WORK ETHIC AND WORD ETHIC
మనమిప్పటివరకీ చూసినట్లుగా గత 500 సంవత్సరాలలో వెస్టర్న్ సివిలైజేషన్ ప్రపంచాధిపత్య స్థానాన్నిసంపాదించడమే కాక, అద్వితీయమైన ఎదుగుదలని సాధించింది. వెస్టర్న్ వ్యవస్థలయిన కార్పొరేషన్, మార్కెట్, స్వతంత్రప్రతిపత్తి కలిగిన పౌరుల దేశం లాంటివి కాంపిటీటివ్ ఎకనామిక్స్ కి గ్లోబల్ నమూనాలైనాయి, వాటిని మిగతా ప్రపంచం నకలు చేసుకుంది. వెస్టర్న్ సైన్స్ ఎన్నో దృక్పథాలని సమూలంగా మార్చేసింది, ఇతరులు దాన్ని అనుసరించారు, చేయని వాళ్ళు శాశ్వతంగా వెనకపడిపోయారు. దాంట్లోంచి వెలువడ్డ వెస్టర్న్ విధివిధానాలయిన రాజనీతి, చట్ట, ప్రజాస్వామ్య మోడల్స్, నాన్-వెస్టర్న్ మోడల్స్ ని తొలగించేయటమో, పూర్తిగా ఓడించటమో చేసాయి. వెస్టర్న్ మెడిసిన్ నాటు, అశాస్త్రీయ వైద్యులనీ, రోగాలు నయం చేస్తామని చెప్పే దొంగ బాబాలనీ చాలా వరకీ తగ్గించటమే కాక వారి పరిధిని విస్తృతంగా కుదించేసింది. వీటన్నిటికన్నా ఎక్కువగా వెస్టర్న్ మోడల్స్ అయిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, వినియోగవ్యవస్థలు మిగతా ఏ పర్యాయవ్యవస్థలనీ పైకి లేవకుండా తుంచేసింది. 1990 చివర్ల వరకీ కూడా వెస్ట్, ప్రపంచాధిపత్య నాగరికత (సివిలైజేషన్) గా చలామణీ అయ్యింది. అయిదు వెస్టర్న్ ప్రముఖ దేశాలయిన అమెరికా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా లు గ్లోబల్ మానుఫాక్చరింగ్ లో 44 శాతం ఉత్పత్తి చేసాయి. సైంటిఫిక్ ప్రపంచాన్ని వెస్టర్న్ యూనివర్సిటీస్ ఏలాయి. నోబుల్ ప్రైజెస్ లో సైతం సింహభాగం వారికే దక్కింది. 1989 లో వచ్చిన పెనువిప్లవాల మార్పుల తరువాత, ప్రపంచమంతా ప్రజాస్వామ్య పవనాలు వీయటం ప్రారంబించాయి. వెస్టర్న్ బ్రాండ్స్ కోకాకోలా, లెవైస్, మెక్ డొనాల్డ్స్ ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరంలో కన్పించటం ప్రారంభించాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలటమే కాదు, ఎకానమీ లో అమెరికాని దాటి, ఒకటవ స్థానం లోకి వెళ్తుందని కొందరు అంచనా వేసిన జపాన్ తప్పటడుగులు వేసి, ఒక దశాబ్థం పైగా శూన్యమైన ఆర్థికాభివృద్దిని సాధించి, Lost decade లోకి జారిపోయింది. ప్రపంచదేశాల సంబంధాలని అధ్యయనం చేసే నిపుణులంతా అమెరికా ఆరోహణ ని వర్ణించటానికి మాటలు వెతుక్కున్నారు.
ఈ పుస్తకం రాసేప్పటికి రెండు ఆర్థిక-సంక్షోభాలు, అనుకోకుండా తలపెట్టాల్సి వచ్చిన రెండు క్లిష్టమయిన యుద్దాలు, 1930 great-depression తరువాత ఎప్పుడూ చూడనంత పెద్ద great-recession , వీటన్నిటినిటినీ మించి మిరిమిట్లుగొలిపే అభివృద్ది, ఆర్థిక వృద్ధి సాధించి జపాన్ ని పక్కకి తోసి ప్రపంచం లోనే రెండవ పెద్ద ఎకానమీ గా చైనా ఎదిగినటువంటి పరిణామాల తరువాత మనముందున్న ప్రశ్న: అటూఇటుగా అర్ధసహస్రాభ్ద ఆధిపత్యానంతరం ప్రపంచ నాయకత్వస్థానం నుంచి వెస్ట్ స్థానం కిందకి జారడం ప్రారంభమయిందా అన్నదే!
ఒకవేళ అదే నిజమయితే, వెస్ట్ పతనం ఇదే మొదటిసారి కాదు. The History of the Decline and Fall of the Roman Empire(1776-1778 six volumes) ,గతంలో వెస్ట్ ఎలా క్షీణించిందన్నవివరాలని విపులంగా చెపుతుంది. చరిత్ర పునరావృతమవనుందా అన్నది పలువురి మదిలో ఉన్న ప్రశ్న. రోమ్ సామ్రాజ్య పతన కారణాలని చూసినప్పుడు ఈ భయాలేవి కొట్టేయదగినవిగా కనపడవు. ఆర్ధిక సంక్షోభాలూ, విస్త్రతంగా ప్రబలిన వ్యాధులూ, బోర్డర్స్ దాటి అత్యధిక సంఖ్యలో ముంచుకొచ్చిన ఇమ్మిగ్రంట్స్, ప్రత్యర్థి దేశాల ఎదుగుదలా, East లో Prussia, Alaric's Goths & Attila's Huns terror ఇవన్నీ కలిపి రోమ్ మహా సామ్రాజ్యాన్ని అంతంచేసాయి.
ఈరోజున వెస్టర్న్ ప్రపంచం వీటన్నిటితో సతమతమవుతూ ఉంది. ఆర్ధిక అస్థవ్యస్థ పరిస్థితులూ, పర్యావరణ పతనం వల్ల రాబోయే ఉపద్రవాలూ, కొన్ని పశ్చిమ దేశాల నడిబొడ్డున ఇమ్మిగ్రంట్ కమ్యూనిటీస్ లో ఇస్లామిస్ట్ ఐడియాలజీ, టెర్రరిజం వ్యవస్థలూ మొదలగునవన్నీ వెస్టర్న్ ప్రపంచ అస్థిత్వానికే పెను సవాళ్ళు విసురుతున్నాయి. మరో పక్క తూర్పున చైనా అద్భుతమయిన ఎదుగుదలని సాధించి రానున్న కొన్ని దశాబ్ధాలలో ప్రపంచ ఎకానమీలో మొదటిస్థానానికి చేరుకోనుంది.
పదహారవ శతాబ్ధం లో క్రిస్టియానిటీలో ఎదిగి, తనదైన శైలిలో నిర్వచించుకున్న Hard-work, Wise management of money and other resources లతో కూడుకున్న Protestantism వెస్టర్న్ సివిలైజేషన్ విజయానికి మూలకారణాలలో ఒకటని Decline and Fall of the Roman Empire లో Gibbon వాదిస్తాడు.
ఈ నేపథ్యంలో మనం వెస్ట్ ఎదుగుదలలో మతానికీ, దేవుడికీ ఉన్న పాత్ర ఏమిటో, ఇరవై శతాబ్ధపు అంత్యదశలో పశ్చిమదేశాల పౌరులు దేవుణ్ణీ, మతాన్నీ ఎందుకు పెద్ద సంఖ్యలో త్యజించారో చూద్దాం.
పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో మీరు యూరప్ లోని ధనవంతులయిన ఇండస్ట్రియలిస్ట్ అయి ఉన్నట్లయితే మీరు Protestant అయ్యే అవకాశాలు చాలా తక్కువ. Reformation తరువాత యూరోపియన్ దేశాలు క్రమక్రమంగా రోమన్ కాథలిక్ చర్చ్ నుంచి దూరం జరగటం ప్రారంభించాయి. ఆర్ధిక శక్తి ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ ల నుంచి, ప్రొటెస్టేంట్ దేశాలయిన ఇంగ్లాండ్, హాలండ్, ప్రష్యా, సాక్సొనీ , స్కాట్లాండ్ లకి తరలటం ప్రారంభమయింది. ప్రజల నమ్మకాలు ఆర్ధిక అదృష్టాలని ప్రభావితం చేసాయా? మరి ప్రొటెస్టంటిజం లో ఉన్న తేడా ఏంటి? Luther భోధనలు కేవలం కష్టించి పనిచేయమనే చెప్పకుండా, పెట్టుబడిని పోగుచేసుకోమని కూడా భోధించాయా?
