Friday, 27 December 2013

EMPIRE of the SUMMER MOON by S.C.GWYNNE

Posted by Kumar N on 12/27/2013 01:08:00 am with 1 comment
మరీచిక గారూ, మీ కామెంట్ చూసానండీ. థాంక్యూ.

చెరోకీ లు, Sioux లు పెద్ద ట్రైబ్స్ అండీ. కానీ వీటన్నిటికన్నా వీరోచితమైన ట్రైబ్ Comanche అని ఇంకోటి ఉంది. అది మీరు టెక్సాస్ వైపు వెళ్తూంటే వస్తుందెక్కువగా. I-35 south మీద అలా డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు Comanche Land అని బోర్డులు కూడా కనపడతాయి. 

కొంతకాలం క్రితం ఈ పుస్తకం గురించి g+ లో మెన్షన్ చేసాను, మీకు ఇంట్రస్ట్ ఉంటే కనక, ఈ పుస్తకం చదవండి, ఫాసినేటింగ్ గా ఉంటుంది, కిందపెట్టనీయదు. It's non-fiction, and the Quanah's story is real. 

అడిగారు కదా రాయమని.. మీకోసం వీలయినంత క్లుప్తంగా. 

పుస్తకం బాగా ఆసక్తికరంగా రాసాడు రచయిత. పెద్ద నేపథ్యాన్ని, ఒక చిక్కుముడయిన పర్సనల్ స్టోరీ తో మొదలుపెట్టి, దాన్ని విప్పదీస్తూ పోతూ, అందులో భాగంగా మిగతా హిస్టరీ అంతా మనకి చెపుతాడు. ఆ దారెంట మనం పోతున్నకొద్దీ మనకి చాలా విషయాలు తెలుస్తాయి. 
 
నేటివ్ అమెరికన్స్ అని చాలా మంది మాట్లాడుతారే తప్ప, అసలు వాళ్లెలా వచ్చారు ఈ కాంటినెంట్ మీదకి అంటే చాలా మంది గుడ్లు తేలేస్తారు. మీకు దాని గురించి తెలుసుకోవాలంటే చాలానే ఉన్నాయి పుస్తకాలు. అసలు మనిషి ఇక్కడికెలా వచ్చ్చాడూ, వచ్చిన తరవాత భూభాగం విడిపోయి ఎలా వేరుపడిపోయి కొన్ని వేల సంవత్సరాలు పశ్చిమగోళానికీ, తూర్పుగోళానికీ ఒకరి ఉనికి ఇంకొకరికి ఎలా తెలవకుండా ఉండిపోయిందీ, అభిముఖ గోళార్థాలలో మనిషి పరిణామదశలు భిన్నదిశలలో ఎందుకు ప్రయాణించాయి, వాటికి కారణాలేంటి అన్న సబ్జక్ట్ ని కవర్ చేసిన చాలా బుక్స్ లో Great Divide పుస్తకం ఒకటి. 
 
సరే పుస్తకం Quanah Parker అనే నేటివ్ అమెరికన్ వీరోచిత నాయకుడి జీవితకథ నేపథ్యంలో సాగుతుంది. అతని లాస్ట్ నేమ్ Parker, తన అమ్మ అయిన Cynthia Ann Parker దగ్గర్నుంచి వచ్చింది. అదేమిటి? నేటివ్ అమెరికన్ కదా, Cynthia పేరు అలా లేదే అన్న ప్రశ్న మదిలో రాక మానదు. 

కథ అక్కడే మొదలవుతుంది. 
***

నందరికీ తెలిసిన విషయమే, యూరప్ నుంచి అట్లాంటిక్ మీదుగా వచ్చిన వైట్ సెటిలర్స్ అంతిమ లక్ష్యం పసిఫిక్ దాకా భూభాగాన్ని స్వంతం చేసుకోవటం. మిగతా కారణాలతో పాటూ, నేటివ్ అమెరికన్స్ తెగల prairie lands మీదుగా ప్రయాణించటమనేది ప్రాణాంతకమైనదే. కానీ యూరోపియన్ మనుషులు తమ ఒప్పందాలని ఎప్పుడూ గౌరవించలేదు, ఎల్లప్పుడూ వెస్ట్ వైపు బౌండరీస్ ని పుష్ చేసుకుంటేనే వెళ్లారు. ఇంగ్లీష్ బాషలోఅంత ప్రావీణ్యం లేని Quanah వైట్ మాన్ ఇండియన్స్ ని ఎలా పక్కకి నెట్టుకుంటూ పోయాడన్నది తన మిత్రునికి demonstrate చేసి చూపిస్తాడు ఈ పుస్తకంలో ఒకచోట. "తన మిత్రుణ్ణి ఒక బెంచ్ మీద కూర్చోమని చెప్పి, తను కూడా పక్కకు వెళ్లి దగ్గరగా కూర్చోని, మిత్రుణ్ణి కాస్త పక్కకు జరగమంటాడు. అతను జరిగాక, మళ్లీ దగ్గరకెళ్లి కూర్చోని, ఇంకాస్త జరగమంటాడు. జరిగాక మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేసి చివరకి బెంచ్ మీదనుంచి పక్కకు తోసేస్తాడు . వైట్ మాన్ మమ్మల్ని ఇలా మా లాండ్ మీదనుంచి మమ్మల్ని తరిమేసాడు అని చెపుతాడు"

పైకి అతి సాధారణంగా కనిపించే ఈ ఉదంతం వెనక ప్రపంచ చరిత్ర మూలాలు దాగున్నాయనిపించకమానదు. 

ఇరువైపులా ఎన్నో హ్యూమన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో పాటూ, ఇరువర్గాల వారూ క్రూయాలిటీకి పరాకాష్ట అయిన పద్దతులని ఎలా అవలంభించారో, యూరోపియన్స్ కీ, నేటివ్ అమెరికన్స్ కీ మధ్య దాదాపు 1870-1875 దాకా జరిగిన రెండొందల యాభై సంవత్సరాల రక్తచరిత్ర ఎలా సాగిందో మనకి అవగాహనలొకి వస్తుంది.

అన్నేళ్ళ ప్రచ్చన్న పరోక్ష యుద్దం సాగినప్పటికీ, 1864 లో Custer చేపట్టిన నరహంతకచర్యల రోజుల్లో కూడా నేటివ్ అమెరికన్స్ తెగలని సమూలంగా నాశనం చేద్దామన్న కోరిక యూరోపియన్స్ కి లేకుండింది. కానీ టెక్సాస్ ప్రాంతంలో తమకి కంటగింపుగా మారిన Comanches ని నిర్మూలించేయమన్న October 3, 1871 order తో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

ఏ US Soldier అప్పటివరకీ వెళ్లని వెస్ట్ టెక్సాస్ లోకి దళాలు భారీఎత్తున దిగుతాయి. WestPoint నుంచి 1862 లో గ్రాడ్యుయేట్ అయ్యి, ఎన్నో వార్స్ లో గాయపడి తన కుడిచేయి వేళ్లని కోల్పోయిన General Mackenzie, విశాలమైన prairie buffalo lands లోని Comanche ఇండియన్స్ తో ఎలా యుద్దం చేయాలో US army కి నేర్పిస్తాడు. అప్పటివరకి ఇండియన్స్ దే పైచేయి, వెస్ట్ వైపు మూవ్ అయిన ప్రతిసారీ ఇండియన్స్ అమెరికన్స్ ని తిప్పికొట్టారు. భారీ నష్టాలతో అమెరికన్స్ మొట్టమొదటిసారిగా తమ భూభాగాలని విడచి, తూర్పువైపు తిరుగుముఖం పట్టారు. Civil War ముగిసిన ఆరుసంవత్సరాలకి కూడా వెస్టర్న్ భూభాగమంతా శవాలతో, రక్తాలతో నిండిపోయి ఒక రూల్-ఆఫ్-లా లేక, ఇండియన్స్ ముఖ్యంగా Comanches వాళ్ల ఇష్టానుసారం రాజ్యమేలుతారు. సివిల్ వార్ లొ నెగ్గిన యూనియన్ దళాలకి మిగిలిపోయిన ఈ చివరి ఇండియన్ దళాలు చేస్తున్న మారణకాండా, పోరాటం నిద్రపట్టనివ్వదు. ఈ దశలో Mackenzie, కొమాంచీ దళాలని ప్రధాన లక్ష్యంగా ఎన్నుకుంటాడు. 

కొమాంచీలు అమెరికన్స్ ని వెస్ట్ వైపు రాకుండా నిలవచేయటమే కాదు, స్పానిష్ ఎంపైర్ ని సౌత్ అమెరికా నుంచి ఉత్తరం వైపుకు రానీయకుండా కూడా అడ్డుకుంటారు. వంద సంవత్సరాల యూరోపియన్స్ అప్రతిహత వెస్ట్ వార్డ్ ఆక్రమణని చరిత్రలొ మొట్టమొదటిసారిగా కొమాంచీలు ఆపగలగటమే కాక, అమెరికన్స్ తమ సెటిల్మెంట్స్ ని అన్నీ వదులుకోని దాదాపు వందమైళ్లు తూర్పువైపు పారిపోయేలా చేయగలుగుతారు.

విచిత్రమేమిటంటే, కొమాంచీల దిగ్భ్రాంతికరమయిన విజయాలన్నీ అమెరికాలో టెక్నాలజికల్ గా ఎన్నో విప్లవాత్మకమయిన మార్పులు సంభవించిన 1869 Rail-Road కాలంలోనే జరిగాయి. Trains వచ్చాక ఇండస్ట్రియలైజ్ అయిన నార్త్-ఈస్ట్ మార్కెట్స్ లో, చికాగో మార్కెట్స్ లో తమ Cattle కి మంచి ధరలు లభించటంతో రైళ్లన్నీ Cattle తో కిక్కిరిసిన కాలమది. Rails తో పాటూ, బఫలో-హంటర్స్ దిగారు. కొత్తగా వచ్చిన 0.5 కాలిబర్ రైఫిల్స్ తో బఫెలోస్ ని వేటాడ్డం సులభమయింది. కొన్ని వందల, వేల ఏళ్లు అమెరికన్ భూభాగాన్నేలిన బఫెలో 1871 లో ఇంకా తిరుగుతూనే ఉంది. 
 
ఆ సంవత్సరంలోనే కాన్సాస్ లో , యాభైమైళ్ల పొడుగూ, ఇరవైఐదు మైళ్ల వెడల్పుతో నలభై లక్షల బఫెలో గుంపు హంటర్స్ కంటపడనేపడింది. మారణకాండ మొదలయింది. మానవ జాతి చరిత్రలో వెచ్చటి-నెత్తురున్న జంతువులని ఇంత భారీ ఎత్తున ఊచకోత కోయటం మునుపెన్నడూ జరిగుండదు. 1868-1881 కాలంలో, ఒక్క కాన్సాస్ లొనే ముప్పైఒక్క లక్షల బఫెలో ఎముకలు ఫర్టిలైజర్ కోసం అమ్మారంటే బఫెలో ల వేట ఎంతపెద్దఎత్తున సాగిందో అర్ధం చేసుకోవచ్ఛు. 

ఇదే సమయంలో Mackenzie దళాలు దిగాయి. ఈస్ట్ నుంచి, వెస్ట్ కి వేసిన Rail-Road దేశాన్ని ఒకేతాను కింద మార్చింది. Nation అభివృద్ది పథంలో దూసుకుపోతోంది. కానీ ఒకే ఒక్క అడ్డంకి. Great Plains ప్రాంతంలో యుద్దవీరులయిన ఇండియన్ ట్రైబ్స్. ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ లో, ప్రిమిటివ్ గా బతుకుతూ, ఆటవికంగా ఊచకోత కోసే కొమాంచీ ట్రైబ్స్ ని నిర్మూలిస్తే కానీ, వెస్ట్ వైపు మైగ్రేషన్స్ శాంతిగా జరగవు. 

Mackenzie కొమాంచీల కోర్-గ్రూప్ అయిన Quahadis కోసం అన్వేషణ మొదలుపెడతాడు. Nomads అయిన ఈ ట్రైబ్స్ ఆచూకీ పట్టుకోవటం అంత సులభం కాదు. కానీ తొందర్లోనే వారి ఆనవాళ్లు కనపడతాయి. కానీ Mackenzie కీ కానీ, తన సైన్యానికి కానీ Quanah ఎవరో అప్పటివరకీ తెలీదు. వారికే కాదు, Quanah ఎవరో, ఎక్కడుంటాడో, అతని వయసెంతో ఇలాంటి విషయాలు వైట్ మెన్ కే కాదు, ఇతర ఇండియన్ తెగలకి సైతం తెలీదు. Mackenzie, Quanah లు ఇద్దరూ 1870 లలో జరిగిన యుద్దాలలో పేరు గడించిన వారే. నిజానికి Mackenzie దళాలతో తలపడేనాటికి, Quanah కేవలం 23 ఏళ్ల ప్రాయం వాడే, కానీ శత్రువులపాలిటి క్రూరుడనీ, ఎంతో తెలివికలవాడనీ, యుద్దరంగంలో జిత్తులమారి అనీ, భయమంటే ఏంటో తెలీని వీరుడని అతనికి పేరు.

అయితే Quanah గురించి చాలామందికి తెలీని ఇంకో విషయం కూడా ఉంది. అతను హాఫ్ - బ్రీడ్. ఇండియన్ చీఫ్ కీ, వైట్ వుమన్ కి పుట్టిన బిడ్డ అతడు. ఇదేమి అంత అరుదైన విషయమేమీ కాదు. కొమాంచీ యుద్ద వీరులు, మిగతా ఇండియన్ తెగల స్త్రీలనే కాకుండా, ఇంగ్లీష్, స్పానిష్, మెక్సికన్, అమెరికన్ స్త్రీలని బంధీలుగా తెచ్చి వారితో పిల్లల్ని కనటం వందల సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. 

కానీ ఇప్పటివరకి అలాంటి సంతానం ఒక ప్రముఖమైన ఇండియన్ చీఫ్ గా ఎదగటం చరిత్రలో రికార్డు అయి లేదు. 1871 లో Mackenzie, Quanah కోసం వేట మొదలెట్టేసరికి, Quanah తల్లి చాలా ప్రాచుర్యం పొందిన యుద్దఖైదీ. ఆమె న్యూయార్క్, లండన్ నగరాలలో The White Squaw గా పేరొందింది. తొమ్మిదేళ్ల వయసులోనే ఇండియన్ తెగల దాడిలొ బంధీగా తరలించబడిన ఆ పాప, ఇండియన్స్ తోనే పెరిగి పెద్దదయ్యి, తిరిగి తన వైట్ ఫ్యామిలీతో కలవటానికి ఎన్నో అవకాశాలొచ్చినప్పటికి తిరస్కరించిన వైట్ వుమన్ గా ఆమె అందరికీ సుపరిచితమే. 

అప్పటివరకీ యూరోపియన్స్ నమ్మకం వేరే. అవకాశమంటూ ఉన్నప్పుడు విచక్షణాజ్ణానమున్న ఏ వ్యక్తయినా, ఒక మొరటు, రక్తపాత, నైతికత విలువలేనీ లేని ఆటవిక సమూహాన్ని తిరస్కరించి, ఆధునికంగా, పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన క్రిస్టియన్ యూరోపియన్ కల్చర్ వైపు మొగ్గుచూపుతారన్న యూరో-సెంట్రిక్ నమ్మకాన్ని సింథియా పార్కర్ దెబ్బతీసింది.

సింథియా టెక్సాస్ లోని ప్రముఖమయిన కుటుంబానికి చెందింది. ఆమె కుటుంబంలో టెక్సాస్ రేంజర్ కెప్టెన్స్, టెక్సాస్ లో మొదటగా చర్చ్ ని నిర్మించిన ప్రసిద్ది చెందిన బాప్టిస్టులూ ఉన్నారు. 

1836 లో Parker's Fort(ఈ రోజునున్న Dallas కి 90 మైళ్ల దూరం) మీద కొమాంచీలు జరిపిన మెరుపుదాడిలో కిడ్నాప్ కి గురవుతుంది. అతి తొందర్లోనే తన మాతృభాషయిన ఇంగ్లీష్ ని మర్చిపోయి, ఇండియన్ ఆచారాలనీ,సంచార జీవన శైలినీ నేర్చుకుంటుంది. ప్రముఖ ఇండియన్ వార్ చీఫ్ అయిన Peta Nocona ని పెళ్లి చేసుకొని తనతో ముగ్గురు పిల్లల్ని కంటుంది. అందులో Quanah పెద్దవాడు. 

Mackenzie కి సింథియా పార్కర్ ఎవరో తెలుసు. నిజానికి ఆకాలంలో టెక్సాస్ సరిహద్దుల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ వారికి తెలీనిదల్లా సింథియా రక్తం Quanah నరాల్లొ ప్రవహిస్తోందని 1875 వరకీ కూడా వారికీ తెలీదు. తెలిసిందల్లా 1865 తర్వాత అమెరికన్ దళాలు అత్యంత పెద్ద ఎత్తున జరిపిన గాలింపుల లక్ష్యం Quanah ఒక్కడే అని. 

మొదట్లో Mackenzie దళాలు భారీ నష్టాలని చూస్తాయి. Quanah ఆచూకీలూ, ఆనవాళ్లు ఏవీ లభించక కనిపించిన, అనిపించిన క్లూ ల వెంటపడి పోతుంటారు. నీళ్లకి సోర్స్ దొరకదు, బఫెలోలు దొర్లే మురికిగుంటలు తప్ప మరోటి కన్పించవు. rodents, buffalos తో నిండి ఉన్న అనంతమైన great plains లో, gypsum తో నిండి ఉండి తాగటానికి అనువుగా లేని నీటితో, దారి తెలీని దుర్గమమైన ప్రాంతాలమధ్య , గుర్రాలమీద స్వారీ నేర్చిన ఇండియన్ తెగలదే పైచేయి అవుతుంది. 

Mackenzie దళాలకి Quanah ఉనికి సైతం కానరాదు, కానీ Mackenzie Cavalry ఆనవాళ్ళే కాదు, Mackanzie ఎప్పుడు ఏం చేస్తున్నాడన్నది Quanah కి స్పష్టంగానే తెలిసిపోయేది. ఈ సమయంలో Mackenzie camp మీద జరిపిన దాడిలో Quanah ప్రాణనష్టం కలిగించటమే కాక, భారీ ఎత్తున Mackenzie దళపు గుర్రాలన్నిటినీ అపహరించుకోని పోతాడు. 1871 లో వెస్ట్ టెక్సాస్ లో గుర్రాన్ని కోల్పోవటమంటే ప్రాణాన్ని కోల్పోవటమే. అది పురాతనమైన ఇండియన్ టెక్నిక్. ఎత్తైన మైదానాల్లో వైట్ మెన్ దగ్గర్నుంచి, గుర్రాన్ని లాగేసుకుంటే చాలు. వందలమైళ్ల దుర్లభమైన బీడుని దాటేసే లోపల వైట్ మాన్ ఆకలితో, దప్పికతో మరణించటం ఖాయమన్నది ఇండియన్స్ కి బాగా తెలిసిన విషయమే. 

అర్ధరాత్రి జరిపిన ఈ దాడితో Quanah, ఈ ప్రాంతంలో మమ్మల్ని ఓడించటం మీతరం కాదన్న స్పష్టమైన మెసేజ్, అమెరికన్ దళాలకి పంపాడు.

ఈ దాడితో నాలుగు సంవత్సరాల రక్తపాతయుద్దం మొదలయింది. Battle of Blanco Canyon తో అమెరికా మొట్టమొదటిసారిగా Quanah ని చూడటం సంభవిస్తుంది. Congressional medal of honor పొందిన Captain Carter మాటల్లో Quanah ని చూద్దాం.

"A large and powerfully built chief led the bunch, on a coal black racing pony. Leaning forward upon his mane, his heels nervously working in the animal’s side, with six-shooter poised in the air, he seemed the incarnation of savage, brutal joy. His face was smeared with black warpaint, which gave his features a satanic look. . . . A full-length headdress or war bonnet of eagle’s feathers, spreading out as he rode, and descending from his forehead, over head and back, to his pony’s tail, almost swept the ground. Large brass hoops were in his ears; he was naked to the waist, wearing simply leggings, moccasins and a breechclout. A necklace of beare’s claws hung about his neck. . . . Bells jingled as he rode at headlong speed, followed by the leading warriors, all eager to outstrip him in the race. It was Quanah, principal warchief of the Qua-ha-das". 

***
అసలు సింథియా ఎవరూ, ఎందుకని ఆమె తన ఫ్యామిలీ దగ్గరికి రావటానికి తిరస్కరించిందీ, చివరకి సింథియా ఎక్కడికి చేరుకుంటుందీ,తన జీవితం హాప్పీ ఎండింగ్ ని చూస్తుందా, అన్-హాప్పీ పర్సన్ గా చనిపోతుందా, అసలు కొమాంచీలు అమెరికా భూభాగమ్మీదకి ఎప్పుడొచ్చారూ, ఒక ట్రైబ్స్ దశనుండి పెద్ద భూభాగాన్ని శాసించే దశకి ఎంతో త్వరగా కొమాంచీలు ఎలా చేరుకున్నారూ, ఇండియన్ తెగల ఆధిక్యానికి అమెరికా భూభాగమ్మీద లేని, స్పెయిన్ ఆక్రమణదారుల ద్వారా అమెరికా ఖండానికి చేరిన నాలుగు కాళ్ల జంతువయిన "గుర్రం " ఎంత ప్రముఖ పాత్ర వహించిందీ, ఏ రకమయిన ఆచ్ఛాదనలేకుండా గుర్రపు స్వారీని ఎలా నేర్చుకున్నారూ, దూరప్రాంతాలని వేగంగా చేరుకోలేని తెగలకి, గుర్రపు వేగం బఫెలో హంటింగ్ లో ఎంత దోహదం చేసిందీ, తద్వారా మొట్టమొదటిసారిగా ఆహారం సమృద్దిగా లభించటమే కాక, యుద్దరంగంలో గుర్రం వల్ల ఇండియన్ తెగలకి లభించిన తిరుగులేని ఆధిక్యతా, ఇవే కాదు, కథ జరిగిన కాలంలో వచ్చే అమెరికన్ - మెక్సికో వార్ గురించీ, టెక్సాస్ అమెరికాలో కలసిపోయిన విశేషాల గురించీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

అంతే కాదు, సింథియా పార్కర్ జీవితాన్ని ఫాలో అవుతూ పోతుంటే కొన్ని చోట్ల గుండె తరుక్కుపోతుంది. సింథియా తొందర్లోనే తన నేపథ్యాన్నీ, గతాన్నీ మర్చిపోవచ్చు గాక, కానీ తన కుటుంబం మాత్రం మర్చిపోదు. సింథియా అంకుల్ James 8 సంవత్సరాలు తనకోసం గాలిస్తూనే ఉంటాడు. 

Quanah చివరకి Teddy Roosevelt అంతటి నాయకుణ్ని కలవటం గురించీ, అమ్మ సింథియా సమాధి స్థలం కోసం సాగించిన అన్వేషణ గురించీ, తన వీరోచిత గాథల గురించీ, తనూ, తన తండ్రి క్రూరమయిన హత్యల గురించీ తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవండి. 

October 25, 1910 న Dallas Morning News paper లో వచ్చిన న్యూస్ స్టోరీతో ఈ బ్లాగ్-పోస్ట్ ముగిస్తాను.

" కన్వెన్షన్ హాల్ లో ప్రతి సీట్ కూడా నిండిపోయింది. ముఖ్య అతిథీ, కొమాంచీ చీఫ్ అయిన Quanah Parker సెంట్రల్ ఆకర్షణగా నిలచాడు. తన పన్నెండేళ్ల Gussie తో Quanah హాజరయ్యాడు. ఇద్దరూ కూడా warbonnets, buckskins, moccasins ధరించారు. అతని ఇంగ్లీష్ పదాలు కొన్నిసార్లు అర్ధం చేసుకోవటం కష్టమయినప్పటికీ స్పష్టమయిన గొంతుతో హాల్ లో చివరి వరసలో కూర్చున్న వారికి సైతం వినపడేలా, ప్రతిధ్వనించే విలక్షణమైన గొంతుతో అతను ప్రసంగించాడు."Ladies and gentleman" he began, " I used to be a bad man. Now I am a citizen of United States. I pay taxes same as you people do. We are the same people now". He spoke of his mother................."
 

