి పైవి గొప్ప ఉదాహరణలు.

Guns, Germs and Steel లాంటి గొప్ప పుస్తకం రాసిన Jared Diamond 1999 లో రాసిన How to get Rich అనే వ్యాసంలో కూడా అదే చెప్తాడు. తూర్పు యూరేషియా మైదాన ప్రాంతంలోని ఓరియంటల్ ఎంపైర్స్ మూస ఆలోచనవిధానంలో మునిగిపోయి ఇన్నోవేషన్ ని నిర్లక్ష్యం చేయడం వల్లా, అదే సమయంలో నదులతో విడిపోయి ఉన్న వెస్టర్న్ యురేషియా లో వివిధ రాజరికాలు, నగరాలూ, దేశాల మధ్య ఉన్న పోటీతత్వం, కమ్యూనికేషన్ వల్లా పశ్చిమ దేశాలు, తూర్పు దేశాలకంటే గణనీయమైన ప్రగతి సాధించాయని అంటాడు. 

కానీ, ఇవేవీ కూడా పూర్తి కారణాల్ని సమగ్రంగా వివరించలేదేమో అన్న అనుమానం ఈ పుస్తక రచయిత వ్యక్తపరచి, తన పరిశోధనలో ఈ కింది ఆరు కారణాలు West ని, మిగతా ప్రపంచం కన్నా ముందంజ వేయించి, నాయకత్వ స్థానంలో నిలబెట్టాయని వాదిస్తాడు. 

1. Competition
పొలిటికల్ మరియు ఎకనామికల్ వ్యవస్థలు వికేంద్రీకరించబడుతూ ఉండడం వల్ల, "రాజ్యం" కన్నా "దేశం" అనే భావం పెరిగి, అది వాటి మధ్య కాంపిటీషన్ కి దారి తీసి, కాపిటలిజం అనే వ్యవస్థకి మార్గం సుగమం చేసింది

2. Science
శాస్త్రీయ శోధనా, పరిశోధన ల్లోంచి వచ్చిన ఫలితాలని అర్ధం చేసుకోవడమే కాకుండా వాటిని ఉపయోగానికి పెట్టటం వల్ల, అనేక ఇతర రంగాల్తో పాటూ మిలిటరీ రంగంలో వెస్టర్న్ వరల్డ్ కి ఆదిపత్యం లభించింది.

3. Property Rights
హింసపద్దతుల ద్వారా కాకుండా, హింస లేకుండా ఆస్థి హక్కుల తగాదాలని పరిష్కరించే చట్ట వ్యవస్థని నిర్మించి, దాన్ని సక్రమంగా అమలు పర్చడం వల్ల, ప్రభుత్వాలు ఎక్కువ కాలం సుస్థిరంగా ఉండి, అవి దీర్ఘకాలిక దేశ ప్రయోజనాల మీద పని చేయటానికి వీలు కలిగింది. 

4. Medicine
సైన్స్ లోనే ఒక భాగమయిన ఆధునిక రోగ నిర్ధారణా, చికిత్సా విధానం ప్రజలు ఆరోగ్యంగా బతకడమే కాకుండా, మనిషి సగటు ఆయుపరిమితిని పొడిగించింది. మెడిసిన్ తక్షణ ఫలాల ఉపయోగం పశ్చిమ యూరప్ సమాజం లోనే కాదు, అదే కాలంలో వారి కాలనీల్లోని వ్యాధుల్ని కూడా నిర్మూలించడానికి ఉపయోగపడింది.

5. The consumer society
మెటీరియల్ కన్సంప్షన్ అనే సంస్కృతి పెరిగి, కట్టుకునే బట్టల దగ్గర్నుంచి, వివిధ కన్స్యూమర్ గూడ్స్ వినియోగం పెరగడం వల్ల ఇండస్ట్రియల్ ఉత్పత్తులకి డిమాండ్ నిలకడగా ఉండీ, ఇండస్ట్రియల్ రివల్యూషన్ నిలబడగలిగింది. 

6. The work ethic
పై కారణాలన్నీ, ముఖ్యంగా వికేంద్రీకృత పోటీ సమాజాలు ఎంత చైతన్యవంతంగా ఉండే అవకాశం ఉందో, అదే సమయంలో కేంద్రస్థానంలో ఒక శక్తివంతమైన ప్రభుత్వమో, అలాంటి ఉక్కు వ్యవస్థో లేకపోతే అవి తొందరగా కూలిపోయే అవకాశాలు కూడా ఎక్కువే. శిఖరాగ్రాన కేంద్రీకృత మరియు అపరిమితాధికారాలు సన్నగిల్లుతూ ప్రజాస్వామ్యం వైపు భారీ అడుగులు వేస్తున్న ఈ సమాజాలు విచ్చిన్నమవకుండా ఉండాలంటే, ప్రజల్లోంచి అంతర్గతంగా వచ్చిన చైతన్యమూ, క్రమశిక్షణా వ్యక్తి శ్రేయస్సు వైపే కాకుండా, సమాజ శ్రేయస్సు వైపు కూడా వెళ్ళగలిగేలా పని సంస్కృతి, ప్రజల్లో ప్రబలంగా ఉండాలి . ఆ సంస్కృతి పెంపొందించడానికి, ఇతర కారణాలతో పాటూ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ లోంచి వచ్చిన ఒక మోరల్ ఫ్రేమ్ వర్క్ కూడా తోడ్పాటునందించింది.

చివరగా, కేవలం పైకారణాల వల్లే పశ్చిమ సమాజాల ఆధిక్యం సిద్దించి, చిట్టచివరకి మిగతా దేశాల కాలనైజేషన్ కి దారితీసింది అని చెప్పడం పూర్తిగా సత్యదూరమే అవుతుంది. ఈ కారణాలకి తోడు పాశ్చాత్య సమాజాల ప్రత్యర్ధుల్లో కూడా అంతర్గతంగా వచ్చిన సంక్షోభాలు సైతం ఆ సమాజాల ఎదుగుదలకి ప్రతిబంధకంగా పరిణమించాయి. 

