Friday 19 April 2013

 

THE BIRTH OF THE CONSUMER SOCIETY

1909 లో French-Jewish Banker, Philanthropist అయిన Albert Khan తన జపాన్ సందర్శన తరువాత, ఇరవై శతాబ్దపు ప్రారంభంలో భూఉపరితలం మీద ఉన్న ప్రజల ఫోటోగ్రాఫిక్ ఇన్వెంటరీ ఒకటి తయారు చేద్దామని తలంచి, ప్రపంచంలో నలుమూలల ఉన్న వివిధ ప్రజల, జాతుల కలర్ ఫోటోగ్రాఫ్స్ సేకరించి ఒక అతి పెద్ద ఆల్బమ్ ని తయారు చేసాడు. దాదాపు యాభై దేశాల్లోని ప్రజల వివిధ వస్త్రధారణనీ, ఫాషన్స్ నీ తన ఆల్బమ్ లోని 72,000 ఫోటోలూ, 100 గంటల ఫిల్మ్ లో పొందుపరచాడు. దీంట్లో Gaeltacht లో ఉన్న నిరుపేదలూ, బలవంతంగా సైన్యంలో చేర్పించబడి సరైన వస్త్రధారణ కరువయిన బల్గేరియా యువకులూ, అరేబియా లోని ముల్లానాయకులూ, నగ్నంగా ఉండే Dahomey దళ నాయకులూ, పూలదండలు ధరించిన ఇండియన్ మహారాజులూ, wild-west లో ధృఢంగా ఉన్న కౌ-బాయ్ లూ etc., ఉన్నారు.

ఒక శతాబ్ధం తరువాత ఈరోజు Khan కనక అదే పని తలపెట్టినట్లయితే, అది ఏ ఉపయోగమూ లేని పనిగానే మిగిలిపోతుంది. ఈ రోజుల్లో ప్రపంచమంతటా అధిక శాతం జనాభా ఒకే రకం వస్త్రథారణతో కన్పిస్తున్నారు. అవే జీన్స్, అవే స్నీకర్స్, అవే టి-షర్ట్స్ . కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ కూడా తమ తమ ethnic wear తోనే ఉండే ప్రజలింకా ఉన్నారు. ex: Peru లో Quechua women ఇప్పటికీ తమ రంగురంగుల వస్త్రాలూ, షాల్సూ, felt-hats నే ధరిస్తూంటారు. నిజానికివి Andalusian origin లోంచి వచ్చి, కాలగమనంలో బ్రిటీష్ ప్రభావంతో కొన్ని మార్పులకి లోనయినవి.

వెస్టర్న్ క్లోతింగ్ మిగతా ప్రపంచదేశాల్లోని జనాభా ని అంతగా ఎందుకు అకర్షిస్తోంది? వెస్టర్న్ తరహాలో డ్రెస్ చేసుకోవటమంటే, వెస్టర్న్ మనుషుల్లాగా ఉండటానికి ప్రయత్నించటమేనా? ఇది కేవలం వస్త్రధారణకి సంబంధించిన విషయమే కాదు. మ్యూజిక్, మూవీస్, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఇవ్వన్నిటిని కలుపుకొని ఉండే ఒక పాపులర్ కల్చర్ ని అక్కున చేర్చుకోవటమే. ఇది స్వేచ్చకి సంబంధించిన విషయం. వ్యక్తులకిష్టాలకనుగుణంగా డ్రెస్ చేసుకోవటము, డ్రింక్ తాగటమూ వ్యక్తి స్వేచ్చ ని తెలియచెప్పే విషయాలు. ప్రజలిష్టపడే వినియోగ వస్తువులు మాత్రమే తయారు చేయబడి, నిలదొక్కుకుంటాయి కాబట్టి ఇది డెమోక్రసీ కి సంబంధించిన విషయం కూడా. చివరగా ఇది కాపిటలిజం కి సంబంధించిన విషయం కూడా అవుతుంది, మరి కార్పోరేషన్స్ వస్తువులమ్మి లాభం చేకూర్చుకోవాలి కదా!

కానీ ఈ కింది చెప్పబోయే కారణాల వల్ల క్లోతింగ్ అనేది వెస్టర్నైజేషన్ ప్రాసెస్ కి మూలమైనది.

అతిగొప్ప ఆర్థిక మార్పులని తీసుకొచ్చి, ప్రపంచంలో పెరుగుతున్న జనాభా లివింగ్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేసినదని చరిత్రకారులు కొనయాడే ఇండస్ట్రియల్ రివల్యుషన్ మూలాలన్నీ టెక్స్టైల్ మానుఫాక్చరింగ్ లో దాగున్నాయి. 
అంత పెద్ద మార్పు సాధించడానికి, రెండవ చాప్టర్లో చెప్పిన సైంటిఫిక్ రివల్యూషన్ లోంచి వచ్చిన టెక్నలాజికల్ ఇన్నోవేషన్ వల్ల వచ్చిన మాస్ ప్రొడక్షన్ అనే అద్భుతం ఒక కారణమైతే, బ్రిటన్ ని దాటి మిగతా వెస్టర్న్ ప్రపంచానికి వ్యాప్తి చెందిన డైనమిక్ కన్స్యూమర్ సొసైటీ రెండవ కారణం.
 కన్స్యూమర్ సొసైటీ ఈ రోజున సర్వాంతర్యామిలా వ్యాపించి ఉండి, ఈ కల్చర్ అనాదిగా ఉన్నట్లుగా మనల్ని భ్రమ పెట్టినప్పటికీ, చరిత్రలో దాని వయసు చాలా చిన్నది. అయినప్పటికీ వెస్ట్ ని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కన్నా ముందంజ వేయించడంలో గణనీయమైన పాత్ర పోషించింది. 

బహుశా మోడర్న్ మెడిసిన్, వెస్టర్న్ కాలనీస్ లో బలవంతంగా తీసుకురాబడిందేమో కానీ, కన్స్యూమర్ సొసైటీ మాత్రం మిగతా ప్రపంచం స్వచ్చందంగా అక్కున చేర్చుకుంది. కాపిటలిజం బద్ద శత్రువులైన, కార్ల్ మార్క్స్ సిద్దాంతాల్ని వంటపట్టించుకున్న సొసైటీస్ కూడా, బహిష్కరించలేకపోయాయి.