Thursday, 4 July 2013

పయనమయే మేఘమా ...

Posted by Kumar N on 7/04/2013 02:20:00 pm with 1 comment
తీరిగ్గా ఉన్నాను కదా అని ఇంకా తెరవని సూట్కేస్ లో అడుగున ఉన్న కెమెరా బయటకు లాగి బాక్ బాక్ అని కొడుతూ పోతూంటే తెలిసింది.

బ్రెత్ టేకింగ్ ...ఐ మీన్ సీరియస్లీ బ్రెత్ టేకింగ్..

మన కాళ్ల కింద భూమిని లాగేసి అదాటున ఎదురుగా ఉండే లోయల్లోకి విసిరేసే బ్రెత్ టేకింగ్ సీనరీస్ మున్నార్ లో అతి సాధారణం. అలాంటి సైటింగ్స్ నీ, లాండ్ స్కేప్ నీ ఒక టూ డైమన్షనల్ బౌండరీ మధ్య స్టిల్ ఇమేజ్ కింద, అదీ ఓ పాయింట్ అండ్ షూట్ డొక్కు కెమెరాలో బంధించాలనుకోవడం, ఈ విశ్వ కార్యాచరణని ఏ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ లోనో, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ లోనో ఇరికించాలనుకోనేంత మూర్ఖత్వమని( అపాలజీస్ టు ఫిజిసిస్ట్స్ ) అర్ధమయింది.

మున్నార్ లో మూడు రాత్రులు ఓ కాటేజ్ లో ఉండటం జరిగింది, బెడ్ పక్కనే చేతికందేంత దూరంలో పైనుంచీ కింద దాకా రెండు రెక్కలున్నకిటికీ . ఒకటి మాత్రం చెప్పగలను. ఏ ప్లేస్ ని విజిట్ చేసినప్పుడైనా ..ఐ విల్ కమ్ బాక్ టు దిస్ ప్లేస్ అగయిన్ అనుకున్న ప్రదేశమేదన్నా ఉందంటే..అది మున్నార్.

It's a heavenly place, where you walk on clouds and surf on wind. And it's not a metaphor that I said.

ఏ కిటికీ కూడా నాలో కిటీకీలను అంత సేపు తెరచి ఉంచలేదు, ఏ బాల్కనీ కూడా నన్నంత సేపు తనతో ఉంచుకోలేదు.

ప్రకృతి అంటే ఓ స్థిరదృశ్యమనీ, ఋతువులు మారినప్పుడే రంగులు మారతాయనీ, పయనమయే మేఘమంటే ఏ బొమ్మదేవర నాగకుమారి సీరియల్ టైటిలని భ్రమపడ్డమో లేక కార్ దాకా నడిచే ఏదో సమయంలోనో తలెత్తి చూసే రెండు క్షణాల ఆసక్తికరమయిన సమయం అని తెలిసిన జీవితం నాది.

నా మీదున్న దుప్పటి తీసేసినంత వేగంగా, చిక్కటిచీకటి తెర లాగేస్తే బాగుండని పలచటి వెలుగు కోసం ఎదురుచూసేలా చేసిన ఉదయాలవి. మెలకువ రాగానే మామూలుగా సెల్ ఫోన్ కోసం సాగే నా చేతులు, కిటికీ రెక్కల కోసం పరిగెట్టిన ఉదయాలు.

ఆ సమయంలో నల్లటి అనంతంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ పోయి వేచి చూసేది నాలోని ఓ పంచప్రాణమేదో.

చీకటక్కడే ఉండేది కానీ కాసేపటికి వెలుతురు మాత్రం వచ్చి తనతో కలిసేది. కలిసున్న ఆ కాస్తసమయంలో ఆ రోజు జరగాల్సిన తంతులు నిర్ణయించేవేమో అవి, లోకం మాత్రం ఓ వింతవర్ణంతో అలంకరించబడేది. ఆ తరవాత చీకటి వెళ్ళిపోయేది కానీ, కళ్యాణానికి ముందు ఏ దివ్యపురోహితుడో అడ్డుపెట్టిన తెరలా ఓ చిక్కటి దట్టపు ధవళవర్ణపు తెర ఒకటి ఇంకా మిగిలే ఉండేది.

"గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి, బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను " . అప్రయత్నంగా శ్రీశ్రీ నా ముందు కదలాడేవాడు.

మేఘమేదో ఆకాశమేదో ఆ రెంటి ఆదీ అంతాలేవో తెలీని చిత్రం.

అదో అద్భుతం.

ఆ తెరకవతల ఏమవుతుందో తెలిసేది కాదు, పెళ్ళింటి బయట నిలబడి వేచి చూసినట్లుగా ఉండేది నా పరిస్థితి. ఉన్నట్లుండి హడావిడి మొదలయ్యేది. ఆ, ఇక "చప్పుళ్ళు వాయించండయ్యా " అనేవారనుకుంటా పై నుంచి ఎవరో. అప్పటికే అందరి మీదా అత్తరు చిలకరిస్తున్న గాలి కాస్తా బాజాలందుకోని సంగీతమెత్తుకునేది. పిలుపు కోసమే కాచుక్కూచున్న చెట్లు కాస్తా సంగీతానికి తగ్గట్లుగా హోయలు పోయేవి.

ఇంతలోనే బాణీ మారేది.. గాలి హోరుగాలయ్యేది. సంగీతంతో పాటూ నృత్యం మొదలెట్టేది. పక్కన చూస్తూ కూర్చున్నవేటినైనా తనతో పాటే లాక్కెళ్ళి మరీ చిందులేపించేది. చెట్లు తమలోంచి తాము బయటకొచ్చేంతగా మర్చిపోయి మరీ డాన్స్ చేసేవి.

మేఘాలన్నీ కళ్ళెదుటే ఉండేవి కాని, ఈ సంతోషంలో పాలుపంచుకోడానికి ఇంకే లోకాల్లోంచి వచ్చేదో కానీ, జోరుమంటూ దూకేది వర్షం. అతికొద్ది సేపట్లోనే మళ్ళీవస్తానంటూ వెళ్ళిపోయేది.

ఎక్కణ్నుంచో ఓ పక్షి తేలుకుంటూ వచ్చి, ప్రభాతవేళల్లో ఐక్యమవ్వాలన్న నా కోరికని తను తీర్చుకొని వెళ్ళేది.

ఈలోపు ఇంకో కార్యక్రమమేదో మొదలయ్యేదనుకుంటా.

మళ్ళీ తెరదించబడేది.

వేదిక విడిదికొండమిదకి మారేదేమో, అక్కడ హడావిడి మొదలయ్యేది. మేఘాలు ఆడపిల్లలయ్యి తయారయ్యడం మొదలెట్టేవి. వాళ్ళ తడారని కురుల్లోంచి జారుతున్న చినుకుల్ని గాలి మోసుకొచ్చి నామీద చిలకరించేది.

ఈ కోలాహలమిలాగే సాగుతూ ఉండేది.

పల్లకీలేవో కదుల్తూ పోయేవి. కొత్త అతిథులెవరో పైనుంచి రథాల్లో దిగేవారు.

ఆశీర్వాదాన్నందించి ఆమోదించాల్సిన గౌరవనీయమైన కుటుంబపెద్ద ఎవరో వచ్చే సూచనందేమో..

తెర మెల్లిమెల్లిగా తప్పుకునేది. కళ్యాణవేదిక కొద్ది కొద్దిగా కనపడేది. దూరంగా వేదవృక్షాలేవో వేదికకి కుడి పక్కనే గంభీరంగా మంత్రోచ్చరణాలు చేస్తూ కనపడేవి. వేదిక ముందు భారీముత్తయుదువుల్లాంటి చెట్లు చాలా సేపట్నుంచీ కూర్చొని ఉన్నట్లుగా తెలిసేది.

అప్పుడు కనపడేవాడు దివ్యనాథుడు..కొద్ది క్షణాలు.

లోక కళ్యాణ సమయం కదా.. లోకమంతా స్వచ్చంగా తేటతల్లమయ్యి పునీతమయి కనపడేది.

తెరచిఉన్న కిటికీల్లోంచి కొత్తప్రాణమేదో వచ్చి నా గుండె నిండేది.

నిత్యకళ్యాణం పచ్చతోరణం అనేది విన్నాను..ఇక్కడ ప్రతిరోజూ అది చాలా సార్లు చూసాను.

నా కళ్లకే కాదు, నా పిల్లల తరానికీ, ఇంకా ముందు తరాలకీ కూడా ఈ స్వచ్చత ఇలాగే మిగిలిపోవాలనీ, మానవసౌకర్యాన్నంటిపెట్టుకుని ఉండే కాలుష్యం టూరిజం రద్దీతో జతయ్యి ఈ నిరంతర కళ్యాణాలన్నీ ఆగిపోకూడదన్న ప్రార్ధనతో మున్నార్ ని వదిలి వచ్చేసాను.

ఊహు....రాలేదు... నాతో పూర్తిగా నావన్నీ రాలేదు.

ఈ పిక్చర్స్ లో కనపడుతూందే..నిటారుగా నిలబడి అక్షింతలు చల్లే చెట్టు, తలొంచి ఆశీర్వదించే చెట్టు, తపస్సు చేస్తున్న చెట్టు...ఆ చిటారుకొమ్మన నా ప్రాణమొకటి వదిలేసి వచ్చాను.. వచ్చేయుగాల తపస్సు కోసం.

ఐ యామ్ సీరియస్.

మీరెప్పుడన్నా వెళ్తే ఎలా ఉందో ఒకసారి చూసుకోరూ.. ప్లీజ్.


(July 2013)


Tuesday, 4 June 2013

ప్పుడప్పుడూ తననెవరేం చేస్తారో, లేక తన లోపలేమవుతుందో తెలీదు కానీ తలుపులు తీసుకోని మనందరికీ కనపడాల్సి వచ్చేప్పటికి చాంద్మా సిగ్గుతోనో, చిరుకోపంతోనో మొఖమంతా ఎర్రబడి కనపడుతూ ఉంటుంది, కొన్ని సంధ్యాసమయాల్లో.

హబ్బే, తనకిబ్బంది కలిగించటమెందుకని స్టేర్ చేయకుండా తలతిప్పుకోని పోతు అప్పుడప్పుడూ ఓరచూపులు చూస్తూంటాను. మరి అందంగా ఉంటే తల తిప్పకుండా ఉండటం సాధ్యమా చెప్పండి ;)

ఇంట్లో కింద ఫ్లోర్ లో ఎసి పని చేయక కొంచెం వేడిగా ఉండి..చల్లబడింది కదా అని నిన్న సాయంత్రం డెక్ మీదకెళ్దామని తలుపులు తెరవగానే కళ్ళకెదురుగా ఎర్రటి బుగ్గలతో చందమామ :) పరదాలేవీ లేని నీలాకాశపు వీధుల్లోంచి అందరికీ కనపడేలా వెళ్లాల్సొచ్చేసరికేమో ఇంకొంచెం ఎర్రబడింది.

Wind..my friend from other world ఎప్పుడూ నా కోసం డెక్ మీద డోర్ బయటే ఎప్పుడూ తచ్చాట్లాడుతూ ఉంటుంది. సరే కొద్ది సేపు ఇక్కడే ఉందాం అని కూర్చున్నా.

అనుకోలేదు రాత్రి ఒంటిగంట దాకా అలాగే అక్కడే కూర్చుండీ పోతానని. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్/నైట్.

పద్దెనిమిది, పంతొమ్మిదేళ్ల వయసులో సిగ్గుతో, తడబడుతూ, తలవంచుకోని బయటకు రానా వద్దా అన్నట్లు ఇంకా పూర్తవ్వని చందమామ, ఇరవైళ్ళోకొచ్చేప్పటికల్లా ఓ కాన్ఫిడెంట్ యువతిగా ప్రపంచం మీదకొచ్చేసి, అందం, వ్యక్తిత్వం కలిసిన ఆకర్షణ వెలుగుతో ముఫ్ఫైళ్ళో ప్రపంచదృష్టినంతా తనవైపు తిప్పుకోని ఒక్క క్షణమైనా వాళ్ళని ట్రాక్స్ లో ఆపేసే చందమామ..నడివయసు వచ్చేప్పటికల్లా నిండైన అమ్మగా ప్రపంచం మీద కరుణతో వెన్నెల్ని చల్లగా కురిపించే చందమామ....

విశాలమయిన నిశ్శబ్దపు ఓపెన్ స్పేసెస్ లో ఎక్కువసేపుండిపోతే, ఇరుకైన భూమ్మీద కండీషన్డ్ జీవితాల కఠినత్వాన్ని తట్టుకోలేక ముడుచుకొని మూలన దాక్కున్నవేవో, విచ్చుకోని ఒళ్ళు విరుచుకోని బయటకొస్తాయనుకుంటాను. తల వెనక్కి వాల్చేసి ఆకాశం వంక చూద్దునా...నీలాకాశంలో అక్కడక్కడా నక్షత్రాలు.. నాకేసి చూడట్లేదు.. యు సీ, ఇట్స్ హర్ డే టుడే, నాట్ అవర్ డే అన్నట్లుగా సద్దుమణిగి కూర్చున్నాయి. ఐ నో అనుకోని కళ్ళు మూసేసుకున్నాను, వెన్నెలచేతులు కళ్ళమీదపెట్టుకోని. నేను నాలో లేను కాబట్టి నన్ను సతాయించుకునే నా బాధ కూడా నాకు లేకుండా.

చుట్టూ చీకటి, దూరంగా ఉన్న ఇళ్లల్లో లైట్లన్నీ ఎప్పుడో ఆగిపోయాయి. ఆ వాటర్ ఫౌంటెన్ లోంచి నీళ్ళ మీద పడుతూన్న శబ్ధం ఏ కొండచరియల మీదనుంచో దూకుతున్న నీళ్ళలాగా చెవులకి సోకుతూ ఉండింది.

ఎవరూ లేరూ, ఎవరూ రారూ..

ఏ అపురూపమయిన క్షణాలనో దోసిలినిండుగా పట్టుకోని ఆఘ్రాణిద్దామనుకుంటామా, ఆ క్షణాలన్నీ జారిపోతూఉంటాయి. పట్టుదొరికి జారిపోయే రెండు క్షణాల మధ్య జీవితమే బ్రతుకయినప్పుడు, జీవితం ఓ 'వెయిటింగ్ ఫర్ గోడో' లా అవడంలో ఆశ్చర్యమేం లేదు.

కానీ ఈ రాత్రి ప్రత్యేకమైనది. ఏ ప్రయత్నాలూ చేయక నక్షత్రాల వీధుల్లోకి వెళ్ళి చందమామ పక్కన కూర్చుంటే చాలూ, ఆ క్షణాలేవో మనల్ని తడిపేస్తూ, తడుముతూ వెళ్తాయని చెప్పే రాత్రి.

ఎందుకో తెలీదు కానీ ఒక్క క్షణం దు:ఖపు తెర అరక్షణం తాకి వెళ్ళింది. విచారంతో కాదు, ఆనందంతో కూడా కాదు. తెలీదెందుకో.. ఏ రాండమ్ ఆక్ట్ ఆఫ్ కైండ్నెస్సో గుర్తొచ్చేమో!

లైఫ్ లో బెస్ట్ థింగ్స్ ఇంకా ఫ్రీగా ఉన్నందుకు మాత్రం కొంచెం ఆశ్చర్యంతో పాటూ, కృతజ్ణతగా కూడా అనిపించింది. మానవజాతింకా పూర్తిగా తననితను పాడుచేసుకోలేదు.

పండు వెన్నెలా, పల్చటి తెల్లటి చందమామా, గలగలమనేనీళ్ళూ, జోరున మీదకి దూకి నాతో రా రా అంటూ ఎక్కడికో లాక్కెళ్లే గాలీ ఇవన్నీ ఇంకా ఉచితమే. 
బాసురే, సంతూర్, సితార్ ల మాయావులు కూడా!

( June 2013)

Saturday, 4 May 2013

సంతోషమరణ క్షణాలు

Posted by Kumar N on 5/04/2013 02:36:00 pm with No comments
క అందమైన సాయంత్రం.......

వీడికి అమాయకత్వం ఎప్పటికీ పోదేమోనన్న కొడుకుతో.. ఇంటి వెనకాల.. సస్యశ్యామలం పాఠ్యపుస్తకాల్లో కాకుండా కంటికెదురుగా ఆరోగ్యంగా, అహ్లాదంగా , ఏపుగా.. సంధ్యాసమయాన, అనాది నాదమేదో జోరున జారిపోతున్నన నీళ్ళల్లోంచి..సృష్టి చైతన్యం లోకి నిండుతూ..మానవ చైతన్యం లోకి ఇంకుతూ...

ఇహ చీకటిపడుతోందని లోపలికొచ్చాక, వాడికిష్టమయిన రెండు చదరంగపు ఆటలు, గెలుపెప్పుడూ నాదే అయినా మళ్ళీ మళ్ళీ అన్నీ సిద్దం చేసి నాతో ఆడు నాన్నా అని నా దగ్గరికి వచ్చే పసితనం

ఏదో కదుపుతున్నానే కానీ..

అప్పట్నుంచీ పక్కన లేని ఈ మనుషులు(?) మెల్లిమెల్లిగా నరనరానా, ప్రతీ జీవకణం నిండా వాళ్లే నిండుతున్నారో, లేక వాటిల్లో జీవమే నింపుతున్నారో తెలీదు..

కళ్ళనిండా...కృతజ్ణత....నాగరికత చాచిన చేయి వేలి కొనలమీద నుంచి జారి..పచ్చిగా...తడిగా...

ప్రభూ...

మాటలు గొంతులో ఆగటం కాదు, అసలు మాటలే లేని ప్రపంచంలో నా చెర లోంచి నేను తప్పించుకున్నప్పుడు..నువ్వు నాతో మాట్లాడుతావని ఊహించలేదు.

ఏ ఆకాశమార్గానో తిరుగుతుంటావనుకోని తలెత్తి చూసేవాణ్ణి.. ఎంత అవివేకం.

నువ్వు సృష్టించిన ఈ విశ్వం నడిచే సూత్రాలేవో కనపడేవట ఐన్ స్టీన్ కి.... ఆ మాథమేటికల్ ఈక్వేషన్స్ లో నువ్వు కనపడ్డప్పుడు, నీ మాటలేవో ఆయనకి అర్ధమయ్యేవట.

అజ్ణానిని..మోర్టల్ బీయింగ్ కదా..నాకది అర్ధం కాదని కదా..అంతకన్నా అందమైన భాషేదో సృష్టించి...అది ఈ మహానుభావులకి నేర్పించి.

ఏమంటారు ప్రభూ దీన్ని?

నిశ్శబ్ధం నిండా నిండిన నీ ఈ గొంతుకి నా గుండె వొణుకుతోంది... కనిపించకుండా ఎంత దాచిపెట్టినా..

నా చుట్టూ కమ్ముకుంటూ, నన్ను వేరే లోకాల్లోకి తీసుకెళ్ళటం కాదు. ఆ లోకాలేవో.. ఆ నాన్-లోకల్ ఫీల్డ్స్ ఏవో..ఇక్కడికే ఇంపోర్ట్ చేసి.. వాటిల్లోకి నన్ను ఇమ్మర్స్ చేసి..

అది వేణువా!! ఆ వేణువు నిండా ఉన్న ఆ విశ్వగావాక్షాల్లోకి దూరి వాటిల్లోంచి దూకి నీలో ఐక్యమైపోవడం కన్నా పరమార్ధమింకేదన్నా ఉందా ప్రభూ ఏ జీవరాశికైనా!

దాన్ని సంతూర్ అంటారా! ఆ తంత్రుల మీద ఆడేవి అతని వేళ్లా లేక అది నీ నృత్యమా..

ఏ చిన్న పుణ్యం చేసుకున్నానో! కాస్తో కూస్తో కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు దేవుడు, ఈ జీవితానికిది చాలనుకునేవాణ్ణి..

ఎంత అల్పత్వం..ఎంబరాసింగ్!

చచ్చిపోవాలని ఉంది!

ఎప్పుడాగిపోతానో, ఎక్కడిక చాలనుకుంటానో తెలీదు..

తెలుస్తోందల్లా ఒక్కటే.. ఇవి సంతోషమరణ క్షణాలని.. ఏ విచారమూ లేని వీడ్కోలు సమయాలని..

(On a quality-lonely night, listen to these Angels...make sure you listen to both parts)

Pt Shivkumar Sharma and Pt Hariprasad Chaurasia - The Valley Recalls 

(May 2013)


Monday, 22 April 2013


నాగరికత చక్రభ్రమణాల గురించి New York Historical Society లో వరసగా అయిదు పెయింటింగ్స్ ఉన్న The Course of Empire కన్నా మెరుగైన ఉదాహరణ ఉండదేమో!


మొదటి పెయింటింగ్ అయిన The Savage State లో, వేకువసమయంలో మేఘాలతో కమ్ముకొని రాబోయే తుఫానుతో పచ్చటి పచ్చికబయళ్ల మధ్య, నాగరికతకి పూర్వమున్న అతి కొద్ది మంది ఆటవిక జాతి ప్రజలు తమ ఉనికికి మార్గమేసుకుంటూంటారు.


రెండవ పెయింటింగ్ అయిన Pastoral State ఎంతో సంతోషభరితమైన వ్యవసాయిక స్వర్గధామం. అందులోని వాస్తవ్యులు,  అక్కర్లేని అరణ్యం లా ఉన్న చెట్లని తొలగించి, పంటలని వేసి, బహు సుందరమైన గ్రీక్ టెంపుల్ ని నిర్మించారు.




మూడవదీ, అతి పెద్దదీ అయిన The consummation of empire లో లాండ్ స్కేప్ మొత్తం మార్బుల్ బజారుతో నిండి ఉండగా, గత పెయింటింగ్స్(కాలాల)ల లో తృప్తిగా బతికినట్లుగా కనపడ్డ మనుషుల స్థానంలో, ఖరీదైన దుస్తుల్లోని వర్తకులతో, వినియోగ-పౌరులతో నిండిపోయి ఉంటుంది.జీవన చక్రం లో ఇది మధ్యాహ్నకాలం.



ఆ తరువాత వచ్చే పెయింటింగ్ The Destruction. నగరం మంటల్లో మునుగుతుంది . విచారంగా అలుముకున్నఆకాశం కింద ఉన్న నగరంలోని పౌరులు దోపిడీ, రేప్ ముఠాల నుంచి పారిపోతుంటారు.
చివరగా The Desolation లో చంద్రోదయమవుతుంది. ఒక్క ప్రాణి కూడా కనపడదు, విడిచిపెట్టేయబడిన శిథిలాలు, చెట్ల పొదలూ తప్ప.





1830 లో Cole వేసిన ఈ పెయింటింగ్ ఉద్దేశం స్పష్టం: ఎంత గొప్ప నాగరికతలయినా, చివరికి అన్ని నాగరికతలూ క్షీణించి, నశించవలసిందే అని. శతాబ్ధాల నుంచీ చరిత్ర కారులు, రాజకీయ వ్యాఖ్యాతలూ, ఆంథ్రోపాలజిస్టులూ, నాగరికతల ఉథ్థాన పతనాల దశ, దిశలు పైన చెప్పిన క్రమాన్నేఅనుసరిస్తాయని భావించారు. 