ఈ ప్రశ్నలన్నిటికీ ఒక ప్రభావవంతమైన సమాధానాన్ని వెతికిన మనిషి జర్మన్ ప్రొఫెసర్ అయిన Max Weber. Father of modern sociology గా పిలవబడే Max Weber 'Protestant work ethic" అన్న పదాన్ని నిర్వచించాడు. అతి చిన్న వయసులో మేధావిగా గుర్తింపు పొందిన Weber , "The History of Medieval Business Organizations" and "Roman Agrarian History and its Significance for Private Law" లాంటి థీసిస్ లతో ముప్పైఏళ్ళకి Freilburg లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా నియమింపబడ్డాడు. Reformation వచ్చేంతవరకీ, క్రిస్టియానిటీ ఇహలోక, భౌతిక విషయాలకన్నా, దైవ భక్తీ, దైవసేవా, అంకితభావం మీద ఎక్కువగా ప్రాముఖ్యతని ఇచ్చేది. ధనం వడ్డీకి ఇవ్వటం పాపం గా భావించేవారు. పేదవారికన్నా ధనవంతులు స్వర్గానికి వెళ్ళే అవకాశాలు తక్కువన్న నమ్మకం ప్రబలి ఉండేది. ఆధ్యాత్మిక జీవనశైలి ఫలితాలు మరణానంతరం లభిస్తాయి అని నమ్మేవాళ్ళు. 1520 తరువాత రిఫార్మేషన్ ప్రభావం చూసిన దేశాల్లో పరిస్థితి అంతా మారిపోయింది . రిఫార్మేషన్ లో ఏ కారణం వల్ల ఉత్తర యూరప్ కాపిటలిజం వైపు అడుగులు వేసిందా అని Weber తన అనుభవాల నేపథ్యంలో ఆలోచించాడు.
1904 లో Weber అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరాన్ని సందర్శించాడు. ఎన్నో లైట్లతో వెలిగిపోతున్నసెయింట్ లూయిస్ నగరం Weber ని ఆశ్చర్యపరచింది. సాక్షాత్తూ థామస్ ఎడిసన్ అక్కడే ఉన్నాడు. నగరంలో టెలిఫోన్స్ మొదలు మోషన్ పిక్చర్స్ వరకీ మోడర్న్ టెక్నాలజీ నిండిపోయి కనపడింది. ఈ సమాజంలోని ఏ లక్షణం తన ఇండస్ట్రియల్ జర్మనీ ని సైతం మందకొడి సమాజంగా కనపడేలా చేస్తోందన్న ప్రశ్న Weber ని వేధించింది. వెనువెంటనే అమెరికాలో మిగతా ప్రదేశాల కి ప్రయాణం కట్టాడు. వందేళ్ళ క్రితం తన ప్రయాణంలో సెయింట్ లూయిస్ కి వంద మైళ్ళ దూరం లో సెయింట్ జేమ్స్ లో , కొత్తగా వెస్ట్ వైపు వేస్తున్న రైలు మార్గాల పక్కనే కొత్తగా వెలుస్తున్న చిన్న చిన్న టౌన్స్ లో పెద్ద సంఖ్యలో ఉన్న చర్చ్ లు, చాపెల్స్ , అమెరికా మెటీరియల్ సక్సెస్, అమెరికా రిలీజియస్ లైఫ్ కి మధ్యన ఏర్పడిన అనుసంధానం తన దృష్టిని ఆకర్షించాయి. The protestant ethic and Spirit of Capitalism అన్న వ్యాసాన్ని రచించాడు. వెస్టర్న్ సివిలైజేషన్ గురించిన వాదనల్లో ఈ వ్యాసం ప్రముఖమైనది. వెస్టర్న్ సివిలైజేషన్ లోని ఆర్ధిక చైతన్యం, ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ వల్ల అనుకోకుండా వచ్చిన పరిణామమని Weber వాదిస్తాడు. మిగతా మతాలు భౌతికమయిన వస్తువులనీ, సౌకర్యాలనీ త్యజించమని భోదిస్తున్న కాలంలో , ప్రొటెస్టెంట్ వర్గాలు ఇండస్ట్రీని, కష్టపడి పనిచేయటాన్నీ, డబ్బునీ తెలివిగా వాడుకోవడాన్ని , పనియే దైవమన్న భావనగా చూసారనీ, అందువల్ల సదా కష్టించి పనిచేయటమే protestant work ethic లో భాగమనీ, ఇదే కాపిటలిజం కి జన్మనిచ్చిందనీ, ఇంకా ఇతర కారణాలతో వాదిస్తాడు.
Weber వాదనల్లో లోపం లేకపోలేదు. అతను Jews ని విమర్శించిన తీరు, ఫ్రాన్స్ బెల్జియం లలో successful Catholic Entrepreneurs ని విస్మరించిన తీరు, మార్టిన్ లూథర్ , బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలు, జర్మనీ లో ప్రొటెస్టెంట్ ప్రాంతాల్లో Weber వాదనకి సరిపోని ఉదాహరణలు అతని వాదనల్లో లోపాలకి ఉదాహరణలు.
అయినప్పటికీ, కొన్ని కారణాలు Weber ఒక మూలసూత్రాన్ని కనిపెట్టేదిశలో సరైన దిశలోనే అడుగులు వేసాడనిపిస్తుంది. రిఫార్మేషన్ తరువాత యూరప్ లోని ప్రొటెస్టెంట్ దేశాలు, కాథలిక్ దేశాల కన్నా వేగంగా అభివృద్ది చెందాయి. 1700 కల్లా సగటు ఆదాయం ఎక్కువుండటమే కాక, 1940 ల కల్లా జీవన ప్రమాణాల్లో కనీసం 40 శాతం ఎక్కువ అభివృద్ది సాధించాయి. ఒకవేళ రిలీజియన్ ఒక్కటే దీనికి కారణం కాదు అని అనుకున్నా, ప్రొటేస్టేంట్ ల మాజీ కాలనీలు కూడా, కాథలిక్ కాలనీల కంటే ఎకనామికల్ గా మెరుగ్గా ప్రగతి సాధించాయి. రిఫార్మేషన్ కాలంలో బైబిల్ కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా, ప్రతి సగటు మనిషి చదవగలగాలీ, చదవాలీ అన్న Luther ఆలోచనా, ఆశయం మేరకు Protestantism అక్షరాస్యత ని ప్రోత్సహించింది. ఆ తరువాత వచ్చిన ప్రింటింగ్ ప్రెస్ , అక్షరాస్యతలూ కలసి , ఆర్థికాభివృద్ది కీ, సైన్స్ అధ్యయనానికీ ఎంతో తోడ్పడ్డాయన్నది తోసిపుచ్చలేని సత్యం. స్కాట్లాండ్ లాంటి విద్యాధికశాతం సాధించిన సమాజంలోనే కాకుండా ప్రొటెస్టెంట్ ప్రపంచంలో అంతటా కూడా ఈ పరిణామం సంభవించింది. ప్రొటెస్టెంట్ మిషనరీస్ ఏ దేశానికిళ్ళినా అక్కడ లోకల్ ప్రజల్లో అక్షరాస్యత పెంపొందించడానికి పాటుపడ్డారు. కానీ, కాథలిక్ మిషనరీస్ ఇలా అక్షరాస్యత ప్రోత్సాహానికి ప్రాముఖ్యతనిచ్చారని చెప్పలేము. రిఫార్మేషన్ సమయంలో రిఫార్మేషన్ ని వ్యతిరేకించిన కాలం నుంచీ రెండవ వాటికన్ కౌన్సిల్ కాలం (1962-65) వరకీ వారీ విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. ప్రొటెస్టెంట్ మిషనరీస్ వల్లే బ్రిటీష్ కాలనీల్లో స్కూల్స్ లో విద్యార్థుల నమోదు శాతం ఇతర దేశాల కన్న కనీసం నాలుగయింతలు ఎక్కువగా ఉండేది.
1941 లో బ్రిటీష్ కాలనీ అయిన ఇండియాలోని కేరళ 55 శాతం అక్షరాస్యతని సాధించి , ఇండియాలోనే ఏ ఇతరప్రాంతం కన్నా కూడా ముందు నిలవడమే కాక, యూరప్ లోని పేద దేశాలయిన పోర్చుగల్ లాంటి సరసన నిలచింది. దీనికి కారణం కేరళలో ప్రొటెస్టెంట్ మిషనరీస్ ఎక్కువగా, యాక్టివ్ గా పనిచేయటం. ఎక్కడైతే ప్రొటెస్టెంట్ మిషనరీస్ యాక్టివ్ గా లేవో (ఉదా: ముస్లిం ప్రాంతాలు, ప్రొటెక్టరేట్స్ ) అక్కడ అక్షరాస్యత చాలా నెమ్మదిగా అభివృద్ది చెందింది.

రిలీజియన్స్, సంఘాలని అంతర్లీనంగా చాలా ప్రభావితం చేస్తాయి. ముందు చాప్టర్లల్లో చెప్పినట్లుగా Stability Ethic మీద దృష్టి కేంద్రీకరించిన Confucius Philosophy చైనా అపజయాల్లో ఎలాంటి పాత్ర పోషించిందో చూసాం. వెస్టర్న్ యూరప్ లో కాంపిటీషన్ అధారంగా ప్రోత్సాహించబడిన ఇన్నోవేషన్ పూర్తిగా భిన్నమైనది. ఇస్లామిస్ట్ దేశాల్లో కూడా ముల్లాలు, ఇమామ్ లు సైంటిఫిక్ ప్రగతిని ఎలా సమూలంగా అణచివేసారో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే సౌత్ అమెరికా లో , ఆర్ధికాభివృద్దికి రోమన్ కాథలిక్ చర్చ్ ఎలా అడ్డంకిగా మారిందో కూడా చూసాం.