ఫలితంగా ఒక విచిత్రమైన మార్పు సంభవించింది. ఏ ఆర్ధిక వ్యవస్థ అయితే ఒక వ్యక్తికి అంతులేని ఛాయిస్ ని ఇచ్చి , వ్యక్తి ఇష్టాలకనుగుణంగా తనని సమూహంలో ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలు కల్పించేట్లుగా నిర్మించబడ్డదో, అదే ఆర్థికవ్యవస్థ చివరకి మొత్తం humanity ని homogenize చేసింది.

ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటే, ఎన్నో రంగాల్లో ఒకే సమయంలో వచ్చిన టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అని కొందరనుకుంటారు కాని, అది నిజం కాదు. దాంట్లో మొట్టమొదటి దశని టెక్స్టైల్ రంగం డామినేట్ చేసింది. కాటన్ మిల్ ఈ పెనుమార్పుల్లో మూల స్థంభంలా నిలచింది.

ఎందువల్ల? 

ఒక సులభమయిన సమాధానమేంటంటే, పంతొమ్మిది శతాబ్ధంలో బ్రిటీష్ economic output per person ఆకాశ మార్గం పట్టింది. రెండు శతాబ్దాలుగా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన సగటు ఆదాయం, 1960 నాటికల్లా ఒక సగటు బ్రిటీష్ వ్యక్తి, 1860 లోని తన గ్రాండ్ ఫాదర్ తో పోలిస్తే ఆరురెట్ల ధనికుడయ్యేలా చేసింది. అతిముఖ్యమైన మార్పు ఏంటంటే బ్రిటీష్ లేబర్ ఫోర్స్ , అగ్రికల్చర్ ని వదిలేసి మిగతా రంగాలకి మరలడం. అది కేవలం మాన్యుఫాక్చరింగ్ కే పరిమితమవ్వలేదు, సర్వీసెస్ రంగాలకి కూడా విస్తరించింది.

ఈ మార్పు తో 1850 లలోనే బ్రిటన్ లో వ్యవసాయాధారిత జనాభా ఇరవై శాతానికి పడిపోయింది(అదే సమయంలో, మిగతా దేశాలలో దాదాపు యాభై శాతం జనభా వ్యవసాయం మీద ఆధారపడటం రివాజు). 1880 లకి వచ్చేప్పటికల్లా ఏడింట ఒక వంతుకీ, 1910 కల్లా పదకొండింట ఒక వంతుకీ పడిపోయింది.

టెక్నాలజీ లో వచ్చిన కొత్త మార్పులు, land, labor and capital లలో విప్లవాత్మకమైన ప్రొడక్టివిటీ ని సాధించిపెట్టాయి. ఒక మార్పు ఇంకో కొత్త ఇన్నోవేషన్ కి దారి తీసి, efficiency ని పెంచింది. James Hargreaves's Spinning Jenny (1766), Richard Arkwright's water frame (1769), Samuel Crompton's mule (1779), Edmund Cartwright's steam powered loom (1787) & Richard Robert's self-acting mule(1830) లన్నీ కూడా ఒక man-hour కి, అధిక వస్త్రం లేక అధిక నూలు ని ఉత్పత్తి సాధించేందుకు కనిపెట్టబడినవే. దాంతో కాటన్ ధర 1790 లతో పోలిస్తే 1830 లకి, 90 శాతానికి పడిపోయింది.


 ఇవే ప్రొడక్టివిటీ లాభాలు మిగతారంగాల్లో కూడా సాధ్యమయ్యాయి. Blast Furnace ఐరన్ ప్రొడక్షన్ నీ, Steam Engine అతి తక్కువ కోల్ వాడకంతో ఎక్కువ హార్స్ పవర్ నీ సాధించగలిగాయి.


ఇలా సాధించిన వరస విజయాలతో, ప్రొడక్టివిటీ మెరుగుదలలతో ఇండస్ట్రీస్ వ్యాపారం పెరగటంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువత మిలటరీ రంగం లో కన్నా, వర్క్ షాప్స్ లో ఎక్కువ చేరటం ప్రారంభించారు.

కానీ, పెరిగిన ప్రొడక్టివిటి, తద్వారా అధికంగా ఉత్పత్తి అవుతున్న Cloth, Iron and Mechanical Power ని కొనుగోలు చేయడానికి, సరిపోయినంతగా కన్స్యూమర్ సొసైటీ కూడా పెరగాలి. లేనట్లయితే Industrial Revolution ఒక ఫలితం లేని విప్లవంగా మిగిలిపోయి ఉండేది.

అయితే వస్త్రాల మీద మనుషులకున్న అంతులేని దాహం, ఆ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ని నిలిపింది.
ఈస్ట్ ఇండియా కంపనీ భారతదేశం నుంచి, పదిహేడవ శతాబ్దపు ప్రారంభంలో భారీగా దిగుమతి చేసుకున్న Indian Cloth, ఆ దాహాన్ని పెంచినంతగా మరేది పెంచలేదని చెప్పవచ్చు.

బ్రిటీష్ ఆర్థికపరిస్థితిని అద్భుతంగా మార్చేసిన కారణాలలో Cotton తలమానికమైనది. టెక్స్టైల్ పరిశ్రమ బ్రిటీష్ జాతీయాదాయంలో పదిశాతం పైనే ఆక్రమించడమే కాకుండా, పరిశ్రమలలో అత్యుత్తమ ఎఫిషియన్సీ టెక్నాలజీ ని కనుక్కోవటానికి అవసరాలని సృష్టించింది. విశేషమేమిటంటే, బ్రిటన్ లో ఉత్పత్తి చెందిన కాటన్, బ్రిటన్ లో వినియోగానికిమించి ఎగుమతులకి ఉపయోగపడేది. 1780 లలో కేవలం ఆరు శాతమున్న కాటన్ ఎగుమతులు, 1830 లలో కల్లా 48 శాతానికి చేరుకుని యూరప్ ఖండానికంతా చేరుకుంది.

అయితే బ్రిటన్, ఇతర యూరప్ దేశాల కన్నా ముందుగా ఎందుకు ఇండస్ట్రియలైజ్ అయ్యింది అన్న ప్రశ్నకి, ఏకైక కారణం లేదని చరిత్రకారులు అభిప్రాయపడతారు. మిగతా నార్త్ -వెస్ట్ యూరోపియన్ దేశాల కన్నా గొప్పగా కన్స్యూమర్ కల్చర్ లేనప్పటికీ, సైంటీఫిక్ నాలెడ్జ్ కూడా మరీ అంత అడ్వాన్స్డ్ గా లేనప్పటికీ బ్రిటన్ అంతగా ముందంజ ఎందుకు వేసిందనేదానికి ఇదమిద్దమైన కారణం కనిపించదు. బహుశా బ్రిటన్ లో వ్యవస్థాగతమైన పొలిటికల్, న్యాయ వ్యవస్థలు ఏర్పరిచిన అవకాశాల వల్లా, చట్టపరంగా creditors కి అధిక రక్షణ కల్పించిన సంఘ్హవ్యవస్థల వల్లా ఈ ముందంజ సాధ్యపడిందేమోనని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారు.