Polybius Histories లో Rome గురించి ఉన్న Book VI లో, రాజకీయభ్రమణాలు ఈ కింది విధంగా వెళ్తాయని రాసి ఉంది. 1. Monarchy 2. Kingship 3. Tyranny 4. Aristocracy 5. Oligarchy 6. Democracy 7. Ochlocracy ( mob rule).  ఈ రకమైన దృష్టికోణం Machiavelli రచనలతో వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇలాంటి పురావృత దశల గురించి Ming నియో-కన్ఫ్యూషియనిజం, అరబ్ చరిత్రకారుడు Ibn Khaldun లు అంతకుముందే చెప్పి ఉన్నారు.

Scienza nuova(1725) లో ఇటాలియన్ ఫిలాసఫర్ Giambattista Vico సివిలైజేషన్స్ అన్నీ కూడా మూడు దశల్లోంచి వెళ్తాయని చెప్పాడు: the divine, the heroic and the human or rational, then reverting back to divine again. 1738 లో బ్రిటీష్ ఫిలసాఫర్ అయిన Henry St John, Viscount Bolingbroke "మంచి వ్యవస్థలతో ఉన్న ప్రభుత్వాలు, మంచి మిశ్రితంలో ఉన్న జంతువుల గుంపుల్లాంటివే, రెండింట్లోనూ అంతర్గతంగా వాటి వినాశానికి దారితీసే విత్తనాలు దాగుంటాయి. అవి కొద్ది కాలం పాటు వృద్ధి సాధించి, అభివృద్ది లోకి వస్తాయి, కాని చివరకి క్రమంగా అదృశ్యమయిపోతాయి" అని అభిప్రాయపడ్డాడు.

భావవాదులూ, భౌతికవాదులూ సైతం ఒక విషయంలో ఏకీభవించారు. హెగెల్ మరియు మార్క్స్ ఇద్దరూ కూడా 'గతితర్కం(dialectic) చరిత్ర కి క్రమం తప్పని రిథమ్ ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.

మరి కొంతమంది చరిత్రకారులు, సివిలైజేషన్ ని ఋతువుల తో పోల్చారు. The Decline of the West ( 1918-22) రాసిన జర్మన్ చరిత్రకారుడయిన Oswald Spengler మెటిరీయలిజం, స్కెప్టిసిజం, సోషలిజం, పార్లమెంటేరిజం, డబ్బు
ల విజయాలతో కూడి ఉన్న పంతొమ్మిదవ శతాబ్ధాన్ని పాశ్చాత్య శీతాకాలం గా అభివర్ణించాడు.

బ్రిటీష్ చరిత్రకారుడు Arnold Toynbee ఇరవై సంపుటిల Study of History (1936-54) లో సివిలైజేషన్ ని " సమస్యల మీద సృజనాత్మక మైనారిటీ వర్గాలు చేసే తిరుగుబాటు" గా చూసాడు. అయితే ఆ తరువాత, నాయకులు పెరుగుతున్న సమస్యలకి క్రియేటివ్ పరిష్కారాలని వెతుక్కోక పోతే, ఆ నాగరికత క్రమంగా క్షీణిస్తుందని అభిప్రాయపడ్డాడు.

Quigley నాగరికతల జీవన చక్రాల గురించి క్లాసిక్ నిర్వచనం ఇలా చెప్పాడు: "ఇదొక పరిణామ క్రమం. ప్రతీ నాగరికతా పుడుతుంది.. ఆ తరువాత తన పరిణామాన్నీ, బలాన్నీ పెంచుకుంటూ అంతర్గతంగా వ్యవస్థాపకమయిన సమస్యలూ, సంక్షోభాలూ మొదలయ్యే దశ వరకీ శరవేగంగా వ్యాపిస్తుంది.. . సంక్షోబాన్ని పరిష్కరించుకొని పునర్వ్యవస్థీరించుకున్నాక తనలో ఉండే దుడుకూ, ఉత్సాహమూ, పట్టుదలా నెమ్మదించి, క్రమంగా నిశ్చలన స్థితికి చేరుకుంటుంది. శాంతి, అభివృద్ది లతో గడపిన స్వర్ణయుగం గడిచాక అంతర్గతంగా మళ్లీ ఒక సంక్షోభం ముంచుకొస్తుంది. ఈ సమయంలో మొట్టమొదటిసారిగా పట్టు సడలిన చిహ్నాలు కనిపించి , బాహ్యశత్రువుల నుంచి తనను తను రక్షించుగోలదా అని తన శక్తి, సామర్ధ్యాల మీద అనుమానాలు మొదలవుతాయి. అక్కణ్నుంచీ నాగరికత క్రమంగా బలహీనమవడం మొదలయ్యి, శత్రువుల దాడిలో మునిగిపోయి, చివరకి అంతమవుతుంది".

పైన చూసిన ప్రతి నిర్వచనమూ, నమూనాలు ఒకదానికొకటి వేరయి ఉండవచ్చు, కానీ వాటన్నిటిలోను చరిత్ర ఒక రిథమ్ ని అనుసరిస్తుందన్న అనుకోలు ఉంది.

1987 లో Paul Kennedy రాసిన The Rise and Fall of the Great Powers రాసిన చరిత్రలో కూడా ఇదే విధంగా గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యాలు వాటి వాటి పారిశ్రామిక ఉత్పత్తులూ, వాటి భాధ్యతల నిష్పత్తుల ప్రకారం ఎగసి పడిపోతాయన్న సిక్లికల్ మోడల్ ని ప్రతిపాదిస్తారు. రాజ్యవిస్తరణ ఒక పరిమితి దాటినప్పుడు అయ్యే ఖర్చులు, వచ్చే లాభాల కన్నా ఎక్కువవుతాయి. ఈ రకమైన అత్యాశ గొప్ప-సామ్రాజ్యాల పతనానికి ముందు చరిత్రలో గమనించవచ్చని అంటాడు Kennedy.

2005 లో Jared Diamond రాసిన Collapse: How Societies Choose to Fail or Succeed లో కూడా పదిహేడవ శతాబ్ధం లోని Easter Island దగ్గర్నుంచీ ఇరవైఒకటో శతాబ్ధం లోని China వరకీ తమతమ సహజపర్యాయణాల పరిరక్షణని ప్రథమ కర్తవ్యంగా చేపట్టకుండా ఎలా తమ సమాజాలని ప్రమాదం వైపు నెట్టుతున్నాయో వివరిస్తాడు. 

Jared Diamond ప్రకారం Mayan Societies ఈ పుస్తకం ముందు చాప్టర్లల్లో చెప్పబడిన Malthusian Trap లోకి జారిపోయాయి. జనాభా వ్యవసాయ ఉత్పత్తుల కన్నా పెరగింది. ఎక్కువ జనాభా మరింత వ్యవసాయాన్నీ, ఆ పెరిగిన వ్యవసాయ అవసరాలు అరణ్యాల తరుగుదలనీ, భూమి సాంద్రత క్షీణించడాన్నీ, కరువునీ తీసుకొచ్చింది. దీనివల్ల అంతర్గత యుద్దాలు చెలరేగి చిట్టచివరకి Mayan civilization అంతమయిపోయింది. Diamond చెప్పదల్చుకున్నదేంటంటే, ఈ రోజున్న ప్రపంచం కూడా Mayan Civilization లాగే అంత్యదశకు చేరుకోవచ్చని.

***

అయితే పైన ప్రతిపాదించిన సిద్దాంతాలన్నీ తప్పవచ్చు. Cole వేసిన చిత్రాలు చరిత్రకి సరైన దర్పణం కాకపోవచ్చు. ఒకవేళ చరిత్ర,  చక్రం తిరిగినట్లు మందగమనంలో నడిచేది కాకుండా, ఒక్కోసారి వయొలెంట్ గా వేగంగా మలుపులు తిరిగేదయితే? ఇంకా ముఖ్యంగా నాగరికత కూలిపోవడానికి శతాబ్ధాలు పట్టకుండా, రాత్రికి రాత్రి కూలిపోతే?

సివిలైజేషన్స్ అనేవి ఎన్నో పరస్పర సంపర్క భాగాలతో, అత్యంత సంక్లిష్టంగా నిర్మితమయి ఉంటాయి. అవి ఒక పథకం ప్రకారం నిర్మించినట్లుగా, ఒక్కొక్క ఇటుకా పేర్చినట్లుగా , ఈజిప్షియన్ పిరమిడ్స్ లా నిలబడి ఉండవు. ఒక నమీబియన్ టర్మైట్స్ గుంపులా ఉంటాయి. అవెప్పుడూ కూడా Order కీ, Disorder కీ మధ్య ఊగుతూ ఉంటాయి, గందరగోళం అంచు దాకా వెళ్లొస్తుంటాయి.

అయితే ఎప్పుడో ఒకప్పుడు, సరైన సమయంలో పరిష్కరించకుండా ఉంచేసిన ఒక సమస్య ఊహించకుండా పెద్దదయి సమాజాలనీ, దేశాలనీ కుదిపేస్తుంది, చివరకి ఆ అంచుమీదనుంచి తోసేస్తుంది. ఇందులోని సంక్లిష్టతని అర్దం చేసుకోవాలంటే ,తమకు తాము ఓ పద్దతిలో ఆర్గనైజ్ చేసుకుని , హాఫ్-మిలియన్ సంఖ్యలో గుంపుగా ఎగిరే టర్మైట్స్ ని గమనించాలి. హ్యుమన్ ఇంటెలిజెన్స్ కూడా అత్యంత దుర్లభమైన నెట్వర్క్ తో, బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ లోంచి వచ్చిన అంతిమ ఫలితం. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంతే. ఎంతో చిక్కగా చిక్కుబడిన యాంటీ-బాడీస్ నెట్వర్క్ తో, బయటనుంచి వచ్చే ఫారిన్ ఏజెంట్స్ మీద యుద్దం కోసం నిర్మించబడ్డ సిస్టమ్.

సహజ ప్రపంచంలో ఉండే సంక్లిష్టంగా ఉండే ప్రతీ సిస్టమ్ లో కూడా కొన్ని కామన్ లక్షణాలని గమనించవచ్చు. చిన్న ఇన్-పుట్ , ఒక్కోసారి ఊహించని అత్యంత పెద్ద ఫలితాలని తీసుకొస్తుంది. దీన్నే మనం 'యాంప్లిఫయిర్ ఎఫెక్ట్' అంటాం. కారణ-ఫలిత చక్రం సరళరేఖగుండా ప్రయాణించదు. అందుకే సంక్లిష్టమయిన నాగరికతలలో జరుగుతున్న వాటిని గమనించి, అంతిమ ఫలితాలని ఊహించే సిద్దాంతాలు ప్రతిపాదించటం అంత తెలివైన పని కాదు.

ఈ కోణం లోంచి చూస్తే, స్ప్రింగ్ 2007 కల్లా గ్లోబల్ ఎకానమీ మాక్సిమమ్ కెపాసిటీకి చేరుకున్న ఒక ఎలక్ట్రికల్ గ్రిడ్ లాంటిదని చెప్పుకోవచ్చు. మహత్తరమైన, శక్తివంతమైన ఆర్ధికవ్యవస్థతో పోలిస్తే చిన్నదైన సబ్ ప్రైమ్ మార్ట్గేజ్ క్రైసిస్ అనే ఒక చిన్న సర్జ్ తోపిడి, సమస్తం గ్రిడ్ ని ట్రిప్ అయ్యేలా చేసి, ప్రపంచం నిండా బ్లాక్-అవుట్ ని, అంధకారాన్నీ తీసుకొచ్చింది.

ఫిజిసిస్టూ, మీటియారలిజిస్టూ అయిన Lewis Fry Richardson గ్రూప్ హత్యల దగ్గర్నుంచీ, పెద్ద యుద్దాల వల్ల జరిగిన మృతుల సంఖ్య లని బేస్ 10 ఆల్గారిథంతో కొలిచే ప్రయత్నం చేసాడు. టెర్రరిస్టు దాడిలో జరిగిన 100 మంది మృతిని 2 మాగ్నిట్యూడ్ అనుకుంటే, ఒక మిలియన్ మంది చనిపోయిన యుద్దం మాగ్నిట్యూడ్ 6 అవుతుంది.1815 నుండీ 1945 మధ్యలోనే, 2,5 మాగ్నిట్యూడ్ దాటిన ఘర్షణలు కనీసం 300 ఉన్నట్లుగా Richardson కనుక్కున్నాడు. దీంట్లో 7 మాగ్నిట్యూడ్ ఉన్న యుద్దాలు కనీసం 36 మిలియన్ల మందిని పొట్టనపెట్టుకున్నాయి. మృతులే కాక, యుద్దం వల్ల చెల్లాచెదురయిన జీవితాలు కనీసమ్ ఇంకో పది మిలియన్లు ఉంటాయని అంచనా.

ముందు చాప్టర్లల్లో చూసినట్లుగా, వెస్టర్న్ సివిలైజేషన్ మొదటి అవతారమయిన రోమన్ ఎంపైర్ శిథిలమవడానికి దీర్ఘకాలం పట్టలేదు. ఐదవ శతాబ్ధం లోని తొలి దశలో బార్బేరియన్ల దాడులతో, ఒక తరం లొనే అంచుమీదనుండి తోయబడింది.1530 లో Incas దక్షిణ అమెరికాలో తిరుగులేని శక్తిగల వారు. కాని గుర్రాల మీద, గన్ పౌడర్ తో, దేశం బయట నుంచి వచ్చిన ముష్కరులు కేవలం ఒక దశాబ్ధకాలం లోనే Incas సామ్రాజ్యాలని చిత్తుచిత్తు చేసారు.

17 వ శతాబ్ధంలో మింగ్ సామ్రాజ్యం శరవేగంగా అంతమయిపోయింది. అలాగే ఫ్రాన్స్ లో Bourbon monarchy పఠిష్టమయిన దశనుండి , పతనదశకి చేరుకోడానికి ఎంతో కాలం పట్టలేదు. అదేవిధంగా అమెరికన్ రివల్యూషన్ వార్ లో, ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికన్స్ కి తోడ్పాటునందించడం ఫ్రాన్స్ కి మొదట తెలివైన ఉపాయంగా తోచింది, కానీ తనందించిన సహాయం తనకి శక్తికి మించి ఫ్రాన్స్ ని ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతే కాదు, 1908 లో కూడా Ottoman Empire అంతర్గతంగా సంస్కరణలని చేపట్టే శక్తివంతమైన ఎంపైర్ గానే కనపడింది, కానీ 1922 కల్లా చిట్టచివరి సుల్తాన్ ఇస్తాన్బుల్ నుండి బ్రిటీష్ యుద్దనౌక వెళ్లిపోవడంతో Ottoman Empire అంతమయిపోయింది.

1942 లో జపాన్, తన చరిత్రలోనే అతి పెద్ద సామ్రాజ్య విస్తరణని సాధించింది, కాని అమెరికా మీద జరిపిన Pearl Harbor దాడితో 1945 కల్లా ఆ సామ్రాజ్యం కనపడకుండా పోయింది.

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో మొదలయిన కారుమేఘాలు, అతివేగంగా ఆ సామ్రాజ్యాన్ని చీకటిలో ముంచెత్తేసాయి. చర్చిల్ 1945 లో  రూజ్వెల్ట్, స్టాలిన్ లతో పాటుగా బిగ్-థ్రీ గా పేరొంది, వివిధ దేశాల దిశలని ప్రభావితం చేసే నాయకుల్లో ఒకరు. కానీ రెండవ ప్రపంచ యుద్దం అంతమవగానే పదవీచ్యుతుడయ్యాడు. కేవలం ఒక డజను సంవత్సరాలలోనే యునైటెడ్ కింగ్డమ్ బర్మా, ఈజిప్ట్, ఘనా, ఇండియా, ఇజ్రాయిల్, జోర్డాన్, మలయా, పాకిస్తాన్, సిలోన్, సూడాన్ లకి స్వాతంత్రాన్నిచ్చి తప్పుకోవాల్సి వచ్చింది. 1956 కల్ల సూయజ్ కెనాల్ లో యునైటెడ్ స్టేట్స్ ని ధిక్కరించి స్వంత నిర్ణయాన్ని తీసుకోలేని దశకి చేరుకోవటంతో యునైటెడ్ కింగ్డమ్ సామ్రాజ్యానికి తెరదిగింది.


సమీప చరిత్రలో ఉదాహరణ కావాలంటే సోవియట్ యూనియన్ కేసి చూడాల్సిందే. వెనక్కి తిరిగి పైనుంచి చూసినప్పుడు దృష్టి పథంలో సమస్తం కనపడే ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ దృష్ట్యా సోవియట్ యూనియన్ కష్టాలకి మొదటి విత్తనం బ్రెజ్ఞేవ్ కాలంలోనే పడిందని చెప్పవచ్చు. కానీ ఆ కాలంలో అది అంత స్పష్టం కాదు కదా. 1985 లో గోర్భచేవ్ సోవియట్ జనరల్ సెక్రటరీ అయినప్పుడు CIA సోవియట్ యూనియన్ ఎకానమీ అమెరికా ఎకానమీలో 60 శాతం ఉంటుందని (తప్పుగా) అంచనా వేసింది. సోవియట్ యూనియన్ న్యూక్లియర్ ఆయుధ సంపత్తి అమెరికాకన్నే ఎక్కువే. థర్డ్ వర్ల్డ్ గా పేరొందిన ప్రపంచంలోని వియత్నాం నుంచి నికరాగువా వరకీ అప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం నుంచే సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కానీ, గోర్బచేవ్ పదవి చేపట్టిన కేవలం ఐదు సంవత్సరాలలోనే మధ్య, తూర్పు యూరప్ ల దేశాల మీద సోవియట్ యూనియన్ పట్టు సడలిపోయింది. చివరకి 1991 లో స్వయాన సోవియట్ యూనియన్ కూలిపోయింది.

చరిత్రలో ఏదైనా సామ్రాజ్యం, క్రమంగా జారిపోకుండా అకస్మాత్తుగా అగాధం అంచు మీద నుంచి పడిపోయిందీ అంటే , అది లెనిన్ స్థాపించిన సామ్రాజ్యమే.

కొన్ని నాగరికతలు క్రమంగా క్షీణించకుండా, శరవేగంగా శిథిలమవుతాయి అనుకున్నప్పుడు మరి ఈరోజున వెస్టర్న్ సివిలైజేషన్ ఉన్న పరిస్థితి ఏంటి? అదెలాంటి ప్రభావితాలకి లోనవుతోంది?

***


గత చాప్టర్లల్లో వెస్ట్, ఈస్ట్ ని దాటేసి ఎలా ముందుకెళ్లిందో చెప్పుకున్నాం. 6 killer apps వెస్టర్న్ సివిలైజేషన్ ని ఊర్ధ్వదశకి పట్టుకెళ్ళాయి. ఆ యాప్స్ ని గత కొన్ని దశాబ్ధాలుగా ఈస్టర్న్ సమాజాలు డౌన్ లోడ్ చేసుకుంటూ ఎంతో ప్రగతినీ, అభివృద్దినీ సాధిస్తున్నాయి.

చైనాలో ఆర్ధిక సంస్కరణలు కేవలం ముప్పై సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి . ఈ రోజు(పుస్తకం రాసే సమయానికి) చైనా per-capita GDP యు.ఎస్ GDP లో 19 శాతానికి చేరుకుంది. హాంగ్ కాంగ్, జపాన్ లు ఆ స్థానానికి 1950 లకే చేరుకున్నాయి. తైవాన్ 1970 ల లోనూ, సౌత్-కొరియా 1975 లలోనూ ఆ దశకి చేరుకున్నాయి. కాన్ఫరెన్స్ బోర్డ్ లెక్కల ప్రకారం, సింగపూర్ per-capita GDP ప్రస్తుతం US కన్నా 21 శాతం ఎక్కువుంది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ అతి పెద్ద ఎత్తున, అతి వేగంగా కొనసాగుతోంది. కేవలం ఇరవై-ఆరు సంవత్సరాలలో GDP పదింతలు పెరిగింది!! UK కి 1830 తరువాత GDP నాలుగింతలవడానికి 70 సంవత్సరాలు పట్టింది. IMF ప్రకారం గ్లోబల్ GDP లో చైనా పదిశాతాన్ని 2013 కల్లా దాటుతుంది. ఆర్థిక సంక్షోభానికి ముందు Goldman Sachs చైనా, అమెరికా GDP ని 2027 కల్లా అధిగమిస్తుందని అంచనా వేసింది. కాని ఆర్ధిక సంక్షోభం చైనా కన్నా, అమెరికా ఆర్థికాభివృద్ది రేటుని అధికంగా దెబ్బ తీసింది.

ఇంకో విధంగా చెప్పాలంటే ఏషియన్ శతాబ్దం ఇప్పటికే వచ్చేసిందని చెప్పుకోవచ్చేమో. జర్మనీ, జపాన్ లని దాటి దూసుకెళ్లిన చైనా, గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో అమెరికాని వెనక్కి తోసేయటానికి అతి సమీప దశలో ఉంది. చైనా లోని షాంఘై, అమెరికాలోని ఏ నగరం తో పోల్చినా కూడా పెద్దదే.

సంఖ్యాపరంగా చూస్తే ఏషియా ప్రపంచం మొత్తం మీద అధిక జనాభా కల ప్రాంతం. కానీ ఆఫ్రికాలో పెరుగుతున్న జనాభా వెస్ట్ పతనాన్ని నిర్దారించేసింది. Samuel Huntington నిర్వచించిన 'West' ప్రాంతాలయిన్ వెస్ట్రన్ యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలేషియా ల లో జనాభా, 1950 లో ప్రపంచ జనాభాలో ఇరవై శాతంగా అంచనా వేసారు. ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ అంచనాల ప్రకారం 2050 కల్లా అది 10 శాతానికి చేరుకుంటుంది. Huntington స్వంత లెక్కల ప్రకారం Western Decline విభిన్న కోణాల ప్రకారం ఈ పాటికే మొదలయిపోయింది. Language (western share 1958 నుండి 1992 కి 3 శాతం పడిపోయింది), Religion (1970 నుండి 2000 కి దాదాపు ఒకశాతం దిగజారింది), territory controlled (1971-1993 కి 1 శాతం పతనం), population (1971 నుంచి 3 శాతం తగ్గుదల), GDP(1970-1992 కి 4 శాతం పతనం), military manpower (1970-1991 కి 6 శాతం దిగజారింది)

2007 లోని ఆర్ధిక సంక్షోభం వెస్ట్ లో ఎప్పుడో మొదలయిన పతనానికి యాక్సలరేటర్ గా అభివర్ణించవచ్చు. ఇది 1930s లలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అంతటిది కాకపోయినా, అదే కోవలోకి చేర్చదగినది. కాని గ్రేట్ డిప్రెషన్ అంతటి మహాపతనపు ప్రభావాన్ని చూపించకపోవడానికి మూడు కారణాలని గమనించవచ్చు. 1. చైనా విపరీతంగా ఇచ్చిన బ్యాంక్ రుణాలు వెస్ట్ కి ఎక్స్ పోర్ట్స్ ని దెబ్బతీయకుండా కాపాడాయి 2. Federal Reserve Bank chairman Ben Bernanke యుఎస్ మానిటరీ పాలసీ బేస్ ని అత్యధికంగా విస్తరించాడు 3. కేవలం అమెరికాయే కాక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కూడా అత్యధికంగా ద్రవ్యలోటు ని అనుభవిస్తూండటమే.

కానీ ప్రభుత్వాలు ప్రజాధనంతో మంజూరు చేసిన స్టిమ్యులస్ నిధులతో ఈ రోజు డెవలప్డ్ ప్రపంచం, మత్తులో మునిగి ఉంది. వివిధ కారణాల వల్ల యూరోజోన్ లోని గ్రీస్, ఐర్లాండ్, పోర్చుగల్ ఇన్వెస్టర్స్ దృష్టిలో నమ్మకాన్ని కోల్పోయాయి.

చరిత్రలో నాగరికతలు, ఎక్కువ సార్లు ఆర్ధిక ఇబ్బందులతోనే నిట్టనిలువుగా కూలిపోయాయని ఈ దశలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం.

