ఏడవ శతాబ్ధంలో అరేబియన్ ఎడారుల్లో ఇస్లాం పుట్టినప్పటి నుంచీ West కీ, East లో ముఖ్యభాగమైన ఇస్లాం సొసైటీస్ కీ మధ్య చాలా ఘర్షణలే జరిగాయి. మొహమ్మద్ అనుచరులు, క్రైస్ట్ అనుచరుల మీద జిహాద్ ప్రకటించటమూ, దానికి సమాధానంగా క్రిస్టియన్స్ క్రూసేడ్స్ జరపడమూ, తద్వారా స్పెయిన్ నీ, పోర్చుగల్ నీ తిరిగి స్వాధీనం చేసుకోవడమూ మనందరికి తెలిసిన విషయమే. దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు జరిగిన ఘర్షణల్లో అడపాదడపా ఓటమి చవిచూట్టము తప్ప, ఈ Clash of Civilizations లో West క్రమం తప్పకుండా నెగ్గుకుంటూ వచ్చింది.
దీనికి ఒక ముఖ్యకారణం Western Science యొక్క పైచేయి. అయితే, ఈ ఆధిక్యం West కి మొదటినుంచీ లేదు.
అదెలాగో చూద్దాం.
మొహమ్మద్ అనుచరులు ఎనిమదవ శతాబ్ధంకల్లా ఇటు స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా, అరేబియన్ ప్రాంతాలలో, ఉత్తరాన సిరియా, తూర్పున పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ల వరకీ ఒక Caliphate (an Islam state ruled by Muhammad's successor) ని నిర్మించారు.
అలా ఏర్పడిన వాటిల్లో Abbasid Caliphate ఆ కాలంలో సైన్స్ లో అందరికన్నా ముందుండేది.
An artist imagination of Science & Technology in Abbbasid Caliphate |
Modern Al-Karaouine | Bayt al-Hikma |
- తొమ్మిదవ శతాబ్ధంలో Caliph Rashid బాగ్దాద్ లో నిర్మించిన Bayt al-Hikma (House of wisdom) లో గ్రీక్ లో రాసిన అరిస్టాటిల్ రాసిన గ్రంథాలన్నీ అరబిక్ భాషలోకి అనువదించబడి ఉండేవి.
- Caliphate ఆ కాలంలోనే ఆస్పత్రులని నిర్మించాయని చెపుతారు. ఉదాః 707 లో Damascus లో Caliph al-Waleed నిర్మించిన bimartisan.
- AD 859 లో Fez స్థాపించిన University of Al-Karaouine ని ఉన్నత చదువుల సంస్థగా పరిగణించేవాళ్ళు.
గ్రీక్ మాథమేటిక్స్ మూలాల మీదే కాకుండా, ముఖ్యంగా Indian Mathematical Foundations ఆధారంగా ముస్లిం మాథమేటిషియన్స్ Algebra (from the arabic al-jabr, meaning 'restoration') ని నిర్మించగలిగారు. క్రీ.శ.820 లోనే మొట్టమొదటి ఆల్జీబ్రా పుస్తకం (Hisab al-Jabr W'al-Musqabalah) ని అరబిక్ భాషలో పర్షియన్ స్కాలర్ Muhammad ibn Musa al-Khwarizmi రచించాడు.
మొట్టమొదటి Experimental scientist ఒక ముస్లిం అయిన Abu Ali al-Hasan ibn al-Haytham (AD 965-1039). అప్పటివరకీ "కళ్ళు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి కాబట్టి, చూడగలుగుతామనే" లాంటి ఎన్నో మూఢనమ్మకాలని ఆయన రచించిన Book of Optics తోసిపారేసింది. ఇతనే మొట్టమొదటి సారిగా నక్షత్రాలు, Solid-Bodies కావనీ గుర్తించాడు. అంతే కాదు, ఈ రోజుకి కూడా స్కూలు పిల్లలకి Optics ని పరిచయం చేసేప్పుడు ఉపయోగించే pinhole camera ని ఈయనే నిర్మించాడు.
Cartography, Medicine, Philosophy, Mathematics and Optics లో అప్పటివరకీ ముస్లిం ప్రపంచం సాధించిన ప్రగతికీ, అలాగే గ్రీకుల Claasical Wisdom ని భధ్రపరచినందుకూ కూడా ముస్లిం ప్రపంచానికి, West ఒక విధంగా ఋణపడి ఉంది. English Thinker Roger Bacon 'Phioslophy is drawn from Muslims' అన్న మాటల్లో ఆ విషయాన్ని గమనించవచ్చు.
మరి Science లో ముస్లిం ప్రపంచం, వెస్ట్ కన్నా ఎలా వెనకపడిపోయింది? ఆ ప్రశ్నకి సమాధానమూ, అలాగే సైన్సులో వచ్చిన విప్లవాలు వెస్టర్న్ సివిలైజేషన్ కి, మిలిటరీ రంగంలోనూ, శాస్త్రీయ రంగంలోనూ ప్రపంచం మీద ఎలా ఆధిపత్యాన్ని అందించాయో తెలుసుకోవాలంటే పదిహేడవ శతాబ్ధం కి వెళ్ళిరావాలి.
***
THE SIEGE
అది 1683వ సంవత్సరం.
1529 లో జరిగినట్లుగానే Ottoman సైన్యం, వియన్నా ద్వారాల వద్ద మరోసారి మోహరించి ఉన్నది.
The vienna siege 1683 |
1453 లో Constantinople ని ఆక్రమించుకున్నప్పటినుంచీ Ottomans ఇస్లాం కి ప్రతినిధులయ్యారు. ఇస్లాంని , Christian భూభాగాలైన Bulgaria, Serbia, Hungary లోకి వ్యాప్తి చెందించారు. 1521 లో Belgrade Ottomans చేతుల్లోకి వచ్చేసింది. Buda 1541 లో. బాగ్ధాద్ నుంచీ బాస్రా వరకీ, ఎర్రసముద్రం ముఖద్వారం లోని Van నుంచీ Aden వరకీ, Barbery Coast లో Algiers నుంచీ Tripoli వరకీ వ్యాప్తి చెందిన సామ్రాజ్యం తో Suleiman-the-Magnificient, ఇస్లాం రాజుల్లోకెల్లా రారాజయ్యాడు. స్వయాన కవీ కూడా అయిన సులేమాన్, చాకచక్యంగా మతాన్నీ, పొలిటిక్స్ నీ, ఎకానమీని కలిపి పరిపాలించగలిగాడు. అంత పెద్ద రారాజయిన తనకి Roman Emperor Charles-V కేవలం వియన్నాకి రాజుగా మాత్రమే కనపడ్డాడు. అలాగే పోర్చుగీస్ వ్యాపారులు సముద్రపు దొంగలుగానూ గోచరించారు.
పదిహేడవ శతాబ్ధం వచ్చేకల్లా Ottoman సామ్రాజ్యం ఇంకా విస్తరించింది. 1669 లో Crete పడిపోయింది. Western Ukraine లోకి కూడా సుల్తాన్ చొచ్చుకొని పోగలిగాడు. 1682 లో సుల్తాన్ తన మొదటి పావు కదిపి తన బలగాలని వియన్నా వైపు నడిపించాడు.