ఉదాహరణలు గమనిద్దాం: 

1. 1640 లో చైనాలో ప్రబలిన ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాలూ, వాతావరణ మార్పూ, వ్యాధులూ మింగ్ డైనాస్టీ మీద విప్లవానికి దారితీసాయి. 
2. అలాగే Ottoman empire పడిపోవడానికి బాహ్యకారణాల కన్నా, అంతర్గత కారణాలే ఎక్కువ. 
3. అమెరికా ఖండాల్లో కూడా ఇదే ఉదాహరణని గమనించవచ్చు. ఉత్తర అమెరికా ల్లోని పొలిటికల్ వ్యవస్థలు పటిష్టంగా ఎదిగాయి, కాని అదే సమయంలో దక్షిణ అమెరికా ల్లోని రాజనీతివ్యవస్థలు తేలిపోయాయి. 

Simon Bolivar ప్రయత్నాలు దక్షిణ అమెరికా దేశాలనిటినీ ఒక్కచోట చేర్చి, United States of Latin America గా రూపొందించలేకపోవడానికీ, పైన పేర్కొన్న ఆరు కారణాలకీ ఏ సంబంధమూ లేదు. 

వెస్ట్ కీ, మిగతా ప్రపంచానికీ ఈ కాలంలో ప్రస్ఫుటమైన తేడా కోసం అన్వేషిస్తే , కీలకమయిన తేడా "సమాజంలో ఏర్పరుచుకున్న వ్యవస్థల" కి సంబంధించిందని అర్ధమవుతుంది. 

చరిత్రని ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు Western Civilization ఒక తిరుగులేని శక్తి గానూ, ఎప్పటికీ నీరుకారని ఒక పటిష్టమయిన వ్యవస్థ గానూ కనిపించవచ్చేమో, కానీ అంతకన్నా పొరపాటు లేదనే విషయం చిట్టచివరగా ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా గమనించవచ్చు. 

Western Civilization ఇంతకు ముందో సారి పైకెగసి, నశించి కిందకి రాలిపోయింది. 

రోమన్ ఎంపైర్ శిథిలాలు యూరప్ అంతా చెల్లాచెదురయి పడడాన్ని చరిత్రలో గమనించవచ్చు. నిజానికి Western Civilization 1.0 version గా చెప్పుకోతగ్గ నాగరికత , Nile, Euphrates , Tigris నదుల పరీవాహక ప్రాంతాల్లో మొదలవడమే కాదు, Athens Democracy , Roman Empire అనే రెండు శిఖరాల్ని అందుకోగలిగింది. ఈ రోజున్న నాగరికతలో మౌళికమైన ప్రజాస్వామ్యం, పౌర న్యాయ వవస్థా, రేఖాగణితం, అంకగణితం, ఆర్కిటెక్చర్, క్రీడలూ, ఆంగ్ల భాషలోని అనేక పదాలూ అన్నీ కూడా ఆ " పురాతన వెస్ట్ " నుంచి వచ్చినవే. అలనాడే రోమన్ సామ్రాజ్యంలో ఉత్పత్తిదారులూ, వ్యవసాయ ఉత్పత్తులూ, నాణాల మార్పిడి చలామణీలో ఉండేవి. చట్టం, మెడిసిన్ రాజ్యంలో ప్రజలకి అందుబాటులో ఉండేది. అంత గొప్ప రోమన్ ఎంపైర్ కూడా అంతర్గతంగా ఉద్భవించిన కారణాల వల్లా, బార్బేరియన్ దండయాత్రల వల్లా, క్షీణించిపోయింది. 

మరిప్పుడు Western Civilization 2.0 కూడా అదే మార్గం వైపు వెళ్తోందా? పూర్వం నుంచీ కూడా ప్రపంచ జనాభాలో వెస్టర్న్ వరల్డ్ జనాభా శాతం తక్కువే. కాని అది ఇప్పుడు మరింత పలచబడింది. ఒకప్పుడు ప్రపంచాన్ని డామినేట్ చేసిన అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇంకో ఇరవై, ముప్పై సంవత్సరాల్లో చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియాలు అమెరికా, యూరప్ లని దాటేసి ముందుకెళ్లబోతున్నాయి. 2007 లో అమెరికాని ముంచెత్తిన ఆర్ధికసంక్షోభం, కన్స్యూమర్ సొసైటీ ల్లో ఉండే మౌళికమైన బలహీనతల్ని బయటపెట్టింది. అసలు వెస్టర్న్ సివిలైజేషన్ కు తనమీద తనకున్న నమ్మకమే సడలిపోయినట్లుగా కనపడుతోంది. 

కాని, అది నిజమేనా? ప్రపంచవిపణి వీధుల్లో, వివిధ కూటముల వేదికలమీదా, ఇతరదేశాల్లొ వెస్టర్న్ సివిలైజేషన్ ప్రభావం క్రమక్రమంగా క్షీణించడం తప్పదా ? లేక ఇది ఒక కేవలం సంధి యుగం మాత్రమేనా? మిగతా ప్రపంచం ఎదుగుదల మొదలయి, వెస్ట్ జీవనప్రమాణాల్ని తమ తమ సమాజాల్లో అత్యధిక ప్రజలకి అందించే దశ అంతానికొచ్చినప్పుడు, ప్లేయింగ్ ఫీల్డ్ సమాంతరమయ్యాక, ఆ ఎదుగుదలలో భాగంగా ఉండే కరప్షనూ, పొల్యూషనూ, అసమానతలూ మిగతా ప్రపంచాన్ని పట్టి పీడించి వాటి ఎదుగుదల శాతాన్ని పడదోస్తాయా? అలా అయితే వెస్టర్న్ వరల్డ్ ముందులా వెలిగిపోకున్నా , మిగతా ప్రపంచం కన్నాముందే నిలబడుతుందా ? లేక క్రమక్రమంగా వెనకపడిపోతుందా?

ఇలాంటి పరిస్థితుల్లొ దాదాపు మూడొందల సంవత్సరాల పైబడిన పశ్చిమ ప్రపంచపు నిరంతర ఎదుగుదలకి కారణాల్ని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది.

Saturday, 13 April 2013

ఈ బ్లాగు నా పేరు మీద ఉన్నప్పటికీ, సృష్టించినవాడికే అన్ని హక్కులూ అన్నట్లుగా నడిపించే దేవుడి ప్రిన్సిపుల్ ప్రకారమైనా, అదే సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టే కాపిటలిజం ప్రిన్సిపుల్ ప్రకారమయినా ఈ బ్లాగు మీద సర్వహక్కులన్నీ ఓ స్నేహశీలికి దక్కుతాయి.

