
నాగరికత చక్రభ్రమణాల గురించి New York Historical Society లో వరసగా అయిదు పెయింటింగ్స్ ఉన్న The Course of Empire కన్నా మెరుగైన ఉదాహరణ ఉండదేమో!
మొదటి పెయింటింగ్ అయిన The Savage State లో, వేకువసమయంలో మేఘాలతో కమ్ముకొని రాబోయే తుఫానుతో పచ్చటి పచ్చికబయళ్ల మధ్య, నాగరికతకి పూర్వమున్న అతి కొద్ది మంది ఆటవిక జాతి ప్రజలు తమ ఉనికికి మార్గమేసుకుంటూంటారు.
రెండవ పెయింటింగ్ అయిన Pastoral State ఎంతో సంతోషభరితమైన వ్యవసాయిక స్వర్గధామం....