13 July 1683 కల్లా వియన్నా ద్వారాల వద్ద 60,000 సిపాయిలు, 80,000 ఇతర మిలిటరీ సిబ్బందీ తిష్టవేసారు.
Byzantium నుంచి వచ్చిన ముస్లిం సైన్యాలు రోమ్ లోని క్రిస్టియన్లకి హడలెత్తించాయి. యముడి మహిషపు లోహ ఘంటలు యూరప్ నిండా మోగాయి. విజయం తథ్యమన్న నమ్మకంతో Kara Mustafa తన టెంట్ ముందు గార్డెన్ నిర్మించుకున్నాడు. Viennese కి ఆహారపదార్ధాల ద్వారాలని మూసివేసి, వారిని లొంగుబాటుకు గురిచేయగలమన్న నమ్మకం Turks లో వచ్చింది. ఆ సంగతి వారి యుద్ద విన్యాసాల్లో, కదలికల్లో, యుద్దభేరుల్లో స్పష్టంగా వియనీస్ కి తెలుస్తూనే ఉంది. Turks, 25th July న తమ శత్రువు మొట్టమొదటి రక్షణశ్రేణులని ఛేధించారు. ఇంకో భారీ విస్ఫోటనం తో Austrians entrenchment at ravelin తో , త్రిభుజాకారంలో బంధించారు. 4th September న ఏకంగా సెంట్రల్ ఫోర్ట్ మీదనే దాడి చేసారు.
కాని అప్పుడే Kara Mustafa కాస్త తత్తరపడ్డాడు. శీతాకాలపు తొలి ఘడియలు మొదలయ్యాయి. ఆయన సైన్యాలకి కావలసిన అత్యవసర సామాగ్రి నిల్వలు తగ్గుమొఖం పట్టాయి. అప్పుడే రోమ్ రాజు Leopald పోలండ్ రాజుతో పరస్పరం రక్షించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మరుక్షణం 60,000 పోలిష్ సైన్యం వియన్నా వైపు యుద్దనడక మొదలెట్టింది. 12 September 1683 కల్లా ఎదురుదాడి రాకెట్ ఫైర్ తో మొదలయ్యింది. రోజంతా సాగించిన ఎదురుదాడిలో ముఖ్యమైన స్థావరాలని కైవసం చేసుకోని, ఆ సాయంత్రం కల్లా పోలిష్ దళాలు వియన్నా ఎదురునున్న కొండ పైనుంచి శత్రుశిబిరంలోకి ఉరకలు పెట్టాయి. రాత్రికల్లా Kara Mustafa టెంట్ లోకి చొరబడ్డాయి. అప్పటికే Kara Mustafa పరారయ్యాడు. చివరకి Ottomans వియన్నాని ఆక్రమించే ప్రయత్నం, ముస్తాఫా పరారీతోనూ, ఓటమిలో Kara Mustafa తనకు తను మృత్యుదండనని విధించుకోవడంతోనూ ముగుస్తుంది. ఈ రెండవ ఆక్రమణ వైఫల్యం, Ottoman empire పతనానికి నాంది పలుకుతుంది. ఆ తరవాత జరిగిన వరస యుద్దాల్లో, Ottomans ని యూరప్ లో సులేమాన్ ఆక్రమించిన దాదాపు ప్రతీ ప్రాంతం లోంచి తరిమికొడతారు. Hungary , Transylvania ని వదులుకోవాల్సి రావటం Ottoman కి భారీ అవమానం.
శతాబ్ధాల క్రిస్టియన్ - ముస్లిం సంఘర్షణలో వియన్నా ఓటమి ఒక పెద్ద మలుపు. West rising లో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ తరవాత జరిగిన ఘర్షణల్లో కూడా వెస్ట్ కి వరసగా పై చేయి లభించడానికి కారణాలని జాగ్రత్తగా అన్వేషిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. 1.సైన్స్ ద్వారా సాధించిన ప్రగతి మిలటరీ రంగంలో ఉపయోగించడమూ, 2) మతనిర్దేశన కన్నా హేతువు కి ప్రభుత్వం పెద్దపీట వేయడం.
Ottoman వియన్నా ఆక్రమణ వైఫల్యం జరిగిన 1683 ప్రాంతంలోనే, యూరప్ లో
ఫిలాసఫీ, పొలిటికల్ థియరీ రంగాల్లో అతివేగవంతమైన మార్పులు జరుగుతున్నాయి. ఆ
రోజుల్లో సైన్స్ ఫిలాసఫీ లో ఒక భాగం. 1687 లో న్యూటన్ తన Principia of
Mathematics ప్రచురించాడు. మూడేళ్ళ తర్వాత John Locke, Second Treatise of
Government ని ప్రచురించాడు
***
MICROGRAPHIA
యూరప్ లో సైంటిఫిక్ విప్లవానికి మూలాలు Church - State ని సెపరేట్ గా ఉంచాలన్న ఆదర్శంలో ఉన్నాయి. "Render therefore to Caesar the things that are Caesar's; and unto God the things that are God's" (Matthew 2.2:21) అన్న సూక్తి, ఖురాన్ లో 'Indivisibility of God's law as revealed to Prophet' సూత్రానికి ఎంతో భిన్నమైనది.
యూరప్ 1500 లకి ముందు కనీళ్ళల్లో మునిగి ఉండేదేమో కానీ అజ్ణానంలో కాదు. Muslim world తో సంపర్కం Renaissance period లో claasical learning కి బాగానే దోహదపడింది. 12 వ శతాబ్ధంలోనే Polophany ని కనుక్కోవటం, 15వ శతాబ్దంలో Brunelleschi పెయింటింగ్ లో ఒక linear perspective నీ కనిపెట్టటం జరిగింది. మొట్టమొదటి నవల La vida de Lazarillo de Tormes (1500) లో రాయడం జరిగింది. కానీ Reanaissance పీరియడ్ కన్నా ముఖ్యమైన మలుపులు 1517 తర్వాత క్రిస్టియానిటీ ముక్కలు ముక్కలుగా విడిపోయిన వైనంలోనూ, దాంట్లో జరిగిన మార్పుల ద్వారానూ వచ్చాయి.
ఇంత గొప్ప మార్పుకు కారణం ప్రింటింగ్ ప్రెస్. ఇండస్ట్రియల్ రివల్యూషన్ లో అత్యంత ప్రభావితమైన ఇన్నొవేషన్.
గూటెన్ బర్గ్, మెటల్ తో నిర్మించిన కదిలే ప్రింటింగ్ ప్రెస్ చైనీస్ ప్రింటింగ్ ప్రెస్ కన్నా ఎన్నో రెట్లు సౌలభ్యవంతమైనదీ, అధునాతనమైనదీ. ఎంతో శక్తివంతమైన ఈ టెక్నాలజీ, గూటెన్ బర్గ్ ఆశించినట్లుగా మొనాపలీగా ఉంచలేకపోయారాయన. ఇది కనుక్కున్న కొన్నేళ్ళల్లోనే యూరప్ నిండా కనీసం పదహారు నకళ్ళు బయలుదేరాయి. 1500 కల్లా ఒక్క జర్మనీ లోనే 200 ప్రింటింగ్ షాప్స్ వచ్చాయి. 1519 కల్లా ఒక వెయ్యి ప్రచురణలు మార్కెట్ లోకి వచ్చాయి.