ఒక్క విషయం స్పష్టం. ప్రొటెస్టెంట్ కల్చర్ పౌరులని ఎక్కువ కష్టపడేలా మాత్రమే కాక , ఎక్కువ పొదుపు చేసేలా, ఎక్కువ చదువుకునేలా చేసింది. టెక్నాలజీ మరియు వినియోగం రెండూ కలపి ఇండస్ట్రియల్ రివల్యూషన్ ని వర్ధిల్లచేసి ఉండొచ్చుగాక, కానీ ఆ పారిశ్రామిక విప్లవం పని గంటలని, పని తీవ్రతని ఎక్కువ చేయటమే కాక, పొదుపు మరియు ఇన్వెస్ట్మెంట్ ల ద్వారా పెట్టుబడి ని పెంచింది. వీటన్నిటికన్నా ఎక్కువగా అది హ్యుమన్ కాపిటల్ మీద ఆధారపడింది. ప్రొటెస్టంటిజమ్ ప్రోత్సహించిన అక్షరాస్యత వీటన్నిటికీ కీలకమయింది.
మరి ఇప్పుడు వెస్ట్ తన మతాన్నీ, దాంతో పాటూ వచ్చిన work ethic ని కోల్పోయిందా?
GET YOUR KICKS
యూరొపియన్స్ ఈ రోజు టైం వేస్ట్ చేస్తూ ఖాళీగా గడుపుతున్నారు. సగటున వారు అమెరికన్స్ కన్నా తక్కువగానూ, ఏషియన్స్ కన్నా మరింత తక్కువ పనిగంటలు పని చేస్తున్నారు. అంతకు ముందు తరాలతో పోలిస్తే చదువు పూర్తయ్యే కాలం మరింతగా పొడిగింపబడటమూ, తొందరగా రిటైర్ అవ్వటమూ కలపి , పనికి అవసరమయిన యూరోపియన్స్ తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటున్నారు. ఉదాహరణకి బెల్జియం, గ్రీకు లలో పదిహేనేళ్లని మించిన యువతీయువకుల్లో 54 శాతం మాత్రమే లేబర్ ఫోర్స్ లో ఉంటే, అమెరికాలో 65, చైనా లో 74 శాతం ఉన్నారు. యూరోపియన్స్ స్ట్రైక్ లకి వెళ్ళే అవకాశాలూ, సందర్భాలూ కూడా ఎక్కువే. 2000-2009 ల మధ్యలో సగటు అమెరికన్ 1711 గంటలు పనిచేస్తే, సగటు జర్మన్ 1437 గంటలు మాత్రమే పనిచేసాడు. 1979 లో ఇంత తేడాలుండేవి కాదు, సగటు స్పానిష్ వర్కర్ అమెరికన్ వర్కర్ కన్నా ఎక్కువ గంటలు పని చేసేవాడు. అప్పట్నుంచీ యూరోపియన్ పనిగంటలు తగ్గుముఖం పడుతూ, దాదాపు ఇరవైశాతం కుదించబడ్డాయి. ఏషియాలో పరిస్థితి వేరే. సగటు సౌత్ కొరియన్ దాదాపు 39 శాతం ఎక్కువ గంటలు పనిచేస్తాడు. హాంగ్ కాంగ్, సింగపూర్ లలో కూడా అమెరికన్స్ కన్నా దరిదాపు ముప్పైశాతం గంటలు ఎక్కువగా పనిచేస్తారు.
పనిగంటలే కాదు, యూరోపియన్స్ ఈ రోజు ప్రార్ధన కూడా తక్కువే చేస్తారు, అట్లాంటిక్ కి అటుపక్క వారితో పోలిస్తే. ఒకప్పుడు యూరప్ అంతా Christendom అని సగర్వంగా చాటుకునేది. యూరప్ నుంచి pilgrims, missionaries, conquistadors ప్రపంచం నలుమూలలకి ప్రయాణం చేసి మతప్రచారం చేసారు. కాని ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. 2005-2008 లో World Values Survey ప్రకారం , 4% Norwegians & Swedes, 8% French and Germans మాత్రమే వారానికి ఒకసారి చర్చ్ సర్వీస్ కి వెళతారు. కానీ అమెరికాలో 36 శాతం, బ్రెజిల్ లో 48 శాతమ్, సబ్-సహారా ఆఫ్రికాలో 78 శాతం వారానికోసారయినా చర్చ్ కి వెళతారు. కాధలిక్ దేశాలయిన ఇటలీ, స్పెయిన్ లు 32%,16% లతో సగటు ప్రొటెస్టెంట్ యూరోపియన్ దేశాలకన్నా ఎక్కువగానే చర్చ్ సంబంధమయిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంఖ్యలు యూరప్ కన్నా తక్కువగా రష్యా, జపాన్ లలో గమనించవచ్చు. God is very important for us అని కేవలం పది శాతం జర్మన్స్, డచ్ , ఫ్రెంచ్ ప్రజలు చెప్పగా, 58 శాతం అమెరికన్స్ మా జీవితాల్లో దేవుడి ముఖ్యమని అభిప్రాయం వెలిబుచ్చారు. చైనాలో సైతం అతి తక్కువమంది (5%) God is important అని సర్వేలో చెప్పారు. ఈ దృక్పథం లోంచి ప్రజలు రాజకీయనాయకులని ఎలా అంచనా వేస్తున్నారన్న ప్రశ్నకి, ఇండియా, బ్రెజిల్ లలో 50 శాతం కన్నా ఎక్కువే ప్రజలు మేము atheist politician ని సహించమని చెప్పారు. ఇదే సంఖ్యలు అమెరికాలో 33 శాతం, నార్వే, స్వీడన్ లలో 4 శాతం, ఫిన్లాండ్ లో 9, జర్మనీ, స్పెయిన్ లలో 11, ఇటలీలో 12 శాతంగా ఉన్నాయి.
ఇహ ఆ సర్వే ప్రకారం బ్రిటన్ లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. 17 శాతం బ్రిటన్స్ కనీసం వారానికి ఒకసారి చర్చ్ కి వెళ్తామని చెప్పారు. 25 శాతం కన్నా తక్కువగా బ్రిటన్స్ God is important in our lives అని అభిప్రాయపడ్డారు. 2004 లో బ్రిటన్ లో చేసిన ఒక సర్వే ప్రకారం ఏదేని సగటు వారంలో క్రిస్టియన్స్ చర్చ్ కి వెళ్ళే సంఖ్య కన్నా, ముస్లిమ్స్ మసీదు కి ఎక్కువగా వెళతారని తెలియవచ్చింది. Sunday May 8, 2005 న 18720 చర్చ్ లలో నిర్వహించిన సెన్సస్ లెక్కల్లో real rate of attendance కేవలం 6.3 శాతమని తేలింది. 1960ల నుంచీ దక్షిణదిశగానే ఈ సంఖ్యలన్నీ ప్రయాణం చేసాయి. క్రిస్టియానిటీ ని పాటించే జనాభా వయసు మీరుతోంది. 1999 లో 38 శాతం మెథడిస్టులు, 65 సంవత్సరాల వయసు దాటినవారే. బ్రిటన్ లోని యువత దేవుణ్ణి నమ్మే అవకాశాలు రానూ రానూ తక్కువయిపోయాయి. ఒక్కసారి కూడా చర్చ్ కి వెళ్ళని దాదాపు 56 శాతం జనాభాతో బ్రిటన్ వెస్టర్న్ యూరప్ లోనే, ఒక Godless country గా తయారయింది.
అయితే ఇరవైశతాబ్ధంలోని ప్రసిద్ద రచయితలు ఈ పరిస్థితిని ముందే తమ రచనల్లో ఊహించారు. C.S. Lewis , Evelyn Waugh లు రెండవ ప్రపంచ యుద్దం వల్ల క్రిస్టియానిటీ కి పెనుప్రమాదం రాబోతుందని గ్రహించారు.
ఇదంతా చదివాక, మరి బ్రిటీష్ ప్రజలు దేవుడి మీద నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారు అన్న ప్రశ్న ఉదయించక మానదు. చాలా క్లిష్టమయిన ప్రశ్నల్లాగే దీనికి కూడా జవాబు కళ్ళెదుటే ఉన్నట్లూ అన్పిస్తుంది, కానీ అది పూర్తి సత్యం కాదు. Philip Larkin ఈ ప్రశ్నకి సమాధానం "1960s" అని ఒక్కముక్కలో తేల్చేసాడు. Beatles, Contraceptive Pill, Mini-Skirt ఈ మూడు కలసి చేసిన విధ్వంసమని తన అభిప్రాయం. కానీ, అవే మూలకారణాలని నిందించేముందు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, అమెరికాలో కూడా ప్రజలివన్నీ అనుభవించారు, కానీ దేవుడి మీద నమ్మకాన్ని వాళ్లు బ్రిటీష్ ప్రజలంతగా కోల్పోలేదు. ఎందుకని? నిజానికి బ్రిటన్స్ ని ఈరోజు ఈ ప్రశ్న అడిగితే, అమెరికాలోని బైబిల్ బెల్ట్ రాష్ట్రాలని చూసి మతమౌడ్య ప్రాంతాలని కళ్లు తేలేస్తారు, కాని వారు కోల్పొయిన నమ్మకమే ఒక అపభ్రంశ అని గ్రహించుకోరు.
మరి యూరప్ లో క్రిస్టియానిటీని చంపేసిందెవరు?
Weber ముందే ఊహించినట్లుగా కాపిటలిజం, వినియోగం, దాంతోపాటే పెరుగుతూ వచ్చిన మెటీరియలిజం ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ ని చంపేసాయా? టాల్ స్టాయ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు. క్రీస్తు భోధనలకీ, మనమీ రోజు పిలుస్తున్న సివిలైజేషన్, సంస్కృతి, కళలూ, సైన్స్ లకీ మధ్య ఘర్షణ తప్పదని భావించాడు.