కరుణతో బహుమతి నా చేతుల్లో పెట్టగానే చేతులు పట్టుకోని కృతజ్ణతలు చెప్పేస్తూ, ఆ బరువుని మెల్లిగా అవతలి చేతుల్లోకి జారుస్తూ, ఇది నువ్విచ్చిందే కాబట్టి, ఇది నీదే అని తప్పుకోబోతున్న నా అతితెలివిని కనిపెట్టి, 'ఇచ్చింది నేనే కాని పెంచాల్సింది తమరే... మానవా' అని హెచ్చరిస్తూ డిటాచ్డ్ గా దూరంగా నిలబడిపోయిన తనకోసం  ఏదైనా ఒక పోస్టు రాసి జారుకుందాం అని తలచి చేతులు మడచి కూర్చుంటే, అసలు చేయి కదలదే?!

ఏం రాస్తాం? అసలు రాయడానికేముందని నా దగ్గిర? ఎంగిలి ఆలోచనలూ, ఎకో ఛాంబర్స్ లోని రెటరిక్కూ తప్ప.

"వ్యాక్యమేదైనా రాసినప్పుడు సంగీతస్వరంలా అనిపించాలి.. దాన్లో రాగాల తూగుండాలి..వానవిల్లుమీద నడిచి మేఘాల్లో తేలినట్టుండాలి..అప్పుడే స్కూలుకొచ్చిన పిల్లలు ప్రభాత వేళ ప్రార్థన సమయంలో లైనుకట్టి నిల్చున్నట్టుండాలి. అప్పుడప్పుడూ భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతుచెయ్యాలి " అంటారు అరుణపప్పు.

అదంతగా గుర్తుండిపోయాకా, ఏవయినా బుర్రలోకి వచ్చినా ఇంకేం రాస్తాను, రాయగలను?

             ***                               ***                                    ***

ఏం రాయగలనా అని ఆలోచిస్తే  Empty Rhetoric కీ, Rantings కీ,  Identity based divisions కీ వాటిని బేస్ చేసుకోని రాసే నిజాయితీలేని కథలు కాని కథలకీ అంతే లేదు. సరే దొడ్డిదారులు వెదుక్కుందామని చూస్తే.. సినిమాలూ, పుస్తకాలూ, రంగుల దళసరి పలకల్లోంచి అందంగా కనిపించి..అందర్నీ మోసం చేసే నాస్టాల్జియాలూ ఎట్సెట్రా  కనిపించాయి.అప్పుడయితే స్వంతంగా ఏం ఆలోచించక్కర్లేదు, చూసిందాన్నో, చదివినదాన్నో, మసక మసగ్గా మంచి విషయాలు మాత్రమే గుర్తుంచుకునే మెమోరీ లోంచే రాసేస్తే పోలా అనిపించినా, వాటిక్కూడా చాలా నైపుణ్యం కావాలి. ముందు చదివినదాన్నో, చూసినదాన్నో ఆకళింపు చేసుకోవాలి, సెంట్రల్ పాయింట్ ఏంటో గ్రహించుకోవాలి, దాని చుట్టూ అల్లినవేవో, చూపినవేవో గుర్తుపెట్టుకోని సమగ్రంగా మనమాటల్లో ఇరికించి, పూర్తిగా చెప్పీ చెప్పకుండా, మనం రాసింది చదివి ఊరుకోకుండా, అసలు రచనేదో చదివించేలా రాయగలగాలి.

ఉఫ్..

హబ్బా... ఒక్క పోస్టు రాయడం ఇంత కష్టమా? అంత టాలెంట్ లేదే నా దగ్గిర?!!  'మరందుకే గబుక్కున చేతులు చాపి తీసుకోని థాంక్స్ చెప్పొద్దురా కుమార్ బాబూ' అని అనుకున్నవాడిని, అలానే ఊరుకోకుండా ఇలా బయటకోస్తే ఇంతే గతి.

సో, ఇహ చిట్టచివరిగా నీతి మాలిన పని చేద్దామని నిర్ణయించేసుకున్నా. ఏ పుస్తకాన్ని పరిచయం చేసినా గమనించిందేంటంటే అత్యధికశాతం అది కొనుక్కొనో, తీసుకొనో చదవరు(నాతో సహా). కారణాలనేకం. ఆసక్తి పుస్తకపరిచయం చదవటంకన్నా ఎక్కువ లేకపోవటం, పుస్తకం దొరక్కపోవటం, ఖరీదు ఎక్కువగా ఉండటం, ఇతర ప్రాధాన్యాల ముందు ఈ పుస్తకం చదవాలి అనుకున్న నిర్ణయం కిందకి జారిపోవటం ఎట్సెట్రా...ఎట్సెట్రా...

అందుకని పుస్తకపరిచయం కన్నా, అసలు పుస్తకం లోని విషయాలే డైరక్టుగా రాస్తే పోలా? పరిచయాలేవో చదివిన వాళ్లే చేసుకుంటారు, అంచనాల నిచ్చెనలేవో వాళ్లే వేసుకుంటారు, మోయాల్సిన బరువులేవో, కొలవాల్సిన కొలతలేవో వాళ్లే నిర్ణయించుకుంటారు.

కాని తప్పు కదా? ఎన్ని రెపరెన్స్ లిచ్చి, ఎన్ని డిస్క్లెమయిర్లు పెట్టి అక్కడక్కడి పేరాగ్రాఫులు రాసినా, కాపీయింగ్ ని కాపీయింగ్ అనే అంటారు.

సరే ఇలాక్కాదని, పుస్తక రచయిత కి ఈమెయిల్ రాసాను.

"ఆర్యా..మీ పుస్తకం నాకు నచ్చింది. నా మాతృభాషలో మీ పుస్తకం గురించి నాలుగు పేరాగ్రాఫుల పరిచయం కాకుండా, ఇంకొంచెం విపులంగా రాస్తే మీర్రాసిన నాలుగు విషయాలు వేరేభాష మాట్లాడే/చదివే వాళ్ళకందడమే కాకుండా, స్వామి కార్యమూ స్వకార్యమూ కలసి వచ్చేలా మీ రీచ్ కూడా ఎక్కువవుతుంది కదా అన్న తలపుతో...మీర్రాసిన ముఖ్యమయిన పాయింట్స్ నేను కాపీకొట్టబోతున్నాను...అదే.. నా భాషలో రాయబోతున్నాను. ఇది మీకు సమ్మతమే అని ఆశిస్తున్నాను కానిచో నాకు తెలిపినయెడల నేనీ దుర్మార్గానికి తలపెట్టను, ఏదయినా తెలియపరచండీ" అని విన్నపాన్ని పంపాను.