Gutenberg printing-press | Gutenberg printing-press workshop |
గూటెన్ బర్గ్, మెటల్ తో నిర్మించిన కదిలే ప్రింటింగ్ ప్రెస్ చైనీస్ ప్రింటింగ్ ప్రెస్ కన్నా ఎన్నో రెట్లు సౌలభ్యవంతమైనదీ, అధునాతనమైనదీ. ఎంతో శక్తివంతమైన ఈ టెక్నాలజీ, గూటెన్ బర్గ్ ఆశించినట్లుగా మొనాపలీగా ఉంచలేకపోయారాయన. ఇది కనుక్కున్న కొన్నేళ్ళల్లోనే యూరప్ నిండా కనీసం పదహారు నకళ్ళు బయలుదేరాయి. 1500 కల్లా ఒక్క జర్మనీ లోనే 200 ప్రింటింగ్ షాప్స్ వచ్చాయి. 1519 కల్లా ఒక వెయ్యి ప్రచురణలు మార్కెట్ లోకి వచ్చాయి.
ఈ టెక్నాలజీతో అన్నిటికన్నా ఎక్కువ లాభపడిన రచయిత థియాలజీ ప్రొఫెసర్, ఒకప్పటి ప్రీస్ట్ అయిన Martin Luther. ఇతనూ, Johann Grunenberg కలిపి రోమన్ కాథలిక్ చర్చ్ ప్రాక్టీసెస్ మీద రాసిన విమర్శల శీర్షికలతో జర్మన్ మార్కెట్ ని నింపేసారు (ref: Theologia Deutsch, Seven Penitential Psalms)
Luther చర్చ్ కి వ్యతిరేకంగా రాసిన Ninety-Five Theses మొదట్లో ప్రచురించకపోయినా, కొన్నేళ్ళలోనే ఆ పత్రాలన్నీ జర్మనీ అంతా లభ్యమయ్యాయి. నిజానికి చర్చ్ కి వ్యతిరేకంగా రచనలు కొత్త ఏమీ కాదు. అంతకు చాలా ముందే Jan Hus పోప్ ని, చర్చ్ ప్రాక్టీసెస్ నీ సవాల్ చేస్తూ రాసాడు, కానీ అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులో లేకపోవటం వల్ల, వాటిని సామాన్య ప్రజలకి విరివిగా అందుబాటులోకి రాకుండా దారుణంగా అణచివేయగలిగారు. ప్రింటింగ్ ప్రెస్ ఆ అణచివేతని అసాధ్యం చేయడమే కాక, Luther works ని దేశం నలుమూలలా ఉన్న ప్రజల చేరువలోకి తెచ్చింది. 1517 నుంచి 1520 మధ్యలో ఆయన ప్రచురించిన 370 editions లో, ఒక్కొక్క edition కి వెయ్యి కాపీలు ప్రింట్ చేసినా, దాదాపు మూడు లక్షల ప్రతుల రచనలు సర్కులేషన్ లోకి వచ్చాయి. 1521-1545 మధ్య క్రిస్టియానిటీ రిఫార్మ్ స్ రచనల్లో సగం Martin Luther వే.
గమ్మత్తేమిటంటే, ఇదే కాలంలో New Testament మొట్టమొదటిసారిగా 1526 లో ప్రింట్ చేయబడింది. మత అతివాదులకి Scriptures ఇలా సామాన్యులకి చదువుకోవడానికి అందుబాటులోకి రావడం ఇష్టం లేకపోయినప్పటికీ, ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ శక్తితో పోటిపడలేకపోయారు. చివరకి వాళ్లు కూడా ఆ ప్రింట్ ప్రపంచపు పోటీలోకి రాక తప్పలేదు. ఇవేకాదు, ఎక్కడో స్కాలర్స్ కి మాత్రమే అందుబాటులో ఉండే అరిస్టాటిల్ రచనలూ, Pro-reform humanists Nicolaus Marschalk, George Sibutus రచనలూ కూడా సామాన్య ప్రజల ముంగిట్లోకి వచ్చేసాయి. 1500 ల తొలినాళ్ళల్లో ఒక వెయ్యి మాధమేటికల్, సైంటిఫిక్ రచనలు ప్రింట్ లోకి వచ్చాయి.
వీటిల్లో ముఖ్యమైనవి: 1417 లో కనిపెట్టబడిన Luretius' De natura rerum, Roman compiliation of Greek Medical Science, Latin versions of Archimedes works. ఇటాలియన్ ప్రింటర్స్ ఎన్నో arithmetical and accounting techniques రచనల ని ప్రింటింగ్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు ఉదా: Treviso Arithmetic (1478) Luca Pacioli's Suma de arithmetica, geometria.
అయితే ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చినదంతా మానవ సమూహ సజ్ణానానికి సహాయం చేసిందని చెప్పలేం. పదహారవ, పదిహేడవ శతాబ్ధాల్లో బోల్డన్ని వినాశకర రచనలు ప్రచురించబడ్డాయి. 1487-1669 మధ్యలో Malleus maleficarumలో Witches ని అంతమొందించాలన్న సందేశంతో యూరప్ లో 12000-45000 మందిని, అందులో ఎక్కువశాతం మహిళలని చంపేయడం జరిగింది. ఇలాంటి ఉదాహరణలే ఇంకా గమనించవచ్చు.
ఇక్కణ్ణుంచి ముందుకెళ్తే 1665 లో Robert Hooke ప్రచురించిన Micrographia గ్రంధం, Scientific Empiricism సాధించిన విజయాల సెలబ్రేషన్స్ కి చిహ్నం. టెలిస్కోప్ ద్వారా ఎంత దూరం చూడొచ్చో, మైక్రోస్కోప్ ద్వారా అంత లోతుల్లోకీ చూడొచ్చన్న విషయం అర్ధమయ్యాక, మానవ మేధకి ఎంతో కొత్త ప్రపంచం తెరుచుకుంది. Organic Matter యొక్క అతిచిన్న యూనిట్ కి Hooke ఉపయోగించిన పదం 'cell', తదుపరి జరిగిన ఎన్నో పెనువిప్లవ అన్వేషణలకీ నాంది పలికింది.
సైంటిఫిక్ విప్లవం, గ్రహాల కదలికల అధ్యయనంతోనూ, Blood Circulation Studies తోనూ మొదలయ్యే ఉండొచ్చు గాక, కానీ Hooke's microscope అప్పటివరకీ మానవుడి కంటికందని ప్రపంచాన్ని, తనముందుకు అధ్యయనానికి తీసుకొచ్చింది.