కానీ, ఇవేవీ కూడా పూర్తిగా మూలకారణాలని వివరించవని చెప్పుకోవచ్చు. ఇండియా నుంచి వచ్చే ప్రింటెడ్ కాటన్ ఫాబ్రిక్ దిగుమతుల మీద విధించిన అధిక రుసుముల వల్ల బ్రిటన్ కాటన్ పరిశ్రమ లాభపడిఉండవచ్చు. అయినప్పటికీ చరిత్రకారుల మధ్య ఇప్పటికీ ఈ కారణాల మీద ఏకాభిప్రాయం లేదు.

మిగతా నార్త్-వెస్ట్ యూరోపియన్ దేశాల కన్నా బ్రిటన్ రెండింట్లో ప్రత్యేకమయినదిగా ఉండటం వల్ల ఇండస్ట్రియల్ రివల్యూషన్ ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

  •  యూరప్ ఖండం అంతటికీ, బ్రిటన్ లో పరిశ్రమలో వేతనాలు ఎక్కువగా ఉండేవి. (ఉదా: Milan లో వేతనాలు London తో పోలిస్తే, 26 శాతం మాత్రమే ఉండేవి. ఇహ మిగతా ఖండాలలో ఉన్న చైనా, ఇండియాతో పోలిస్తే వేతనాలు చాలా ఎక్కువగా ఉండేవి.
  • బ్రిటన్ లో Coal సమృద్దిగానూ, సులువుగానూ లభించడం వల్ల కోల్ ధరలు, ఇంగ్లీష్ చానెల్ కి అవతల ఉన్న దేశాలతో పోలిస్తే చాలా చవకగా ఉండేవి. 1820-1860 మధ్యలో కోల్ పరిశ్రమలు నాలుగింతలయి కోల్ ధర నాలుగవవంతుకి పడిపోయింది.
ఈ రెండు కారణాలని కలిపి చూస్తే, ఇండస్ట్రియల్ టెక్నాలజీ లో నిరంతర ఇన్నోవేషన్స్ కోసం, బ్రిటీష్ ఎంటర్ ప్రెన్యూయర్స్ మోటివేట్ అయ్యారని చెప్పొచ్చు. ఇతర దేశాలలో కన్నా బ్రిటన్ లో అధిక వేతనాలతో ఉన్న వర్కర్స్ ని కొత్త టెక్నాలజీ మషీన్స్ తో రీప్లేస్ చేయటం అవసరమయింది.

ఫ్రెంచ్ విప్లవం లాగే, బ్రిటీష్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ యూరప్ ఖండమంతా పాకింది. అయితే ఈసారి అది పూర్తిగా శాంతియుతమైనది. అంతే కాదు, కొత్త టెక్నాలజీ ని కనిపెట్టిన ఇన్నోవేటర్స్ ఎవరూ కూడా ఆ టెక్నాలజీ కాపీ చేసుకోనీబడకుండా ఆపలేకపోయారు. 1771 లో Richard Arkwrigh's నిర్మించిన cotton mill, 7 సంవత్సరాలలోపే ఫ్రాన్స్ లో కాపీ చేయబడింది. Watt 1775 steam engine ని, ఫ్రాన్స్ కేవలం3 సంవత్సరాలలో కాపీ చేసేసింది. ఇండస్ట్రియల్ గూఢచార్యం పుణ్యమాని 1784 కల్లా జర్మనీ ఈ రెండూ సమకూర్చేసుకుంది. అమెరికా వీటన్నిటికన్నా నెమ్మదిగా అడుగులేసింది. 1788 కి కానీ మాసచూసట్స్ లో మొదటి కాటన్ మిల్ రాలేదు. స్టీమ్ ఇంజన్ 1803 కి కాని రాలేదు. బెల్జియం, డచ్, స్విస్ దేశాలన్నీ కూడా ఇదే తోవ పట్టాయి. మిషనరీ ఎఫిషియన్సీ ఎక్కువయిన కొలదీ, లేబర్ చౌకగా ఉన్నచోట కూడా, మిషన్స్ రావటం మొదలయింది. 1820-1913 కి మధ్యలో ప్రపంచ జనాభా దాదాపు నాలుగింతలయింది. ప్రపంచం నలుమూలలా కాటన్ స్పిండిల్స్ కూడా అంతే రెట్లయ్యాయి.

పంతొమ్మిదవ శతాబ్దపు చివరికల్లా, అమెరికా లోని నార్త్-ఈస్ట్ రాష్ట్రాల్లోనూ, యూరప్ లోని Glasgow to Warsaw నుంచి దరిదాపు మాస్కో వరకీ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వర్ధిల్లింది. 1800 లో ప్రపంచంలో అతిపెద్ద పది నగరాలలో, ఏడు ఏషియా లో ఉండేవి. ఇండస్ట్రియల్ రివల్యూషన్ పుణ్యమా అని 1900 కల్లా అది ఒకటికి చేరుకుంది, మిగతా తొమ్మిది యూరప్ లో కానీ, అమెరికాలో కానీ ఉండేవి.

కానీ, వేగంగా సంభవించిన ఇండస్ట్రియల్ విప్లవం వల్ల సృష్టించబడ్డ క్రమబద్దరీకంచబడని మార్కెట్ల లో ఉండే అస్థిరత,
అధిక ఉత్పత్తీ, ఆర్థికపరిస్థితి హెచ్చుతగ్గులూ ప్రజలని ఆందోళనలకి గురిచేసింది. దీర్ఘకాలంలో ప్రజల జీవననాణ్యత మెరుగుపడినప్పటికీ, సమీపకాలంలో శరవేగమైన ఇండస్ట్రియల్ వార్డ్స్ ప్రజలకి కీడు చేసేవిగానే దాపురించాయి. స్టీమ్, పొగ తో నిండిపోయిన బ్రిటీష్ ఫ్యాక్టరీలలోని వర్కర్స్ బ్రతుకులని సమకాలీన సాహిత్యము, మ్యూజిక్ ప్రతిబింబించింది. William Blake పెయింటింగ్స్ లో, Richard Wagner ఒపెరాల్లో, Thomas Carlyle రచనల్లో అవి గమనించవచ్చు. Industrial Economy సాంఘిక సంబంధాలన్నిటినీ 'The Cash Nexus' కింద మార్చేసిందనీ Thomas Carlyle వాపోయాడు.