అనుకున్నట్లుగానే సైలెన్స్.

మళ్ళీ ఓ రిమైండర్ కూడా పంపి, రెండు వారాలు వేచి ఉన్నాను. ఈ లోపల నా చౌర్యపు పనిని కొనసాగిస్తూ..

ఇప్పటివరకీ ఏ రిప్లై రానందున, ప్రస్తుతానికి ఇది పబ్లిష్ చేయడానికే డిసైడ్ చేసుకున్నాను.

This is about a book called 'Civilization - The West and the Rest' by Neill Ferguson.  ఇంతకీ ఈ పుస్తకమే ఎందుకూ అంటే పెద్దగా సమాధానం ఏమీ లేదు. తెలుగు బ్లాగుల్లో కనపడే రెటరిక్ పరిధి దాటి కాస్త ముందుకేమన్నా వెళ్ళడానికి పనికొస్తుందేమో అన్న ఆశ అంతే. ఇదే సబ్జక్ట్ మీద Ian Morrison రాసిన పుస్తకాలూ కూడా పరిచయం చేయాలన్న ఆశ కూడా ప్రస్తుతానికి ఉంది. ఏ దృష్టికోణమూ పరిపూర్ణము కాదు కాబట్టి, దీనికి వ్యతిరేకంగానో, టాంజెన్షియల్ గానో ఉండే ధీసిస్ లు కనపడితే అవి చదివి పరిచయం చేయాలన్న ఆశ కూడా ఉంది, కాని అసలు ఈ పుస్తకమే పూర్తి చేస్తానో లేదో అనుమానం కాబట్టి, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిన చందాన నా ప్రగల్బాలన్నీ ఇంతటితో ఆపేస్తే మంచిది.

ఎనీవే, ఇహ సోది ఆపేసి...నెక్స్ట్ పోస్ట్ రాస్తూ కూర్చుంటా...అంటే...పైన చెప్పిన పుస్తకం గురించి :)

Disclaimer:
The upcoming blog post(s) will have some introduction articles about the book "Civilization - The West and the Rest' by Neill Ferguson. As part of introducing I have written some paragraphs/pages from the book in Telugu language. The author of the book has already been informed about this attempt. However, If any copyright acts are violated, please let me know, and I will delete these blog post(s). 

Friday, 22 March 2013

CYCLORAMA

Posted by Kumar N on 3/22/2013 08:42:00 am with 11 comments

CYCLORAMAఅనే పదం ఎప్పుడన్నా విన్నారా? Interesting గా ఉంది కదా? నిజానికి ఇదెలా explain చేయాలో నాకు తెలీట్లేదు, కానీ ఓ నాలుగు రోజుల క్రితం చూసినప్పుడు మాత్రం "భలే" అనిపించింది.
ప్రకృతి లో మనముందు ఉండే ఓ పెయింటింగ్ లోకి మధ్యలో వెళ్ళి నిలబడితే ఎలా ఉంటుంది? మన ముందే కాకుండా మన చుట్టూ 360 degrees లోనూ ఆ పెయింటింగ్ ఉంటుంది కదా! సరే నా సోది ఎందుక్కాని వికీ వాడి డిఫినిషన్ చూడండి. 

"A cyclorama is a panoramic painting on the inside of a cylindrical platform, designed to provide a viewer standing in the middle of the cylinder with a 360° view of the painting. The intended effect is to make a viewer, surrounded by the panoramic image, feel as if they were standing in the midst of an historic event or famous place". Sometimes dioramas were constructed in the foreground to provide additional realism to the cyclorama.

క్లుప్తంగా చెప్పాలంటే, చరిత్ర లో ఒక దేశ దశని మార్చిన ఓ అద్భుతమయిన పెయింటింగ్ మన చుట్టూ వేసి, మనల్ని మధ్యలో నిలబెట్టి, స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఒక నారేటర్, మనల్ని ఆ రోజు, ఆ సీన్ మధ్యలోకి తీసికెళ్ళగలిగాడనుకోండి.. బావుంటుంది కదా?

సినిమాల్లేని రోజుల్లో ఈ cycloramas, cyclorama buildings బాగా పాపులర్ అట. ఏదైనా famous, most influential historical event కి సంబంధించిన పెయింటింగ్ వేసి, అవి ప్రదర్శించడం కోసమే నిర్మించబడ్డ cyclorama buildings లో పెట్టేవాళ్ళట. ప్రతీ పెద్ద టౌన్ లో ఈ థియేటర్స్ ఉండేవట. మొట్టమొదటిసారిగా, చాలా ఫేమస్ ఐరిష్ పెయింటర్ Robert Balker కి ఐడియా వచ్చిందిట, ఒక టూ డి పెయింటింగ్ వాళ్ల మొహం ఎదురుగా వేళ్ళాడదీయకుండా ప్రేక్షకులని సీన్ మధ్యలోకి ఎలా తీసుకెళ్ళటం అని ఆలోచిస్తున్నప్పుడు. 1787 లో మొట్టమొదటి cyclorama building ఓపెన్ అయ్యిందిట.

అచ్చం ఇప్పటి సినిమాల్లాగే, ఈ cyclorama paintings ని ఊరూరా తిప్పేవాళ్లట, ఈ cyclorama buildiings లో ప్రదర్శనకి. సరే, ఇక ఈ 'అట " లు మానేస్తాలెండి :)) 
చాలా ఆశ్చర్యమేసింది నాకు. ఒక్కసారి ఊహించుకోండి. 42 feet అంటే 13 మీటర్ల ఎత్తూ, 365 feet(111 మీటర్లు) చుట్టుకొలతా ఉండే ఒక పెయింటింగ్ ని, విడదీసి, పాడవకుండా ఒక ఊరి నుంచి, ఇంకో ఊరికి తీసుకెళ్ళి అక్కడ నెలల/సంవత్సరాల కొద్దీ ప్రదర్శించీ మళ్ళీ ఇంకో ఊరికి తీసుకెళ్ళటం!! 'బాప్ రే' అనిపించింది. 