అయితే కొత్తగా దూసుకొస్తూన్న సైన్స్ కేవలం అబ్జర్వేషన్ కి సంబంధించిందే కాదు. గెలీలియో తో మొదలయిన సిస్టమేటిక్ ప్రయోగాలు, కొత్త మాధమేటికల్ రిలేషన్ షిప్స్ ని తెరమీదకి తీసుకొచ్చాయి. ఈ మాధమేటిక్స్ ని న్యూటన్, లెబ్నిజ్ ఇంకా విస్తృతపరచారు. సైంటిఫిక్ రివల్యూషన్ ఫలితాలు ఫిలాసఫీ లో కూడా విప్లవాలని తీసుకొచ్చాయి. Descartes, Spinoza అప్పటివరకి Perception, Reason మీద నెలకొని ఉన్న సిద్దాంతాలని తోసిపుచ్చారు. ఈ కాలంలో జరిగిన ఎన్నో ఇంటలెక్చువల్ ఇన్నోవేషన్స్ , ఈరోజు మనకి తెలిసిన మోడర్న్ అనాటమీ, ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, జామెట్రీ, మేధమేటిక్స్, మెకానిక్స్, ఫిజిక్స్ లకి జన్మనిచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ రివల్యూషన్ యొక్క ప్రభావం, లక్షణం 1530 to 1789 మధ్యలో జరిగిన అతి ముఖ్యమయిన 29 కీలకమయిన ఇన్నోవేషన్స్ చూసి తెలుసుకోవచ్చు. (*లిస్ట్ ఈ పోస్ట్ చివరన కింద ఇవ్వబడింది).
ప్రపంచపు హిస్టరీ ఆఫ్ సైన్స్ అన్ని పుస్తకాలలో కనపడే 369 అతి ముఖ్యమైన సైంటిఫిక్ మలుపుల్లో, అత్యధికంగా...38 శాతం సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, Reformation period నుంచీ French Revolution మధ్యకాలంలో జరిగినవే అంటే, ఈ పీరియడ్ ప్రభావాన్ని అంచనా వేసుకోవచ్చు.
1600 మధ్యలో కల్లా, ప్రింటింగ్ ప్రెస్, పోస్టల్ సర్వీసెస్ ల సహాయంతో సైంటిఫిక్ నాలెడ్జ్ యూరప్ అంతా, అతివేగంగా విస్తృతమవుతూ వచ్చింది. ఇంత వేగంగా వచ్చిన సైంటిఫిక్ విప్లవాల ఫలితాలని, అప్పటివరకీ స్థిరపడిపోయి ఉన్న
Christian Doctrine తో సంధానం చేసుకోవడం మహామహులకే కష్టతరమయింది. సాక్షాత్తూ Newton, Hooke లే ఎంతో ఇబ్బందిపడ్డారు. కానీ ఈ ఇంటలెక్చువల్ రివల్యూషన్, దాదాపు ఒక శతాబ్దపు ముందు వచ్చిన రిలీజియస్ రివల్యూషన్ కన్నా ఎంతో శక్తివంతమైనదీ, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులని సంఘంలో తీసుకొచ్చింది అని చెప్పకమానదు.
Eurocentrism అన్నమాట అంటే చాలు కొంతమంది ఉలిక్కిపడతారు. అదొక ప్రిజుడిస్ పదమనీ, డిస్టేస్ట్ ఫుల్ పదమని కొంతమంది భావన. కానీ సైంటిఫిక్ రివల్యూషన్ పూర్తిగా ముమ్మాటికీ Eurocentric దే. ఏరకంగా కొలిచి చూసినా, సైంటీఫిక్ రివల్యూషన్ లో జరిగిన 80 శాతం ఇన్నోవేషన్స్ , Glasgow, Copenhagen, Krakow, Naples, Marseille and Plymouth లతో చుట్టుకొని ఉన్న ఒక చిన్న hexagon ఆకారంలో ఉండే ప్రాంతంలో జరిగాయి. ఇవే కాదు, దాదాపు మిగతావన్నీ కూడా వీటికి వంద మైళ్ల చుట్టూ ఉన్న ప్రాంతంలోనే జరిగాయి.
దీనికి పూర్తి వ్యతిరేకంగా, ఈ కాలంలో Ottoman ప్రపంచంలో సైంటిఫిక్ ప్రొగ్రెస్ ఏమాత్రమూ కనపడదు. ముస్లిం ప్రపంచం మీద మతానికున్న పట్టు, సైన్స్ లో ప్రగతికి విరోధంగా మిగిలిందనేది చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. పదకొండవ శతాబ్దపు తొలినాళ్ళనుంచే ఇస్లామిక్ క్లరిక్స్ గ్రీక్ ఫిలాసఫీ భోధనలు, ఖురాన్ భోధనలతో సరిపడవని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. భగవంతుని సృష్టినీ, విశ్వాన్ని నడిపించే శక్తులనీ అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం Blasphemy గా పరిగణించబడేది. Abu Hamid al-Ghazali రచించిన The Incoherence of the Philosophers లో ఈ foreign science ని చదువుకున్నవాళ్ళు, మతాన్ని వదిలేయకుండా ఉండడమనేది అరుదని ప్రమాదహెచ్చరికలు చేస్తాడు. మతాధికారుల పర్యవేక్షణలో ఫిలాసఫీ ప్రాచుర్యం కాకుండా అడ్డుకోవడమూ, పుస్తకాలని తగలపెట్టటమూ, free-thinkers ని అంతమొందించటమూ నిరాటంకంగా సాగిపోయాయి. యూరోపియన్ యూనివర్సిటిస్, తమ విద్యార్ధుల సంఖ్యని పెంచుకోని, విద్యార్ధులకి స్కాలర్ షిప్స్ పెంచే కాలంలో, ముస్లిం ప్రపంచంలో మద్రాస ల పలుకుబడి పెరిగింది. చివరకి ప్రింటింగ్ ని కూడా అరికట్టాలని చూసారు.
Ottomans కి Script పవిత్రమైనది. పెన్ కీ, కాలిగ్రఫీకి, స్కాలర్ ఇంక్ కీ ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రింటింగ్ కి ఇవ్వలేదు. 1515 లో Sultan Selim ప్రింటింగ్ ప్రెస్ ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు కనపడితే వారికి మరణశిక్ష విధించబడుతుందన్న ఆదేశాలని జారీచేసాడు!!. ఒకప్పుడు యూరోపియన్ స్కాలర్స్ కి ఐడియాస్ నీ, ఇన్స్పిరేషన్ నీ అందించిన ముస్లిం సైంటిస్ట్ లు, సైంటిఫిక్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పులు తెలుసుకోలేకుండా, వాటినుంచి దూరం చేయబడ్డారు.
ఇస్లాం ని, సైంటిఫిక్ ప్రొగ్రెస్ తో అనుసంధానం చేయకపోవడం ఒక చారిత్రకవిషాదంగా పరిణమించింది.