మరయితే, ఆర్థికాభివృద్ది లోని ఏ భాగం మతం మీద నమ్మకానికి అడ్డంకి గా నిలుస్తోంది?
మరయితే, ఆర్థికాభివృద్ది లోని ఏ భాగం మతం మీద నమ్మకానికి అడ్డంకి గా నిలుస్తోంది?
- మారుతున్న మహిళల పాత్రా, కుదించుకుపోతూ, దిగజారిపోతూ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీల వల్ల మరింతగా కుంగిపోతున్న కుటుంబపరిమాణమూ, తగ్గిపోతున్న జనాభా సంఖ్య ఇవన్నీ కలిపి సైంధవ పాత్ర పోషిస్తున్నాయా?
- సైంటిఫిక్ నాలెడ్జ్ వల్ల ప్రపంచంలోని మిస్టరీలన్నీ తేటతెల్లమవుతూ ఉండటం వల్ల దేవుడిమీదా, మతం మీదా నమ్మకం తగ్గిపోతూ వస్తుందా?
- ముందుతరాల్లో "మరణానంతర దశ" సమీప భవిష్యత్తులో వచ్చే ప్రమాదమని కన్పించేది, రానూ రానూ ఆయుష్షు పెరుగుతూఉండటం వల్ల ఆ ప్రమాదం ఎప్పుడో సుదీర్ఘ భవిష్యత్తులో వచ్చే పరిణామం అవటం వల్ల ఆ ఎరుక క్రమంగా మాసిపోయి, మనిషిలో ఆ భయం తగ్గి, ప్రజలు దైవ, మత మార్గాలని త్యజించారా?
- లేక ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలని విస్తారంగా అమలు చేయటం వల్ల మనం ఊయల దశనుంచీ, శ్మశాన దశ వరకీ ప్రభుత్వాల, వ్యవస్థల సంరక్షణ కి ప్రజలు అలవాటు పడటం వల్ల , కనీస జీవన మనుగడకి ప్రమాదం తప్పి దైవభీతి తగ్గిపోవటం ప్రారంభమయిందా?
- లేక యూరోపియన్ క్రిస్టియానిటి, మోడర్న్ కల్చర్ మీద మితిమీరిన మోజుతో తనను తానే చంపేసుకుందా?
- లేక యూరప్ ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒంటి చేత్తో హత్య చేసాడా?
The Future of an Illusion (1928) లో ఫ్రాయిడ్ Weber ప్రతిపాదించిన సిద్దాంతాలనీ, కారణాలనీ తోసిపుచ్చాడు. వెస్టర్న్ సివిలైజేషన్ సాధించిన విజయాలని రిలీజియన్ వివరించలేదన్నాడు. మతం ఒక మాయ అనీ, universal neurosis అనీ, అది మనిషి సహజ, మూల ప్రవృత్తులయిన sexual desires, violent & destructive impulses లని అదిమిపెట్టడానికి అభివృద్ది చేసిన వ్యవస్థ అనీ అభిప్రాయపడ్డాడు.
రిలీజియన్ విచ్చలవిడి సెక్సువల్ ప్రవర్తనలని నిషేదించటమే కాదు, మృత్యువు, జీవన సమరంలోని దు:ఖాల లాంటి కష్టాలని మనిషికి వివరించటానికి ప్రయత్నం చేసింది. అనేక దేవుళ్ళ స్థానంలో , ఒకే దేవుణ్ణి ప్రతిపాదించిన మతాలు వచ్చాక, ఆ దేవుడికీ, మనిషికీ మధ్య బంధం ఒక తండ్రికీ, కుమారుడికీ ఉన్న బంధమైంది. తండ్రి కోసం ఎంతో కష్టపడ్డ సంతానానికీ ఎప్పుడో ఒకప్పుడు సరైన బహుమతులూ, ప్రశంసలూ లభిస్తాయన్న నమ్మకం ఏర్పడింది.
మతానికున్న పవిత్రత, మొండితనం, మూర్ఖత్వం, దుస్సహనం, హేతుబద్ద ఆలోచనకి వ్యతిరేకత లక్షణాలని కలిగిఉన్న కొత్త సిద్దాంతం ఏదైనా వస్తే తప్ప, మానవజాతి ఎప్పటికైనా మతాన్ని త్యజిస్తుందన్న ఆశలు తక్కువేనన్నాడు ఫ్రాయిడ్.
కానీ, స్టాలిన్, హిట్లర్ తమ దుర్మార్గ కల్ట్ లతో 1930 లలో ఆ పరిస్థితి సంభవించేలా కనపడింది.
అయినప్పటికీ, ఈ కొత్త కల్ట్ లు ఫ్రాయిడ్ భావించిన మనిషి మౌళికలక్షణాలని రూపుమాపలేకపోయాయి. 1945 లో యూరప్ అంతటా క్రూరమైన హింసనీ, Timur తరువాత అంతటి స్థాయిలో మాస్ రేప్ ల ద్వారా దిగ్భ్రాంతికరమయిన సెక్సువల్ వయొలెన్స్ నీ చూసింది.
ఈ పరిణామాలకి మొదటి స్పందన కొన్ని దేశాలు రిలిజియన్ వైపే మొగ్గుచూపటంతో ప్రారంభమయింది. కానీ 1960 ల కల్లా యుద్దానంతరం పెరిగిన యువతకి అవేవీ గుర్తులేక తమలో అణగారిఉన్న కోరికలు క్రిస్టియానిటీ బయట తీర్చుకోవాలనుకున్నారు. ఫ్రాయిడ్ చెప్పిన థియరీస్ లో భాగంగానే కోరికలణచుకోవటాన్ని భోధించే రిలీజియన్ పట్ల వ్యతిరేకతా భావం నింపుకున్న యువత చర్చ్ లని త్యజించి, సెక్స్ షాప్ లకి వెళ్ళింది. Civilization and its Discontents (1929-1930) లో ఫ్రాయిడ్ , మనిషి అట్టడుగు పొరలలో ఉన్న కోరికలకీ, నాగరికత కీ మౌళికమైన వ్యతిరేకత ఉందనీ వాదించాడు. ఆ గ్రంధంలో ఫ్రాయిడ్ సుదీర్ఘవాదన చదివిన వియన్నా వ్యంగ్యరచయిత Karl Kraus "చికిత్స అని భ్రమపడే వింతవ్యాధే సైకో-అనాలసిస్" అని ఓ వ్యంగ్యోక్తి విసిరాడు. ఏదేమైనా హిప్పీలు Let It All Hang Out (1967) అన్న విధానాన్నే పాటించారు. వెస్ట్ విమర్శకుల ప్రకారం 1960 లు, వ్యక్తి సెక్స్ వాంఛలని సెలబ్రేట్ చేసుకునే లక్షణాలతో నిండిపోయి , థియాలజీ ని వదలి 'పోర్నోగ్రఫీ' , శాంతిని ప్రవచించే Prince of Peace లాంటి కాథలిక్ కమ్యూనిటీస్ ని వదలి హింసనిండి ఉన్న సినిమాలూ, వీడియో గేమ్స్ లతో('వార్నోగ్రఫీ') నిండి ఉన్న ఫ్రాయిడ్ అనంతర, నాగరికానంతర అనాగరికత సమాజానికి ద్వారాలు తెరచాయి.
ప్రొటెస్టంటిజం అంతమవ్వటానికి పైన చెప్పిన కారణాలూ, సిద్దాంతాలతో వచ్చిన ఇబ్బందేమిటంటే , యూరప్ లోని క్రిస్టియానిటీ పలచనవడాన్ని ఇవి వివరిస్తాయేమో కానీ, అదే కాలంలో అమెరికాలో ఎందుకు క్రిస్టియానిటీ కొనసాగగలిగిందో అర్ధవంతంగా వివరించలేవు. అమెరికాలోనూ, యూరప్ లో మాదిరిగానే సాంఘిక, సాంస్కృతిక మార్పులు సంభవించాయి. వారు ధనవంతులయ్యారు. వారి సైన్స్ జ్ణానం పెరిగింది. యూరోపియన్స్ కన్నా ఎక్కువగానే సైకో-అనాలసిస్, పోర్నోగ్రఫీ లు లభ్యమయ్యాయి. కానీ అమెరికాలో ప్రొటెస్టంటిజం , యూరప్ లో దెబ్బతిన్నంతగా నష్టాల్ని చూడలేదు. నిజానికి దానికి వ్యతిరేకంగా నలభై ఏళ్ల క్రితంతో పోలిస్తే అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో God పాత్ర ఈ రోజుకీ అదే స్థాయిలో ఉండడమో ఇంకా పెరగడమో సంభవించింది. ఆదివారం కోట్ల సంఖ్యలో చర్చ్ లకి హాజరయ్యే ప్రజలే దానికి సాక్ష్యం.
అమెరికాలో 1960 లలో sex, drugs, rock-n-roll లతో పాటూ, evangelical protestantism కూడా పెరగడమనే వైచిత్రి సంభవించింది. అమెరికా లో పాపులర్ ప్రీచర్ అయిన రెవరెండ్ బిల్లీ గ్రాహం, ఎవరెక్కువ యువతని స్టేడియం లకి తీసుకురాగలరని బీటిల్స్ తో సైతం పోటీపడ్డాడు.