అయితే, సైలెంట్ మోషన్ పిక్చర్స్ ఎప్పుడయితే వచ్చాయో, వీటి పైన ఇంట్రస్ట్ తగ్గిపోయి మెల్లిగా ఫేడ్ అయిపోయాయని, నారేటర్ చెప్పింది. 



సరే విషయానికొస్తే, స్ప్రింగ్ బ్రేక్ కదా... పిల్లల్ని తీసుకోని ఈస్ట్ కోస్ట్ కి వెళ్ళి, ఫ్రెండ్స్ తో గడిపి, అలాగే పిల్లలకి ఊరికే Lincoln సినిమా రిలీజ్ అయిన రెండో రోజే చూపించడమే కాదు, చరిత్ర పాఠాలు నేర్పుదామని Gettysburg కీ, మిగతా historical places కి తీసుకెళ్ళా. Guide భలే ఉన్నాడు. అమెరికా చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ వార్ ఘట్టం, దాని తర్వాత Lincoln ఇచ్చిన స్పీచ్ Gettysburg address అమెరికన్ చరిత్రలో చిరకాలం ఎలా నిల్చిపోయిందీ అవన్నీ తల్చుకుంటూ ఓ రౌండ్ వేస్తున్నప్పుడు, ఈ cyclorama కి వెళ్ళాను. అసలదంటే ఏంటో తెలీకుండానే. చాలా బాగా ఇంప్రెస్సివ్ అనిపించింది. Gettysburg Cyclorama అని కొడితే ఇంఫర్మేషన్ దొరుకుతుంది. 

క్లుప్తంగా ఇదీ విషయం: 

Pickett's Charge అనే ఒక పర్టిక్య్లులర్ ఘట్టం గురించి ఫ్రెంచ్ ఆర్టిస్ట్ Paul Philippoteaux వేసిన ఈ పెయింటింగ్, ఒరిజినల్ గా 1882 లో ఫ్రాన్స్ లో వేసి, అక్కణ్ణుంచి బోస్టన్, అమెరికా కి తీసుకొచ్చి మొట్టమొదటి సారిగా 1884 లో Boston లో ఉన్న cyclyorama building లో ప్రదర్శనకి పెట్టారట. అక్కణ్ణుంచి 1913 లోనో ఎప్పుడో Gettysburg, PA కి తరలించి అప్పట్నుంచీ అక్కడే ప్రజల సందర్శనకోసం పెట్టారు. నూటపాతికేళ్ళల్లో డర్ట్ కలెక్ట్ అవ్వడం వల్లా, క్లైమెట్ కంట్రోల్ సరిగ్గా లేని బిల్డింగ్స్ లో ఉండటం వల్లా పెయింటింగ్ పాడవుతోందని, 2005 లో $12million తో restoration project చేపట్టి, తిరిగి 2008 నుంచీ పబ్లిక్ డిస్ప్లే కి ఓపెన్ చేసారు. 
ఎలివేటెడ్ హైట్ లో ఉంటుంది, సర్క్యులర్ షేప్ లో ఎస్కలేటర్స్ ఎక్కి, ఒక క్లోజ్డ్ డోమ్ లోకి వెళ్తాము. అసలు పైన దిగేముందే చుట్టూ పెయింటింగ్ కనపడగానే వావ్ అనుకున్నాను. ఆ తర్వాత కొంచెం నారేటింగ్, డార్క్ చేసి సమ్ లైటింగ్ ఎఫెక్ట్సూ అంతా కలిపి బావుండింది. అంతా కలిపి ఒక పావుగంట, ఇరవై నిమిషాల ఎక్స్ పెరీయన్సే కాని, నచ్చింది. 


సరే నాలాగే Cycloramas అంటే తెలీని వాళ్లకోసం ఇక్కడ పెడదామని. ముఖ్యంగా కొన్ని ఫోటోస్ లో చూడండి, ఆ వుడెన్ ఫెన్సింగ్ రియల్ వి వెళ్ళి , ఆ పెయింటింగ్ లో ఉన్న వుడెన్ ఫెన్సింగ్స్ తో ఎక్కడ మెర్జ్ అవుతున్నాయో, అలాగే నేలా, గడ్డీ కూడా రియల్ వి వెళ్ళి పెయింటింగ్ లో ఎక్కడ కలుస్తున్నాయో. 

నిన్న రాత్రి ఇంటికొచ్చాక చూస్తే మంచి ఫోటోస్ అన్నీ పోయాయి, ఇప్పుడా స్టోరీ ఎందుక్కాని నా సెల్ ఫోటోతో తీసిన ఫోటోస్ ఉన్నాయి. అవి అంత బాగా ఉండవు కానీ, you get an idea. 


ప్రస్తుతం ఇలాంటి cycloramas ప్రపంచం మొత్తంలో ఓ ఇరవై ముప్పై దాకానూ. అమెరికాలో రెండూ, కెనడాలో ఒకటీ ఉన్నాయి అని ఆ నారేటర్ చెప్పింది నాతో. 



- Kumar N

Monday, 4 February 2013

దేవకన్యల పిల్లో ఫైట్

Posted by Kumar N on 2/04/2013 02:17:00 pm with 1 comment
మయిందంటే ఇందాక డిన్నర్ చేస్తున్నానా, వెళ్ళేప్పుడు నల్లటి, చిక్కటి రాత్రి అమాయకంగానే ఉండింది.

వచ్చేప్పుడు బయట డోర్ ఓపేన్ చేసానా,

ఉఫ్..

Breathtaking.. ఇన్నేళ్లలో ఎన్నోసార్లు చూసిందే, కాని It's all projection of the mind అంటారు కదా. అందం ఎదురుగా ఉందో, మన మనసులో ఉందో, లేక ఆ రెండింట్ళోను ఏకకాలంలో ఉన్నప్పుడే అందం ప్రత్యక్షమవుతుందో ఎవరికి తెలుసు కాని,

గతవారం పర్చుకున్న తెల్లటి మంచు చీర ఇంకా మార్చనేలేదు. భూదేవి ముస్తాబు పూర్తవ్వలేదకున్నారో ఏమో పైవాళ్ళు, వడివడిగా మల్లెపూలలా జారుతున్నాయి తెల్లటి మంచు బిందువులు కొన్ని , తేటతెల్లటి దూదిపింజలు మరికొన్ని.