మత, రాజకీయ నమ్మకాలని బహిష్కరించిన ఒక Jewish lawyer కొడుకైన Carl Marx, ఒక ధనిక కాటన్-మిల్ యజమాని కి కుమారుడూ, అతని సహ రచయితా అయిన Friedrich Engels లనీ ఈ "Cash Nexus" అన్న పదం విపరీతంగా ఆకర్షించింది. 1848 విప్లవాలకి తెరలేచే సమయాల్లో వారు Communist Manifesto ప్రచురించారు. నిజానికి Industrial Society ని Marx, Engels లే కాకుండా ఎంతో మంది విమర్శించారు. కాని అంతర్గతంగా చూస్తే పఠిష్టంగా కనపడే ఒక పర్యాయసాంఘికవ్యవస్థకి బ్లూ-ప్రింట్ ని ఇచ్చింది మాత్రం వారిద్దరే.

ఇక్కడ కాసేపు ఆగి, Western Civilization లో అతి పెద్ద చీలికకి ప్రారంభం పలికి, షుమారు నూటయాభై సంవత్సరాలు మన్నిన ఈ సిద్దాంతం మూలాలేంటో చూద్దాం.

చరిత్ర Dialectics Principles ని అనుసరిస్తుందన్న Hegel ఫిలాసఫీ , Ricardo ప్రతిపాదించిన Political Economy
ప్రిన్సిపుల్స్ మరియు "Iron-law-of-wages(దీర్ఘ కాలంలో వేతనాలెప్పుడూ తగ్గుమొఖం దిశలోనే పడిపోతూంటాయి) " ప్రిన్సిపుల్స్ నీ, కలగలుపుకొని ఉద్భవించిన Marxism, Thomas Carlyle యొక్క ఇండస్ట్రియల్-ఎకానమీ-వ్యతిరేకత స్థానంలో ఒక యుటోపియా ని సృష్టించింది. పెట్టుబడి స్వంతదారులయిన బూర్జువాలు, ఆస్థిరహిత కార్మికులు గా రెండు వర్గాలతో విడిపోయి అసమానతలతో నిండిపోయి ఉన్న సంఘాన్ని Industrial Economy సృష్టిస్తుందనీ, Capitalism పెట్టుబడిని సంఘంలోని అతికొద్ది వర్గాలకే పరిమితం చేసి, మిగతావారందరినీ వేతనబానిసలు గా మార్చేస్తుందని Marxism నమ్మింది.


Marx మరియు అతని శిష్యుల వాదన ఎందుకు తప్పయిందో గమనించేముందు, ఎక్కడ సరయినదో గుర్తించడం అవసరం.

Industrial Revolution వల్ల అసమానతలు పెరిగాయి. 1780-1830 మధ్య output per labourer 25 శాతం పెరిగితే, వేతనాలు మాత్రం కేవలమ్ 5 శాతం పెరిగాయి. 1801 లో జాతీయాదాయం లోని 25 శాతం సమాజంలోని పైవర్గాలకి చెందితే, అది 1848 కల్లా 35 శాతానికి పెరిగింది. Paris లో, 1820 లో 41 శాతం ప్రాపర్టీ 9 శాతం ప్రజలకి చెందితే, 1911 కల్లా 52 శాతానికి చేరుకుంది. Prussia లో, సమాజంలోని పైనున్న 5 శాతం ప్రజలకి, 1854 లో 21 శాతం ఆదాయం చెందితే, 1896 కి 27 శాతం, 1913 కల్లా 43 శాతానికెగసింది.

పంతొమ్మిదవ శతాబ్ధంలో ఇండస్ట్రియల్ సొసైటీస్ అసమానంగా అభివృద్ది చెందాయన్నది చరిత్రలో గమనించవచ్చు.
తద్వారా ఊహించిన పరిణామాలే సంభవించాయి. Hamburg లో 1892 లో ప్రబలిన కలరా వల్ల 800/yr Marks కన్న తక్కువ సంపాదించే వర్గాల్లో మృతుల సంఖ్య, 50,000/yr Marks కన్నా ఎక్కువ సంపాదించే వర్గాల కన్నా 13 రెట్లు ఎక్కువయ్యింది.

Industrial society తీసుకొచ్చిన అసమానతలని చూసి భయపడడానికి Marxist అయ్యి ఉండాల్సిన అవసరం లేదు.

Welsch కి చెందిన ఫ్యాక్టరీ యజమాని Robert Owen, Socialism అనే పదానికి సృష్టికర్త అయ్యి, Co-operative
Production అనే ఎకనామిక్ మోడల్ ని ప్రతిపాదించి, ఆ ప్రిన్సిపుల్స్ ఆధారంగా Scotland లోని Orbiston, USA Indiana లోని New Harmony అనే రెండు యుటోపియన్ గ్రామాల్ని నిర్మించాడు. చివరికి సౌందర్యారాధకుడూ, చమత్కారీ అయిన Oscar Wilde సైతం సాంఘిక దురవస్థలని గుర్తించాడు.

కానీ, Wilde భయపడిన, Marx అనుకున్న విప్లవం ఎప్పుడూ రాలేదు. 1830, 1848 లలో వచ్చిన ఉద్యమాలు తాత్కాలికంగా పైకెగసిన ఆహార ధరలూ, ఆర్ధిక సంక్షోభాల కారణాల వల్ల తప్ప, సాంఘిక ధృవాల వల్ల కాదు.

అగ్రికల్చర్ ఉత్పత్తి పెరిగిన కొద్దీ, ఇండస్ట్రియల్ ఉపాధి అవకాశాలు పెరిగి విప్లవమొచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. ఒక పేద-సమూహం లా తయారవుతారని ఊహించిన శ్రామిక ఉద్యోగ వర్గాలు(Proletariats) , స్కిల్స్ ఉన్న labour aristocracy గా, స్కిల్స్ సంపాదించలేని సాంఘికావసరాల ఉత్పత్తికి ఉపయోగపడని Lumpenproletariat (Marx coined this word) గా విడిపోయారు. స్కిల్స్ సంపాదించిన వర్గం సమ్మెలూ, చర్చల ద్వారా అధిక వేతనాలని చేజిక్కించుకుంది . మరొక వర్గం మద్యాన్ని ఆశ్రయించింది.