వెస్టర్న్ సివిలైజేషన్ తూర్పున godless Europe గానూ, పశ్చిమాన God-fearing America గానూ రెండుగా
విడిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోగలం? యూరప్ లో క్రిస్టియానిటి క్షీణిస్తున్న కాలంలో , అమెరికాలో నిలదొక్కుకుని ఉండగలటాన్ని ఎలా వివరించగలం? దీనికి సమాధానం కావాలంటే, అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ , మిస్సోరీ లో చూడవచ్చు. స్ప్రింగ్ ఫీల్డ్ లో 122 Baptist Churches, 36 Methodist chapels, 25 Churches of Christ, 15 Churches of God మిగతావన్నీ కలపి, 400 Christian worship places ఉన్నాయి.

ముఖ్యమయిన విషయమేమిటంటే, ఈ చర్చ్ లన్నీ ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. Weber ప్రయాణం చేసిన కాలంలో American Baptists, Methodists లు ఎవరెక్కువ దైవభక్తి కలవాళ్లని పోటీపడి ఉండొచ్చేమో కానీ, ఈకాలంలో కాంపిటీషన్ చర్చ్ ల మధ్య ఉంది. కార్-డీలర్స్ , ఫాస్ట్-ఫుడ్ జాయింట్స్ మధ్య ఎలా తీవ్రపోటీ ఉంటుందో అలాగే ఈ చర్చ్ ల మధ్య ఉంది!!. చర్చ్ లు కూడా కమర్షియల్ మైండ్ తో భక్తులని ఆకర్షించటం మొదలెట్టాయి. యూరప్ కళ్ళకి, ఇదంతా ఓ షాపింగ్ మాల్ లానో , ఓ బిజినెస్ పార్క్ లానో కనిపించవచ్చు. కానీ స్ప్రింగ్ ఫీల్డ్ లో ఈరోజున అమెరికాలో అత్యంత పెద్ద చర్చ్ ఉంది, అందులోని పేస్టర్ John Lindell కరిష్మా ఉన్న ప్రీచర్. ఆయన భోధనలని వింటూంటే ఒక రిలీజియస్-ప్రీచర్ కన్నా, స్టీవ్ జాబ్స్ ని వింటున్నట్లుగా ఉంటుంది. ఆయన ప్రకారం ప్రొటెస్టంటిజం అమెరికాలో ఇంకా బలంగానే ఉంది. క్రమం తప్పకుండా చర్చ్ కి రావటం వల్ల మనుషులు వారి జీవితాల్లో ఇంకా కష్టపడి పని చేయాలన్న తపన జీవించి ఉంటుందని భావిస్తాడు. స్వయాన ఆయన బాగా కష్టించి పనిచేసే మనిషి.
James River దగ్గరకెళ్ళినప్పుడు అమెరికా, యూరప్ లలోని ప్రొటెస్టంటిజంలో తేడాలు సులభంగానే గ్రహించవచ్చు. Reformation యూరప్ లో జాతీయం చేయబడి Church of England or Scotland's Kirk ల చర్చ్ ల నిర్మాణానికి తోడ్పడింది, కానీ అమెరికాలో తొలినాళ్ళనుంచీ మతానికీ, ప్రభుత్వానికీ మధ్య అడ్డుగోడ స్పష్టంగా, ధృఢంగా నిలచి ఉంది. అందువల్ల ప్రొటెస్టంటిజం లోని భిన్నవర్గాల మధ్య పోటీ మొదటి నుంచీ ఉంది. వింతగా అనిపించినప్పటికీ బహుశా ఇదే కారణం చేత యూరప్ లో ప్రొటెస్టంటిజం చనిపోయిందేమో??!!
అయినప్పటికీ, ఈరోజు అమెరికన్ ఎవాంజలికల్స్ ని Weber అనుమానాస్పదంగానే చూసిఉంటాడు. అంతా కమర్షియలైజ్ అయిపోయి అదో రకమైన Walmart Worship లా కన్పిస్తోంది. అంతే కాదు, చర్చ్ లకి వెళ్లడం ఒకప్పటి పోలిస్తే చాలా సులభమూ, ఎంటర్టెయినింగ్ గానూ తయారయ్యింది. దీనికి తోడు, చర్చ్ కి వస్తూన్న భక్తుల నైతిక వ్యక్తిగత ప్రవర్తన, జీవన విధానం మీద చర్చ్ వైపు నుంచి ఉన్న అంచనాలూ, షరతులూ కూడా తగ్గాయి. ఇంకా చెప్పాలంటే దేవుని వైపునుంచి భక్తుల మీద ఉన్న అంచనాల కంటే, భక్తులు దేవుణ్ణి అడిగే కోరికల చిట్టా పెరుగుతోంది. God the Father స్థానంలో God the Analyst వచ్చాడు. దాదాపు ముప్పై శాతం అమెరికన్స్ తమ మతాన్నో, మతంలోని శాఖనో, పూర్తిగా మతాన్నో విడిచిపెడుతూండే స్థాయికి చేరుకున్న అమెరికన్ సమాజంలో దైవనమ్మకం అనేది పూర్తిగా నిలకడలేనిదయింది.
మతమూ, దైవభక్తీ ఒక టైమ్ పాస్ వ్యవహారం అయిందంటే, Max Weber సిద్దాంతీకరించిన Protestant ethic నుంచి అమెరికా చాలా దూరం వచ్చేసిందన్నమాటే. అసలు ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ లో తక్షణ-సంతోషం కన్నా, కష్టపడి నిదానంగా సంపాదించుకున్న సంతోషానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా మనం ఈ మధ్యే Capitalism-without-saving అనే ఓ సుదీర్ఘ ప్రయోగం లోంచి బయటకొచ్చాం. అమెరికాలో housing-bubble పరాకాష్ట దశలో ఉన్నప్పుడు అమెరికన్స్ వారి సంపాదనంతా వినియోగసంస్కృతి లో ఖర్చుపెట్టటమే కాక, కాగితం మీద మాత్రమే పెరిగిన ఇళ్ల ధరల మీద లోన్లు తీసుకొని మరీ దుబారా చేసారు. అక్కణ్ణుంచి జారిన ఇళ్ల రేట్ల తో లక్షల మంది, ఇళ్లు పలికే ధరకన్నా అధికమొత్తంలో అప్పులో కూరుకుపోయారు. లోన్ పేమెంట్స్ కట్టలేని వందల వేల మంది ఇళ్లనొదిలేసి వదిలిపోయారు. పేమెంట్స్ రాని బ్యాంకులు పూర్తిగా దివాళా తీసే ప్రమాదపుటంచుమీదా ఊగి, కొన్ని ఆ అంచునుంచి జారిపోయాయి. పరిస్థితి అదుపుతప్పి, దేశం మొత్తమ్మీద ఎకానమీ పేకమేడల్లా కూలిపోతున్న ప్రమాదాన్ని గ్రహించిన అమెరికన్ ప్రభుత్వం, బ్యాంకులకి టాక్స్ పేయర్ మనీ సహాయాన్నందించి బెయిల్-ఔట్స్ తో వాటిని ఒడ్డుకు చేర్చింది. దీంతో దేశమ్మొత్తమ్మీద అప్పుభారం మితిమీరి పెరిగింది. ఈరోజు అమెరికా లో ప్రైవేట్-పబ్లిక్ అప్పు భారం, జిడిపి కన్నా మూడున్నర రెట్లయింది!!.
ఈ పరిణామం ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. కొన్ని తేడాలతో ఇంగ్లీష్ మాట్లాడే ఇతర దేశాల్లో Irleand, UK, కొద్దివరకీ కెనడా, ఆస్ట్రేలియా ల్లో కూడా కూడ ఇవే దృశ్యాలు సాధారణమయ్యాయి. పోర్చుగల్, గ్రీస్, ఐర్లాండ్ లలో ఇంతకన్నా పెద్ద సంక్షోభాలే వచ్చాయి. 2007-2009 లలో వచ్చిన ఆర్ధికసంక్షోభం ప్రపంచమంతా ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు గాక, కానీ దాని మూలాలు మాత్రం ప్రపంచమంతటా పరచుకొని లేవు. ఈ సంక్షోభం వెస్టర్న్ ప్రపంచంలో తయారయిన సమస్య. మితిమీరిన వినియోగం, పాటించని పొదుపు, వెసులుబాటు ఉన్నదానికన్నా ఆర్థికంగా ఎక్కువ వెసులుబాటు ని కలగచేసుకోవాలని ప్రయత్నించటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమయ్యింది.
ఏషియాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఏషియన్స్ పొదుపు రేట్లు ఎక్కువే అన్న సంగతి మనకి తెలిసిందే. ప్రైవేట్ అప్పు భారం కూడా తక్కువే. ఇళ్లు సాధారణంగా తక్కువ రుణ భారంతో కొనుగోళ్లవుతాయి. అదే సమయంలో ఏషియన్స్ ఎక్కువ పనిగంటలు కూడా పని చేస్తారు.
ఇండస్ట్రియలైజేషన్, ఆర్థికప్రగతీ ఇవన్నీ కలపి చైనాలో ఆశ్చర్యకరమయిన, అనుకోని పరిణామమొకటి సంభవించింది. క్రిస్టియానిటీ ఈ మధ్య కాలంలో, చైనాలో ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం.