కళ్ళెత్తి చూస్తే కనకాభిషేకాలు అన్నట్లుగా, కాళ్ళాపి చూస్తే నిండా మంచుతలంబ్రాలు.

కదలాలనిపించలేదస్సలు.

అక్కడే ఆగిపోయా, కార్ వైపు కాకుండా వెనక్కి నడవడం మొదలుపెట్టాను. దూరంగా ఉన్న చీకట్లోకి చూపులు విసిరేస్తూ..

ఉండీ, ఉండీ ఓ తెల్లటి ఫ్లేక్ పెదవి పై పడి , తగిలీ తగలంగానే కరిగిపోయి పెదాలమీద తడి ముద్ర మిగల్చి వళ్ళంతా గిలిగింతలు పెట్టిన అనుభూతి, అమ్మాయి లేత పెదాలు నోట్లో కరిగిపోయి గుండెలు నిండిపోయిన అనుభవం.

నడచుకుంటూ రోడ్డు చివర దాకా వెళ్ళి, ఎదురుగా ఉన్న బ్రైట్ యెల్లో నియాన్ లైట్ కేసి తదేకంగా చూస్తే, చుట్టూ ఉన్న చీకటిలో, స్థంబం కింద అటూఇటూ త్రిభుజాకారంలో పర్చుకున్న పల్చటి, పసుప్పచ్చటి వెలుతురులో, వేగం పెంచుకొని ఆ వెలుతురు తెరనానుకొని జారుతున్న మంచువస్త్రం.

పెళ్ళినాటి రాత్రి హాఫ్ - వైట్ శారీలా!

అక్కడే ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోయా.

నాగరిక ప్రపంచంలో బతుకుతున్నాను కదా. మనుషులు వెళ్లలేని చోట్లకి కార్లు వెళ్ళటం ఇక్కడి సంప్రదాయం. దాన్ని పాటిస్తూ ఎక్కణ్నుంచో వచ్చి నాకేసి ఓ చూపేసిపోతూ నన్ను దాటిపోయిన రెండు కార్లు.

తప్పదని వెనక్కెళ్ళి కార్లో కూర్చోని కావాలని దారితప్పి, కురుస్తున్న మంచులో మెత్తటి నల్లటి తారురోడ్డు మీద, అంతకన్న మెత్తగా జారిపోయే చెవర్లెట్ కార్లో యద్దనపూడి రాజశేఖరంలా కొద్దిసేపు తిరిగి హోటల్కొచ్చా.

ఎంట్రన్స్ దగ్గిరగా ఉంటుందని వెనక వైపు పార్క్ చేసి, దిగితే మళ్ళీ అస్సలు కదలాలనిపించలేదు. అటేపు కదా, ఎవరూ రారిప్పట్లో అని తెలుసు.

అలాగే మళ్ళీ చూస్తూ, నడీచీ నడవనట్లుగా నడుస్తూ, ఎందుకో తల పైకెత్తా..

బాప్ రే....

వర్ణనాతీతం.

కన్నుచించుకున్నా కనపడని లోకాల్లోంచి, నా కోసమే, నా మీదకే దూకుతున్న ఓ మంచుపాతం.

దేవకన్యల పిల్లో ఫైట్ ఏమో, దూదంతా చెల్లా చెదురయి, చిన్న చిన్న బిందువులయి, పల్చటి ఫ్లేక్స్ అయ్యి, నా మొహమ్మీదకి వాళ్ళు విసురుతున్న భావన.

వడివడిగా మొహమ్మీదకి జారుతున్న మెత్తటి మంచుని అలాగే దీక్షగా, తదేకంగా తల పైకెత్తి చూస్తూంటే, అది నా వైపొస్తోందా, లేక నేనే పైకి ఎగిరిపోతున్నానా.. అన్న మాయ భావన.

తన్మయత్వం అంటే అనుభవంలోకొచ్చిన అనుభూతి నన్నలాగే ముందుకు నడిపించింది.

ఇంకా జుర్రుకోవాలనుకుందేమో నా మనసు..ఈ సారి నాలిక బాగా బయటకి చాపి, చిన్న చిన్న బిందువులు కాకుండా, కొంచెం పెద్ద ఫ్లేక్స్ కోసం, వాటినెతుక్కుంటూ సాగింది నా ప్రయాణం.

చీకట్లో, నల్లటి ప్రపంచంలో, చుట్టూ ఎవరూ లేరూ, రారూ అని తెలిసి, తలా, చూపూ ఆకాశం లోంచి తిప్పకుండా, స్వచ్చమైన స్పటికం లాంటి మంచురుచి వేటలో సాగుతుంటే వచ్చిన అనుమానమేంటంటే..

అన్ని వేల ఫ్లేక్స్ పైనుంచి జారుతున్నా, నా మొహం మీద దాకా వచ్చి, నాలిక తగిలేలోపున పక్కకెళ్లిపోవటం.. వాటి చపలచిత్తమా లేక 'దేవలోకంలోంచి వస్తూన్న స్వచ్చమైన మంచుబిందువును నేను, మనిషిని తాకి మలినమవలేను' అనుకోని దారిమార్చుకోవటమా అన్న విషయం తేలలేదు.

ఏమయితేనేం., కొన్నిటిని ఆర్తిగా నాలుకమీద అలాగే ఉండనిచ్చి, మరికొన్నిటిని గొంతుదాకా జుర్రుకొని..

ఆకాశానికేసి సగం దాకా ఎగిరి, చుట్టూ మంచు ప్రఫంచంలో నేను నడుస్తూంటే, ధడేల్ మని మోకాళ్ళ దగ్గర శబ్ధం.

ఎవరిదో వైట్ కార్, వెనకనుంచి వెళ్ళి ధభాల్ మని గుద్దుకున్నాను.

తల కిందకి వంగింది, కళ్ళు కిందకి దిగాయి.

కట్ చేస్తే..

కాళ్ళు తిరిగి రూమ్ కేసి నడచాయి.

అనుభవం లోంచి అనుభూతి వెళ్ళిపోయి జ్ణాపకంగా మిగిలిపోకముందే ఇక్కడ కుమ్మరిద్దామని... .