పద్దెనిమిదవ శతాబ్దపు చివరివరకీ, కేవలం ఒకే ఒక్క వెస్టర్న్ బుక్ మిడిల్ ఈస్టర్న్ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేయబడిందంటే, మిడిల్ ఈస్టర్న్ ప్రపంచం మిగతా ప్రపంచంతో ఎంతగా డిస్కనెక్ట్ అయి ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంతకీ ఆ పుస్తకం ఏంటని మీకు కుతూహలంగా ఉందా? సమాధానం: సిఫిలిస్ ని ఎలా ట్రీట్ చేయాలన్న మెడికల్ బుక్.
Takiyuddin observatory - an artist imagination |
ఈ కాలంలో రెండు నాగరికతల్లో ఉన్న తేడాని, 1570 లో Istanbul లో నిర్మించిన obseravtory కథ చెప్పినంతగా మరేది చెప్పలేదు. Takiyuddin al-Rasid, సిరియా లో 1521 లో జన్మించాడు. డమస్కస్, కైరో లలో చదువుకున్న శాస్త్రవేత్త. ఆస్ట్రానమీ, మేథమేటిక్స్, ఆప్టిక్స్ లలో ఎంతో కృషి చేసాడు. తను స్వయానా astronomical clocks నిర్మించినవాడు. 1570 లో తను సుల్తాన్ తో ఎంతో లాబీయింగ్ చేసి అబ్జర్వేటరీ నిరించగలిగాడు. కానీ, 1577 వచ్చేప్పటికల్లా పరిస్థితులు మారాయి. Takiyuddin ఆకాశానికవతల అనంతలోకాల్లో ఉన్న రహస్యాలని ఛేధించటం, దైవదూషణతో సమానమని సీనియర్ క్లరిక్ Sheikh ul-Islam Kadizade, సుల్తాన్ ని ఒప్పించగలిగాడు. ఫలితంగా సుల్తాన్ 1580 లో observatory ని సమూలంగా కూలగొట్టించేస్తాడు. ఆ తరవాత దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు ఇస్తాన్ బుల్ ఏ అబ్జర్వేటరీకి నోచుకోదు.
సైన్స్ మీదా, పరిశోధనా, అన్వేషణా, శాస్త్రీయ తృష్ణ మీద క్రిస్టియన్ చర్చ్ తన పట్టుని క్రమక్రమంగా సడలించిన కాలంలోనే, పై రకమైన విధానాలతో, చర్యలతో ముస్లిం మతాధిపతులు Ottoman సైంటిఫిక్ అభివృద్దిని అడ్డుకుంటారు.
పంతొమ్మిదివ శతాబ్ధపు చివరలో కూడా Huseyin Rifki Tamani, the head teacher of Muhendishane-i Cedide "విశ్వం గోళాకారంలోనూ, భూమి దాని కేంద్రంలోనూ, సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతారని బోధించేవారంటే, సైన్స్ నీ, అది కనుక్కొన్న ఫలితాలని గుర్తించటానికి ఎంతగా నిరాకరించారో అర్ధం చేసుకోవచ్చు.
దీనికి పూర్తి వ్యతిరేకంగా పదిహేడవ శతాబ్ధపు ద్వితీయార్ధంలో యూరప్ లో ఉన్న రాజ్యాధికారులందరూ, క్రిస్టియన్ మత పెద్దల నసుగుళ్ళని పక్కకుతోసి సైన్స్ కి పెద్దపీట వేసారు.
July 1662 లో King Charles II, Royal Society of London for Improving Natural Knowledge కి Physico-Mathematical Experimental Learning సంస్థ స్థాపించటం కోసం నగదు మంజూరు చేసాడు. ఆ తరవాత నాలుగు సంవత్సరాలకి పారిస్ లో Academie Royale des Sciences ఏర్పాటు చేయబడింది. 1675 లో Charles-II Greenwich లో Royal Observatory ని నిర్మించమని ఆదేశిస్తాడు. Royal Society ని ఏర్పాటు చేయడంలో ముఖ్యోద్దేశం ఏ రాజకీర్తికోసం ప్రాకులాటో కాదు, నూతన ఆలోచనలనీ, ఐడియాలనీ, సంక్లిష్టమయిన సైంటిఫిక్ సమస్యలని కలసికట్టుగా ఎదుర్కోవాలన్న సదుద్దేశం. దానికి ఉదాహరణే, గురుత్వాకర్షణశక్తి ప్రిన్సిపుల్. తన ముందు Hooke కృషి ఫలితాలు లేనట్లయితే న్యూటన్ గురుత్వాకర్షణశక్తిని సమీకరించలేకపోయేవాడు.
ఇదంతా చెప్పటం, యూరప్ లో సైంటిస్టులంతా సౌహార్ద్రసంబంధాలని కలిగిఉన్నారన్న అభిప్రాయాన్ని కలిగించటం కోసం కాదు. నిజానికి సైంటిస్టుల మధ్య ఆనాడైనా, ఏనాడైనా పోటీ ఉధృతమే. ఉదా: Inverse-square law of gravity ని ముందు ఎవరు కనుక్కొన్నారన్న విషయం పై Newton, Hooke హోరాహోరీ దెబ్బలాడుకునేవారు. అలాగే Leibniz తన gravity principle ని తీసిపారేసాడన్న కోపంతో Newton, Leibniz తో కూడా హేయమైన పోట్లాటకి దిగేవాడు
ఏదేమైనా experimental methods, patient observation టెక్నాలజీ లో ఎంతో ముందడుగు వేయడానికి తోడ్పడి, చివరకి ఇండస్ట్రియల్ రివల్యూషన్ కి దారి తీసాయి. న్యూటన్ నియమాల మొదలు, థామస్ న్యుకోమెన్ స్టీమ్ ఇంజన్ వరకి ప్రయాణం అతితక్కువ కాలంలో, ఏ మూలమలుపుల చుట్టూ సాగకుండా నేరుగా నడచింది. ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన ఇన్నొవేషన్స్, జేమ్స్ వాట్ అధునాతన స్టీమ్ ఇంజన్(1764), జాన్ హారిసన్ క్రోనోమీటర్(1761), రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్(1769) ఒకే దేశంలోంచి, ఒకే దశాబ్దం లో రావటం కాకతాళీయమేమీ కాదు.
న్యూటన్ 1727 లో చనిపోయినప్పుడు లండన్ లోని ప్రముఖ చర్చ్ Westminster Abbey లో నాలుగురోజుల పాటు ప్రజల సందర్శనార్ధం ఉంచి, అందులోనే burie చేస్తారు. తన అంత్యక్రియలకి ఇద్దరు డ్యూక్స్ తో పాటూ, లార్డ్ చాన్సలర్ సైతం హాజరయ్యారు. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్, సమాజపు పైతరగతుల్లోంచి రాని ఒక శాస్త్రవేత్తకి అంతటి గౌరవాన్నివ్వడం చూసి అచ్చెరువొంది "ఒక మేథమేటిక్స్ ప్రొఫెసర్, కేవలం తన వృత్తిలో గొప్పవాడిగా రాణించినందువల్ల, తన మృతికి ఒక రాజమరణపు గౌరవార్దాన్నందివ్వడం నేనీరోజు తిలకించానని" రాసుకున్నాడు.