THE CHINESE JERUSALEM
చైనాలో కాపిటలిజం వృద్ది అందరికీ తెలిసిన కధే. కానీ ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ సాధించిన వృద్ది సంగతి ఎంత మందికి తెలుసు?
Shanghai లోని China Partner and East China Normal University సర్వే ప్రకారం 1949 లో కేవలం ఐదులక్షలున్న ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్, ఈ రోజున చైనాలో నాలుగు కోట్ల మందయ్యారు. మరికొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య ఏడు కోట్ల వరకీ ఉంది. రెండు కోట్ల కాథలిక్స్ ని కూడా చేర్చినట్లయితే ఈ రోజు దాదాపు తొమ్మిది, పది కోట్ల క్రిస్టియన్స్ ఉన్నారు. అవును, యూరప్ లో ఉన్న Practicing Christians తో సరిసమానంగా చైనాలో కూడా ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. చైనాలో చర్చ్ లు వేగంగా నిర్మించబడుతున్నాయి. బైబిల్ ని ముద్రించే కంపనీల్లో Nanjing Amity Printing Company ప్రపంచంలోనే అతి పెద్దది. ఏడుకోట్ల బైబిల్స్ ని ముద్రించిన ఈ కంపనీ, అందులో ఐదు కోట్ల బైబిల్స్ ని మాండరిన్ భాషలోనే ముద్రించింది. ఇంకో మూడు, నాలుగు దశాబ్ధాల్లో , క్రిస్టియన్స్ చైనా జనాభాలో ఇరవై నుంచి ముప్పై శాతానికి చేరుకోవడాన్ని ఊహించవచ్చు. క్రిస్టియానిటీ వ్యాపించకుండా నిరోధించిన చరిత్రతో నిండి ఉన్న చైనాలో, ఈ పరిణామం దిగ్భ్రాంతికరం.
(ఇక్కడ రచయిత చైనాలో క్రిస్టియానిటీ చరిత్రని వివరిస్తాడు. 1299 నుంచీ, 1800 వరకీ మిషనరీస్ చేసిన ప్రయత్నాలూ, మింగ్ సామ్రాజ్యం ఆ ప్రయత్నాలని అడ్డుకున్న విధానాన్నీ చెపుతాడు. మూడవ క్రిస్టియన్ ప్రభంజనంలో బ్రిటీష్ మిషనరీస్, కొన్ని వేల సంఖ్యలో ఎవాంజలిస్టులని ఎలా పంపించాయో, ఈ మతమార్పిడుల ప్రయత్నాలని చైనీస్ ఇంపీరియల్ ప్రభుత్వం, ఏ రకమయిన ప్రచారాలతో తిప్పికొట్టిందో కొన్ని ఉదాహరణలు చూపుతాడు.
Nanjing లో 1853 కల్లా క్రమక్రమంగా బలపడుతోన్న క్రిస్టియానిటీ ఊపుని Qing empire Nanjing ని ఆక్రమించుకోవటంతో అడ్డుకుంటుంది. అయినప్పటికీ పట్టువదలని కొన్ని మిషనరీస్, వేషభాషలని మార్చి, చైనీస్ దుస్తులని వేసుకొని, Qing era లోని pigtail ని ధరించి ఎలా ప్రచారాన్నీ కొనసాగించిందీ, మరికొన్ని మిషనరీస్ ఇతర విధానాలయిన gospel of material progress and scientific knowledge ని ఎలా అవలంభించిందీ వివరిస్తాడు.
వీటన్నిటి వల్లా 1877 కల్లా చైనాలో పద్దెనిమిది క్రిస్టియన్ మిషనరీస్ క్రియాశీలకంగా పనిచేస్తూండటమే కాక, మూడు బైబిల్ సొసైటీస్ కూడా ఏర్పడడాన్ని ఉదహరిస్తాడు. మిషనరీస్ ఎన్నో విత్తనాలని నాటినప్పటికీ, Qing empire ని కూలగొట్టడంతో, ఈ విత్తనాలు చెల్లాచెదురయ్యాయి. కమ్యూనిస్టుల ప్రభంజనంలో క్రిస్టియానిటీ ప్రథమ కార్యకర్తలూ, నాయకులూ అందరూ కొట్టుకుపోయారు. ప్రాణనష్టంతో క్షీణించిన ప్రభావంతో CIM(China Inland Mission) తన సభ్యులని చైనాలోంచి విరమించుకుంది. కార్యకర్తల్లేకపోవడంతో చైనా అంతటా చర్చ్ లు మూతపడ్డాయి. దీనికి తోడు Great Leap Forward గా ప్రసిద్ధి గాంచిన 1958-62 కాలంలో, నిజానికి ఆకలి సంక్షోభం నాలుగున్నరకోట్ల చైనా ప్రజలని పొట్టనపెట్టుకుంది. ఈ కాలంలో మరిన్ని చర్చ్ లు మూతపడటమే కాక విగ్రహారాధన వ్యతిరేకత ఎన్నో బౌద్దమత గుడులని కూలగొట్టింది. కానీ, ఇదే కాలంలో Mao స్వయానా ఎంతోమందికి cult-leader అయ్యాడు. ఆయన భార్య Jian Qing చైనాలో క్రిస్టియానిటి కేవలం మ్యూజియం కి పరిమితమయ్యిందని సగర్వంగా ప్రకటించింది.
ఈ భాగంలో రచయిత వివరించిన,ఉదహరించిన ఇతర విషయాలు:

- Shanghai కి దక్షిణాన Zheijang province లోని Wenzhou నగరంలోని పారిశ్రామిక పట్టణంలోని ప్రగతీ;
- ఈ నగరంలో మావో ఆధ్వర్యంలో నడచిన cultural revolution కి ముందున్న 480 చర్చ్ ల సంఖ్య, ఈ రోజుకి అధికారిక అంచనాల ప్రకారమే 1339 కి చేరుకున్న విషయం;
- 1958 లో Religion-Free గా మావో ప్రకటించిన ఈ నగరంలో, 2002 కల్లా జనాభాలో, క్రిస్టియన్స్ 14 శాతానికి చేరుకున్న విషయం;
- గతంలో చైనీస్ అధికారగణం క్రిస్టియానిటీని అనుమానంతో చూసిన విధానం;
- తైపింగ్ తిరుగుబాటులో క్రిస్టియన్ మిషన్ల పాత్ర, తియానాన్మెన్ స్క్వేర్ లో సెమినరీ విద్యార్థుల భాగం, ఆ సంఘటనల్లో ప్రభుత్వం గాలించిన అతిముఖ్యమైన ఇద్దరు విద్యార్థులు, ఆ పిదప క్రిస్టియన్ క్లర్జీ లుగా మారిన విషయం;
- Nanjing లో Reverend Kan Renping యొక్క చర్చ్ సభ్యుల సంఖ్య 1994 లోని 400 నుంచి, 5000 వరకీ పెరిగి,చర్చ్ లోని ఆదివారం కార్యక్రమాలని కొత్తగా చేరాలనుకున్న సభ్యులు చూడలేక, స్థలం సరిపోక దగ్గర్లో ఉన్న chapels లో cctvs లో చూడాల్సి రావడం;
- బీజింగ్ లో అనధికారిక చర్చ్ లలో entrepreneurial or professional class జనాభా కలసుకుంటున్న వైనం;
- చైనాలో క్రిస్టియానిటీ లేటేస్ట్ ఫాషన్ అయిన విషయం;
- ఒలింపిక్ సాకర్ గోల్ కీపర్ Gao Hong, నటి Lu Liping, పాప్-సింగర్ Zheng Jun లు క్రిస్టియన్లన్న విషయం;
- రానున్న కాలంలో బౌద్దమతంలా క్రిస్టియానిటీ కూడా తనకున లక్షణాలని కాపాడుకుంటూనే మైనారిటీ మతంగా చైనాలో స్థిరపడవచ్చని చైనీస్ అకడమిక్ అయిన Tang Yi బహిరంగంగానే అంగీకరిస్తున్న విషయం;
- ఇంకా చైనాలోని ఇతర అకడమిక్స్, ఫిల్మ్ మేకర్స్ క్రిస్టియానిటి ప్రాముఖ్యత గురించి చెప్పిన విషయాలు,
- 2007 చైనా ప్రెసిడెంట్ గా Hu Jintao అధికారం చేపట్టాక కనీవినీఎరుగని రీతిలో పొలిట్ బ్యూరో సెషన్ ని "రిలీజియన్" అనే విషయం మీద నిర్వహించి, దేశంలో అత్యంత ప్రాముఖ్యమయిన 25 మంది అధికారులకి "the knowledge and strength of religious people must be mustered to build a prosperous society " అని ఆదేశించిన విషయమూ; చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 14వ సెంట్రల్ కమిటీ రిపోర్టులో ఆర్థికప్రగతి స్థిరంగా ఉండాలంటే, "ఆస్థిహక్కు" మూలస్థంభంగా ఉండాలనీ, rule-of-law భధ్రత విస్తారంగా లభించాలనీ, నైతికత అనేది సహాయంగా ఉండాలనీ పేర్కొన్న విషయమూ గురించి వివరిస్తాడు)
LANDS OF UNBELIEF
పైన చెప్పిన విషయాలన్నీ కూడా వెస్టర్న్ పునాదుల్లో భాగంగా ఉండేవి. కానీ ఈమధ్యకాలంలో వెస్ట్ ప్రజలు వీటి మీద నమ్మకం కోల్పోయినట్లుగా కనపడుతున్నారు. యూరప్ లోని చర్చ్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి; Europe లో Reformation కాలంలో వచ్చిన అభివృద్ది, మార్పుల మీద కొత్త అనుమానాలు మొదలయినట్లుగా గోచరిస్తున్నది; కాపిటలిస్టుల మధ్య పోటీ నడుస్తున్న కాలంలోని ఆర్ధికసంక్షోభాలతో, బ్యాంకర్స్ మితిమీరిన స్వార్ధాలతో గౌరవహీనమయిన స్థాయికి చేరుకుంది; సైన్స్ కోర్సుల్లో తక్కువ విద్యార్థులు కనపడుతున్నారు ; ప్రైవేట్ ఆస్థి హక్కులని ప్రభుత్వాలు అలవాటుగా అతిక్రమించి, తనను తాను మోయలేక మితిమీరిన ఆకలితో మరిన్ని ఆదాయపన్నులతో ధనసేకరణ చేసి, తమనుతాము సమర్ధవంతంగా నడపలేక ప్రజలఆదాయాన్ని దుర్వినియోగ పరుస్తున్నాయి.