( Feb 2013 )





Friday, 4 January 2013

Bonding Beyond Love

Posted by Kumar N on 1/04/2013 02:00:00 pm with No comments


పిన్న వయసులోనే, ఏ అవస్థా పడకుండా చనిపోయినవాళ్ళెవరైనా ఉంటే వాళ్ళను చూసి ఏడవకండి. బి హాప్పీ ఫర్ దెమ్

లేదా

ఈ సినిమా చూడకండి.

అని చెప్పాను స్నేహితులతో, కేవలం ఈ సినిమా కోసమే ఆర్ట్ సినిమాలు వేసే లింకన్ సెంటర్ కి ఓ గంట ప్రయాణం, పదిహేడు డాలర్ల టోల్స్, ముప్పైఆరు డాలర్ల పార్కింగ్, పదమూడు డాలర్ల టికెట్ etc., పెట్టుకోని చూసి వచ్చాను అని తెలిసి, ఎలా ఉందీ అని అడిగితే?

If my childhood taught me one thing, its that the differences between the rich and the poor are nothing. It’s the chasm between the healthy and the sick that you just can’t breach అని అంటుందో పాత్ర Steve Toltz పుస్తకంలో.

How True!

బాండింగ్ అంటూ ఇంకా ఏర్పడకుండా ఉండే ప్రేమలు తెలుసు, ప్రేమ లేకుండా ఉండే బాండింగ్స్ ఉంటాయా? హాపీ టైమ్స్ లోపలినుండి ఫీల్ అవ్వటానికే కాదు, బయటనుండి చూడటానికి కూడా బావుంటాయి. rough times లో ఒక రిలేషన్షిప్ ని ప్రేమ నిలపెట్టగలదేమో, కాని devastating times లో కేవలం ప్రేమ సరిపోదు, అంతకు మించి ఏదో కావాలి. దాన్ని బాండింగ్ అంటారని నా స్నేహితుడి వైఫ్ ఎప్పుడూ నాకు స్కూలింగ్ ఇస్తుంది. ఏ పేరయితేనేం, యాభై, అరవై ఏళ్ళు ఒక రూఫ్ కింద కలిసి బతికితే వచ్చే బంధానికి షార్ట్ కట్స్ లేవు. ఆ సుదీర్ఘ ప్రయాణం కలసి చేయాల్సిందే.

సినిమా అంతా భార్యా భర్తా ఇద్దరే పాత్రలు (మధ్యలో కొద్ది నిమిషాలు వచ్చిపోయే ఓ అరడజను మనుషులు తప్ప). సినిమా మొత్తం ఒకే ఇంట్లో.. ఒక్క రెండు షాట్లు తప్ప. ఇద్దరికీ ఎనభై దాటిన వయసూ, ఏభై ఏళ్ళ పైగా దాంపత్యం, పిల్లలుండేది విదేశాల్లో..

ఓ తెలుగు కధా, దాని మీద తీసిన ఓ తెలుగు సినిమా గుర్తొస్తోందా? అదృష్టవశాత్తూ పోలికలింతటితో ఆగిపోతాయి.

అదృష్టమో, దురదృష్టమో తెలీదు కాని, ఇదే సినిమా నిజజీవితంలో ప్లే అవుతున్నప్పుడు రెండు సార్లు నేను అందులోనే దానికి చాలా దగ్గరగానే ఉన్నాను. అప్పుడు ఆ ఫ్రేమ్స్ లో మాత్రమే ఉన్నాననీ ఆ మూమెంట్స్ లో లేననీ, అదే జీవితం సినిమా తెర పై ప్లే అవుతున్నప్పుడు ఈ సారి ఫ్రేమ్స్ దాటి ఆ మూమెంట్స్ లొకి వెళ్ళానని, ఈ సినిమా చూసేప్పుడు తెలిసొచ్చింది.

వయసులోకెచ్చేప్పుడు, వయసు మీదకొచ్చే మనుషులంతగా కనపడరనుకుంటాను. అదే గది రోజూ దాటుతూ వెళ్తున్నప్పుడో, తిరిగి వస్తున్నప్పుడో ఒక్క రెండు నిమిషాలు రోజుకోసారి తాతయ్య పక్కన కూర్చొని ఉండాల్సిందనీ, ఈ సినిమాలో కూతురికీ నాకూ పెద్ద తేడా లేదేమో అనిపించింది, ఏదో కొన్నిసార్లు మెడిసిన్స్ పట్టుకురావడానికో, హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికో ఉపయోగపడటం తప్ప.

ఏమో, ఇకముందు కూడా పెద్ద తేడా ఉండదేమో కూడాను, తెర అవతలి పక్కకింకోసారి వెళ్ళినప్పుడు!

స్వీయసోది వదిలి సినిమా విషయానికొస్తే...Michael Haneke దర్శకత్వం వహించి, ఇద్దరు ఫ్రెంచ్ నటులు Emmanuelle Riva, Jean-Louis Xavier Trintignant లు నటించిన సినిమా Amour(Love). ఈ సినిమాకి Cannes Film Festival లో Palme d'Or అవార్డ్ వచ్చింది. European Film Awards లో best picture, best director, best actor and best actress వచ్చాయి. The National Society of FIlm Critics వాళ్ళు best film of 2012 గానూ US Critics' film of the year గా ఎంపిక చేసారు.

సినిమాకి Love అని పేరు పెట్టారు కానీ, Life beyond love అని పేరు పెడితే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది.

అద్భుతనటన అనే పదం అండర్ స్టేట్మెంట్ అన్నట్లుగా నటించిన Emmanuelle Riva(Anne), అంతే ధీటుగా ఆమె భర్తగా నటించిన Trintignant(Georges).

Body deterioration నీ తద్వారా వచ్చే Human Suffering నీ, అది Human Psyche మీద వేసే impact నీ, ఇంత ఫిజికల్ గా చూపెట్టటం డైరక్టర్ సాహసమనే చెప్పాలి. సాధారణంగా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి రోల్ పాసివ్..దాన్ని అధిగమించి ప్రేక్షకుణ్ణి తెరలోపలికి తీసుకెళ్ళి పాత్రల మధ్యలో నిలపడానికే థ్రీ డి లూ, ఫోర్ డిలూ. కాని అవేవీ అవసరం లేకుండానే వాటికన్నా ఇంకో ఎక్కువ డైమన్షన్ ని ప్రేక్షకులకి ఇచ్చి అందులోంచి వచ్చే అసహనాన్ని కూడా తీసుకురావటానికి డైరక్టర్ కొన్ని క్లెవర్ టెక్నిక్స్ ఉపయోగించాడు.