Westminster Abbey లోని న్యూటన్ మాన్యుమెంట్ కింద రాసిన ఈ మాటలు న్యూటన్ కి ఇచ్చిన విలువకి అద్దం పడతాయి. "Here is buried Isaac Newton, Knight, who by a strength of mind almost
divine, and mathematical principles peculiarly his own, explored the
course and figures of the planets, the paths of comets, the tides of the
sea, the dissimilarities in rays of light, and, what no other scholar
has previously imagined, the properties of the colours thus produced.
Diligent, sagacious and faithful, in his expositions of nature,
antiquity and the holy Scriptures, he vindicated by his philosophy the
majesty of God mighty and good, and expressed the simplicity of the
Gospel in his manners. Mortals rejoice that there has existed such and
so great an ornament of the human race! He was born on 25th December
1642, and died on 20th March 1726".
వెస్ట్ లో గవర్నమెంట్, సైన్స్ పార్టనర్షిప్ లోకి ప్రవేశించాయన్న విషయం ఇలాంటి ఎన్నో ఉదాహరణల్లో చూడవచ్చు. ఈ భాగస్వామ్యాన్ని చాటి చెప్పే ఇంకో అతి గొప్ప ఉదాహరణ వోల్టేర్ స్నేహితుడయిన King of Prussia 'Frederick the great' ది. అది ఈ కింది భాగంలో చూద్దాం.
***
OSMAN AND FRITZ
ఈ భాగం లో రచయిత Ottoman Empire వియన్నాని ముట్టడించిన తర్వాత 70 సంవత్సరాలకి ఉన్న పరిస్థితులని వివరిస్తాడు.Ottomoan Empire ఎలా వరస సమస్యలబారిన పడిందీ, పన్నులరాబడి తగ్గిపోయి ప్రభుత్వ ఖజానా నిండకపోవటమూ, సుఫీ మిస్టిక్స్ కీ, అతివాదమతపెద్దలకీ మధ్య ఘర్షణలూ, అవినీతిపెరిగిపోవటమూ, అంతర్గత తిరుగుబాట్లతో ఐదుగురు సుల్తాన్ లని పీఠం నుంచి తప్పించటమూ, ఇద్దరు సుల్తాన్ లని హత్యచేయటమూ, బహుభార్యత్వం వల్ల వారసులెక్కువయి రాజ్యాసనం కోసం కుట్రలూ, కుతంత్రాలూ ఇత్యాది సమస్యలతో Ottoman Empire ఎలా వీగిపోయిందో ఈ సెక్షన్ లో గమనించవచ్చు.
Frederick the great, a music lover loved philosophical discussions with Voltaire and others |
ఇదే కాలంలో Prussia లో Frederick the Great ప్రష్యాని సమూలంగా మార్చేసి, ప్రజల సమస్యలకి ప్రముఖ పాత్రనిచ్చిన విధానమూ, ప్రభుత్వసిబ్బందిని తగ్గించిన విధానమూ, తన తండ్రిబాటలో కాక హిస్టరీ, మ్యూజిక్, ఫిలాసఫీ(వోల్టేర్ తనకి దగ్గరిమిత్రుడు) లలో తనకున్న ఆసక్తీ గురించీ, రాజసింహాసనం మీద కూర్చున్నాక ఆయన మిలటరీ రంగంలో సాధించిన అద్వితీయమైన ప్రగతీ, విజయాలూ, ఆస్ట్రియానీ ముట్టడించి, సిలిసియాని జయించటం గురించీ, అతను మరణించే సమయానికి తన రాజ్యాన్ని పోలిష్ సరిహద్దులవరకీ విస్తరించటం గురించీ వివరిస్తాడు.
Frederick తండ్రి రాజాస్థాననానికి ఎంతో రాబడి తెచ్చి, ఎన్నో ఆస్థులని సమకూరుస్తాడు. కానీ Frederick ఆ ఆస్థులన్నిటినీ తిరిగి ప్రజల కోసం ఖర్చుపెడతాడు. ఒపేరా హౌసెస్, కేథడ్రల్స్ ని ఎన్నిటినో నిర్మిస్తాడు. ఎన్నో ఉదారవాద రాజశాసనాలని ఆదేశిస్తాడు. ఆ రోజుల్లో Frederick జారీ చేసిన శాసనాల్లోని మతసామరస్యం, ఇమ్మిగ్రేషన్ పట్ల సుముఖతా, పాత్రికేయస్వేచ్చా గురించీ కూడా మనం ఈ సెక్షన్ లో గమనించవచ్చు. స్వేచ్చా, విదేశసందర్శకులతో ప్రష్యా సంస్కృతి ఇనుమడించిన విధానమూ, ప్రష్యా జ్ణాన తృష్ణా, ఎన్నో పుస్తకాల విక్రయకేంద్రాలూ, చర్చావేదికలూ, సైంటిఫిక్ సంస్థలతో వర్ధిల్లిన విధానమూ గురించి ఈ భాగం లో చదువుకోవచ్చు.
ఈయన పరిపాలనాకాలంలోనే ఫిలసాఫర్ Immanuel Kant (Critique of Pure Reason (1781)) పద్దెనిమదవ శతాబ్దపు అతిగొప్ప ఫిలాసఫర్ గా ఎదిగిన విధానమూ, Frederick the great ఇలాంటి ఫిలాసఫర్స్ కీ, మేధావుల తెలివితేటలకీ ఇచ్చిన ప్రాముఖ్యతా, అదే సమయంలో ఆ మేధావులు ఏ సమాజపు దిగువ వర్గాల నుంచి వచ్చారా, ఎగువతరగతికి చెందినవారా ఇట్లాంటి విషయాల పట్ల తనకున్న విముఖతను గురించీ వివరిస్తాడు.
ఇదే కాలంలో యూరప్ అంతా ఫిలాసఫీ విస్తరించిన విధానమూ, అదే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ వల్ల పెరిగిన పుస్తకాలూ, మాగజైన్సూ, విప్లవాత్మకంగా పెరిగిన అక్షరాస్యతా, తద్వారా పెరిగిన చదువరుల సంఖ్య గురించి చెపుతాడు.. జ్ణానం కేవలం చదవడం వల్లే విస్తరించలేదనీ,. ఖండమంతా విస్తరించిన ఆర్ట్ ఎక్జిబిషన్లూ, మ్యూజిక్ థియేటర్సూ వల్ల సోషల్ సైన్సెస్ ప్రజలకి అందిన విధానమూ తద్వారా జరిగిన ఎడ్యుకేషన్ గురించి కూడా చదువుకోవచ్చు.