పైన ఉదహరించబడిన పతనాలలో, దాదాపు ప్రతీ పతనము ఆర్ధిక కారణాలతో ముడిపడి ఉన్నదే. 16వ శతాబ్ధంలో స్పెయిన్ ఆదాయం కన్నా కట్టవలసిన వడ్డీ ఎక్కువయి కృంగిపోయింది. ఫ్రాన్స్ విషయంలో 1751 నుండి 1778 కల్లా వడ్డీ, వచ్చే ఆదాయంలో 25 నుండి 62 శాతానికి చేరుకొని ఊపిరాడని దశకి చేరుకుంది. Ottoman Empire విషయంలో కూడా ఇదే స్టోరీ కొనసాగింది, 1868 లో ఆదాయంలో 17 శాతం ఉన్న అప్పులు, 1877 కల్లా 50 శాతానికి చేరుకొని Ottoman Empire ని చిన్నాభిన్నం అవడానికి నాంది పలికింది.

చివరగా బ్రిటన్ కేసు చూద్దాం. 1921 కల్లా బ్రిటన్ ఖర్చుల్లో అప్పుల వల్ల అయ్యే ఖర్చు 44 శాతానికి చేరుకుంది. అది 1937 దాకా డిఫెన్స్ ఖర్చు కన్నా కూడా పెరగసాగింది. కాని బ్రిటన్ నిజమైన సమస్యలన్నీ 1945 తరువాతే మొదలయ్యాయి. రెండవ ప్రపంచ యుద్దం అంతం కల్లా 21 బిలియన్ పౌండ్ల అప్పులో 3.4 బిలియన్ పౌండ్ల అప్పు ఇతరదేశాల క్రెడిటర్స్ కి చెందిందే!!

2001 తరువాత కేవలం పది సంవత్సరాలలోనే అమెరికా దేశ అప్పు GDP లో 32 శాతం నుండి, 66 శాతానికి చేరుకుంది. నిజానికి CBO లెక్కల ప్రకారం కొన్ని ఆర్ధిక గణాంక శాతాలలో అమెరికా పరిస్థితి రాబోవు కాలాలలో
గ్రీస్ కన్నా కూడా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సంఖ్యలన్నీ నిరాశపూరితంగా కనపడుతుండొచ్చు, కానీ ఆర్ధికస్థిరత్వం అనే రంగంలో, నిజం కన్నా నమ్మకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతానికి ప్రపంచమంతా అమెరికా ఎలాగోలా ఈ కష్టకాలంలోంచి ముక్కుతూ, మూలుగుతూ అయినా బయటపడుతుందని నమ్ముతోంది. ఈ సందర్భంలో చర్చిల్ అమెరికా గురించి అన్న మాటలు స్ఫురణకి రాక మానవు. 'అమెరికా ఎప్పుడూ సరయిన బాటలోనే నడుస్తుంది, కానీ మిగతా అన్ని బాటలన్నీ మూసుకున్నాక మాత్రమే" అని చర్చిల్ చమత్కరించాడొకసారి.

అమెరికా గురించి ప్రమాదగంటలు మోగడం ఇదే మొదటిసారి కాదు. 1980లలో కూడా అమెరికా ఆర్ధికపరిస్థితి గురించి ఆందోళనలకేం తక్కువ లేదు. కాని 1990 లకల్లా అమెరికా మిగులుబడ్జెట్ లని సమర్పించే స్థాయికి చేరుకుంది. మరి ఎందుకు చింతించటం? ఇలా నిమ్మకు నీరెత్తినట్లుండే ధోరణే సంక్షోభానికి దారి తీసుంది. ఏదో ఒక రోజు ఒక బ్యాడ్ న్యూస్ తో ఏ క్రెడిట్ ఏజెన్సీ రేటింగ్ డౌన్ గ్రేడ్ తోనో, అకస్మాత్తుగా పండిట్లే కాక సాధారణ ప్రజలు కూడా అమెరికా ఆర్థికపరిస్థితి గురించి ఆందోళన చెందటం ప్రారంభిస్తారు. ఈ రకమయిన దృష్టి మార్పే అతి కీలకమయినది.సబ్-ప్రైమ్ మార్కెట్లలలో రుణగ్రస్తులు చెల్లింపులిక చేయలేరేమోనన్న కొత్త దృక్పథం చిగురులు తొడిగి, ఇంతింతై వటుడింతై 2007 లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలన్నీ కూలిపోవడానికి దోహదపడింది.

ఇదే ఇన్వెస్టర్లు అమెరికా ప్రభుత్వం తీసుకునే స్టిమ్యులస్, జీరో ఇంట్రస్ట్ రేట్ల విధానాలు సత్ఫలితాలనివ్వదనీ, ద్రవ్యోల్భణాన్ని పెంచుతుందనీ నమ్మ్మిన రోజున, కొత్త ఆర్ధికసంక్షోభాలు రాక మానవు. ఇలాంటి విధానాలన్నీ self-fulfilling అని అంటాడు Thomas Sargent. ఎందుకంటే ద్రవ్యోల్బనాన్ని నిర్ణయించేవి మనీ సర్కులేషన్ లోని వేగం తప్ప, కేవలం మనీ సప్లై ఒక్కటే కాదు. అలాగే debt-to-gdp ratio కన్నా కూడా ఇన్వెస్టర్లు డిమాండ్ చేసే ఇంట్రస్ట్ రేట్లే ప్రభుత్వాలు గడువులోపల అప్పుల చెల్లింపులు చేయగలవా లేదా అని నిర్ణయిస్తాయి. నమ్మకాలు దెబ్బతిన్నప్పుడు ఇన్వెస్టర్లకి బాండ్స్ మీద చెల్లింపులు పెంచాల్సి రావచ్చు, తద్వారా మూలిగే నక్కమీద తాటిపండు చందానా ఆర్ధికవ్యవస్థ మీద మరింత పెనుభారం పడవచ్చు. తగ్గిపోతున్న విశ్వాసం, బాండ్స్ పై చెల్లింపుల పెరుగుదల, పెరుగుతున్న ద్రవ్యలోటులన్నీ కలిసినప్పుడు వచ్చే ఫలితం ఒక మరణవలయం. సరిగ్గా ఇదే జరిగింది 2010 లో గ్రీస్ , ఐర్లాండ్, పోర్చుగల్ లలో.

నిజమే, జపాన్ ఇంతకన్నా ఎక్కువ debt-to-gdp ratios ని తట్టుకోని నిలబడగలిగింది, ఇన్వెస్టర్ల నమ్మకాలు సడలకుండా. కాని జపాన్ అప్పులో అధికశాతం జపనీస్ ఇన్వెస్టర్లదే. కాని US అప్పులో సగం కన్నా ఎక్కువ అప్పు విదేశీ ఇన్వెస్టర్ల చేతిలో ఉంది, ముఖ్యంగా ఇరవై శాతం వరకీ చైనాదే.

అమెరికన్ డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవడం వల్ల అమెరికాకి దొరికిన అత్యంత విలువైన సౌలభ్యం, కరెన్సీని ప్రింట్ చేసుకుంటూ పోవటం. కేవలం ఆ సౌలబ్యం వల్లే అమెరికాకి ఊపిరిదొరకడానికి అవకాశం లభిస్తోంది. ఇదే వెసులుబాటు మీద చైనా ఇప్పుడు దాడి చేస్తోంది. అమెరికా డాలర్స్ జారీ అదుపుతప్పుతోందనీ, అంతర్గతంగా వినియోగవస్తువుల ధరలు పెరుగుతున్నాయనీ చైనా కామర్స్ మినిస్టర్ Chen Deming October 2010 లో అన్నారు. US నియంత్రణ లేని,బాధ్యత లేని విధానాలతో కరెన్సీ ని ప్రింట్ చేస్తోందని చైనా ఎకనమిక్ అడ్వైజర్ Xia Bin సైతం సెలవిచ్చారు.

చైనా ఆందోళనలు అర్ధం చేసుకోవచ్చు. సంక్షోభం పిదప కొన్ని కమ్మోడీటీస్ ధరలు అమెరికాలో పెరిగాయి. US Treasuries లో చైనా నిల్వలు 2009 నుండి 2010 వరకీ, 10 శాతం తగ్గాయి. గోల్డ్ ఔన్స్ కి $1400 ఉన్నప్పటికీ 2010 లో చైనా గోల్డ్ కొనుగోళ్లు ప్రారంభించింది, కాలపరీక్షకి నిలదొక్కుకున్న పెట్టుబడి అన్న నమ్మకంతో.

ఇంత జరుగుతున్నప్పటికీ, అమెరికా కి ప్రస్తుతం ఉన్న భయం inflation కాదు, deflation. 1950s తరువాత, ధరలు ఈ కాలంలోనే అత్యంత తక్కువ స్థాయిలో పెరగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ రుణాల మంజూరీ కఠినతరమై కాపిటల్ దొరకటం కష్టమవుతోంది.

వివిధకారణాల వల్ల ఆర్థికాభివృద్ది రేటు మందకొడిగానే ఉండబోతోంది. అందువల్ల ఫెడరల్ గవర్నమెంట్ ద్రవ్యలోటును పూడ్చుకోవటం దుర్లభమవుతుంది. దాంతో కట్టాల్సిన ఇంట్రస్ట్ రానురాను పెరుగుతుంది. CBO అంచనాల ప్రకారం ఫెడరల్ ఆదాయం లో ఈ రోజు 9 శాతం ఉన్న అప్పు, 2020 కల్లా 20 శాతానికీ, 2040 కల్లా 58 శాతానికి చేరుకోబోతోంది.

ఇలాంటి సంఖ్యలు, అమెరికా మిలటరీ కమిట్మెంట్స్ ని తగ్గించుకోకతప్పదేమోనన్న అనుమానలని రేకెత్తిస్తాయి. ఇలాగే కొనసాగితే, ఫెడరల్ ఆదాయంలో మిలటరీ ఖర్చు శాతం కన్నా, ఇంట్రస్ట్ పేమెంట్స్ ల ఖర్చు ఎక్కువ శాతానికి చేరుకోకతప్పదు.

(ఇక్కడ రచయిత Samuel Huntington రాసిన Clash of Civilizations గురించీ అందులో రాసిన విషయాలు, జ్యోస్యాలూ వాటిల్లో కొన్ని ఎలా నిజం కాలేదో వివరించారు. అలాగే చరిత్రలో ఒక సివిలైజేషన్ కీ, మరొక సివిలైజేషన్ కి మధ్య జరిగిన యుద్దాలూ, ఘర్షణలకన్నా ఒకే నాగరికత, సంస్కృతి లోపల అంతర్గతయుద్దాలు ఎలా ఎక్కువగా జరిగాయో, అవి ఆయా సమాజాల మీద ఎంత ప్రభావితం చూపాయో చెప్పారు)

ఆ వివరించిన నేపథ్యంలో...

చైనా ఎదుగుదలని జాగ్రత్తగా అర్ధం చేసుకోవలసిన అవసరమున్నది. 'Quiet Rise' మా ఉద్దేశం, గ్లోబల్ ఆర్డర్ ని కదిలించే ఉద్దేశం మాకు లేదని చైనా చెపుతున్నప్పటికీ కొంతమంది కామెంటేటర్స్ Samuel Huntington చెప్పిన civilizations clashes యొక్క మొదటి గుర్తులు కనపడుతున్నాయని భావిస్తున్నారు.

2010 చివర్లో US Federal Reserve Bank చేసిన quantitative easing తో, చైనా, యు.ఎస్ ల మధ్య కరెన్సీ వార్ కి నిప్పంటుకున్నట్లుగా అనిపించింది కొద్ది కాలం. "చైనా తన కరెన్సీ ని మానిప్యులేట్ చేసి ఆర్టిఫిషియల్ గా తగ్గించే ప్రయత్నాలు ఆపక పోతే, యు.ఎస్ తనని కాపాడుకోవటానికి వేరే విధానాలు అవలంబించాల్సి వస్తుంది" అని ప్రసిడెంట్ ఒబామా హెచ్చరించారు. చైనీస్ ప్రీమియర్ Wen Jiabao ఏ మాత్రం ఆలస్యం చేయలేదు ప్రతిస్పందించటానికి. "మమ్మల్ని మా కరెన్సీ గురించి వత్తిడి చేయద్దు.... ఎన్నో ఎగుమతుల కంపనీలు మూసుకోవాల్సి వస్తుంది మేము, నగరాలకి వలస వస్తూన్న శ్రామికులందరూ పల్లెలకి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. చైనా లో సాంఘిక, ఆర్థిక కల్లోలాలు ఏర్పడితే అది ప్రపంచానికే మంచిది కాదు" అని తిరిగి హెచ్చరించారు.

నిజానికి కరెన్సీ వార్స్ చైనా-యు.ఎస్ మధ్యలో జరగట్లేదు. చైనా+అమెరికా కరెన్సీలకీ, మిగతా ప్రపంచానికీ మధ్య జరుగుతున్నాయి. యు.ఎస్ కొత్త కరెన్సీ ప్రింట్ చేస్తూన్నకొద్దీ, చైనా ఆ కరెన్సీకి వత్తాసు పలుకుతూ తన కరెన్సీ ని అడ్జస్ట్ చేస్తూన్న కొద్దీ, ఇద్దరూ లాభపడ్డట్లే. నిజంగా నష్టపోయింది ఇండోనేషియా, బ్రెజిల్ లాంటి దేశాలు, వాటి రియల్ ట్రేడ్ ఎక్చేంజ్ రేట్స్ Jan 2008-Nov 2010 మధ్య 18, 17%s పెరిగాయి..

అయితే Chimerica కి ఊర్ధ్వదశ ఇప్పటికే దాటిపోయింది. ఒక spender కీ, ఒక saver కీ మధ్య జరిగిన ఆర్ధికవివాహం, విడాకుల వైపు వెళ్లబోతోందన్న చిహ్నాలు కనపడుతున్నాయి.

ఆర్ధిక సంక్షోభం కి పిదప, 2010 చైనా ఉత్పత్తులు 20 శాతం పెరిగితే, యు.ఎస్ 2 శాతం తగ్గాయి. ఈ రకమైన పరిస్థితి అప్పిచ్చేవాడికే లాభం చేకూర్చేలా ఉంటుంది కానీ, తీసుకునేవారికి కాదు. కొంతమంది అమెరికన్ పాలసీ మేకర్స్ చైనా మనకెంత అవసరమో, మనమూ చైనాకి అంతే అవసరం అన్న మంత్రాన్ని ముప్పొద్దులా చెపుతూ ఉంటారు. కానీ చైనా లీడర్స్ ఇప్పటికే అమెరికన్ డాలర్ మీదా ఆధారపడ్డం తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రణాళిక లు ఏర్పరుచుకున్నారు. చైనా ముఖ్యోద్దేశం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా, ప్రపంచాన్ని చెప్పుచేతల్లో ఉంచుకుందామన్నట్లుగా పైకి కనపడదు. చైనా ప్రణాళికల సారాంశాన్ని ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు.

1. Consume more 2. Import more 3. Invest abroad more 4. Innovate more.

పైన చెప్పిన ప్రతీ ఆర్ధికవ్యూహం చివరికి భౌగోళిక-రాజకీయ లాభాల్ని తెచ్చిపెట్టేదే. Consume ఎక్కువ చేయటం వల్ల చైనా trade-surplus ని తగ్గించుకుంటుంది. ఇప్పటికే చైనా యు.ఎస్ ని కార్ల అమ్మకాలలో అధిగమించింది. వచ్చే కొన్నేళ్లల్లో అవి పదిరెట్లు అవుతాయని ఒక అంచనా. International Energy Agency అంచనాల ప్రకారం 2035 కల్లా గ్లోబల్ ఎనర్జీలో చైనా 20 శాతం ఉపయోగించుకుంటుంది. Global Coal Consumption లో 46 శాతం చైనాలోనే జరుగుతుంది. దాదాపు అదే శాతం వినియోగం అల్యూమినియం, కాపర్, నికెల్, జింక్ లలో జరుగుతుంది. వినియోగం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఇలాంటి మార్కెట్లు ఎక్స్ పోర్టర్లకి ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఇప్పటికే చైనా ఆస్ట్రేలియా ఎక్స్ పోర్ట్ లలో 22 శాతాన్ని ఆక్రమించిన అతిపెద్ద మార్కెట్. బ్రెజిల్ నుంచి 12%, సౌత్-ఆఫ్రికా నుండి 10 శాతం ఎక్స్ పోర్ట్ లు చైనాకి వెళ్తున్నాయి. జపాన్, జర్మనీ ల నుండి హై-వాల్యూ కొనుగోళ్లని కూడా చైనా చేపట్టింది. ఒకప్పుడు చైనా కేవలం తక్కువ ధరల మానుఫాక్చరింగ్ ప్రాడక్ట్స్ ఎక్స్ పోర్ట్ లకి పేరొందిన దేశం. ఇప్పుడలా కాదు. గ్లోబల్ అభివృద్ది లో ఇరవై శాతం ఆక్రమించిన చైనా ఈ రోజున, ఇతర దేశాలకి చైతన్యవంతమయిన మార్కెట్. ఆ స్థానం ఫ్రెండ్స్ ని సంపాదించిపెడుతుంది.

కానీ చైనా ఆందోళనలు చైనాకున్నాయి.ప్రపంచ మార్కెట్లల్లో commodities prices లో ఉండే ధరల అనిశ్చితి , ముఖ్యంగా 2004-10 మధ్యలో జరిగిన అతిపెద్ద ధరల మార్పులని చూసి చైనా ఆందోళన చెందక మానదు. అందుకే దేశం వెలుపల commodity-producing assets అయిన అంగోలా లోని ఆయిల్-ఫీల్డ్స్ నుంచి, జాంబియాలో కాపర్ మైన్స్ వరకీ కొనుగోలు చేస్తుంది. కేవలం ఒకే నెలలో (Jan 2010) లో చైనా ఇన్వెస్టర్లు $2.4 billion డాలర్లని 420 overseas enterprises లలో పెట్టుబడులు పెట్టారంటే చైనా ప్రపంచ మార్కెట్ల మీద ఎంతగా దృష్టి కేంద్రీకరించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో అధిక శాతం ఏషియా(45%) , ఆఫ్రికా(42%) ల లో జరిగాయి.

ఈపాటికి చైనా అవలంబించే పద్దతులు అర్ధమయ్యే ఉండాలి. హైవే, మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ , మైన్స్, అగ్రికల్చర్ లాండ్ లలో దీర్ఘకాల లీజ్ ల మీద చైనా దృష్టి సారించింది. ఇతర దేశాల్లోని సహజ వనరుల మీద పెట్టుబడుల వల్ల డాలర్ మీద ఆధారపడ్డం తగ్గుతుందని చైనా ఆలోచన. అదే సమయంలో తన ఆర్ధిక పలుకుబడి కూడా పెరుగుతుంది. నౌకాదళ శక్తిని పెంచుకొని సముద్రమార్గాల మీదా, రవాణా మీదా పట్టు సాధించాలన్న చైనా ఆశయాలకి ఈ పెట్టుబడులు సహకరిస్తాయి అని చైనా కి తెలుసు. South-China నది ఇప్పటికే core-national interest కింద పరిగణించబడుతోంది, దానికి తోడు deep water ports పాకిస్తాన్ వరకే కాక, బర్మా, శ్రీలంక వరకీ సాగుతున్నాయి.

ఈ నమూనా ఒకప్పటి చైనా Admiral Zheng He పాటించిన దానికి భిన్నమైనది. చైనా మీద ఆధిపత్యానికి అలనాడు బ్రిటీష్ విక్టోరియన్ రాయల్ నావీ అవలంభించిన మోడల్ ఇది. 

చివరగా, "కాలిఫోర్నియాలో డిజైన్ చేయబడిన ప్రొడక్ట్ లని ఉత్పత్తి చేయడానికి అసెంబ్లీ లైన్స్ లా ఉపయోగబడేది మాత్రమే చైనా" అన్న ఇమేజ్ ని దాటి ముందుకెళ్తోంది. Wind Turbines, Photovoltaic Panels లలో కొత్త కొత్త ఇన్నోవేషన్లతో ప్రపంచంలోనే పెద్ద ఉత్పత్తిదారవాలనుకుంటోంది.

కొత్త పేటెంట్ల దరఖాస్తుల సంఖ్యలో జర్మనీ ని దాటేసింది. పేటెంట్ల జారీలో 2004 లో బ్రిటన్ నీ, 2005 లో రష్యానీ, 2006 లో ఫ్రాన్స్ ల కన్నా ముందుకు దూసుకెళ్లిన చైనా మిగతా పశ్చిమ దేశాలని అధిగమించడానికి సమాయత్తమవుతోంది.

చైనా గత దశాబ్దంలో R&D రంగంలో ఖర్చుని ఆరింతలు పెంచి, శాస్త్రజ్ణులని రెట్టింపు చేసి, ఒక సంవత్సరంలో ప్రజంట్ చేసే సైంటిఫిక్ పేపర్స్ లోనూ, సూపర్-కంప్యూటింగ్ శక్తి సామర్ధ్యాలలో యావత్ ప్రపంచంలో యు.ఎస్ తరువాత రెండవ స్థానం లోకి ఎదిగింది. ఇదంతా కూడా Eastern Ascendancy story లో ఒక భాగం.

ఇవన్నీ ఒకెత్తయితే, తూర్పుదేశాల ఎదుగుదలకి అతి పెద్ద నిదర్శనం ఎడ్యుకేషన్ రంగంలో చూడవచ్చు. Organization for Economic Cooperation and Development చేసిన study ప్రకారం, South-Korea, Japan లకీ, Britain, Italy లకీ 25-34 మధ్య ఉన్న యువకుల అకడమిక్ అచీవ్ మెంట్స్ లో ఎంతో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే రకమయిన తేడా 14 సం.ల పిల్లలలో మాథమేటికల్ ఆప్టిట్యూడ్స్ టెస్ట్ స్కోర్స్ లో కూడా ఉంది.

సింగపూర్ విద్యార్థులు, ప్రపంచ సగటు కన్నా 19 శాతం పైన ఉంటే స్కాట్లాండ్ విద్యార్థులు అదే సగటుకి 3 శాతం కింద ఉన్నారు.

***

మరి చైనా ప్రభంజనానికి అడ్డొచ్చే విషయాలేమైనా ఉన్నాయా? 

చైనా అధిరోహణకి ఆటంకాలకి కనీసం నాలుగు రకాల సిద్దాంతాలు కనపడతాయి.

మొదటిది:  
జపాన్ గురించి ఇవేరకమయిన అంచనాలూ, ప్రొజెక్షన్స్ వేయబడ్డాయి ఒకప్పుడు. జపాన్ కూడా అమెరికా కన్నా బలమయిన ఆర్ధికశక్తిగా ఎదుగుతుందని భావించారు. కానీ అది జరగలేదు. 1989 తరువాత జపాన్ విధి ఏమయిందో తెలిసిందే, అదే రకంగా చైనా కూడా స్థంబిస్తుందని కొంతమంది నిపుణుల అంచనా.
రాజకీయ, ఆర్ధిక వ్యవస్థలు నిజమైన పోటీతత్వం మీద ఆధారపడినవి కావనీ, రియల్-ఎస్టేట్, స్టాక్-మార్కెట్ లలో రాబోయే సంక్షోభాలు చైనాని భారీగా దెబ్బతీసి దివాళాకోరు బ్యాంకులూ, నెమ్మదించిన ఆర్థిక ప్రగతీ, డిఫ్లేషన్ లతో చైనాని అతలాకుతలం చేస్తాయ వీరంటారు. 

మరి కొంతమంది యూరేషియా తూర్పున కేవలం కొన్ని ఐలాండ్స్ ల సమూహాలు, పశ్చిమాన ఒక ఖండమంత ఉన్న అమెరికాకి ఎప్పటికీ పోటీ కాలేవని వాదిస్తారు. జపాన్ కూడా పశ్చిమ ప్రపంచ దేశాలని దాటేస్తుందన్న అంచనాలు ఒకప్పుడు ఇంతే నమ్మకంగా కన్పించాయనీ, నిజానికి బ్రిటన్ ని దాటినప్పటికి, అమెరికాని జపాన్ అందుకోలేకపోయిందనీ, నిజానికి 1945 లో అమెరికా చేతిలో ఓటమి పొందిన తరువాత జపాన్ సాధించిన ప్రగతి సమస్తం, తన భధ్రత కోసం అమెరికా మీద ఆధారపడి సాధించిందే అని వీరంటారు. 