Michael Haneke గురించి Trintignant ఓచోట ఇలా చెప్పాడు. "Often, directors ask us to show what we feel, and with Haneke, no, above all you mustn't show what you feel. You have to just feel, and he does the rest." అని. అది ఏ మాత్రమూ అతిశయోక్తి కాదనీ Riva ని చూస్తుంటే తెలిసింది.

ఇంతకీ కథెంటో చెప్పలేదు కదూ. Anne అండ్ Georges ఇద్దరూ ఎనభైల్లో ఉన్న రిటైర్డ్ కపుల్. Ann మ్యూజిక్ స్టూడెంట్ Alexandre ఒక సక్సెస్ ఫుల్ ఫ్రెంచ్ పియానిస్ట్. .అతని concert కి వెళ్ళడంతో కథ ప్రారంభమవుతుంది. (ఇంకా అంతకుముందు షాట్ తోటే మొదలవుతుంది కాని spoil చేయటిష్టం లేక చెప్పట్లేదు ). ఆ మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గిర కూర్చొని Georges, Anne మాట్లాడుకునే సమయంలో, Georges వేసిన ఓ ప్రశ్నకి Anne దగ్గర్నుంచి response ఏమీ రాదు..రెండు సుదీర్ఘమయిన నిమిషాల సేపు తనలా stare చేస్తూ ఉండిపోతుంది. తర్వాత కొద్ది సేపటికి మనకర్దమవుతుంది, Anne కి brain stroke వచ్చిందనీ. తన బాడీలో రైట్ సైడ్ అంతా paralyse అయిందనీ, జరిగిన సర్జరీ తనకి హెల్ప్ చేయకపోగా హాని చేసిందనీ, తనింకెప్పటికీ వీల్ చెయిర్ లోనే ఉండబోతుందని.

హాస్పటల్ నుంచి వచ్చాక Anne అడుగుతుంది. "Georges ఒక్క సహాయం చేయగలవా ప్లీజ్" అని. "ఇంకెప్పుడూ నన్ను మళ్ళీ హాస్పిటల్ కి పంపించకు దయచేసి" అంటుంది. మొదట్లో resist చేసినా చివరకి జార్జ్ ప్రామిస్ చేస్తాడు "సరే " అని.

Anne ని చూసుకోవడానికి Georges అన్ని సేవలూ చేస్తాడు, చేస్తూనే ఉంటాడు.. వీల్ చెయిర్లో ఇంట్లోనే తిప్పటం, బెడ్ మీద నుంచి దింపడం, బట్టలు తొడగటం, టాయిలెట్ కి వెళ్ళినప్పుడు నిలపెట్టటం, కూర్చోపెట్టటం, అండర్ వేర్స్ వేయటం, ఫ్లష్ చేయటం...well you get the idea!. తను take care చేసే విధానానికి, ఓసారి గ్రాసరీస్ తీసుకొచ్చి ఇచ్చినతను చెపుతాడు కొన్ని మాటలు, ఇంత ఘాడంగా ప్రేమని సేవ ద్వారా వ్యక్తపర్చేవాళ్ళని చూడలేదన్న అర్ధంలో.

Anne పరిస్థితి రోజు రోజుకీ ఇంకా దిగజారుతూనే ఉంటుంది. రెండవ సారి కూడా stroke వస్తుంది. ఎక్కువ కాలం bedridden అయిపోతుంది. పక్కలు తడుపుకోవటం మొదలవుతుంది. ఒకవైపు అనారోగ్యం, అశక్తతా, ఇంకోవైపు ఇలాంటివన్నీ అవుతున్నందుకు హ్యుమన్ డిగ్నిటీ కోల్పోయినట్లుగా, హ్యుమిలియేటింగ్ గా ఫీల్ అవుతుంది తను. No big deal అని Georges చెప్తూనే ఉన్నప్పటికీ.

ఇంకొద్ది రోజులకి మాట కూడా పడిపోతుంది. భర్తే తన ప్రపంచంగా మిగిలిపోయిన Anne కి , ఉన్న ఒక్క ప్రపంచంతో కమ్యూనికేషన్ తెగిపోతుంది. ఎన్నో చెప్పాలనుకోని చెప్పలేకపోయిన సన్నివేశాల్లో Anne నటనకి తలలొంచి నమస్కరించాల్సిందే. Georges కి Anne ని తనొక్కడే చూసుకోవటం కష్టమవుతుంటూంది. నర్స్ లని పెడతాడు చూసుకోటానికి. వాళ్ళిద్దరూ ఎలా cope up అవుతారన్నది సినిమాలో చూడాల్సిందే.

కథ లోంచి బయటకొస్తే...

జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోని నెమరేసుకునే సమయాల్లో Anne అంటుందో చోట Georges ని సరదాగా ఏడిపిస్తూ.. you're a monster sometimes, but very kind అని. నిజంగానే Georges చాలా కైండ్ అని చివర్లో తెలుస్తుంది.

మామూలుగా ఇలాంటి సినిమాల్లో సెంటిమెంట్ పిండడానికీ, Kleenex బాక్స్ లని ఖాళీ అయ్యేలా చేయటానికి చాలా అవకాశముంటుంది. అసలా జోలికే పోలేదు డైరక్టర్. సైలెంట్ గా మన లోపలకొచ్చి సఫర్ చేయడం తప్ప.

చివరగా నటీనటులకీ ముఖ్యంగా Riva కీ, డైరక్టర్ కీ ఓ మంచి సినిమా అందించినందుకు మనసులోనే థాంక్స్ చెప్పుకుంటూ..

సినిమా అనేది ఆర్ట్ అయినప్పుడు, Catharsis ఈ ఆర్ట్ కి కూడా కి apply అవ్వాలీ అనుకున్నప్పుడూ, Catharsis కి ఉన్న artistic definition ఏమో కాని కొన్ని సినిమాలు చూసినప్పుడు దాని Medical Definition గుర్తుకొచ్చేలా చేసే మన డైరక్టర్లందరికీ ఈ నా పోస్టు అంకితం చేస్తున్నాను ;)
 
(Jan 2013)