ఈ పీరియడ్ లో Reason కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఎన్ని ముఖ్యమైన ఫిలాసఫికల్, సైంటిఫిక్ గ్రంధాలొచ్చాయో, క్రిస్టియన్ మతచాందసత్వం మీద Reason దాడిని గమనించవచ్చు.ఇతర యూరప్ మోనార్క్ ల వలె, Frederick the great మతం నుంచీ, సమాజంలో ఇతర వర్గాల సంకెళ్ళ నుంచీ, ఇంటలెక్చువల్స్ కి స్వేచ్చనిచ్చాడనీ, వోల్టేర్ కి తన ఇంటిపైన ఆశ్రయాన్నివ్వటమే కాదు, Royal Science Society లాంటిదాన్ని ప్రష్యాలో కూడా ఒకటి స్థాపించమని ఆహ్వానించాడనీ కూడా ఈ భాగంలో రచయిత చెపుతాడు. ఇదే సెక్షన్ లో Frederick కి మ్యూజిక్ రచనల గురించీ, ఇతర రచనల గురించీ ఉన్న ఆసక్తి గురించి తెలుసుకోవచ్చు. అలాగే ప్రష్యాలోని Potsdam ఈరోజున ఉన్న స్థితి గురించి కూడా రచయిత వివరిస్తాడు.
సైన్స్ లో సాధించిన ప్రగతి, ఆయుధసాంకేతికతలో ఎలా ముందడుగులు వేపించిందీ, తద్వారా మిలటరీ ఆధిపత్యం ఎలా సిద్దించిందీ, గన్స్, ఆర్టిలరీ సాంకేతికత ఎలా అభివృద్ది చెందిందీ ఇవన్నీ కూడా వివరిస్తాడు.
TANZIMAT TOURS
ఈ భాగం లో ముస్లిం ప్రపంచం యూరప్ లో జరుగుతున్న సైన్స్ రివల్యూషన్ నీ తద్వారా యూరప్ యుద్దరంగంలో సంపాదించిన ఆధిక్యతనీ గమనించి, తమముందు మరే మార్గమూ లేదనీ, సైన్స్ ని దగ్గరకి తీసుకోకతప్పదన్న సత్యాన్ని గ్రహించడం గురించి కొన్ని ఉదాహరణలు చూపుతాడు. వెస్టర్న్ ప్రపంచం నుంచి శాస్త్రవేత్తలనీ, నిపుణులనీ ఇస్తాన్బుల్ కి ఆహ్వనించిన సందర్భాలూ, మార్పు కోసం చేసిన ప్రయత్నాలు పొలిటికల్ వ్యతిరేకత వల్ల మాటిమాటికి విఫలం చెందిన వైనాల గురించి కూడా చెపుతాడు.
చిట్టచివరకి 1826 లో సంస్కరణలని పెద్ద ఎత్తున చేపట్టిన సుల్తాన్లు గా పేరొందిన Mahmud II మరియు Abdulmecid-I లు మార్పుని వ్యతిరేకిస్తున్న పొలిటికల్ శక్తుల మీద యుద్దాన్ని ప్రకటించి, ఆర్మీని శక్తివంతం చేయటానికి సమూలమైన మార్పులు చేపట్టటం గురించీ, కొత్త ఆయుధాలని సమకూర్చుకోవటం, అల్లాపేరున మోగే యుద్దభేరి ఆర్మీ బాండ్ ని యూరోపియన్ స్టైల్ బాండ్ కింద మార్చటం, చివరకి ఆర్మీ యూనిఫామ్స్ కూడా యూరోపియనైజ్ చేయటం గురించీ రచయిత వివరిస్తారు.
యూరప్ లో వచ్చిన సైంటిఫిక్ విప్లవం తర్వాత 200 సంవత్సరాలకి వెస్టర్న్ నాలెడ్జ్ ని ఇస్లామిక్ ప్రపంచంలోకి తీసుకురావటానికి చేసిన ప్రయత్నాలూ, ఏర్పరిచిన సంస్థల గురించి కూడా రచయిత వివరిస్తారు.
ISTANBUL TO JERUSALEM
ఈ సెక్షన్ లో టర్కీ తన విధానాలని మార్చుకోన్న వైనం గురించి వివరిస్తారు. టర్కీ అరబిక్ స్క్రిప్ట్ నుంచి, తన ఆల్ఫబెట్స్ కి మారిన విధానం గురించీ, తద్వారా టర్కీ ఇరవైయ్యవ శతాబ్ధంలోకి దూసుకొచ్చిన విధానమూ, fez నీ, turban నీ వదిలేసి స్త్రీ పురుషులు ధరించే దుస్తుల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులూ , వెస్టర్న్ కాలండర్ ని అమలుపరచడమూ, అన్నిటికన్నా ముఖ్యంగా టర్కీ దేశాన్ని మతపరమైన దేశంగా కాక, సెక్యులర్ దేశంగా ప్రకటించటమూ, షరియా లా ని నిర్మూలించి స్విట్జర్లాండ్ చట్టాన్ని అనుసరించి సివిల్ కోడ్ ని ప్రిపేర్ చేసుకోవటమూ, మతాధిపత్యం ఒట్టోమాన్ ఎంపైర్ ని ఎంత వెనకంజవేసిందో టర్కీ గ్రహించిన సంగతి గురించి చెపుతారు.
అలాగే, ఇజ్రాయిల్ సైంటిఫిక్, టెక్నాలజీ రంగంలో తన చుట్టూ ఉన్న అరబిక్ దేశాలకన్నా ఎంత ముందున్న విషయం గురించి కొన్ని ఉదాహరణలు పేర్కొంటారు.
*************************
చివరగా, ఇస్లాం దేశాలు కూడా ఆధునిక కాలంలో సైన్స్ కి ఆహ్వానం పలికి, తమ తమ దేశాల్లో క్రమక్రమంగా సైంటిఫిక్ సంస్థలనీ, అత్యాధునిక యూనివర్సిటీలనీ, పరిశోధనశాలల మీదా దృష్టి కేంద్రీకరించడాన్నీ గమనించొచ్చు.
ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ ప్రతి ఏటా రెండు సైన్స్ ఫెస్టివల్స్ ని నిర్వహిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం పద్దెనిమిది మిలియన్ల డాలర్లతో అబ్జర్వేటరీని నిర్మిస్తోంది. గమ్మత్తేమిటంటే, షరియా లా ని ఎంతో ఖశ్చితంగా అమలుపరచాలని ఆరాటపడే శక్తులున్న దేశంలో 70 శాతం సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు అమ్మాయిలు కావడం ఎంతో సంతోషించాల్సిన విషయం. అటు టెహరాన్ నుంచీ రియాద్ వరకీ, ఇటు సౌదీ నుంచి వెస్ట్ లండన్ వరకీ అమ్మాయిల చదువు పట్ల విముఖత గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ విషయం.
అయితే ఇరాన్ సమకూర్చుకూంటోన్న శాస్త్రీయ విజ్ణానం, ఏ ఫలితాలకోసం ఉపయోగిస్తుందో వేచి చూడాల్సిందే. మతశక్తుల చేతిలో విస్ఫోటనవిజ్ణానం ఆందోళనకి ఆస్కారమిచ్చే విషయమే. ఈ విషయంలో పాకిస్తాన్ సైంటిస్ట్ AQKhan ఎంత భాధ్యతారహితంగా ప్రవర్తించారో గుర్తుకురాకమానదు.