మనకి మిగిలిందల్లా మతిలేని వినియోగసంస్కృతి, అన్ని కల్చర్స్ సమానమే అన్న మతిలేని వాదన ఒకటి. ఎంత తీవ్ర భావజాలాన్ని పెంచే కల్చర్ అయినా, ఏ కళా, హేతువు లేని ఆచారాలతో మగ్గిపోతున్న కల్చర్ అయినా అన్నిటినీ సమానంగా చూడాలన్న మోడ్రన్ వాదన ఒకటి వేళ్లూనుకుంటోంది. నాస్తికత్వం కొత్త పుంతలు తొక్కుతోంది.

నమ్మకానికీ, అపనమ్మకానికీ మధ్య తేడా తెలుసుకోవాలంటే London Transport System లో బాంబు బ్లాస్ట్ లని
ప్లాన్ చేసిన ముక్తర్ సయ్యద్ ఇబ్రహీమ్ మరియు Stanmore లో అతని పొరుగింటిలో ఉన్న Sarah Scott కి మధ్య జరిగిన సంభాషణ వినాలి.
"నువ్వు కాథలిక్ వి ఎందుకయ్యావు, మీ ఫ్యామిలీ ఐరిష్ ఫ్యామిలీ కాబట్టా? అని ఇబ్రహీమ్ నన్నడిగాడు. "లేదు నేను కాథలిక్ ని కాదు, నిజానికి నాకు ఏ మతంలోనూ నమ్మకం లేదు" అని చెప్పాను. దానికి అతడు "నమ్మకం లేదు అనేది సరికాదు, నమ్మకం ఉంచుకోవాలి" అని చెప్పాడు. "ప్రజలు ఎందుకో మతమంటే భయపడతారు, అలా భయపడకూడదు" అని కూడా చెప్పాడు. అదే సంభాషణలో "తను అల్లాని నమ్ముతాననీ, అల్లా ప్రార్ధనలు చేస్తే చనిపోయాక virgins లభిస్తారని, అలాంటివే ఏవో చెప్పుకొచ్చాడు" అని సారా చెప్పుకొచ్చింది.
మనమీ virgins మీద నమ్మకం మీదా, ఆ సంభాషణ మీదా ఎన్ని జోక్స్ అయినా వేసుకోవచ్చేమో, కానీ ఈ సంభాషణ ఈ రోజు యూరప్ లో మెజారిటీ అవుతోన్న నాస్తికులకీ, మైనారిటీ గా ఉన్న కరడుగట్టిన మతవాదులకీ మధ్యన ఎంతటి అగాధముందో తెలియచేస్తుంది.
నిజానికీ రోజున వెస్ట్, అరోమాథెరపీ దగ్గర్నుంచి, Zen and Art of Motorcycle Maitenance లాంటి ఎన్నో పోస్ట్-మోడరన్ కల్ట్ లతో నిండిపోయిఉంది. ఇవ్వేవీ కూడా ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ ఇచ్చే శక్తివంతమైన-ఆర్థికనమూనా మరియు సాంఘికబంధాల, వర్క్ ఎథిక్ లని ఇవ్వలేవు. అంతే కాదు, ఆధ్యాత్మికంగా ఆవరిస్తున్న శూన్యం వల్ల, ఇమ్మిగ్రెంట్స్ గా వచ్చి మతాన్ని మితిమీరి నమ్మే అతికొద్దిమంది మైనారిటీల రాజకీయ ఆశయాలూ, దురాశలకి వెస్ట్ లోని దేశాలు ఈజీ టార్గెట్స్ అవుతున్నాయి.
రాడికల్ ఇస్లాం కి, వెస్టర్న్ సివిలైజేషన్ కి మధ్యనున్న ఘర్షణ "Jihad vs McWorld" అన్న సారాంశంగా చెప్పగలగటమే దీనికి నిలువెత్తు ఉదాహరణ.
Western Civilization మూల విలువలైన
ఒక అంచనా ప్రకారం వెస్టర్న్ యూరప్ లో ముస్లిం జనాభా సంఖ్య 1990 లో ఒక కోటి నుండి, 2010 లో ఒక కోటి డెబ్బయి లక్షలకి చేరుకుంది. జనాభాశాతం ప్రకారం చూసినట్లయితే ఫ్రాన్స్ లో 9.8% నుండి పోర్చుగల్ లో 0.2% వరకీ అన్ని దేశాల్లో ఏదో శాతంలో ఉన్నారు.
ఈ సంఖ్యలు భవిష్యత్తులో గణనీయంగా పెరగబోతున్నాయి. 2004-2008 లో బ్రిటన్ లో ముస్లిం జనాభా 6.7%
శాతంతో పెరిగింది. అదే రేటున పెరిగినట్లయితే రానున్న మూడు-నాలుగు దశాబ్దాలలో యుకె జనాభాలో ముస్లిం ప్రజలు యాభై శాతానికి చేరుకోగలరని కొన్ని జనాభాఅంచనాలు చెపుతున్నాయి.
ఇమ్మిగ్రెంట్స్ తాము వలసవెళ్లిన సమాజాల సంస్కృతిలో భాగమవకుండా, రాడికల్ సిద్దాంతాలకి ఆకర్షితులవుతున్నప్పుడు అది దుష్పరిమాణాలకి దారితీసేప్రమాదముంది. పైన చెప్పిన సంఖ్యలకన్నా పాకిస్తానీ జమా-యత్-ఇస్లామీ, అరబ్ ముస్లిం బ్రదర్హుడ్, సౌదీ వాళ్లు ఫైనాన్స్ చేస్తున్నా ముస్లిం వరల్డ్ లీగ్ లాంటి రాడికల్ ఇస్లాం సంస్థలు , యూరప్ లోని ముస్లిం కమ్యూనిటీ లోకి ఎంతచొచ్చుకుపోయాయన్నదే ఆశ్చర్యం.
యార్క్ షైర్ లో జన్మించిన షెహ్జాద్ తన్వీర్ ఉదాహరణని చూద్దాం. ఇతను జన్మతా పేదవాడేమీ కాదు. ఇతని తండ్రి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇమ్మిగ్రంట్. చేపలూ , చిప్స్ ని అమ్ముతూ, మెర్సిడెస్ కార్ ని డ్రైవ్ చేస్తూ విజయవంతమైన ఫుడ్ బిజినెస్ ని నిర్మించుకోగలిగాడు. అలాగే తన్వీర్ చదువుకోని వ్యక్తి కూడా కాదు. లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటి నుంచి స్పోర్ట్స్ సైన్స్ లో పట్టా పొందాడు. కానీ ఇదే తన్వీర్ సూయిసైడ్ బాంబర్ గా మారి జూలై 7, 2005 న లండన్ లోని సర్కిల్ లైన్ అండర్ గ్రౌండ్ ట్రెయిన్ లో, Aldgate కీ, Liverpool కీ మధ్య బాంబులు పేల్చి ఆరుగురు ప్రయాణికుల మృతికి కారణమయ్యాడు.
ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంటర్టెయిన్మెంట్ లలో ఎన్ని అవకాశాలు కలిగించినప్పటికీ ఒక ముస్లిం ఇమ్మిగ్రెంట్ సంతానం, చెడ్డవ్యక్తుల భోధనల వల్ల ప్రభావమయ్యి కరడుగట్టిన తీవ్రవాది గా మారకుండా అడ్డుకోలేమనడానికి తన్వీర్ మంచి ఉదాహరణ. ఈ విషయంలో యూనివర్సిటీలలో ఇస్లామిక్ సెంటర్స్ ఎంతో పాత్ర పోషిస్తున్నాయి. జిహాద్ కి రిక్రూట్ చేసుకోవటమే కాక, అంతకు మించి పాకిస్తాన్ లాంటి దేశాల్లో ట్రెయినింగ్ కోసం ఈ సెంటర్స్ ముఖద్వారాల్లా పనిచేస్తున్నాయి. 1999-2009 మధ్యలో 119 వ్యక్తులు ఇస్లామిక్ టెర్రరిజం కి సంబంధించిన నేరాలు చేసినట్లుగా ఋజువయింది. ఇందులో రెండింట మూడువంతులు బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవాళ్లే. ఇవి కాకుండా 2006 అట్లాంటిక్ మీదుగా వెళ్తున్న విమానాలని పేల్చేసే కుట్రలో దొరికిన విద్యార్థులూ, 2009 క్రిస్ట్మస్ రోజున ఆమ్స్టర్డామ్ - డెట్రాయిట్ విమానాన్ని మార్గమధ్యంలో పేల్చేసే కుట్రలో నైజీరియాలో జన్మించిన లండన్ విద్యార్ధీ లాంటి ఉదాహరణలు, ఇస్లామైజేషన్ ఆఫ్ ఇమ్మిగ్రంట్ కమ్యూనిటీస్ కి నిలువెత్తు సాక్షాలు.