రెండవది:  
అంతర్గతంగా భధ్రతా సమస్యలూ, ఆందోళనలూ జరగడం చైనా చరిత్రలో కొత్తేమీ కాదు. అవి భవిష్యత్తులో వస్తాయన్నదే ఈ రెండవ వాదం. చైనా ఈ రోజుకీ కూడా పేద దేశమే. తలసరి ఆదాయంలో చైనా 86 వ స్థానంలో ఉంది. 150 మిలియన్ల ప్రజలు అనగా పదింట ఒక్కరు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఎయిర్, వాటర్, గ్రౌండ్ పొల్యూషన్లతో చైనా సతమతమవుతోంది. సాధించిన ప్రగతి అంతా అర్బన్ ప్రాంతాలలో కావడంతో, నగరాలకి వలస పెరిగి, నగరాల మీద వత్తిడి పెరుగుతోంది. పల్లె ప్రాంతాల అభివృద్ది నగరాల స్థాయిలో లేకపోవటంతో, పల్లెప్రజల్లో అశాంతులు రేగవచ్చు. 

కానీ ఈ రోజున ఏ రకమయిన ఊహల్లో కూడా చైనాలో విప్లవమొస్తుందన్న ఆలోచన లేదు. సర్వేలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. అసమనాతలు పెరిగినప్పటికీ చైనా ప్రజలు కమ్యూనిస్ట్-కాపిటలిస్టు మిశ్రమ పద్దతిని అవలంభిస్తున్న తమ ప్రభుత్వం పట్ల సానుకూల దృష్టితో ఉన్నారు.

కొన్ని సర్వేల ప్రకారం ఫ్రీ-మార్కెట్ ఎకానమీ విధానలపట్ల ఈ రోజున అమెరికా ప్రజల కన్నా , చైనా ప్రజలు ఎక్కువ నిబద్దత కనపరుస్తున్నారు.

నిజానికి చైనా కి రాబోతున్న ప్రమాదం తన డెమోగ్రఫీ లో దాగుంది. 1979 లో అమల్లోకి తీసుకొచ్చిన one-child policy వల్ల 2030 కల్లా చైనాలో తన పొరుగు దేశమైన ఇండియా కన్నా, వృద్దుల శాతం ఎక్కువవబోతోంది. 1980లో 5 శాతమున్న 65 yrs+ జనాభా 16 శాతానికి చేరుకుంటుంది. Anhui, Hainan, Guangdong, Jiangxi లలో స్త్రీల కన్నా 38 శాతం ఎక్కువున్న పురుషుల జనాభాతో, స్త్రీ-పురుష నిష్పత్తి లో సమతుల్యం దెబ్బతింది.

మూడవది: 
పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, రాజకీయాలలో వారి మాటకి ఇప్పుడున్నదానికన్నా మరింత ప్రాధాన్యత లభించాలని ఆశించవచ్చు. పశ్చిమ దేశాల చరిత్రలో ఇదే సంభవించింది. చైనా ఒకప్పుడు గ్రామీణ దేశం. నాలుగింట మూడవ వంతు ప్రజలు పల్లెల్లో నివసించేవారు. ఈరోజు 45 శాతం జనాభా నగరాలలో ఉంది. 2030 కల్లా అది 70 శాతానికి చేరుకోవచ్చని అంచనా. అర్బన్ చైనాలో మధ్యతరగతి వేగంగా విస్తరిస్తోంది. మొబైల్ ఫోన్ల , ఇంటర్నెట్ యుగంలో ప్రభుత్వ పరిధిలోకి రాని, ప్రజల నెట్ వర్క్స్ ఏర్పడవచ్చు. నిజానికి అసమ్మతిదారుడిగా పేరొంది 2010 నోబుల్ శాంతి బహుమతి పొందిన Liu Xiaobo కంటే, తనకున్న ప్రజాదరణని కొత్త టెక్నాలజీ ద్వారా మరింత శక్తివంతంగా ఉపయోగించుకొని బాధితుల తరఫున ఉద్యమాలు లేవదీసిన ఆర్టిస్ట్ Ai Weiwei లాంటి వల్లే చైనా ప్రభుత్వానికి మరిన్ని సమస్యలు రావచ్చు. 

కానీ, దీనికి వ్యతిరేకమయిన వాదం కూడా ఉంది. అది బీజింగ్ లో ఈ పుస్తకం కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసిన టేలివిజన్ ప్రొడ్యూసర్ మాటల్లో చూడవచ్చు. "మా జనరేషన్ చాలా అదృష్టవంతులమని భావిస్తాం. మా తాతల తరం Great Leap Forward లో పాల్గొన్నారు. మా తండ్రుల తరం Cultural Revolution లోంచి వెళ్ళారు, కానీ మేం చదువుకుంటున్నాం, ట్రావెల్ చేస్తున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం. అందుకనేమో మేము ఆ స్క్వేర్ గురించి అంతగా ఆలోచించం". ఆ స్క్వేర్ Tiananmen Square అని అర్ధమయింది. డెమొక్రసీ కోసం Tiananmen Square లో జరిగిన ఉద్యమాన్ని మిలటరీ అత్యంత దారుణంగా అణచివేసిన విషయం మనకి తెలిసినదే.

నాలుగవది: 
చైనా తన పొరుగుదేశాలకి కంటగింపయింది. పరిస్థితి మరింత విషమించినప్పుడు ఆ దేశాలన్నీ కలిపి యు.ఎస్ వెనక సంఘటితమవవచ్చు. చైనా తన బలాన్ని ప్రదర్శిస్తున్న రీతి మీద గుర్రుగా ఉన్న ఏషియా దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. Qinghai-Tibetan పీఠభూమి నుంచి నీటివనరులని తరలించాలన్న చైనా ప్రణాళికలు బంగ్లాదేశ్, ఇండియా, కజక్స్తాన్ లకి సమస్యలు తీసుకురావచ్చు. చైనా అలవాటుగా, వియత్నాం లోని బాక్సైట్ మైన్స్ లో తన ప్రజలనే ఉద్యోగాల్లో నియమించటం పట్ల Hanoi లో ఓపిక నశిస్తోంది. Senkaku/Diaoyu Islands లలో rare-earth exports మీద చైనా విధిస్తున్న ఆంక్షలు జపాన్ తో చైనా సంబంధాలని దెబ్బతీసాయి.

1972 లోని రిచర్డ్ నిక్సన్- హెన్రీ కిసింజర్ ల చైనా చర్చల ఫలితం వల్ల తిరిగి ప్రారంభమయిన దౌత్య సంబంధాలని అమెరికా ఫారిన్ పాలసీ చరిత్రలోనే అతి పెద్ద మలుపు గా పేర్కొంటారు. 2010 లో India, Indonesia ల పర్యటనలతో తూర్పు వైపు దృష్టి సారిస్తున్నట్లుగా అన్పించినప్పటికి, ప్రస్తుతం వైట్-హౌస్ లో నివసిస్తున్న అమెరికా అధ్యక్షుడు చైనా మీద అంతగా శ్రద్ద పెడుతున్నట్లుగా గోచరించదు.

"వెళ్లిపోతోన్న" ఒక శక్తి కి, "రానున్న" శక్తి తీసుకొచ్చే తలనొప్పుల డైలమా అంతా ఇంతా కాదు. ఎదుగుతోన్న జర్మనీ ని నిరోధించే ప్రయత్నంలో బ్రిటన్ చాలా కోల్ఫోవాల్సి వచ్చింది. ఆ ఖర్చుల కన్నా యు.ఎస్ కి ఒక జూనియర్ పార్ట్నర్ గా ఉండిపోవడం బ్రిటన్ సులభమయింది.

మరి అమెరికా, చైనా ని నియంత్రించాలా లేక చైనా ని ప్రసన్నం చేసుకోవాలా?

ఒపీనియన్ పోల్స్ లో అమెరికన్ ప్రజలు, తమ అధ్యక్షుడి లాగే ఎటూ తేల్చుకోలేని ధోరణిని వ్యక్తపరుస్తున్నారు. ఒక పోల్ ప్రకారమ్ 49 శాతం అమెరికన్ ప్రజలు ప్రపంచ సుపీరియర్ పవర్ గా అమెరికాని చైనా అధిగమించదని భావిస్తే, 46 శాతం ప్రజలు చైనా సూపర్ పవర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. సోవియట్ యూనియన్ పతనమయిన తరువాత, ఏకధృవ ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికా కి లభించిన స్థానంతో కొంతమంది కామెంటేటర్స్ తలలకి మత్తెక్కింది. నిజానికి కోల్డ్-వార్ నలభై సంవత్సరాలు సాగింది, సోవియట్ యూనియన్ యు.ఎస్ ఎకానమీని అధిగమించే స్థాయికి కనీస దూరం లోకి ఎప్పుడూ రాలేదు.

కానీ, మనమిప్పుడు పశ్చిమప్రపంచపు ఐదొందల సంవత్సరాల ఆధిపత్య అంత్యదశలో ఉన్నాం. ఈ సారి తూర్పు ప్రపంచం నుంచి పైకెదుగుతూ సవాల్ విసురుతున్న పోటీదారుడు ఆర్ధికంగా శక్తివంతమైనవాడే కాక, భౌగోళిక-రాజకీయాలలొ కూడా బలంగా ఎదుగుతున్నవాడు.

We are the Masters now అని చైనా ప్రకటించుకోవడానికి సమయమింకా ఆసన్నం కాలేదు, కానీ వారు ఎప్పుడో అప్రెంటిస్ దశని దాటి వచ్చేసారు. కానీ ఈ ధృవాల మధ్య Samuel Huntington ఊహించిన Clash of Civilizations ల ఘర్షణ బహుశా జరగకపోవచ్చు. బహుశా గత ఐదొందల సంవత్సరాలలో జరిగినట్లుగానే వెస్ట్ వైపే బలం మొగ్గవచ్చు. కానీ, ఒక సివిలైజేషన్ బలహీనపడి, మరొక సివిలైజేషన్ బలపడ్డప్పుడు కీలకమయిన ప్రశ్న అవి రెండూ ఘర్షణ పడతాయా, లేదా అన్నది కాదు. బలహీనపడ్డ శక్తి అంచు మీద నుంచి జారి ఒకేసారి కూలిపోతుందా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.

హిందూ-కుష్ పర్వతాల నుంచి వైదొలగడమూ, మెసపొటేమియా మైదానాల్లోంచి వెనక్కి మరలడమూ, క్షీణించి నశించబోతున్న సోవియట్ యూనియన్ కి సంకేతాలుగా నిలచాయి. 1989 లో ఆఫ్ఘనిస్తాన్ లోంచి వైదొలగిన సోవియట్ యూనియన్ 1991 కల్లా అంతరించిపోయింది. జరిగిందాన్ని గమనించినప్పుడు ఎప్పుడో ఐదో శతాబ్ధం లో జరిగినట్లుగా సివిలైజేషన్స్ మెల్లిగా అవతరించి, వృద్దిలోకి వచ్చి, ప్రాభ్యవ్యాన్ని పొంది, ప్రపంచాన్ని శాసించి, క్రమంగా జారిపోవు. చరిత్రకారులు వెనక్కి తిరిగి చూసి చరిత్ర రాసినప్పుడు, సివిలైజేషన్స్ నశించడాన్ని అతినెమ్మదిగా జరిగే ప్రక్రియగా, నిర్ధారణగా తెలిసిన ఎన్నో కారణాలతో అంతమయిపోయాయి అన్నట్లుగా అభివర్ణిస్తారు. అది నిజం కాదు. ఈ చాప్టర్లోనే పైన చెప్పుకున్నట్లుగా సివిలైజేషన్స్ అతి సంక్లిష్టమయిన ఇతర వ్యవస్థల్లాగే ప్రవర్తిస్తాయి. ఒక పరిపూర్ణమయిన సమతుల్యంలో, మనం తెలుసుకోలేనంత కాలం సివిలైజేషన్స్ మన్నుతాయి, వెలుగుతాయి. ఆ పిదప అకస్మాత్తుగా అవి అంతరిస్తాయి. పైన చెప్పుకున్న Thomas Cole పెయింట్ The Course of Empire కన్నా, ఒకప్పుడూ ఎన్నోవేల కాలేజ్ హాస్టళ్లల్లో ఉన్న ఒక పోస్టర్ ఈ పరిస్థితికి దృశ్యచిత్రంగా నిలుస్తుందని చెప్పవచ్చునేమో. వేగంగా దూసుకెళ్తూన్న ఒక రైలు విక్టోరియన్ స్టేషన్ టర్మినల్ గోడని ఢీకొని ఆగక, కిందనున్న రోడ్డుమీదకి తలక్రిందులుగా జారిపోయిన వైనాన్ని చిత్రీకరించిన ఆ ఆ పోస్టరే బహుశా నిజానికి దగ్గరేమో!

వెస్ట్రన్ సివిలైజేషన్ ని ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి అసలేమైనా చేయగలమా?

అన్నిటికన్నా ముందరగా మనం, వెస్ట్రన్ సివిలైజేషన్ అంత్యదశ ఆసన్నమయిందని నిర్ధారణగా అనుకోవటం మానేయాలి. నిజమే, మిగతా ప్రపంచం కన్నా వెస్ట్ ని ముందుంచిన విషయాలు ఈ రోజున కేవలం వెస్ట్ కే పరిమితమయి లేవు. ఈ రోజున చైనాలో కాపిటలిజం కూడా ఉంది. ఇరానియన్స్ దగ్గర సైన్స్ ఉంది. రష్యా డెమొక్రసీని తెచ్చుకుంది. ఆఫ్రికన్స్ (నెమ్మదిగా) మోడరన్ మెడిసిన్ ని సాధించుకుంటోంది. టర్కీ కన్స్యూమర్ సొసైటీగా ఎదుగుతోంది. వీటన్నిటి అర్దమేమిటంటే వెస్ట్రన్ దేశాల పనితీరు నమూనాలు క్షీణించట్లేదని, ఏవో కొన్ని భాగాల్లో తప్ప, అవి దాదాపు ప్రపంచమంతటా వర్ధిల్లుతున్నాయని.

రోజురోజుకీ మరింత ఎక్కువ మంది పశ్చిమేతరులు, పశ్చిమదేశాల ప్రజల్లాగా డ్రెసింగ్, ట్రావెలింగ్, డ్రింకిమ్గ్, ఈటింగ్, ప్లేయింగ్, వర్కింగ్, షవరింగ్, స్లీపింగ్ లు అలవాటు చేసుకుంటున్నారు.

మరింత ముఖ్యంగా వెస్ట్రన్ సివిలైజేషన్ కేవలం ఏదో ఒక్క విషయం కాదు, అదొక పాకేజ్. అది కేవలం కాపిటలిజమే కాదు, ఒక political pluralism కూడా (multiple states and multiple authorities). స్వేచ్చ ఆలోచనల్లోనే కాదు, సైంటిఫిక్ మెథడ్ లో కూడా. అది రూల్-ఆఫ్-లా, ఆస్థి-హక్కు లకి సంబంధించింది కూడా. ఈ రోజుకి కూడా వెస్ట్ లో ఉన్న వ్యవస్థలు , ఇతర ప్రపంచం కన్నా మెరుగైనవి. చైనాలో పొలిటికల్ - కాంపిటీషన్ లేదు. ఇరాన్ లో ఆత్మప్రభోధంగా నడుచుకునే స్వేచ్చ లేదు. రష్యాలో వోటు-హక్కు రావచ్చేమో కాక, కాని అక్కడ రూల్-ఆఫ్-లా అవినీతితో కూడుకున్నది. ఈ దేశాలేవీ కూడా స్వేచ్చాపూరిత జర్నలిజం ని అనుమతించవు. బహుశా అందుకేనేమో ఈ మూడు దేశాలన్నీ కలిపి కూడా 'National Innovative Development' and 'National Innovation Capacity' ల లాంటి నాణ్యతాకొలబద్దల్లో వెస్ట్రన్ దేశాల కన్నా వెనకపడి ఉంటాయి.

వెస్టర్న్ సివిలైజేషన్ లో లోపాలకేం కొదవ లేదు. చారిత్రాత్మకమయిన తప్పిదాలు పశ్చిమ నాగరికత చాలానే చేసింది. ఇంపిరీయలిజంతో అది చేసిన ఘోర కృత్యాలూ, తన వినియోగసంస్కృతి లోని డొల్లతనం, దాని తీవ్రమైన మెటీరియలిజం లన్నీ కూడా ఆ తప్పిదాల పరిణామాలే. ప్రొటెస్టెంట్ ఎథిక్ గురించి Max Weber ఎంతో గొప్పగా చెప్పుకున్న క్రమశిక్షణా, వాంఛా-కోరిక ల పట్ల స్వీయ-నియంత్రణ లని పశ్చిమనాగరికత ఏనాడో కోల్పోయింది.

అయినప్పటికీ, ఉన్నదాంట్లో మెరుగైన ఆర్ధిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థల పాకేజ్ గా ఈ వెస్టర్న్ పాకేజ్ ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాలని ఆకర్షిస్తోంది. వ్యక్తి స్థాయిలో మానవ సృజనాత్మకతని ఎంతో ప్రేరేపించే వ్యవస్థలుగా, 21వ శతాబ్ధం లోని రానున్న సమస్యలకి ఇదే పరిష్కారంగా ప్రపంచం నలుమూలలా ఈ నమూనాలని దిగుమతి చేసుకుంటున్నాయి.

గత అర్ధ-సహాస్రాబ్దంలో మరే ఇతర సివిలైజేషన్ కూడా ఇంతగా, మానవ సమాజం లో ఎక్కడో మరుగున ఉన్న టాలెంటెడ్ వ్యక్తులని కనిపెట్టి, వారిని ఎడ్యుకేట్ చేయలేదు. కానీ మన ముందున్న పెద్ద ప్రశ్న ఈ పాకేజ్ కి అంతర్గతంగా ఉన్న శక్తులని మనం గుర్తిస్తున్నామా, లేక మర్చిపోతున్నామా అన్నదే.

మూలాల్లోకి వెళ్లి చూస్తే, స్కూళ్లల్లో ఏవయితే భోధిస్తున్నారో అవే నాగరికత గా చెప్పుకోవచ్చు.. చైనా నాగరికత ఒకప్పుడు Confucius భోధనల మీద నిర్మించబడింది, ఇస్లాం నాగరికత ఈ రోజుకీ ఖురాన్ మీద ఆధారపడింది. మరి ఈ రోజున వెస్టర్న్ సివిలైజేషన్ స్కూళ్ల లో భోధించబడుతున్న ముఖ్య గ్రంధాలేమిటి? పైన చెప్పుకున్న వ్యవస్థల మిశ్రమమైన పాకేజ్ ఒక ఫలితంగా వచ్చేలా పశ్చిమదేశాలలోని స్కూళ్లు ఈ రోజున ఎంత ప్రభావితంగా భోధించగలుగుతున్నాయి? బహుశా వెస్టర్న్ సివిలైజేషన్ కి నిజమైన ప్రమాదం చైనా, ఇస్లాం, కార్బన్ ఎమిషన్స్ రూపంలో రావట్లేదేమో, పూర్వీకుల నుంచి సంక్రమించిన నాగరికతలో పశ్చిమ దేశాల ప్రజలకి నమ్మకం పోవటం వల్ల వస్తుందేమో?

***

P.G.Woodhouse అన్నట్లుగా పశ్చిమ నాగరికత, ఒక అపరిపక్వ-అనుసరణ కాదు.


"సమాజంలో నిలదొక్కుకున్న ఆచారాలకీ, నమ్మకాలకీ, వారి కోరికలకీ తగ్గట్లుగా, పాలక పక్షం నడచుకోవాలని రాజ్యాంగంలో ప్రకటించుకొని దానికి నిబద్దులవడమే, పశ్చిమ నాగరికత కేంద్రంలో ఉన్న ముఖ్యమైన నియమం" అని ఎంతో విలువైన మాటని తన ఉపన్యాసం లో చెప్పాడు Churchill.


అదే స్పీచ్ లో ప్రస్తావించిన ఆ బార్బారిక్, ఆటవిక శక్తులు ఆ రోజున బ్రిటన్ బయటున్నాయి, ముఖ్యంగా జర్మనీ లో. కానీ, ఆ ఆటవిక శక్తులు కూడా పశ్చిమ నాగరికతలోంచి వచ్చినవే అని మనమీ రోజున వెనక్కి తిరిగి చూసి గమనించవచ్చు. అదే విధంగా ఈ రోజున వెస్టర్న్ సివిలైజేషన్ కి ప్రమాదం బయటనుంచి వస్తున్నది కాదు, అంతర్గతంగా వస్తున్నదే. ఎన్నో ధోరణుల వల్ల స్వయాన బలహీనంగా, పిరికిగా తయారవుతున్న సమాజాల వల్ల వస్తున్నదే. చరిత్ర మీదున్న అజ్ణానం తో, ఏ విలువలూ, నియమాలూ, ధోరణులూ, దృక్పథాలూ తమని ఒకప్పుడు మిగతా ప్రపంచం కన్నా ముందు నిలబెట్టాయో అన్న విషయం మరవడం వల్ల వస్తున్నదే.

Sunday, 21 April 2013

నిజానికి ఈ మెడిసిన్ అనే చాప్టర్, CONSUMPTION కన్నా ముందే రావాల్సింది, కానీ ఈ చాప్టర్ చాలా పెద్దది అవడం మూలానా, పెరిగిన పనిభారంతో కావాల్సినంత టైం అండ్ ఎనర్జీ దొరకకపోవటం వలనా, అన్నిటికన్నా ముఖ్యంగా మెడిసిన్ రంగంలో వెస్ట్ కంట్రిబ్యూషన్ ఎంత గొప్పదో, ఎన్ని వందల కోట్ల జీవితాలని రక్షించిందో, మనందరికీ తెలిసిన విషయమే కావున, ఈ చాప్టర్ ని స్కిప్ చేయటం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్లు పుస్తకం సంపాదించి చదువుకుంటార్లే అని వదిలేస్తున్నాను.