ఈరోజు, వియన్నా ముట్టడి తర్వాత దాదాపు మూడు వందల సంవత్సరాలకి, వెస్ట్ సైంటిఫిక్ రంగంలో మిగతా ప్రపంచం కన్నా ముందంజని ఇకముందు కూడా కొనసాగించగలదా, లేదా?
ఇదే ప్రశ్నని ఇంకోవిధంగా కూడా వేసుకోవచ్చు.
నాన్ వెస్టర్న్ ప్రపంచం, వెస్టర్న్ ప్రపంచపు కేంద్రస్థంభాలయిన Rule of Law, Property Rights, True representative form of government ని తిరస్కరించి, కేవలం వెస్టర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ ని మాత్రమే తీసుకోని ఆ లాభాలని విస్తృతంగా అమలుపర్చి, ప్రపంచాధిపత్యాన్ని సాధించగలదా?
అది తరవాతి చాప్టర్స్ లో చూద్దాం.
**********************************************************************
*1530 to 1789 మధ్య అతి ముఖ్యమయిన break-throughs.
1530 Paracelsus pioneers the application of chemistry to physiology and pathology
1543 Nicolaus Copernicus' De revolutionibus orbium coelestium states the heliocentric theory of the solar system
Andreas Vesalius' De humani corporis fabrica supplants Galen's anatomical textbook
1546 Agricola's De natura fossilium classifies minerals and introduces the term 'fossil'
1572 Tycho Brahe records the first European observation of a supernova
1589 Galileo's tests of falling bodies revolutionize the experimental method
1600 William Gilbert's De magnete, magnetisque coporibus describes the magnetic properties of the earth and electricity
1604 Galileo discovers that a free-falling body increases its distance as the square of the time
1608 Hans Lippershey and Zacharias Janses independently invent the telescope
1609 Galileo conducts the first telescopic observations of the night sky
1610 Galileo discovers four of Jupiter's moons and infers that the earth is not at the centre of the universe
1614 John Napier's Mirifici logarithmorum canonis descriptio introduces logarithms
1628 William Harvey writes Exercitatio anatomica de motu cordis et sanguinis in animalibus, accurately describing the circulatino of blood
1637 Rene Descartes 'La Geometrie' an appendix to his Discours de la methode, founds analytic geometry
1638 Galileo's Discorsi e dimonstrazioni matematiche founds modern mechanics
1640 Pierre de Fermat founds number theory
1654 Fermat and Blaise Pascal found probability theory
1661 Robert Boyle's Skeptical Chymist defines elements and chemical analysis
1662 Boyle states Boyle's Law that the volume occupied by a fixed mass of gas in a container is inversely proportional to the pressure it exerts
1669 Issac Newton's De analysi per qequationes numero terminorum infinitas presents the first systematic account of the calculus, independently developed by Gottfried Leibniz
1676 Antoni van Leeuwenhoek discovers micro-organisms
1687 Newton's Philosophiae naturalis principia mathematica states the law of universal gravitation and the laws of motion
1735 Carolus Linnaeus' Systema naturae introduces systematic classification of genera and species of organisms
1738 Daniel Bernoulli's Hydrodynamica states Bernoulli's Principle and founds the mathematical study of fluid flow and kinetic theory of gases
1746 Jean-Etienne Guettard prepares the first true geological maps
1755 Joseph Black identifies carbon dioxide
1775 Antoine Lavoisier accurately describes combustion
1785 James Hutton's 'Concerning the System of the Earth ' states the uniformitarian view of the earth's development
1789 Lavoisier's Traite elementarie de chimie states the law of conservation of matter
**********************************************************************
*1530 to 1789 మధ్య అతి ముఖ్యమయిన break-throughs.
1530 Paracelsus pioneers the application of chemistry to physiology and pathology
1543 Nicolaus Copernicus' De revolutionibus orbium coelestium states the heliocentric theory of the solar system
Andreas Vesalius' De humani corporis fabrica supplants Galen's anatomical textbook
1546 Agricola's De natura fossilium classifies minerals and introduces the term 'fossil'
1572 Tycho Brahe records the first European observation of a supernova
1589 Galileo's tests of falling bodies revolutionize the experimental method
1600 William Gilbert's De magnete, magnetisque coporibus describes the magnetic properties of the earth and electricity
1604 Galileo discovers that a free-falling body increases its distance as the square of the time
1608 Hans Lippershey and Zacharias Janses independently invent the telescope
1609 Galileo conducts the first telescopic observations of the night sky
1610 Galileo discovers four of Jupiter's moons and infers that the earth is not at the centre of the universe
1614 John Napier's Mirifici logarithmorum canonis descriptio introduces logarithms
1628 William Harvey writes Exercitatio anatomica de motu cordis et sanguinis in animalibus, accurately describing the circulatino of blood
1637 Rene Descartes 'La Geometrie' an appendix to his Discours de la methode, founds analytic geometry
1638 Galileo's Discorsi e dimonstrazioni matematiche founds modern mechanics
1640 Pierre de Fermat founds number theory
1654 Fermat and Blaise Pascal found probability theory
1661 Robert Boyle's Skeptical Chymist defines elements and chemical analysis
1662 Boyle states Boyle's Law that the volume occupied by a fixed mass of gas in a container is inversely proportional to the pressure it exerts
1669 Issac Newton's De analysi per qequationes numero terminorum infinitas presents the first systematic account of the calculus, independently developed by Gottfried Leibniz
1676 Antoni van Leeuwenhoek discovers micro-organisms
1687 Newton's Philosophiae naturalis principia mathematica states the law of universal gravitation and the laws of motion
1735 Carolus Linnaeus' Systema naturae introduces systematic classification of genera and species of organisms
1738 Daniel Bernoulli's Hydrodynamica states Bernoulli's Principle and founds the mathematical study of fluid flow and kinetic theory of gases
1746 Jean-Etienne Guettard prepares the first true geological maps
1755 Joseph Black identifies carbon dioxide
1775 Antoine Lavoisier accurately describes combustion
1785 James Hutton's 'Concerning the System of the Earth ' states the uniformitarian view of the earth's development
1789 Lavoisier's Traite elementarie de chimie states the law of conservation of matter
Quite interesting Kumar garu, thanks for great work !
ReplyDeleteనాకు ఆ గూటెన్ బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ గురించి తెలుసు. కళ్ళు కాంతిని వెదజల్లుతాయి అని నమ్మడం అది ఇక్కడ చదివాక లీలగా గురోస్తుంది ఎక్కడో చదినట్లు గా ఇవి తప్ప మిగిలినదంతా కొత్తగా తెలుసుకోవటమే . చాల చాల బావుంది అప్పటి కాలం కి వెళ్లి ప్రపంచాన్ని చుట్టి వస్తున్నట్లుగా :-)
Thanks again !
ReplyDeleteReally appreciate your hard work, Kumar gaaru!!
ఊసుపోక రాసుకోడానికీ, నిబద్దతతో ఒక అంశాన్ని విస్తృతంగా వివరించడానికీ ఉన్న తేడా తెలిసింది!
So far, every post is so extensive and of course, is a great read!
Like Sravya said, I feel like I'm on the Time machine!
Thanks so much!!