Communist Manifesto లో ప్రవచించిన చికిత్సలు ఇండస్ట్రియల్ వర్కర్స్ ని ఆకర్షించలేదు.

Marx & Engels :

  • వ్యక్తి ఆస్థి ని నిర్మూలించాలనీ,
  • వంశపారంపర్యంగా వచ్చే ఆస్థిని తీసివేయాలనీ,
  • ఋణాలిచ్చే సంస్థలనీ, కమ్యూనికేషన్ రంగాలనీ కేంద్రీకృతం చేసి అదుపులోకి తీసుకోవాలనీ,
  • అన్ని ఫ్యాక్టరీలనీ, ఉత్పత్తి సాధనాలనీ రాజ్యం వశం చేసుకోవాలనీ,
  • వ్యవసాయ రంగంలో కార్మికసైన్యాన్ని ఏర్పాటు చేయాలనీ,
  • నగరాలకీ, పల్లెలకీ ఉన్న తేడాలని తొలగించాలనీ,
  • కుటుంబం అనే వ్యవస్థని నిర్మూలించాలనీ,
  • Community-of-women  ని ఏర్పరచాలనీ,
  • సమస్త Nationalities ని నిర్మూలించాలనీ ప్రతిపాదించారు.

దీనికి పూర్తి వ్యతిరేకంగా పందొమ్మిదవ శతాబ్ధపు మధ్యకాలంలోని ఉదారవాదులు రాజ్యాంగ ప్రభుత్వాలూ, వాక్ స్వేచ్చ, ప్రెస్ హక్కులూ, ఎలక్షన్ ప్రాసెస్ కి సవరణలని చేసి సమాజంలోని అన్నివర్గాలకీ ప్రాతినిధ్యం దొరికేలా చేయాలనీ, free-trade పెంచాలనీ, జాతీయత ని పెంపొందించాలనీ అభిప్రాయపడ్డారు.

కమ్యూనిస్ట్ మానిఫెస్ట్ రచించబడిన 1848 తరువాత అర్దశతాబ్ధానికల్లా ఈ ఉదారవాదులు పైనచెప్పినవాటిల్లో చాలా వరకీ సాధించి, Marx, Engels ప్రతిపాదించిన విప్లవాత్మక సాంఘికసవరణలు మాకవసరం లేదని తేల్చి చూపించారు.


  • 1850 లో కేవలం France, Greece, Switzerland లోని ప్రజలకీ, అందునా కేవలం ఇరవైశాతానికి పైగా మాత్రమే ప్రజలకి వోటు హక్కు ఉండేది. 1900 ల కల్లా పది యూరోపియన్ దేశాల ప్రజలకి వోటు హక్కు సమకూరింది.
  • సమాజంలోని వివిధ వర్గాలకి రాజకీయప్రాతినిధ్యం లభించడంతో కింద వర్గాలకి లబ్ధిచెందే చట్టాలు రూపొందించబడ్డాయి
  • Free-trade వల్ల బ్రిటన్ లో బ్రెడ్ చౌకగా లభించడమే కాక, యూనియన్స్ వల్ల పెరిగిన వేతనాల వల్ల వర్కర్స్ లాభం పొందారు. 1848-1913 కి మధ్య లేబర్ వేతనాలు బాగా పెరిగాయి
  • విస్తారంగా ఉన్న సాంఘిక ప్రాతినిధ్యం వల్ల ఆదాయపన్ను ఫ్లాట్ రేట్ గా కాక, అంచెలంచల ఆదాయపన్నుగా రూపుదిద్దుకుంది.

1842 కి ముందు బ్రిటీష్ రెవెన్యూ మొత్తం, డైరక్ట్ ఆదాయపన్ను ద్వారా కాకుండా, ఇండైరక్ట్ మార్గాలైన వినియోగపన్ను, ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీల ద్వారా లభించడం వల్ల, ధనికవర్గాల నుండి పన్ను రెవెన్యూ తక్కువ మొత్తంలో లభించేది. 1913 కల్లా రెవెన్యూ లో మూడవ వంతు, సమజాంలోని అధికాదాయ వర్గాల మీద డైరక్ట్ ఆదాయ పన్ను ద్వారా లభించింది.

1842 లో కేంద్ర ప్రభుత్వం విద్య, ఆర్ట్స్, సైన్సెస్ రంగాల మీద ఖర్చు చేసిన మొత్తం దరిదాపు సున్నా. 1913 కి ఆ ఖర్చు రెవెన్యూ లో పది శాతానికి చేరుకుంది. అదే సమయానికి బ్రిటన్, జర్మనీ తరహాలో పదవీవిరమణ చేసిన సీనియర్ సిటిజన్స్ కి, పెన్షన్ స్కీమ్స్ ప్రారంభించింది.

Marx and Engels రెండు విషయాలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మొదటగా వారి 'Iron-law-of-wages' సిద్దాంతం పూర్తి నాన్సెన్స్. నిజమే, కాపిటలిజం లో ఆస్థి కేంద్రీకృతమయింది. ఆ ధోరణి ఇరవై శతాబ్దపు మూడు, నాలుగు దశాబ్దాల దాకా కొనసాగింది. కాని సమాజంలో అల్పాయాదవర్గాల మీద పన్ను తగ్గి, అదే సమయంలో వేతనాలు పెరిగిన కొలదీ ఆదాయవ్యత్యాసాలు తగ్గడం ప్రారంభించాయి.

Marx అర్ధం చేసుకోలేని, 'వర్కర్స్ కూడా కన్స్యూమర్స్ ' అన్న అతి ముఖ్యమైన విషయాన్ని కాపిటలిస్టులు బాగా అర్ధం చేసుకున్నారు. అందువల్ల వేతనాలని అతితక్కువగా తొక్కిపట్టటమనేది అర్ధం లేని విషయం. USA లాంటి దేశాలలో కాపిటలిస్టు కంపనీలకి వారి ఉద్యోగులూ, వారి కుటుంబాల కన్నా మించిన మార్కెట్ లేదనేది అర్ధమయింది. ఇండస్ట్రియల్ సొసైటీలలో వర్కర్స్ సమూహాలన్నీ దుర్బరావస్థలలో పడిపోతారని Marx చేసిన ఊహగానాలు నిజం కాకపోవటమే కాక, వెస్టర్న్స్ ఇండస్ట్రియల్ ఎకానమీ, వెస్టర్న్ వర్కర్స్ కి ఎన్నో రెట్ల ఉద్యోగావకాశాలని కల్పించింది. కాటన్ మిల్ ఇండస్ట్రియలైజ్ అవటం వల్ల దిగుమతులు తగ్గిపోయి నష్టపోయిన వారెవరైనా ఉన్నారంటే, ఎగుమతులు తగ్గిపోయి వ్యాపారం దెబ్బతిన్న భారతదేశ చేనేత పరిశ్రమ లోని కార్మికులు.