Saturday, 20 April 2013

 

WORK ETHIC AND WORD ETHIC


 మనమిప్పటివరకీ చూసినట్లుగా గత 500 సంవత్సరాలలో వెస్టర్న్ సివిలైజేషన్ ప్రపంచాధిపత్య స్థానాన్నిసంపాదించడమే కాక, అద్వితీయమైన ఎదుగుదలని సాధించింది. వెస్టర్న్ వ్యవస్థలయిన కార్పొరేషన్, మార్కెట్, స్వతంత్రప్రతిపత్తి కలిగిన పౌరుల దేశం లాంటివి కాంపిటీటివ్ ఎకనామిక్స్ కి గ్లోబల్ నమూనాలైనాయి, వాటిని మిగతా ప్రపంచం నకలు చేసుకుంది. వెస్టర్న్ సైన్స్ ఎన్నో దృక్పథాలని సమూలంగా మార్చేసింది, ఇతరులు దాన్ని అనుసరించారు, చేయని వాళ్ళు శాశ్వతంగా వెనకపడిపోయారు. దాంట్లోంచి వెలువడ్డ వెస్టర్న్ విధివిధానాలయిన రాజనీతి, చట్ట, ప్రజాస్వామ్య మోడల్స్, నాన్-వెస్టర్న్ మోడల్స్ ని తొలగించేయటమో, పూర్తిగా ఓడించటమో చేసాయి. వెస్టర్న్ మెడిసిన్ నాటు, అశాస్త్రీయ వైద్యులనీ, రోగాలు నయం చేస్తామని చెప్పే దొంగ బాబాలనీ చాలా వరకీ తగ్గించటమే కాక వారి పరిధిని విస్తృతంగా కుదించేసింది. వీటన్నిటికన్నా ఎక్కువగా వెస్టర్న్ మోడల్స్ అయిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, వినియోగవ్యవస్థలు మిగతా ఏ పర్యాయవ్యవస్థలనీ పైకి లేవకుండా తుంచేసింది. 1990 చివర్ల వరకీ కూడా వెస్ట్, ప్రపంచాధిపత్య నాగరికత (సివిలైజేషన్) గా చలామణీ అయ్యింది. అయిదు వెస్టర్న్ ప్రముఖ దేశాలయిన అమెరికా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా లు గ్లోబల్ మానుఫాక్చరింగ్ లో 44 శాతం ఉత్పత్తి చేసాయి. సైంటిఫిక్ ప్రపంచాన్ని వెస్టర్న్ యూనివర్సిటీస్ ఏలాయి. నోబుల్ ప్రైజెస్ లో సైతం సింహభాగం వారికే దక్కింది. 1989 లో వచ్చిన పెనువిప్లవాల మార్పుల తరువాత, ప్రపంచమంతా ప్రజాస్వామ్య పవనాలు వీయటం ప్రారంబించాయి. వెస్టర్న్ బ్రాండ్స్ కోకాకోలా, లెవైస్, మెక్ డొనాల్డ్స్ ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరంలో కన్పించటం ప్రారంభించాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలటమే కాదు, ఎకానమీ లో అమెరికాని దాటి, ఒకటవ స్థానం లోకి వెళ్తుందని కొందరు అంచనా వేసిన జపాన్ తప్పటడుగులు వేసి, ఒక దశాబ్థం పైగా శూన్యమైన ఆర్థికాభివృద్దిని సాధించి, Lost decade లోకి జారిపోయింది. ప్రపంచదేశాల సంబంధాలని అధ్యయనం చేసే నిపుణులంతా అమెరికా ఆరోహణ ని వర్ణించటానికి మాటలు వెతుక్కున్నారు.



ఈ పుస్తకం రాసేప్పటికి  రెండు  ఆర్థిక-సంక్షోభాలు, అనుకోకుండా తలపెట్టాల్సి వచ్చిన రెండు క్లిష్టమయిన యుద్దాలు, 1930 great-depression తరువాత ఎప్పుడూ చూడనంత పెద్ద great-recession , వీటన్నిటినిటినీ మించి మిరిమిట్లుగొలిపే అభివృద్ది, ఆర్థిక వృద్ధి సాధించి జపాన్ ని పక్కకి తోసి ప్రపంచం లోనే రెండవ పెద్ద ఎకానమీ గా చైనా ఎదిగినటువంటి పరిణామాల తరువాత మనముందున్న ప్రశ్న: అటూఇటుగా అర్ధసహస్రాభ్ద ఆధిపత్యానంతరం  ప్రపంచ నాయకత్వస్థానం నుంచి వెస్ట్ స్థానం కిందకి జారడం ప్రారంభమయిందా అన్నదే!

ఒకవేళ అదే నిజమయితే, వెస్ట్ పతనం ఇదే మొదటిసారి కాదు. The History of the Decline and Fall of the Roman Empire(1776-1778 six volumes) ,గతంలో వెస్ట్ ఎలా క్షీణించిందన్నవివరాలని  విపులంగా చెపుతుంది. చరిత్ర పునరావృతమవనుందా అన్నది పలువురి మదిలో ఉన్న ప్రశ్న.  రోమ్ సామ్రాజ్య పతన కారణాలని చూసినప్పుడు ఈ భయాలేవి కొట్టేయదగినవిగా కనపడవు. ఆర్ధిక సంక్షోభాలూ, విస్త్రతంగా ప్రబలిన వ్యాధులూ, బోర్డర్స్ దాటి అత్యధిక సంఖ్యలో ముంచుకొచ్చిన ఇమ్మిగ్రంట్స్, ప్రత్యర్థి దేశాల ఎదుగుదలా, East లో Prussia, Alaric's Goths & Attila's Huns terror ఇవన్నీ కలిపి రోమ్ మహా సామ్రాజ్యాన్ని అంతంచేసాయి.
ఈరోజున వెస్టర్న్ ప్రపంచం వీటన్నిటితో సతమతమవుతూ ఉంది. ఆర్ధిక అస్థవ్యస్థ పరిస్థితులూ, పర్యావరణ పతనం వల్ల రాబోయే ఉపద్రవాలూ, కొన్ని పశ్చిమ దేశాల నడిబొడ్డున ఇమ్మిగ్రంట్ కమ్యూనిటీస్ లో ఇస్లామిస్ట్ ఐడియాలజీ, టెర్రరిజం వ్యవస్థలూ మొదలగునవన్నీ వెస్టర్న్ ప్రపంచ అస్థిత్వానికే పెను సవాళ్ళు విసురుతున్నాయి. మరో పక్క తూర్పున చైనా అద్భుతమయిన ఎదుగుదలని సాధించి రానున్న కొన్ని దశాబ్ధాలలో ప్రపంచ ఎకానమీలో మొదటిస్థానానికి చేరుకోనుంది.

 పదహారవ శతాబ్ధం లో క్రిస్టియానిటీలో ఎదిగి, తనదైన శైలిలో నిర్వచించుకున్న Hard-work, Wise management of money and other resources లతో కూడుకున్న Protestantism వెస్టర్న్ సివిలైజేషన్ విజయానికి మూలకారణాలలో ఒకటని Decline and Fall of the Roman Empire లో Gibbon వాదిస్తాడు.

ఈ నేపథ్యంలో మనం వెస్ట్ ఎదుగుదలలో మతానికీ, దేవుడికీ ఉన్న పాత్ర ఏమిటో, ఇరవై శతాబ్ధపు అంత్యదశలో పశ్చిమదేశాల పౌరులు దేవుణ్ణీ, మతాన్నీ ఎందుకు పెద్ద సంఖ్యలో త్యజించారో చూద్దాం. 
పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో మీరు యూరప్ లోని ధనవంతులయిన ఇండస్ట్రియలిస్ట్ అయి ఉన్నట్లయితే మీరు Protestant అయ్యే అవకాశాలు చాలా తక్కువ. Reformation తరువాత యూరోపియన్ దేశాలు క్రమక్రమంగా రోమన్ కాథలిక్ చర్చ్ నుంచి దూరం జరగటం ప్రారంభించాయి. ఆర్ధిక శక్తి ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ ల నుంచి, ప్రొటెస్టేంట్ దేశాలయిన ఇంగ్లాండ్, హాలండ్, ప్రష్యా, సాక్సొనీ , స్కాట్లాండ్ లకి తరలటం ప్రారంభమయింది. ప్రజల నమ్మకాలు ఆర్ధిక అదృష్టాలని ప్రభావితం చేసాయా? మరి ప్రొటెస్టంటిజం లో ఉన్న తేడా ఏంటి? Luther భోధనలు కేవలం కష్టించి పనిచేయమనే చెప్పకుండా, పెట్టుబడిని పోగుచేసుకోమని కూడా భోధించాయా?
ఈ ప్రశ్నలన్నిటికీ ఒక ప్రభావవంతమైన సమాధానాన్ని వెతికిన మనిషి జర్మన్ ప్రొఫెసర్ అయిన Max Weber. Father of modern sociology గా పిలవబడే Max Weber 'Protestant work ethic" అన్న పదాన్ని నిర్వచించాడు. అతి చిన్న వయసులో మేధావిగా గుర్తింపు పొందిన Weber , "The History of Medieval Business Organizations" and "Roman Agrarian History and its Significance for Private Law" లాంటి థీసిస్ లతో ముప్పైఏళ్ళకి Freilburg లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా నియమింపబడ్డాడు. Reformation వచ్చేంతవరకీ, క్రిస్టియానిటీ  ఇహలోక, భౌతిక విషయాలకన్నా, దైవ భక్తీ, దైవసేవా, అంకితభావం మీద ఎక్కువగా ప్రాముఖ్యతని ఇచ్చేది. ధనం వడ్డీకి ఇవ్వటం పాపం గా భావించేవారు. పేదవారికన్నా ధనవంతులు స్వర్గానికి వెళ్ళే అవకాశాలు తక్కువన్న నమ్మకం ప్రబలి ఉండేది. ఆధ్యాత్మిక జీవనశైలి ఫలితాలు మరణానంతరం లభిస్తాయి అని నమ్మేవాళ్ళు. 1520 తరువాత రిఫార్మేషన్ ప్రభావం చూసిన దేశాల్లో పరిస్థితి అంతా మారిపోయింది . రిఫార్మేషన్ లో ఏ కారణం వల్ల ఉత్తర యూరప్ కాపిటలిజం వైపు అడుగులు వేసిందా అని Weber తన అనుభవాల నేపథ్యంలో ఆలోచించాడు.

1904 లో Weber అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరాన్ని సందర్శించాడు. ఎన్నో లైట్లతో వెలిగిపోతున్నసెయింట్ లూయిస్ నగరం Weber ని ఆశ్చర్యపరచింది. సాక్షాత్తూ థామస్ ఎడిసన్ అక్కడే ఉన్నాడు. నగరంలో  టెలిఫోన్స్ మొదలు మోషన్ పిక్చర్స్ వరకీ మోడర్న్ టెక్నాలజీ నిండిపోయి కనపడింది. ఈ సమాజంలోని ఏ లక్షణం తన ఇండస్ట్రియల్ జర్మనీ ని సైతం మందకొడి సమాజంగా కనపడేలా చేస్తోందన్న ప్రశ్న Weber ని వేధించింది. వెనువెంటనే అమెరికాలో మిగతా ప్రదేశాల కి ప్రయాణం కట్టాడు. వందేళ్ళ క్రితం తన ప్రయాణంలో సెయింట్ లూయిస్ కి వంద మైళ్ళ దూరం లో  సెయింట్ జేమ్స్  లో , కొత్తగా వెస్ట్ వైపు వేస్తున్న రైలు మార్గాల పక్కనే కొత్తగా వెలుస్తున్న చిన్న చిన్న టౌన్స్ లో పెద్ద సంఖ్యలో ఉన్న చర్చ్ లు, చాపెల్స్ , అమెరికా మెటీరియల్ సక్సెస్, అమెరికా రిలీజియస్ లైఫ్ కి మధ్యన ఏర్పడిన అనుసంధానం తన దృష్టిని ఆకర్షించాయి.  The protestant ethic and Spirit of Capitalism అన్న వ్యాసాన్ని రచించాడు. వెస్టర్న్ సివిలైజేషన్ గురించిన వాదనల్లో ఈ వ్యాసం ప్రముఖమైనది.  వెస్టర్న్ సివిలైజేషన్ లోని ఆర్ధిక చైతన్యం, ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ వల్ల అనుకోకుండా వచ్చిన పరిణామమని Weber వాదిస్తాడు. మిగతా మతాలు భౌతికమయిన వస్తువులనీ, సౌకర్యాలనీ త్యజించమని భోదిస్తున్న కాలంలో , ప్రొటెస్టెంట్ వర్గాలు ఇండస్ట్రీని, కష్టపడి పనిచేయటాన్నీ, డబ్బునీ తెలివిగా వాడుకోవడాన్ని , పనియే దైవమన్న భావనగా చూసారనీ, అందువల్ల సదా కష్టించి పనిచేయటమే  protestant work ethic లో భాగమనీ, ఇదే కాపిటలిజం కి జన్మనిచ్చిందనీ, ఇంకా ఇతర కారణాలతో  వాదిస్తాడు.

Weber వాదనల్లో లోపం లేకపోలేదు. అతను Jews ని విమర్శించిన తీరు, ఫ్రాన్స్ బెల్జియం లలో successful Catholic Entrepreneurs ని విస్మరించిన తీరు, మార్టిన్ లూథర్ , బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలు, జర్మనీ లో ప్రొటెస్టెంట్ ప్రాంతాల్లో Weber వాదనకి సరిపోని ఉదాహరణలు అతని వాదనల్లో లోపాలకి ఉదాహరణలు.

అయినప్పటికీ, కొన్ని కారణాలు Weber ఒక మూలసూత్రాన్ని కనిపెట్టేదిశలో సరైన దిశలోనే అడుగులు వేసాడనిపిస్తుంది. రిఫార్మేషన్ తరువాత యూరప్ లోని ప్రొటెస్టెంట్ దేశాలు, కాథలిక్ దేశాల కన్నా వేగంగా అభివృద్ది చెందాయి. 1700 కల్లా సగటు ఆదాయం ఎక్కువుండటమే కాక, 1940 ల కల్లా జీవన ప్రమాణాల్లో కనీసం 40 శాతం ఎక్కువ అభివృద్ది సాధించాయి. ఒకవేళ రిలీజియన్ ఒక్కటే దీనికి కారణం కాదు అని అనుకున్నా, ప్రొటేస్టేంట్ ల మాజీ కాలనీలు కూడా, కాథలిక్ కాలనీల కంటే ఎకనామికల్ గా మెరుగ్గా ప్రగతి సాధించాయి. రిఫార్మేషన్ కాలంలో బైబిల్ కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా, ప్రతి సగటు మనిషి చదవగలగాలీ, చదవాలీ అన్న Luther ఆలోచనా, ఆశయం మేరకు Protestantism అక్షరాస్యత ని ప్రోత్సహించింది. ఆ తరువాత వచ్చిన ప్రింటింగ్ ప్రెస్ , అక్షరాస్యతలూ కలసి , ఆర్థికాభివృద్ది కీ, సైన్స్ అధ్యయనానికీ ఎంతో తోడ్పడ్డాయన్నది తోసిపుచ్చలేని సత్యం.  స్కాట్లాండ్ లాంటి విద్యాధికశాతం సాధించిన సమాజంలోనే కాకుండా ప్రొటెస్టెంట్ ప్రపంచంలో అంతటా కూడా ఈ పరిణామం సంభవించింది. ప్రొటెస్టెంట్ మిషనరీస్ ఏ దేశానికిళ్ళినా అక్కడ లోకల్ ప్రజల్లో అక్షరాస్యత పెంపొందించడానికి పాటుపడ్డారు. కానీ, కాథలిక్ మిషనరీస్ ఇలా అక్షరాస్యత ప్రోత్సాహానికి ప్రాముఖ్యతనిచ్చారని చెప్పలేము. రిఫార్మేషన్ సమయంలో రిఫార్మేషన్ ని వ్యతిరేకించిన కాలం నుంచీ రెండవ వాటికన్ కౌన్సిల్ కాలం (1962-65) వరకీ వారీ విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. ప్రొటెస్టెంట్ మిషనరీస్ వల్లే బ్రిటీష్ కాలనీల్లో స్కూల్స్ లో విద్యార్థుల నమోదు శాతం ఇతర దేశాల కన్న కనీసం నాలుగయింతలు ఎక్కువగా ఉండేది.

 1941 లో బ్రిటీష్ కాలనీ అయిన ఇండియాలోని కేరళ 55 శాతం అక్షరాస్యతని సాధించి , ఇండియాలోనే ఏ ఇతరప్రాంతం కన్నా కూడా ముందు నిలవడమే కాక, యూరప్ లోని పేద దేశాలయిన పోర్చుగల్ లాంటి సరసన నిలచింది. దీనికి కారణం కేరళలో ప్రొటెస్టెంట్ మిషనరీస్ ఎక్కువగా, యాక్టివ్ గా పనిచేయటం. ఎక్కడైతే ప్రొటెస్టెంట్ మిషనరీస్ యాక్టివ్ గా లేవో (ఉదా: ముస్లిం ప్రాంతాలు, ప్రొటెక్టరేట్స్ ) అక్కడ అక్షరాస్యత చాలా నెమ్మదిగా అభివృద్ది చెందింది. 

రిలీజియన్స్, సంఘాలని అంతర్లీనంగా చాలా ప్రభావితం చేస్తాయి. ముందు చాప్టర్లల్లో చెప్పినట్లుగా Stability Ethic మీద దృష్టి కేంద్రీకరించిన Confucius Philosophy చైనా  అపజయాల్లో ఎలాంటి పాత్ర పోషించిందో చూసాం. వెస్టర్న్ యూరప్ లో కాంపిటీషన్ అధారంగా ప్రోత్సాహించబడిన ఇన్నోవేషన్ పూర్తిగా భిన్నమైనది. ఇస్లామిస్ట్ దేశాల్లో కూడా ముల్లాలు, ఇమామ్ లు సైంటిఫిక్ ప్రగతిని ఎలా సమూలంగా అణచివేసారో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే సౌత్ అమెరికా లో , ఆర్ధికాభివృద్దికి రోమన్ కాథలిక్ చర్చ్ ఎలా అడ్డంకిగా మారిందో కూడా చూసాం.

ఒక్క విషయం స్పష్టం. ప్రొటెస్టెంట్ కల్చర్ పౌరులని ఎక్కువ కష్టపడేలా మాత్రమే కాక , ఎక్కువ పొదుపు చేసేలా, ఎక్కువ చదువుకునేలా చేసింది. టెక్నాలజీ మరియు వినియోగం రెండూ కలపి ఇండస్ట్రియల్ రివల్యూషన్ ని వర్ధిల్లచేసి ఉండొచ్చుగాక, కానీ ఆ పారిశ్రామిక విప్లవం పని గంటలని, పని తీవ్రతని ఎక్కువ చేయటమే కాక, పొదుపు మరియు ఇన్వెస్ట్మెంట్ ల ద్వారా పెట్టుబడి ని పెంచింది. వీటన్నిటికన్నా ఎక్కువగా అది హ్యుమన్ కాపిటల్ మీద ఆధారపడింది. ప్రొటెస్టంటిజమ్ ప్రోత్సహించిన అక్షరాస్యత వీటన్నిటికీ కీలకమయింది.

మరి ఇప్పుడు వెస్ట్ తన మతాన్నీ, దాంతో పాటూ వచ్చిన work ethic ని కోల్పోయిందా?

GET YOUR KICKS 


యూరొపియన్స్ ఈ రోజు టైం వేస్ట్ చేస్తూ ఖాళీగా గడుపుతున్నారు. సగటున వారు అమెరికన్స్ కన్నా తక్కువగానూ, ఏషియన్స్ కన్నా మరింత తక్కువ పనిగంటలు పని చేస్తున్నారు. అంతకు ముందు తరాలతో పోలిస్తే చదువు పూర్తయ్యే కాలం మరింతగా పొడిగింపబడటమూ, తొందరగా రిటైర్ అవ్వటమూ కలపి , పనికి అవసరమయిన యూరోపియన్స్  తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటున్నారు. ఉదాహరణకి బెల్జియం, గ్రీకు లలో పదిహేనేళ్లని మించిన యువతీయువకుల్లో 54 శాతం మాత్రమే లేబర్ ఫోర్స్ లో ఉంటే,  అమెరికాలో 65, చైనా లో 74 శాతం ఉన్నారు. యూరోపియన్స్ స్ట్రైక్ లకి వెళ్ళే అవకాశాలూ, సందర్భాలూ కూడా ఎక్కువే. 2000-2009 ల మధ్యలో సగటు అమెరికన్ 1711 గంటలు పనిచేస్తే, సగటు జర్మన్ 1437 గంటలు మాత్రమే పనిచేసాడు.  1979 లో ఇంత తేడాలుండేవి కాదు, సగటు స్పానిష్ వర్కర్ అమెరికన్ వర్కర్ కన్నా ఎక్కువ గంటలు పని చేసేవాడు.  అప్పట్నుంచీ యూరోపియన్ పనిగంటలు తగ్గుముఖం పడుతూ, దాదాపు ఇరవైశాతం కుదించబడ్డాయి. ఏషియాలో పరిస్థితి వేరే. సగటు సౌత్ కొరియన్ దాదాపు 39 శాతం ఎక్కువ గంటలు పనిచేస్తాడు. హాంగ్ కాంగ్, సింగపూర్ లలో కూడా అమెరికన్స్ కన్నా దరిదాపు  ముప్పైశాతం గంటలు ఎక్కువగా పనిచేస్తారు.

పనిగంటలే కాదు, యూరోపియన్స్ ఈ రోజు ప్రార్ధన కూడా తక్కువే చేస్తారు, అట్లాంటిక్ కి అటుపక్క వారితో పోలిస్తే. ఒకప్పుడు యూరప్ అంతా Christendom అని సగర్వంగా చాటుకునేది. యూరప్ నుంచి pilgrims, missionaries, conquistadors ప్రపంచం నలుమూలలకి ప్రయాణం చేసి మతప్రచారం చేసారు. కాని ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. 2005-2008 లో World Values Survey ప్రకారం , 4% Norwegians & Swedes, 8% French and Germans మాత్రమే వారానికి ఒకసారి చర్చ్ సర్వీస్ కి వెళతారు. కానీ అమెరికాలో 36 శాతం, బ్రెజిల్ లో 48 శాతమ్, సబ్-సహారా ఆఫ్రికాలో 78 శాతం వారానికోసారయినా చర్చ్ కి వెళతారు. కాధలిక్ దేశాలయిన ఇటలీ, స్పెయిన్ లు 32%,16% లతో సగటు ప్రొటెస్టెంట్ యూరోపియన్ దేశాలకన్నా ఎక్కువగానే చర్చ్ సంబంధమయిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఈ సంఖ్యలు యూరప్ కన్నా తక్కువగా రష్యా, జపాన్ లలో గమనించవచ్చు. God is very important for us  అని కేవలం పది శాతం జర్మన్స్, డచ్ , ఫ్రెంచ్ ప్రజలు చెప్పగా, 58 శాతం అమెరికన్స్ మా జీవితాల్లో దేవుడి ముఖ్యమని అభిప్రాయం వెలిబుచ్చారు. చైనాలో సైతం అతి తక్కువమంది (5%) God is important అని సర్వేలో చెప్పారు. ఈ దృక్పథం లోంచి ప్రజలు రాజకీయనాయకులని ఎలా అంచనా వేస్తున్నారన్న ప్రశ్నకి, ఇండియా, బ్రెజిల్ లలో 50 శాతం కన్నా ఎక్కువే ప్రజలు మేము atheist politician ని సహించమని చెప్పారు. ఇదే సంఖ్యలు అమెరికాలో 33 శాతం, నార్వే, స్వీడన్ లలో 4 శాతం, ఫిన్లాండ్ లో 9, జర్మనీ, స్పెయిన్ లలో 11, ఇటలీలో 12 శాతంగా ఉన్నాయి.

ఇహ ఆ సర్వే ప్రకారం బ్రిటన్ లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.  17 శాతం బ్రిటన్స్ కనీసం వారానికి ఒకసారి చర్చ్ కి వెళ్తామని చెప్పారు. 25 శాతం కన్నా తక్కువగా బ్రిటన్స్ God is important in our lives అని అభిప్రాయపడ్డారు. 2004 లో బ్రిటన్ లో చేసిన ఒక సర్వే ప్రకారం ఏదేని సగటు వారంలో క్రిస్టియన్స్ చర్చ్ కి వెళ్ళే సంఖ్య కన్నా, ముస్లిమ్స్ మసీదు కి ఎక్కువగా వెళతారని తెలియవచ్చింది. Sunday May 8, 2005 న  18720 చర్చ్ లలో నిర్వహించిన సెన్సస్ లెక్కల్లో real rate of attendance కేవలం  6.3 శాతమని తేలింది. 1960ల నుంచీ దక్షిణదిశగానే ఈ సంఖ్యలన్నీ ప్రయాణం చేసాయి. క్రిస్టియానిటీ ని పాటించే జనాభా వయసు మీరుతోంది. 1999 లో 38 శాతం మెథడిస్టులు, 65 సంవత్సరాల వయసు దాటినవారే. బ్రిటన్ లోని యువత దేవుణ్ణి నమ్మే అవకాశాలు రానూ రానూ తక్కువయిపోయాయి.  ఒక్కసారి కూడా చర్చ్ కి వెళ్ళని దాదాపు 56 శాతం జనాభాతో బ్రిటన్ వెస్టర్న్ యూరప్ లోనే, ఒక Godless country గా తయారయింది.