Decline and Fall లో Gibbon 180 నుండి 1590 వరకీ అంటే 1400 సంవత్సరాల చరిత్రని సమీక్షించాడు. ఇందులో పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న చక్రవర్తుల , రోమన్ చక్రవర్తుల బాడీగార్డుల దగ్గర్నుంచీ, "ఒకే దేవుడు" అన్న సిద్దాంతం ఎదుగుదల వరకీ చర్చించాడు. 180AD లో Marcus Aurelius చనిపోయాక, సివిల్ వార్ పెద్ద సమస్యయ్యింది.
నాలుగవ శతాబ్ధం కల్లా బార్బేరియన్స్ దాడులు, వలసలు తీవ్రమయ్యాయి, ముఖ్యంగా Huns వెస్ట్ కి తరలిపోయినప్పుడు. ఈ మధ్యలో పర్షియా నుంచి రోమన్ సామ్రాజ్యానికి ప్రమాదం పెరగసాగింది. మొదటిసారి వెస్టర్న్ సివిలైజేషన్ కూలిపోయినప్పుడు ఆ ప్రక్రియ నెమ్మదినమ్మెదిగా తగలబడిందని Gibbon అభిప్రాయపడ్డాడు.
చివరిసారిగా రోమన్ సామ్రాజ్య పతనం 406 లో ప్రారంభమయింది. జర్మన్ తెగలు Rhine నుంచి Gaul వరకీ వెళ్లి , చివరకి ఇటలీ మీద దాడిచేసాయి. 410 లో సాక్షాత్తూ రోమ్ Goth ల చేతిలో నేలమట్టమయింది . ఈ విజయంతో Goths స్పెయిన్ మీద దాడి చేసారు. 429-439 మధ్య జరిగిన వరస నార్త్-ఆఫ్రికా లో లభించిన వరస అపజయాలతో రోమ్ సామ్రాజ్య పరిధి కుచించుకుపోవటమే కాక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. రోమన్ సైనికులు Huns ని జయించలేకపోయారు. 452 కల్లా వెస్టర్న్ రోమన్ సామ్రాజ్యం బ్రిటన్ ని, స్పెయిన్ లో అత్యధికభాగాన్నీ, నార్త్-ఆఫ్రికా లోని ధనిక ప్రాంతాల్నీ కోల్పోయింది. ఇటలి మినహా పెద్దగా ఏం మిగల్లేదు. 468 కల్లా రోమన్ సామ్రాజ్యం పూర్తిగా పతనమయిపోయింది. 476 లో రోమ్ Odoacer, King of the Scirii కి ఓ కప్పం కట్టే సామంతరాజ్యమయి మిగిలింది.
ఎంత వేగంగా రోమన్ పతనం సంభవించిందనేది దిగ్భ్రాంతి కలిగించే విషయం. కేవలం ఐదు దశాబ్ధాల్లో రోమ్ జనాభా మూడువంతుల పైగా పడిపోయింది. ఆర్కియాలజికల్ శాఖ దగ్గరున్న ఐదవశతాబ్ధపు చివరి దశల్లోని సాక్షాల్లో రోమన్ సామ్రాజ్యపతనాన్ని చూడొచ్చు. ఒక చరిత్రకారుడన్నట్లుగా 'end of civilization' కేవలం ఒకతరంలోనే సంభవించింది.
మరి ఇప్పుడు చూస్తున్న వెస్టర్న్ సివిలైజేషన్ కూడా ఇంతే అకస్మాత్తుగా పతనమవనుందా? ఈ ప్రశ్న గత వందేళ్లుగా Chesterton నుంచీ , Shaw వరకీ బ్రిటీష్ మేధావులని ఇబ్బంది పెడుతూనే ఉంది.
కానీ ఈ రోజు భయాలకి కారణాలు మరింత స్పష్టంగా కనపడుతున్నాయి. చైనా మరియు ఇతర దేశాలు ఆర్ధికంగా వృద్ది సాధిస్తూ, వెస్ట్ కీ, ఈస్ట్ కీ మధ్యనున్న అంతరాలని తగ్గిస్తున్న ఇదే కాలంలోనే, పర్యావరణ మార్పుల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. భూమ్మీద కార్బన్-డై-ఆక్సైడ్ శాతం పెరుగుతోందనేది తిరుగులేని సత్యం. దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగింది. ఇంకా స్పష్టం కానిదేంటంటే ఇవే మార్పులు ఇలానే కొనసాగితే భూమ్మీద వాతావరణం భవిష్యత్తులో ఎలా మారబోతోందనేది. ధృవాల వద్దనున్న మంచు కరిగి సముద్రపు మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు కొట్టుకుపోయే ప్రమాదాలు ఎక్కువవుతాయి అని ఊహించటం బహుశా సత్యదూరం కాదేమో?
పర్యావరణమార్పులే కాక, ఏషియాలో అధిక జనాభా కల ప్రాంతాలు, దేశాలు పేదరికాన్ని తగ్గించేందుకు వెస్టర్న్ మార్గాన్ని పట్టిన ఈ దశలో, ఎనర్జీ సప్లై, ఆహారం, ఫ్రెష్ వాటర్ ల సప్లైల మీద తట్టుకోలేనంత డిమాండ్ ఏర్పడుతుందన్నది కూడా కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తల వాదన. climate change మీద ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే, వారు ఒక్కసారి చైనా సందర్శిస్తే, చైనాలోని ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల కలిగిన పర్యావరణ దుస్థితిని కళ్లారా చూడొచ్చు.
ఈ విషయాలని చర్చించే చాలామంది లాగే నేను(రచయిత) కూడా సైంటిఫికల్ గా తగిననాణ్ని కాదు, సరైన సాక్షాలివ్వడానికి. కానీ ఇక్కడ డేటా కన్నా కూడా అంతం గురించిన జ్యోస్యం మనల్ని ఆకర్షిస్తుంది. మొదటిసారిగా చరిత్రలో లిఖించబడిన myths and legends ని చూస్తే, ప్రపంచం అంతమవ్వటం అనే విపత్తు గురించి మానవుడు మొదటి నుంచీ ఊహాగానాలూ, జ్యోస్యాలు చెపుతునే ఉన్నాడన్నది స్పష్టమవుతుంది. ఇలాంటి ఉదాహరణలు బైబిల్ లోని apocalypse లోనే కాక, మరిన్న కల్చర్స్ లోని ఎన్నో ఉదాహరణలలో చూడొచ్చు.
అసలు decline and fall అనేది తప్పించుకోలేని సత్యమనీ, ప్రతిదీ తప్పక క్షీణించవలసిందేనని మానవుడిలో ఇంకిఫోయింది. బహుశా తప్పించుకోలేని "మృత్యువు" నుంచి ఈ ఆలోచన ఉధ్బవించి ఉంటుంది. వ్యక్తులు ఎలా వృద్దాప్యం లో క్షీణిస్తారో, నాగరికతలు కూడా అదే మార్పులకి లోనవుతాయని మన నమ్మకం.
నరుడు చివరకి గడ్డిలో కలసిపోతాడు. గర్వంతొ ఊగిపోయే క్షణాలు, అంతరించిపోయి శిథిలాల్లో కలసిపోతాయి. గతవైభవగుర్తులుగా మిగిలిపోయిన చిహ్నాల మీదుగా గాలి దిగులుగా వీస్తూంటుంది.
కానీ, సంక్లిష్టమయిన సాంఘిక , రాజకీయ పరిస్థితుల మధ్య ఈ decline and fall ఎలా సంభవిస్తుందనేది క్షుణ్ణంగా పరిశీలించి అర్ధం చేసుకోడానికి మనం కష్టపడుతుంటాం. సివిలైజేషన్స్ అకస్మాత్తుగా గాలిబుడగలా పేలిపోయి అంతమయిపోతాయా? లేక సుదీర్ఘకాలంలో క్రమక్రమంగా వీగిపోతూ రాలిపోతాయా?
ముగింపు చెప్పే ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కోవాలంటే, చరిత్రాత్మకమయిన వివరణ శరణుజొచ్చాల్సిందే.

- Separation of Church
- Scientific Method
- Rule of Law
- Very idea of a free society
- వీటితో పాటూ గతశతాబ్ధంలో పెంపొందించుకున్న Equality of sexes , Legality of homosexual acts

THE END OF DAYS

ఆఖరకు వచ్చేసరికి భయపెట్టారు:))
ReplyDeleteVery very interesting Kumar ji !
ReplyDeleteమరీ ముఖ్యంగా ఈ పార్ట్లో తెలిసిన లండన్ బ్లాస్ట్స్ ఇలా తెలిసిన విషయాలు ఉండటం వల్లో ఏంటో మరీ interesting గా అనిపించింది :-) Thank you !