కాలంతో పాటు, టెక్నాలజీ పెరిగి తద్వారా ఉత్పత్తి పెరిగి, ధరలు తగ్గడంతో వెస్టర్న్ వర్కర్స్ వారి ఆదాయంతో మరింత కొనుగోలు చేయగలిగారు. దీని ప్రభావం, ఆ కాలంలోని వెస్టర్న్, నాన్-వెస్టర్న్ ప్రజల జీవన ప్రమాణాలలో ఉన్న వ్యత్యాసం లో గమనించవచ్చు. వెస్టర్న్ సొసైటీస్ లలో అంతర్గతంగా, ఇండస్ట్రియల్ టౌన్స్ ప్రాంతాలకీ, రూరల్ ప్రాంతాలకీ కూడా తేడాను గమనించవచ్చు. పదిహేడవ శతాబ్దపు తొలినాళ్లలో లండన్ లోని సగటు వర్కర్ వేతనం, మిలన్(ఇటలీ) లోని సగటు వర్కర్ కి సమానంగా ఉండేది, కానీ 1750 నుండి 1850 కల్లా లండన్ వర్కర్స్ ఎంతో ముందుకెళ్ళారు. ఒక సమయంలో గరిష్టంగా మిలన్ లోని వర్కర్ కన్నా ఆరు రెట్లు ఎక్కువగా వేతనం లభించేది.

క్రమంగా ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ఇండస్ట్రియలైజేషన్ మార్గాన్ని పట్టి ఆ తేడాని తగ్గించుకున్నాయి.

ఇదే సమయంలో చైనా లోని వర్కర్స్ వేతనాలలో ఎలాంటి తేడా కాలానుగుణంగా రాలేదు. పంతొమ్మిదవ శతాబ్దమంతా పెద్ద నగరాలైన బీజింగ్, కాంటన్ లలో నిర్మాణ కార్మికులలో దినసరి వేతనాలు మూడు గ్రాముల వెండి కి పరిమితమయ్యాయి. ఇరవై శతాబ్దపు తొలినాళ్లల్లో కూడా స్వల్పమార్పే (5-6 గ్రామ్స్) వచ్చింది. లండన్ లోని వర్కర్స్ వేతనాలు 1800-1870 లలో 18grams/day నుండి, 1900-1913 ల కల్లా 70grams/day కి చేరుకున్నాయి. చైనాలో పంతొమ్మిదవ శతాబ్ధమంతా, ముఖ్యంగా Taiping Rebellion కాలంలో జీవన ప్రమాణాలు పడిపోతూవచ్చాయి. చైనాలో కనీస జీవనానికి కావాల్సిన ఆదాయం తక్కువే కావచ్చు కాక, కానీ గుర్తుంచుకోదగ్గ విషయమేమిటంటే తూర్పు ఏషియాలోని ప్రజలు మిల్డ్ రైస్, చిన్న ధాన్యాల మీదా ఆధారపడ్డ కాలంలో లండన్, బెర్లిన్ ప్రజలు వివిధ రకాల బ్రెడ్, డెయిరీ ప్రొడక్ట్స్, మీట్, వైన్ లని కొనుగోలు చేసుకోగలిగారు.

ఏదేమైనా పద్దెనిమిదవ శతాబ్ధంలోలండన్, బీజింగ్ లలోని జీవన ప్రమాణాలలో రెండు రెట్ల వ్యత్యాసం, ఇరవైశతాబ్ధపు రెండవ దశాబ్థం కల్లా గరిష్టంగా ఆరురెట్లకి చేరుకుంది.

Marx and Engel చేసిన రెండవ తప్పు , పంతొమ్మిదవ-శతాబ్ధపు-దేశం తనను తాను మారిన సాంఘిక,రాజకీయ,ఆర్థిక,ప్రాపంచిక,సాంకేతిక పరిస్థితులకనుగుణంగా మలచుకోగలిగే శక్తిని తక్కువంచనా వేయడం.

Marx, Contribution to a Critique of Hegel's Philosophy of Right రచించినప్పుడు Religion ని Opium of Masses అన్న ఒక ఫేమస్ స్లోగన్ ని ఇచ్చాడు. అది నిజమే, కాని "జాతీయత" అనేది మిడిల్ క్లాస్ ప్రజల 'కొకెయిన్ '

Beating Heart of Italy అని పిలవబడే Giuseppe-Mazzini 1852 లో చెప్పిన మాటలని చూద్దాం. "ఫ్రెంచి విప్లవం రెండు ప్రశ్నలని మనముందుంచింది. 1. సాంఘికమైన ప్రశ్నలు 2. జాతీయతకి సంబంధించిన ప్రశ్నలు"