అయితే ఇరవైశతాబ్ధంలోని ప్రసిద్ద రచయితలు ఈ పరిస్థితిని ముందే తమ రచనల్లో ఊహించారు. C.S. Lewis , Evelyn Waugh లు రెండవ ప్రపంచ యుద్దం వల్ల క్రిస్టియానిటీ కి పెనుప్రమాదం రాబోతుందని గ్రహించారు.

ఇదంతా చదివాక, మరి బ్రిటీష్ ప్రజలు దేవుడి మీద నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారు అన్న ప్రశ్న ఉదయించక మానదు. చాలా క్లిష్టమయిన ప్రశ్నల్లాగే దీనికి కూడా జవాబు కళ్ళెదుటే ఉన్నట్లూ అన్పిస్తుంది, కానీ అది పూర్తి సత్యం కాదు. Philip Larkin ఈ ప్రశ్నకి సమాధానం "1960s" అని ఒక్కముక్కలో తేల్చేసాడు. Beatles, Contraceptive Pill, Mini-Skirt ఈ మూడు కలసి చేసిన విధ్వంసమని తన అభిప్రాయం. కానీ, అవే మూలకారణాలని నిందించేముందు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, అమెరికాలో కూడా ప్రజలివన్నీ అనుభవించారు, కానీ దేవుడి మీద నమ్మకాన్ని వాళ్లు బ్రిటీష్ ప్రజలంతగా కోల్పోలేదు. ఎందుకని? నిజానికి బ్రిటన్స్ ని ఈరోజు ఈ ప్రశ్న అడిగితే, అమెరికాలోని బైబిల్ బెల్ట్ రాష్ట్రాలని చూసి మతమౌడ్య ప్రాంతాలని కళ్లు తేలేస్తారు, కాని వారు కోల్పొయిన నమ్మకమే ఒక అపభ్రంశ అని గ్రహించుకోరు.

మరి యూరప్ లో క్రిస్టియానిటీని చంపేసిందెవరు?

Weber ముందే ఊహించినట్లుగా కాపిటలిజం, వినియోగం, దాంతోపాటే పెరుగుతూ వచ్చిన మెటీరియలిజం ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ ని చంపేసాయా? టాల్ స్టాయ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు. క్రీస్తు భోధనలకీ, మనమీ రోజు పిలుస్తున్న సివిలైజేషన్, సంస్కృతి, కళలూ, సైన్స్ లకీ మధ్య ఘర్షణ తప్పదని భావించాడు.
మరయితే, ఆర్థికాభివృద్ది లోని ఏ భాగం మతం మీద నమ్మకానికి అడ్డంకి గా నిలుస్తోంది? 
  • మారుతున్న మహిళల పాత్రా, కుదించుకుపోతూ, దిగజారిపోతూ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీల వల్ల మరింతగా కుంగిపోతున్న కుటుంబపరిమాణమూ, తగ్గిపోతున్న జనాభా సంఖ్య ఇవన్నీ కలిపి సైంధవ పాత్ర పోషిస్తున్నాయా? 
  • సైంటిఫిక్ నాలెడ్జ్ వల్ల ప్రపంచంలోని మిస్టరీలన్నీ తేటతెల్లమవుతూ ఉండటం వల్ల దేవుడిమీదా, మతం మీదా నమ్మకం తగ్గిపోతూ వస్తుందా?
  • ముందుతరాల్లో "మరణానంతర దశ" సమీప భవిష్యత్తులో వచ్చే ప్రమాదమని కన్పించేది, రానూ రానూ ఆయుష్షు పెరుగుతూఉండటం వల్ల  ఆ ప్రమాదం ఎప్పుడో సుదీర్ఘ భవిష్యత్తులో వచ్చే పరిణామం అవటం వల్ల ఆ ఎరుక క్రమంగా మాసిపోయి,  మనిషిలో ఆ భయం తగ్గి, ప్రజలు దైవ, మత మార్గాలని త్యజించారా? 
  • లేక ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలని విస్తారంగా అమలు చేయటం వల్ల మనం ఊయల దశనుంచీ, శ్మశాన దశ వరకీ ప్రభుత్వాల, వ్యవస్థల సంరక్షణ కి ప్రజలు అలవాటు పడటం వల్ల , కనీస జీవన మనుగడకి ప్రమాదం తప్పి దైవభీతి తగ్గిపోవటం ప్రారంభమయిందా? 
  • లేక యూరోపియన్ క్రిస్టియానిటి, మోడర్న్ కల్చర్ మీద మితిమీరిన మోజుతో తనను తానే చంపేసుకుందా? 
  • లేక  యూరప్ ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒంటి చేత్తో హత్య చేసాడా?

The Future of an Illusion (1928) లో ఫ్రాయిడ్ Weber ప్రతిపాదించిన సిద్దాంతాలనీ, కారణాలనీ తోసిపుచ్చాడు. వెస్టర్న్ సివిలైజేషన్ సాధించిన విజయాలని రిలీజియన్ వివరించలేదన్నాడు. మతం ఒక మాయ అనీ, universal neurosis అనీ, అది మనిషి సహజ, మూల ప్రవృత్తులయిన sexual desires, violent & destructive impulses లని అదిమిపెట్టడానికి అభివృద్ది చేసిన వ్యవస్థ అనీ అభిప్రాయపడ్డాడు. 

రిలీజియన్ విచ్చలవిడి సెక్సువల్ ప్రవర్తనలని నిషేదించటమే కాదు, మృత్యువు, జీవన సమరంలోని దు:ఖాల లాంటి కష్టాలని మనిషికి వివరించటానికి ప్రయత్నం చేసింది. అనేక దేవుళ్ళ స్థానంలో , ఒకే దేవుణ్ణి ప్రతిపాదించిన మతాలు వచ్చాక, ఆ దేవుడికీ, మనిషికీ మధ్య బంధం ఒక తండ్రికీ, కుమారుడికీ ఉన్న బంధమైంది. తండ్రి కోసం ఎంతో కష్టపడ్డ సంతానానికీ ఎప్పుడో ఒకప్పుడు సరైన బహుమతులూ, ప్రశంసలూ లభిస్తాయన్న నమ్మకం ఏర్పడింది.

మతానికున్న పవిత్రత, మొండితనం, మూర్ఖత్వం, దుస్సహనం, హేతుబద్ద ఆలోచనకి వ్యతిరేకత లక్షణాలని కలిగిఉన్న కొత్త సిద్దాంతం ఏదైనా వస్తే తప్ప, మానవజాతి ఎప్పటికైనా మతాన్ని త్యజిస్తుందన్న ఆశలు తక్కువేనన్నాడు ఫ్రాయిడ్.

కానీ, స్టాలిన్, హిట్లర్ తమ దుర్మార్గ కల్ట్ లతో  1930 లలో ఆ పరిస్థితి సంభవించేలా కనపడింది.
అయినప్పటికీ, ఈ కొత్త కల్ట్ లు ఫ్రాయిడ్ భావించిన మనిషి మౌళికలక్షణాలని రూపుమాపలేకపోయాయి. 1945 లో యూరప్ అంతటా క్రూరమైన హింసనీ, Timur తరువాత అంతటి స్థాయిలో మాస్ రేప్ ల ద్వారా దిగ్భ్రాంతికరమయిన సెక్సువల్ వయొలెన్స్ నీ చూసింది.

ఈ పరిణామాలకి మొదటి స్పందన కొన్ని దేశాలు రిలిజియన్ వైపే మొగ్గుచూపటంతో ప్రారంభమయింది. కానీ 1960 ల కల్లా యుద్దానంతరం పెరిగిన యువతకి అవేవీ గుర్తులేక తమలో అణగారిఉన్న కోరికలు క్రిస్టియానిటీ బయట తీర్చుకోవాలనుకున్నారు. ఫ్రాయిడ్ చెప్పిన థియరీస్ లో భాగంగానే కోరికలణచుకోవటాన్ని భోధించే రిలీజియన్ పట్ల వ్యతిరేకతా భావం నింపుకున్న యువత చర్చ్ లని త్యజించి, సెక్స్ షాప్ లకి వెళ్ళింది. Civilization and its Discontents (1929-1930) లో ఫ్రాయిడ్ , మనిషి అట్టడుగు పొరలలో ఉన్న కోరికలకీ, నాగరికత కీ మౌళికమైన వ్యతిరేకత ఉందనీ వాదించాడు. ఆ గ్రంధంలో ఫ్రాయిడ్ సుదీర్ఘవాదన చదివిన వియన్నా వ్యంగ్యరచయిత Karl Kraus "చికిత్స అని భ్రమపడే వింతవ్యాధే సైకో-అనాలసిస్" అని ఓ వ్యంగ్యోక్తి విసిరాడు. ఏదేమైనా హిప్పీలు  Let It All Hang Out (1967) అన్న విధానాన్నే పాటించారు. వెస్ట్ విమర్శకుల ప్రకారం 1960 లు, వ్యక్తి సెక్స్ వాంఛలని సెలబ్రేట్ చేసుకునే లక్షణాలతో నిండిపోయి , థియాలజీ ని వదలి 'పోర్నోగ్రఫీ' , శాంతిని ప్రవచించే Prince of Peace లాంటి కాథలిక్ కమ్యూనిటీస్ ని వదలి హింసనిండి ఉన్న సినిమాలూ, వీడియో గేమ్స్ లతో('వార్నోగ్రఫీ') నిండి ఉన్న   ఫ్రాయిడ్ అనంతర, నాగరికానంతర అనాగరికత సమాజానికి ద్వారాలు తెరచాయి.  

ప్రొటెస్టంటిజం అంతమవ్వటానికి పైన చెప్పిన కారణాలూ, సిద్దాంతాలతో వచ్చిన ఇబ్బందేమిటంటే , యూరప్ లోని క్రిస్టియానిటీ పలచనవడాన్ని ఇవి వివరిస్తాయేమో కానీ, అదే కాలంలో అమెరికాలో ఎందుకు క్రిస్టియానిటీ కొనసాగగలిగిందో అర్ధవంతంగా వివరించలేవు. అమెరికాలోనూ, యూరప్ లో మాదిరిగానే సాంఘిక, సాంస్కృతిక మార్పులు సంభవించాయి. వారు ధనవంతులయ్యారు. వారి సైన్స్ జ్ణానం పెరిగింది. యూరోపియన్స్ కన్నా ఎక్కువగానే సైకో-అనాలసిస్, పోర్నోగ్రఫీ లు లభ్యమయ్యాయి. కానీ అమెరికాలో ప్రొటెస్టంటిజం , యూరప్ లో దెబ్బతిన్నంతగా నష్టాల్ని చూడలేదు. నిజానికి దానికి వ్యతిరేకంగా నలభై ఏళ్ల క్రితంతో పోలిస్తే అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో God పాత్ర ఈ రోజుకీ అదే స్థాయిలో ఉండడమో ఇంకా పెరగడమో సంభవించింది. ఆదివారం కోట్ల సంఖ్యలో చర్చ్ లకి హాజరయ్యే ప్రజలే దానికి సాక్ష్యం.

అమెరికాలో 1960 లలో sex, drugs, rock-n-roll లతో పాటూ, evangelical protestantism కూడా పెరగడమనే వైచిత్రి సంభవించింది. అమెరికా లో పాపులర్ ప్రీచర్ అయిన రెవరెండ్ బిల్లీ గ్రాహం, ఎవరెక్కువ యువతని స్టేడియం లకి తీసుకురాగలరని బీటిల్స్ తో సైతం పోటీపడ్డాడు.

వెస్టర్న్ సివిలైజేషన్ తూర్పున godless Europe గానూ, పశ్చిమాన God-fearing America గానూ రెండుగా
విడిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోగలం? యూరప్ లో క్రిస్టియానిటి క్షీణిస్తున్న కాలంలో , అమెరికాలో నిలదొక్కుకుని ఉండగలటాన్ని ఎలా వివరించగలం? దీనికి సమాధానం కావాలంటే, అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ , మిస్సోరీ లో చూడవచ్చు. స్ప్రింగ్ ఫీల్డ్ లో 122 Baptist Churches, 36 Methodist chapels, 25 Churches of Christ, 15 Churches of God  మిగతావన్నీ కలపి, 400 Christian worship places ఉన్నాయి.

ముఖ్యమయిన విషయమేమిటంటే, ఈ చర్చ్ లన్నీ ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. Weber ప్రయాణం చేసిన కాలంలో American Baptists, Methodists లు ఎవరెక్కువ దైవభక్తి కలవాళ్లని పోటీపడి ఉండొచ్చేమో కానీ, ఈకాలంలో కాంపిటీషన్ చర్చ్ ల మధ్య ఉంది. కార్-డీలర్స్ , ఫాస్ట్-ఫుడ్ జాయింట్స్ మధ్య ఎలా తీవ్రపోటీ ఉంటుందో అలాగే ఈ చర్చ్ ల మధ్య ఉంది!!. చర్చ్ లు కూడా కమర్షియల్ మైండ్ తో భక్తులని ఆకర్షించటం మొదలెట్టాయి. యూరప్ కళ్ళకి, ఇదంతా ఓ షాపింగ్ మాల్ లానో , ఓ బిజినెస్ పార్క్ లానో కనిపించవచ్చు. కానీ స్ప్రింగ్ ఫీల్డ్ లో ఈరోజున అమెరికాలో అత్యంత పెద్ద చర్చ్ ఉంది, అందులోని పేస్టర్ John Lindell కరిష్మా ఉన్న ప్రీచర్. ఆయన భోధనలని వింటూంటే ఒక రిలీజియస్-ప్రీచర్ కన్నా, స్టీవ్ జాబ్స్ ని వింటున్నట్లుగా ఉంటుంది. ఆయన ప్రకారం ప్రొటెస్టంటిజం అమెరికాలో ఇంకా బలంగానే ఉంది. క్రమం తప్పకుండా చర్చ్ కి రావటం వల్ల మనుషులు వారి జీవితాల్లో ఇంకా కష్టపడి పని చేయాలన్న తపన జీవించి ఉంటుందని భావిస్తాడు. స్వయాన ఆయన బాగా కష్టించి పనిచేసే మనిషి.

James River దగ్గరకెళ్ళినప్పుడు అమెరికా, యూరప్ లలోని ప్రొటెస్టంటిజంలో తేడాలు సులభంగానే గ్రహించవచ్చు. Reformation యూరప్ లో జాతీయం చేయబడి Church of England or Scotland's Kirk ల చర్చ్ ల నిర్మాణానికి తోడ్పడింది, కానీ అమెరికాలో తొలినాళ్ళనుంచీ మతానికీ, ప్రభుత్వానికీ మధ్య అడ్డుగోడ స్పష్టంగా, ధృఢంగా నిలచి ఉంది. అందువల్ల ప్రొటెస్టంటిజం లోని భిన్నవర్గాల మధ్య పోటీ మొదటి నుంచీ ఉంది.  వింతగా అనిపించినప్పటికీ బహుశా ఇదే కారణం చేత యూరప్ లో ప్రొటెస్టంటిజం చనిపోయిందేమో??!!

అయినప్పటికీ, ఈరోజు అమెరికన్ ఎవాంజలికల్స్ ని Weber అనుమానాస్పదంగానే చూసిఉంటాడు. అంతా కమర్షియలైజ్ అయిపోయి అదో రకమైన Walmart Worship లా కన్పిస్తోంది. అంతే కాదు, చర్చ్ లకి  వెళ్లడం ఒకప్పటి పోలిస్తే  చాలా సులభమూ, ఎంటర్టెయినింగ్ గానూ తయారయ్యింది. దీనికి తోడు, చర్చ్ కి వస్తూన్న భక్తుల నైతిక వ్యక్తిగత ప్రవర్తన, జీవన విధానం మీద చర్చ్ వైపు నుంచి ఉన్న అంచనాలూ, షరతులూ కూడా తగ్గాయి. ఇంకా చెప్పాలంటే దేవుని వైపునుంచి భక్తుల మీద ఉన్న అంచనాల కంటే, భక్తులు దేవుణ్ణి అడిగే కోరికల చిట్టా పెరుగుతోంది. God the Father స్థానంలో God the Analyst వచ్చాడు. దాదాపు ముప్పై శాతం అమెరికన్స్ తమ మతాన్నో, మతంలోని శాఖనో, పూర్తిగా మతాన్నో విడిచిపెడుతూండే స్థాయికి చేరుకున్న అమెరికన్ సమాజంలో దైవనమ్మకం అనేది పూర్తిగా నిలకడలేనిదయింది.

మతమూ, దైవభక్తీ ఒక టైమ్ పాస్ వ్యవహారం అయిందంటే, Max Weber సిద్దాంతీకరించిన Protestant ethic  నుంచి అమెరికా చాలా దూరం వచ్చేసిందన్నమాటే. అసలు ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ లో తక్షణ-సంతోషం కన్నా, కష్టపడి నిదానంగా సంపాదించుకున్న సంతోషానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా మనం ఈ మధ్యే Capitalism-without-saving అనే ఓ సుదీర్ఘ ప్రయోగం లోంచి బయటకొచ్చాం. అమెరికాలో housing-bubble పరాకాష్ట దశలో ఉన్నప్పుడు అమెరికన్స్ వారి సంపాదనంతా వినియోగసంస్కృతి లో ఖర్చుపెట్టటమే కాక, కాగితం మీద మాత్రమే పెరిగిన ఇళ్ల ధరల మీద లోన్లు తీసుకొని మరీ దుబారా చేసారు. అక్కణ్ణుంచి జారిన ఇళ్ల రేట్ల తో లక్షల మంది, ఇళ్లు పలికే ధరకన్నా అధికమొత్తంలో అప్పులో కూరుకుపోయారు. లోన్ పేమెంట్స్ కట్టలేని వందల వేల మంది ఇళ్లనొదిలేసి వదిలిపోయారు. పేమెంట్స్ రాని బ్యాంకులు పూర్తిగా దివాళా తీసే ప్రమాదపుటంచుమీదా ఊగి, కొన్ని ఆ అంచునుంచి జారిపోయాయి. పరిస్థితి అదుపుతప్పి, దేశం మొత్తమ్మీద ఎకానమీ పేకమేడల్లా కూలిపోతున్న ప్రమాదాన్ని గ్రహించిన అమెరికన్ ప్రభుత్వం, బ్యాంకులకి టాక్స్ పేయర్ మనీ సహాయాన్నందించి బెయిల్-ఔట్స్ తో వాటిని ఒడ్డుకు చేర్చింది. దీంతో దేశమ్మొత్తమ్మీద అప్పుభారం మితిమీరి పెరిగింది. ఈరోజు అమెరికా లో ప్రైవేట్-పబ్లిక్ అప్పు భారం, జిడిపి కన్నా మూడున్నర రెట్లయింది!!.

ఈ పరిణామం ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. కొన్ని తేడాలతో ఇంగ్లీష్ మాట్లాడే ఇతర దేశాల్లో  Irleand, UK, కొద్దివరకీ కెనడా, ఆస్ట్రేలియా ల్లో కూడా కూడ ఇవే దృశ్యాలు సాధారణమయ్యాయి. పోర్చుగల్, గ్రీస్, ఐర్లాండ్ లలో ఇంతకన్నా పెద్ద సంక్షోభాలే వచ్చాయి. 2007-2009 లలో వచ్చిన ఆర్ధికసంక్షోభం ప్రపంచమంతా ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు గాక, కానీ దాని మూలాలు మాత్రం ప్రపంచమంతటా పరచుకొని లేవు. ఈ సంక్షోభం వెస్టర్న్ ప్రపంచంలో తయారయిన సమస్య. మితిమీరిన వినియోగం, పాటించని పొదుపు, వెసులుబాటు ఉన్నదానికన్నా ఆర్థికంగా ఎక్కువ వెసులుబాటు ని కలగచేసుకోవాలని ప్రయత్నించటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమయ్యింది.

ఏషియాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఏషియన్స్ పొదుపు రేట్లు ఎక్కువే అన్న సంగతి మనకి తెలిసిందే. ప్రైవేట్ అప్పు భారం కూడా తక్కువే. ఇళ్లు సాధారణంగా తక్కువ రుణ భారంతో కొనుగోళ్లవుతాయి. అదే సమయంలో ఏషియన్స్ ఎక్కువ పనిగంటలు కూడా పని చేస్తారు.

ఇండస్ట్రియలైజేషన్, ఆర్థికప్రగతీ ఇవన్నీ కలపి చైనాలో ఆశ్చర్యకరమయిన, అనుకోని పరిణామమొకటి సంభవించింది. క్రిస్టియానిటీ ఈ మధ్య కాలంలో, చైనాలో ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం. 

THE CHINESE JERUSALEM


చైనాలో కాపిటలిజం వృద్ది అందరికీ తెలిసిన కధే. కానీ ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ సాధించిన వృద్ది సంగతి ఎంత మందికి తెలుసు?

Shanghai లోని China Partner and East China Normal University సర్వే ప్రకారం 1949 లో కేవలం ఐదులక్షలున్న ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్,  ఈ రోజున చైనాలో నాలుగు కోట్ల మందయ్యారు. మరికొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య ఏడు కోట్ల వరకీ ఉంది. రెండు కోట్ల కాథలిక్స్ ని కూడా చేర్చినట్లయితే ఈ రోజు దాదాపు తొమ్మిది, పది కోట్ల క్రిస్టియన్స్ ఉన్నారు. అవును, యూరప్ లో ఉన్న Practicing Christians తో సరిసమానంగా చైనాలో కూడా ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. చైనాలో చర్చ్ లు వేగంగా నిర్మించబడుతున్నాయి.  బైబిల్ ని ముద్రించే కంపనీల్లో Nanjing Amity Printing Company ప్రపంచంలోనే అతి పెద్దది. ఏడుకోట్ల బైబిల్స్ ని ముద్రించిన ఈ కంపనీ, అందులో ఐదు కోట్ల బైబిల్స్ ని మాండరిన్ భాషలోనే ముద్రించింది. ఇంకో మూడు, నాలుగు దశాబ్ధాల్లో , క్రిస్టియన్స్ చైనా జనాభాలో ఇరవై నుంచి ముప్పై శాతానికి చేరుకోవడాన్ని ఊహించవచ్చు. క్రిస్టియానిటీ వ్యాపించకుండా నిరోధించిన చరిత్రతో నిండి ఉన్న చైనాలో, ఈ పరిణామం దిగ్భ్రాంతికరం.

(ఇక్కడ రచయిత చైనాలో క్రిస్టియానిటీ చరిత్రని వివరిస్తాడు. 1299 నుంచీ, 1800 వరకీ మిషనరీస్ చేసిన ప్రయత్నాలూ, మింగ్ సామ్రాజ్యం ఆ ప్రయత్నాలని అడ్డుకున్న విధానాన్నీ చెపుతాడు. మూడవ క్రిస్టియన్ ప్రభంజనంలో బ్రిటీష్ మిషనరీస్, కొన్ని వేల సంఖ్యలో ఎవాంజలిస్టులని ఎలా పంపించాయో, ఈ మతమార్పిడుల ప్రయత్నాలని చైనీస్ ఇంపీరియల్ ప్రభుత్వం, ఏ రకమయిన ప్రచారాలతో తిప్పికొట్టిందో కొన్ని ఉదాహరణలు చూపుతాడు.

Nanjing లో 1853 కల్లా క్రమక్రమంగా బలపడుతోన్న క్రిస్టియానిటీ ఊపుని Qing empire Nanjing ని ఆక్రమించుకోవటంతో అడ్డుకుంటుంది. అయినప్పటికీ పట్టువదలని కొన్ని మిషనరీస్, వేషభాషలని మార్చి, చైనీస్ దుస్తులని వేసుకొని, Qing era లోని pigtail ని ధరించి ఎలా ప్రచారాన్నీ కొనసాగించిందీ, మరికొన్ని మిషనరీస్ ఇతర విధానాలయిన gospel of material progress and scientific knowledge ని ఎలా అవలంభించిందీ వివరిస్తాడు.

వీటన్నిటి వల్లా 1877 కల్లా చైనాలో పద్దెనిమిది క్రిస్టియన్ మిషనరీస్ క్రియాశీలకంగా పనిచేస్తూండటమే కాక, మూడు బైబిల్ సొసైటీస్ కూడా ఏర్పడడాన్ని ఉదహరిస్తాడు. మిషనరీస్ ఎన్నో విత్తనాలని నాటినప్పటికీ, Qing empire ని కూలగొట్టడంతో, ఈ విత్తనాలు చెల్లాచెదురయ్యాయి. కమ్యూనిస్టుల ప్రభంజనంలో క్రిస్టియానిటీ ప్రథమ కార్యకర్తలూ, నాయకులూ అందరూ కొట్టుకుపోయారు. ప్రాణనష్టంతో క్షీణించిన ప్రభావంతో CIM(China Inland Mission) తన సభ్యులని చైనాలోంచి విరమించుకుంది. కార్యకర్తల్లేకపోవడంతో చైనా అంతటా చర్చ్ లు మూతపడ్డాయి. దీనికి తోడు Great Leap Forward గా ప్రసిద్ధి గాంచిన 1958-62 కాలంలో, నిజానికి ఆకలి సంక్షోభం నాలుగున్నరకోట్ల చైనా ప్రజలని పొట్టనపెట్టుకుంది. ఈ కాలంలో మరిన్ని చర్చ్ లు మూతపడటమే కాక విగ్రహారాధన వ్యతిరేకత ఎన్నో బౌద్దమత గుడులని కూలగొట్టింది. కానీ, ఇదే కాలంలో Mao స్వయానా ఎంతోమందికి cult-leader అయ్యాడు. ఆయన భార్య Jian Qing చైనాలో క్రిస్టియానిటి కేవలం మ్యూజియం కి పరిమితమయ్యిందని సగర్వంగా ప్రకటించింది.

ఈ భాగంలో రచయిత వివరించిన,ఉదహరించిన ఇతర విషయాలు:
  • Shanghai కి దక్షిణాన Zheijang province లోని Wenzhou నగరంలోని పారిశ్రామిక పట్టణంలోని ప్రగతీ; 
  • ఈ నగరంలో మావో ఆధ్వర్యంలో నడచిన cultural revolution కి ముందున్న 480 చర్చ్ ల సంఖ్య, ఈ రోజుకి అధికారిక అంచనాల ప్రకారమే 1339 కి చేరుకున్న విషయం; 
  • 1958 లో Religion-Free గా మావో ప్రకటించిన ఈ నగరంలో, 2002 కల్లా జనాభాలో, క్రిస్టియన్స్ 14 శాతానికి చేరుకున్న విషయం;
  •  గతంలో చైనీస్ అధికారగణం క్రిస్టియానిటీని అనుమానంతో చూసిన విధానం;
  •  తైపింగ్ తిరుగుబాటులో క్రిస్టియన్ మిషన్ల పాత్ర, తియానాన్మెన్ స్క్వేర్ లో సెమినరీ విద్యార్థుల భాగం, ఆ సంఘటనల్లో ప్రభుత్వం గాలించిన అతిముఖ్యమైన ఇద్దరు విద్యార్థులు, ఆ పిదప క్రిస్టియన్ క్లర్జీ లుగా మారిన విషయం;
  • Nanjing లో Reverend Kan Renping యొక్క చర్చ్ సభ్యుల సంఖ్య 1994 లోని 400 నుంచి, 5000 వరకీ పెరిగి,చర్చ్ లోని ఆదివారం కార్యక్రమాలని కొత్తగా చేరాలనుకున్న సభ్యులు చూడలేక, స్థలం సరిపోక దగ్గర్లో ఉన్న chapels లో cctvs లో చూడాల్సి రావడం;
  • బీజింగ్ లో అనధికారిక చర్చ్ లలో entrepreneurial or professional class జనాభా కలసుకుంటున్న వైనం; 
  • చైనాలో క్రిస్టియానిటీ లేటేస్ట్ ఫాషన్ అయిన విషయం;
  • ఒలింపిక్ సాకర్ గోల్ కీపర్ Gao Hong, నటి Lu Liping, పాప్-సింగర్ Zheng Jun లు క్రిస్టియన్లన్న విషయం; 
  • రానున్న కాలంలో బౌద్దమతంలా క్రిస్టియానిటీ కూడా తనకున లక్షణాలని కాపాడుకుంటూనే మైనారిటీ మతంగా చైనాలో స్థిరపడవచ్చని చైనీస్ అకడమిక్ అయిన Tang Yi బహిరంగంగానే అంగీకరిస్తున్న విషయం; 
  • ఇంకా చైనాలోని ఇతర అకడమిక్స్, ఫిల్మ్ మేకర్స్ క్రిస్టియానిటి ప్రాముఖ్యత గురించి చెప్పిన విషయాలు, 
  • 2007 చైనా ప్రెసిడెంట్ గా Hu Jintao అధికారం చేపట్టాక కనీవినీఎరుగని రీతిలో పొలిట్ బ్యూరో సెషన్ ని "రిలీజియన్" అనే విషయం మీద నిర్వహించి, దేశంలో అత్యంత ప్రాముఖ్యమయిన 25 మంది అధికారులకి "the knowledge and strength of religious people must be mustered to build a prosperous society " అని ఆదేశించిన విషయమూ; చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 14వ సెంట్రల్ కమిటీ రిపోర్టులో ఆర్థికప్రగతి స్థిరంగా ఉండాలంటే,  "ఆస్థిహక్కు" మూలస్థంభంగా ఉండాలనీ, rule-of-law భధ్రత విస్తారంగా లభించాలనీ, నైతికత అనేది సహాయంగా ఉండాలనీ పేర్కొన్న విషయమూ గురించి వివరిస్తాడు)

LANDS OF UNBELIEF


పైన చెప్పిన విషయాలన్నీ కూడా వెస్టర్న్ పునాదుల్లో భాగంగా ఉండేవి. కానీ ఈమధ్యకాలంలో వెస్ట్ ప్రజలు వీటి మీద నమ్మకం కోల్పోయినట్లుగా కనపడుతున్నారు. యూరప్ లోని చర్చ్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి; Europe లో Reformation కాలంలో వచ్చిన అభివృద్ది, మార్పుల మీద కొత్త అనుమానాలు మొదలయినట్లుగా గోచరిస్తున్నది; కాపిటలిస్టుల మధ్య పోటీ నడుస్తున్న కాలంలోని ఆర్ధికసంక్షోభాలతో, బ్యాంకర్స్ మితిమీరిన స్వార్ధాలతో గౌరవహీనమయిన స్థాయికి చేరుకుంది; సైన్స్ కోర్సుల్లో తక్కువ విద్యార్థులు కనపడుతున్నారు ;  ప్రైవేట్ ఆస్థి హక్కులని ప్రభుత్వాలు అలవాటుగా అతిక్రమించి, తనను తాను మోయలేక మితిమీరిన ఆకలితో మరిన్ని ఆదాయపన్నులతో ధనసేకరణ చేసి, తమనుతాము సమర్ధవంతంగా నడపలేక ప్రజలఆదాయాన్ని దుర్వినియోగ పరుస్తున్నాయి.

మనకి మిగిలిందల్లా మతిలేని వినియోగసంస్కృతి, అన్ని కల్చర్స్ సమానమే అన్న మతిలేని వాదన ఒకటి. ఎంత తీవ్ర భావజాలాన్ని పెంచే కల్చర్ అయినా, ఏ కళా, హేతువు లేని ఆచారాలతో మగ్గిపోతున్న కల్చర్ అయినా అన్నిటినీ సమానంగా చూడాలన్న మోడ్రన్ వాదన ఒకటి వేళ్లూనుకుంటోంది. నాస్తికత్వం కొత్త పుంతలు తొక్కుతోంది. 

నమ్మకానికీ, అపనమ్మకానికీ మధ్య తేడా తెలుసుకోవాలంటే London Transport System లో బాంబు బ్లాస్ట్ లని
ప్లాన్ చేసిన ముక్తర్ సయ్యద్ ఇబ్రహీమ్ మరియు Stanmore లో అతని పొరుగింటిలో ఉన్న Sarah Scott కి మధ్య జరిగిన సంభాషణ వినాలి.

"నువ్వు కాథలిక్ వి ఎందుకయ్యావు, మీ ఫ్యామిలీ ఐరిష్ ఫ్యామిలీ కాబట్టా? అని ఇబ్రహీమ్ నన్నడిగాడు. "లేదు నేను కాథలిక్ ని కాదు, నిజానికి నాకు ఏ మతంలోనూ నమ్మకం లేదు" అని చెప్పాను. దానికి అతడు "నమ్మకం లేదు అనేది సరికాదు, నమ్మకం ఉంచుకోవాలి" అని చెప్పాడు. "ప్రజలు ఎందుకో మతమంటే భయపడతారు, అలా భయపడకూడదు" అని కూడా చెప్పాడు. అదే సంభాషణలో "తను అల్లాని నమ్ముతాననీ, అల్లా ప్రార్ధనలు చేస్తే చనిపోయాక virgins లభిస్తారని, అలాంటివే ఏవో చెప్పుకొచ్చాడు" అని సారా చెప్పుకొచ్చింది.

మనమీ virgins మీద నమ్మకం మీదా, ఆ సంభాషణ మీదా ఎన్ని జోక్స్ అయినా వేసుకోవచ్చేమో, కానీ ఈ సంభాషణ ఈ రోజు యూరప్ లో మెజారిటీ అవుతోన్న నాస్తికులకీ, మైనారిటీ గా ఉన్న కరడుగట్టిన మతవాదులకీ మధ్యన ఎంతటి అగాధముందో తెలియచేస్తుంది.

నిజానికీ రోజున వెస్ట్, అరోమాథెరపీ దగ్గర్నుంచి, Zen and Art of Motorcycle Maitenance  లాంటి ఎన్నో పోస్ట్-మోడరన్ కల్ట్ లతో నిండిపోయిఉంది. ఇవ్వేవీ కూడా ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ ఇచ్చే శక్తివంతమైన-ఆర్థికనమూనా మరియు సాంఘికబంధాల, వర్క్ ఎథిక్ లని ఇవ్వలేవు. అంతే కాదు, ఆధ్యాత్మికంగా ఆవరిస్తున్న శూన్యం వల్ల, ఇమ్మిగ్రెంట్స్ గా వచ్చి మతాన్ని మితిమీరి నమ్మే అతికొద్దిమంది మైనారిటీల రాజకీయ ఆశయాలూ, దురాశలకి వెస్ట్ లోని దేశాలు ఈజీ టార్గెట్స్ అవుతున్నాయి.

రాడికల్ ఇస్లాం కి, వెస్టర్న్ సివిలైజేషన్ కి మధ్యనున్న ఘర్షణ "Jihad vs McWorld" అన్న సారాంశంగా చెప్పగలగటమే దీనికి నిలువెత్తు ఉదాహరణ.

Western Civilization మూల విలువలైన
  • Separation of Church 
  • Scientific Method 
  • Rule of Law 
  • Very idea of a free society 
  • వీటితో పాటూ గతశతాబ్ధంలో పెంపొందించుకున్న  Equality of sexes , Legality of homosexual acts 
విలువలన్నిటినీ కూడా ఇస్లామిస్టులు తిరస్కరిస్తారు.

ఒక అంచనా ప్రకారం వెస్టర్న్ యూరప్ లో ముస్లిం జనాభా సంఖ్య 1990 లో ఒక కోటి నుండి, 2010 లో ఒక కోటి డెబ్బయి లక్షలకి చేరుకుంది. జనాభాశాతం ప్రకారం చూసినట్లయితే ఫ్రాన్స్ లో 9.8% నుండి పోర్చుగల్ లో 0.2% వరకీ అన్ని దేశాల్లో ఏదో శాతంలో ఉన్నారు.

ఈ సంఖ్యలు భవిష్యత్తులో గణనీయంగా పెరగబోతున్నాయి. 2004-2008 లో బ్రిటన్ లో ముస్లిం జనాభా 6.7%
శాతంతో పెరిగింది. అదే రేటున పెరిగినట్లయితే రానున్న మూడు-నాలుగు దశాబ్దాలలో యుకె జనాభాలో ముస్లిం ప్రజలు యాభై శాతానికి చేరుకోగలరని కొన్ని జనాభాఅంచనాలు చెపుతున్నాయి.

ఇమ్మిగ్రెంట్స్ తాము వలసవెళ్లిన సమాజాల సంస్కృతిలో భాగమవకుండా, రాడికల్ సిద్దాంతాలకి ఆకర్షితులవుతున్నప్పుడు అది దుష్పరిమాణాలకి దారితీసేప్రమాదముంది. పైన చెప్పిన సంఖ్యలకన్నా  పాకిస్తానీ జమా-యత్-ఇస్లామీ, అరబ్ ముస్లిం బ్రదర్హుడ్, సౌదీ వాళ్లు ఫైనాన్స్ చేస్తున్నా ముస్లిం వరల్డ్ లీగ్ లాంటి రాడికల్ ఇస్లాం సంస్థలు , యూరప్ లోని ముస్లిం కమ్యూనిటీ లోకి ఎంతచొచ్చుకుపోయాయన్నదే ఆశ్చర్యం.

యార్క్ షైర్ లో జన్మించిన షెహ్జాద్ తన్వీర్ ఉదాహరణని చూద్దాం. ఇతను జన్మతా పేదవాడేమీ కాదు. ఇతని తండ్రి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇమ్మిగ్రంట్. చేపలూ , చిప్స్ ని అమ్ముతూ, మెర్సిడెస్ కార్ ని డ్రైవ్ చేస్తూ విజయవంతమైన ఫుడ్ బిజినెస్ ని నిర్మించుకోగలిగాడు. అలాగే తన్వీర్ చదువుకోని వ్యక్తి కూడా కాదు. లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటి నుంచి స్పోర్ట్స్ సైన్స్ లో పట్టా పొందాడు. కానీ ఇదే తన్వీర్ సూయిసైడ్ బాంబర్ గా మారి జూలై 7, 2005 న లండన్ లోని సర్కిల్ లైన్ అండర్ గ్రౌండ్ ట్రెయిన్ లో, Aldgate కీ, Liverpool కీ మధ్య బాంబులు పేల్చి ఆరుగురు ప్రయాణికుల మృతికి కారణమయ్యాడు.

ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంటర్టెయిన్మెంట్ లలో ఎన్ని అవకాశాలు కలిగించినప్పటికీ ఒక ముస్లిం ఇమ్మిగ్రెంట్ సంతానం, చెడ్డవ్యక్తుల భోధనల వల్ల ప్రభావమయ్యి  కరడుగట్టిన తీవ్రవాది గా మారకుండా అడ్డుకోలేమనడానికి తన్వీర్ మంచి ఉదాహరణ. ఈ విషయంలో యూనివర్సిటీలలో ఇస్లామిక్ సెంటర్స్ ఎంతో పాత్ర పోషిస్తున్నాయి. జిహాద్ కి రిక్రూట్ చేసుకోవటమే కాక, అంతకు మించి పాకిస్తాన్ లాంటి దేశాల్లో ట్రెయినింగ్ కోసం ఈ సెంటర్స్ ముఖద్వారాల్లా పనిచేస్తున్నాయి. 1999-2009 మధ్యలో 119 వ్యక్తులు ఇస్లామిక్ టెర్రరిజం కి సంబంధించిన నేరాలు చేసినట్లుగా ఋజువయింది. ఇందులో రెండింట మూడువంతులు బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవాళ్లే. ఇవి కాకుండా 2006 అట్లాంటిక్ మీదుగా వెళ్తున్న విమానాలని పేల్చేసే కుట్రలో దొరికిన విద్యార్థులూ, 2009 క్రిస్ట్మస్ రోజున ఆమ్స్టర్డామ్ - డెట్రాయిట్ విమానాన్ని మార్గమధ్యంలో పేల్చేసే కుట్రలో నైజీరియాలో జన్మించిన లండన్ విద్యార్ధీ లాంటి ఉదాహరణలు, ఇస్లామైజేషన్ ఆఫ్ ఇమ్మిగ్రంట్ కమ్యూనిటీస్ కి నిలువెత్తు సాక్షాలు.

THE END OF DAYS


Decline and Fall లో Gibbon 180 నుండి 1590 వరకీ అంటే 1400 సంవత్సరాల చరిత్రని సమీక్షించాడు. ఇందులో పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న చక్రవర్తుల , రోమన్ చక్రవర్తుల బాడీగార్డుల దగ్గర్నుంచీ, "ఒకే దేవుడు" అన్న సిద్దాంతం ఎదుగుదల వరకీ చర్చించాడు. 180AD లో Marcus Aurelius చనిపోయాక, సివిల్ వార్ పెద్ద సమస్యయ్యింది.

నాలుగవ శతాబ్ధం కల్లా బార్బేరియన్స్ దాడులు, వలసలు తీవ్రమయ్యాయి, ముఖ్యంగా Huns వెస్ట్ కి తరలిపోయినప్పుడు. ఈ మధ్యలో పర్షియా నుంచి రోమన్ సామ్రాజ్యానికి ప్రమాదం పెరగసాగింది. మొదటిసారి వెస్టర్న్ సివిలైజేషన్ కూలిపోయినప్పుడు ఆ ప్రక్రియ నెమ్మదినమ్మెదిగా తగలబడిందని Gibbon అభిప్రాయపడ్డాడు.

చివరిసారిగా రోమన్ సామ్రాజ్య పతనం 406 లో ప్రారంభమయింది. జర్మన్ తెగలు Rhine నుంచి Gaul వరకీ వెళ్లి , చివరకి ఇటలీ మీద దాడిచేసాయి. 410 లో సాక్షాత్తూ రోమ్ Goth ల చేతిలో నేలమట్టమయింది . ఈ విజయంతో Goths స్పెయిన్ మీద దాడి చేసారు. 429-439 మధ్య జరిగిన వరస నార్త్-ఆఫ్రికా లో లభించిన వరస అపజయాలతో రోమ్ సామ్రాజ్య పరిధి కుచించుకుపోవటమే కాక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. రోమన్ సైనికులు Huns ని జయించలేకపోయారు. 452 కల్లా వెస్టర్న్ రోమన్ సామ్రాజ్యం బ్రిటన్ ని, స్పెయిన్ లో అత్యధికభాగాన్నీ, నార్త్-ఆఫ్రికా లోని ధనిక ప్రాంతాల్నీ కోల్పోయింది. ఇటలి మినహా పెద్దగా ఏం మిగల్లేదు. 468 కల్లా రోమన్ సామ్రాజ్యం పూర్తిగా పతనమయిపోయింది. 476 లో రోమ్ Odoacer, King of the Scirii కి ఓ  కప్పం కట్టే సామంతరాజ్యమయి మిగిలింది.

ఎంత వేగంగా రోమన్ పతనం సంభవించిందనేది దిగ్భ్రాంతి కలిగించే విషయం. కేవలం ఐదు దశాబ్ధాల్లో రోమ్ జనాభా మూడువంతుల పైగా పడిపోయింది. ఆర్కియాలజికల్ శాఖ దగ్గరున్న ఐదవశతాబ్ధపు చివరి దశల్లోని సాక్షాల్లో రోమన్ సామ్రాజ్యపతనాన్ని చూడొచ్చు. ఒక చరిత్రకారుడన్నట్లుగా 'end of civilization' కేవలం ఒకతరంలోనే సంభవించింది.

మరి ఇప్పుడు చూస్తున్న వెస్టర్న్ సివిలైజేషన్ కూడా ఇంతే అకస్మాత్తుగా పతనమవనుందా? ఈ ప్రశ్న గత వందేళ్లుగా Chesterton నుంచీ , Shaw వరకీ  బ్రిటీష్ మేధావులని ఇబ్బంది పెడుతూనే ఉంది.

కానీ ఈ రోజు భయాలకి కారణాలు మరింత స్పష్టంగా కనపడుతున్నాయి. చైనా మరియు ఇతర దేశాలు ఆర్ధికంగా వృద్ది సాధిస్తూ, వెస్ట్ కీ, ఈస్ట్ కీ మధ్యనున్న అంతరాలని తగ్గిస్తున్న ఇదే కాలంలోనే, పర్యావరణ మార్పుల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. భూమ్మీద కార్బన్-డై-ఆక్సైడ్ శాతం పెరుగుతోందనేది తిరుగులేని సత్యం. దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగింది. ఇంకా స్పష్టం కానిదేంటంటే ఇవే మార్పులు ఇలానే కొనసాగితే భూమ్మీద వాతావరణం భవిష్యత్తులో ఎలా మారబోతోందనేది. ధృవాల వద్దనున్న మంచు కరిగి సముద్రపు మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు కొట్టుకుపోయే ప్రమాదాలు ఎక్కువవుతాయి అని ఊహించటం బహుశా సత్యదూరం కాదేమో?

పర్యావరణమార్పులే కాక, ఏషియాలో అధిక జనాభా కల ప్రాంతాలు, దేశాలు పేదరికాన్ని తగ్గించేందుకు వెస్టర్న్ మార్గాన్ని పట్టిన ఈ దశలో, ఎనర్జీ సప్లై, ఆహారం, ఫ్రెష్ వాటర్ ల సప్లైల మీద తట్టుకోలేనంత డిమాండ్ ఏర్పడుతుందన్నది కూడా కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తల వాదన. climate change మీద ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే, వారు ఒక్కసారి చైనా సందర్శిస్తే, చైనాలోని ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల కలిగిన పర్యావరణ దుస్థితిని కళ్లారా చూడొచ్చు.

ఈ విషయాలని చర్చించే చాలామంది లాగే నేను(రచయిత) కూడా సైంటిఫికల్ గా తగిననాణ్ని కాదు, సరైన సాక్షాలివ్వడానికి. కానీ ఇక్కడ డేటా కన్నా కూడా అంతం గురించిన జ్యోస్యం మనల్ని ఆకర్షిస్తుంది. మొదటిసారిగా చరిత్రలో లిఖించబడిన myths and legends ని చూస్తే, ప్రపంచం అంతమవ్వటం అనే విపత్తు గురించి  మానవుడు మొదటి నుంచీ ఊహాగానాలూ, జ్యోస్యాలు చెపుతునే ఉన్నాడన్నది స్పష్టమవుతుంది. ఇలాంటి ఉదాహరణలు బైబిల్ లోని apocalypse లోనే కాక, మరిన్న కల్చర్స్ లోని ఎన్నో ఉదాహరణలలో చూడొచ్చు.

అసలు decline and fall అనేది తప్పించుకోలేని సత్యమనీ, ప్రతిదీ తప్పక క్షీణించవలసిందేనని మానవుడిలో ఇంకిఫోయింది. బహుశా తప్పించుకోలేని "మృత్యువు" నుంచి ఈ ఆలోచన ఉధ్బవించి ఉంటుంది. వ్యక్తులు ఎలా వృద్దాప్యం లో క్షీణిస్తారో, నాగరికతలు కూడా అదే మార్పులకి లోనవుతాయని మన నమ్మకం.

నరుడు చివరకి గడ్డిలో కలసిపోతాడు. గర్వంతొ ఊగిపోయే క్షణాలు, అంతరించిపోయి శిథిలాల్లో కలసిపోతాయి. గతవైభవగుర్తులుగా మిగిలిపోయిన చిహ్నాల మీదుగా గాలి దిగులుగా వీస్తూంటుంది.

కానీ, సంక్లిష్టమయిన సాంఘిక , రాజకీయ పరిస్థితుల మధ్య ఈ decline and fall ఎలా సంభవిస్తుందనేది క్షుణ్ణంగా పరిశీలించి అర్ధం చేసుకోడానికి మనం కష్టపడుతుంటాం. సివిలైజేషన్స్ అకస్మాత్తుగా గాలిబుడగలా పేలిపోయి అంతమయిపోతాయా? లేక సుదీర్ఘకాలంలో క్రమక్రమంగా వీగిపోతూ రాలిపోతాయా?

ముగింపు చెప్పే ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కోవాలంటే, చరిత్రాత్మకమయిన వివరణ శరణుజొచ్చాల్సిందే.