 Mazzini వాదనల్లా చెల్లాచెదురై చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న యూరప్ మాప్ ని , 11 దేశాలుగా రూపాంతరం
 చెందించాలి. ఇదంత సులభం కాదు. జాతీయత అనే ఒక అనుభూతి ఆర్టిస్టిక్ ప్రపంచానికి చెందినది, ప్రొగ్రామటిక్ మార్గాల్లో పనిచేయదు. జనాల నాలిక మీద ఉండే పద్యాల్లాంటి(ex:Greek Rigas Feraios) వాటిల్లో, మైదానాల్లో ఆడే ఆటల్లో (Scotland vs England's first international soccer in 1872 ) జాతి అన్న భావం పొంగటం సులభతరమే కాని కమ్యూనిస్ట్ మానిఫెస్టోలో Marx పిలుపునిచ్చినట్లుగా పొలిటికల్, భాషా, మత పరమైన సరిహద్దులని చెరిపేసి ఒక్కజాతి అన్న భావం తీసుకురావటం కష్టతరమైన పని. 1830-1905 మధ్యన 8 యురోపియన్ దేశాలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాయి. ఒక దేశాన్ని నిర్మించడం అనే ప్రక్రియ విజయవంతమవుతుందా, అపజయం పొందుతుందా అనేది realpolitk మీద ఆధారపడి ఉంటుంది. ఇలా కొత్తగా ఏర్పాటయిన దేశాల్లో భూస్వాముల ప్రతిఫలాలు మాత్రమే ముఖ్యం కాలేదు. 1859-1871 మధ్యలో ఏర్పడిన ఇటలీ, 1864-1871 మధ్య స్వతంత్రమయిన జర్మనీ లలో ప్రజలకి, మెరుగైన ఎకానమీ నమూనాలు, తగ్గుముఖం పట్టిన వివిధ ట్రాన్సాక్షన్ ఖర్చులు, మరింత పఠిష్టమయిన లా అండ్ ఆర్డర్ వ్యవస్థలు, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు లాంటి లాభాలు జరిగాయి. ఈ కొత్త దేశాలు యూరప్ లో పెద్ద నగరాలని నిర్మించుకోగలగడమే కాక, ప్రజల శాంతి భధ్రతలని కాపాడగలిగాయి. స్లమ్స్ ని తగ్గించడమూ, పెద్ద పెద్ద వీధులూ, పెద్ద చర్చ్ లూ, ఆకుపచ్చ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియమ్స్, మరింత పోలీస్
సిబ్బంది లాంటివన్నీ కలసి యూరప్ లోని నగరాలని సమూలంగా మార్చివేసాయి. కొత్త స్కూల్స్ ఎన్నో నిర్మించబడి, నేషనల్ లాంగ్వేజెస్ స్టూడెంట్శ్ మెదళ్ళల్లోకి ఇంకిపోయాయి. బరాక్స్ నిర్మించబడ్డాయి, హైస్కూల్ గ్రాడ్యుయేట్స్ ని దేశాన్ని కాపాట్టం కోసం శిక్షణ ఇవ్వడానికి. లాభసాటి కానప్పటికీ దేశపు నలుమూలలా
Europe in 1800
Europe in 2000
రైల్వేలైన్లెన్నో నిర్మించబడ్డాయి, దేశభధ్రత కోసం అవసరమయినపుడు శిబిరాలని తరలించటం కోసం. పుట్టిన ప్రదేశం ఆధారంగా ప్రజలు ఫ్రెంచ్ మెన్, జర్మన్స్ , ఇటాలియన్స్, సెర్బ్స్ etc. అయ్యారు.


 
*****

Issac Merritt Singer 1850 లో Boston కి వెళ్ళి కుట్టుమిషన్ సూది వంకరగా కాకుండా స్ట్రెయిట్ గా ఉండాలనీ, చేత్తో కాకుండా కాలితో నడిపేలా ఉండాలని తలచినప్పుడు Singer కుట్టు మిషన్ పుట్టింది.


Marx లాగే వ్యక్తిగతంగా ఎన్నోలోపాలున్నప్పటికీ, Marx తెచ్చిన మార్పులా కాక, ప్రపంచాన్ని మెరుగైన మార్పు వైపు మరల్చినవాడు Issac Singer. Cloth production లో తనకి ముందు వంద సంవత్సరాల క్రితం మొదలయిన mechanization ప్రక్రియ, Singer Manufacturing Company పూర్తి చేసింది. ఒక యంత్రంతో రెండు బట్ట ముక్కలని కలిపి కుట్టడం సాధ్యపడింది. ఈ విప్లవాత్మకమయిన మార్పుని దాదాపు ఒక తరం అంతగా పట్టించుకోలేదు. Singer ఎంతో మంది స్త్రీలని ప్రేమించిన వ్యక్తి. చరిత్రలో స్త్రీలకి ఇతనికన్నా ఎక్కువగా ఎవరైనా లాభం చేసారా? అన్న ప్రశ్న తమాషాగా అనిపించినప్పటికీ అందులో ఎంతో నిజం ఉంది. సింగర్ టెక్నాలజీ వల్ల ఒక స్కర్ట్ కుట్టడం గంటలనించీ, నిమిషాలకీ, చివరకి సెకన్లకీ పడిపోయింది. సింగర్ కుట్టు మిషన్ చరిత్రని అనుసరిస్తే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లోని పరిణామక్రమాన్ని గమనించవచ్చు.

1856 లో మొదటిసారిగా Turtleback model, 1858 లో Grasshopper,
1865 లో New family, 1880 లో electric 99k లతో 1900 కల్లా 40 models, 1929 కల్లా 3000 models లకి చేరుకున్నాయి.

పంతొమ్మిదవ శతాబ్ధంలో సింగర్ మషిన్ టెక్నాలజీ వ్యాప్తిచెందినంత వేగంగా, అతికొన్ని మాత్రమే ప్రపంచమంతా వ్యాపించాయి. New York broadway నుంచి Brazil, Canada, Germany, Russia, Scotland లకి శరవేగంగా చేరుకుంది. 1904 కల్లా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కుట్టుమిషన్స్ అమ్ముడయి 1914 కల్లా అంతకు రెట్టింపయ్యాయి. వస్త్రాన్ని కుడుతున్న అమ్మాయి చుట్టూ ఉన్న S అక్షరంతో ఉన్న లోగోని మౌంట్ ఎవరెస్ట్ మీద కూడా చూడవచ్చని కంపనీ ప్రతినిధులు చెప్తున్నారు. చివరకి, కొంతవరకీ మోడర్న్ మెడిసిన్ ని , మోడర్న్ టెక్నాలజీని వ్యతిరేకించిన మహాత్మా గాంధీ సైతం, మానవాళికి ఉపయోగపడే కొన్ని గొప్ప ఇన్వెషన్స్ లో ఇది ఒకటి అని ప్రశంసించాడు.


ఈ మార్పు క్లాత్ కి ఎంతో డిమాండ్ ని సృష్టించింది. ఈ డిమాండ్ ని సంతృప్తి పరచటం కోసం Cotton and Textiles ఇండస్ట్రీ ఎంతో విస్తరించి అమెరికన్ ఇండస్ట్రియలైజేషన్ లో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. అమెరికాలో 1870 నుంచి సగటు 80 శాతం వృద్దిరేటుతో గణనీయంగా పుంజుకున్న ఇండస్ట్రియలైజేషన్, అమెరికాని 1913 కల్లా ప్రపంచంలో అత్యధిక ఇండస్ట్రియల్ ఉత్పత్తి కల దేశంగా నిలపెట్టింది. కానీ 1910 కల్ల బ్రిటన్ కన్నా రెట్టింపయిన జనాభాతో ఉన్న అమెరికా లోని cotton production దేశీయ వినియోగానికే సరిపోవడం వల్ల, ఎగుమతిలో బ్రిటన్ కన్నా వెనకపడింది. ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే, అదే కాలంలో బ్రిటన్ తో కాటన్ ఎగుమతుల్లో పోటీ
పడిన దేశం West నుంచి కాక, East నుంచి Japan అవడం.

TURNING WESTERN


1910 వచ్చేప్పటికి ప్రపంచం అనేకమార్గాల్లో ఆర్ధికంగా అనేకమార్గాల్లో మిళితమవడం ప్రారంభమయింది. వెస్టర్న్
ఇన్వెషన్స్ అయిన రైల్వేస్, స్టీమ్ షిప్స్, టెలిగ్రాఫ్స్ లతో ప్రపంచం చిన్నదవడం మొదలయింది. అమెరికాలో ఉన్న రైల్వేస్ లైన్ అంతా చుట్టచుడితే భూమి చుట్టుకొలతకి 13 రెట్లుంటుంది. కొత్తగా కనిపెట్టబడిన స్క్రూ ప్రొపెల్లర్స్, కాంపౌండ్ ఇంజన్స్ , సర్ఫేస్ కండెన్సర్స్ వల్ల , సముద్రాల మీద స్టీమ్ షిప్స్ ప్రయాణం చాలా వేగంగానే కాక, చౌకగానూ తయారయింది. Mauretania (1907) అనే ఓడ, Sirius (1838) కన్నా 46 రెట్లు ఎక్కువ పెద్దదయినప్పటికీ, హార్స్ పవర్ 219 రెట్లవటం వల్ల, అట్లాంటిక్ సముద్రాన్ని కేవలం తొమ్మిదిన్నర రోజుల్లో దాటేసింది. సముద్రం మీద
freight costs కూడా గణనీయంగా పడిపోయాయి. గ్రౌండ్ మీద 30 మైళ్ళ దూరం ఉండే Manchester నుండి Liverpool కి 8 షిల్లింగ్స్ అవసరమయితే, 7,250 మైల్స్ దూరంలో ఉన్న బొంబాయి కి కేవలం 30 షిల్లింగ్స్ ఖర్చయ్యేది. 1869 లో తెరవబడిన సూయజ్ కెనాల్, 1914 లోని పనామా కెనాల్ ప్రపంచాన్ని ఇంకా కుదించేసాయి. 1860 లో సముద్రపు అడుగున వేసిన కేబుల్స్ తో లండన్ నుండి బొంబాయి కి టెలిగ్రామ్స్ పంపటం సాధ్యమయింది. 1857 లో Indian Mutiny వార్త లండన్ కి చేరడానికి 46 రోజులు పడితే, 1891 లో జపాన్ లోని Nobi భూకంపం వార్త చేరడానికి ఒకరోజు పట్టింది.

వీటన్నిటి వల్లా, ప్రపంచం నలుమూలలకీ లేబర్ ఫోర్స్ రవాణా సులువయింది. 1840 నుండి 1940 మధ్య 58 మిలియన్ల యూరోపియన్స్ అమెరికాకి వలసపోయారు. 51 మిలియన్ల రష్యన్స్ సైబిరియా, సెంట్రల్ ఏషియా, మంచూరియాలకీ, 52 మిలియన్ల ఇండియన్స్ సౌత్ - ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియేషియా కి వలసపోయారు. పెట్టుబడి కూడా వీరితో పాటే ఖండాలు దాటింది. బ్రిటన్ ప్రప్ంచానికి బ్యాంకర్ అయింది. బ్రిటీష్ కాటన్ ని ఎగుమతి చేయటమే కాక, కాటన్ ని తయారు చేసే యంత్రాలనీ, ప్లాంట్స్ ని పెట్టటానికి అవసరమయ్యే డబ్బు పెట్టుబడిని ఎగుమతి చేయగల సామర్ధ్యాన్ని సంపాదించుకుంది.

వీటితో పాటే, శరవేగంగా వెస్టర్న్ డ్రెస్సింగ్ ప్రపంచమంతటా పాకింది. సింగర్ కుట్టుమిషన్ ప్రపంచమంతా వ్యాపించినప్పుడు, సింగర్ యాజమాన్యం ఊహించిందీ, ఉద్దేశించిందీ వివిధ దేశాల్లోని ప్రజలు వారి వారి డ్రెస్సింగ్ స్టైల్స్ లో బట్టలని , మిషన్ మీద కుట్టుకోవడానికి ఉపయోగిస్తారని. కానీ ప్రపంచమంతటా అవి వెస్టర్ డ్రెస్సింగ్ స్టైల్స్ ని కాపీ చేయటానికి ఎక్కువ ఉపయోగించబడ్డాయి.

ఈ మార్పు జపాన్ లో పెద్ద ఎత్తున సంభవించింది. సాక్షాత్తూ జపాన్ రాజు హిరోహిటో వెస్టర్న్ క్లోతింగ్ ని అందరికన్నా ఎక్కువగా ఇష్టపడడం ప్రారంభించిన విషయం Henry Poole & Co కి జపాన్ ప్రిన్స్ హిరోహిటో పంపిన purchase order లో పెద్ద ఎత్తున military uniforms, embroidered waistcoats, dinner jackets, morning coats, fancy cashmere suits, flannel suits ని ఉండడం ద్వారా గమనించవచ్చు. ఒక్క జపాన్ రాజే కాదు, Henry Poole Co's basement లో ఇథియోపియా చక్రవర్తి Haile Selassie నుంచి, రష్యా జార్ Nicholas II వరకీ ఆర్డర్ చేసిన వేలకొద్దీ సూట్స్ ఉండేవి. Henry Poole కి అంకితమయిన ఇంకో కస్టమర్ Maharaja of Cooch Behar. ఆయన ఈ కంపెనీ నుంచి 1000 suites order చేసాడు. ప్రతీ ఉదాహరణలోనూ Perfect English Gentleman లాగా కన్పించాలన్న ఆసక్తీ, తమ దేశీయ వస్త్రధారణని అధిగమించింది.


 జపాన్ లోని Meiji minister Tomomi రెండు సంవత్సరాలు USA, Europe లలో పర్యటించిన తరువాత వెస్టర్న్ ప్రపంచం తమకన్నా ప్రతి రంగంలోనూ ముందంజలో ఉందన్న ఎరుక, ఆత్మావలోకనంలోకి నెట్టి , ఏ రంగం వల్ల ఆ అభివృద్ది సాధ్యపడిందో నని ప్రతి సిస్టమ్ నీ జపాన్ దిగుమతి చేసుకోవటం మొదలెట్టింది. 1889 లో ఏర్పడిన Prussian style constitution మొదలు, 1897 లోని బ్రిటీష్ గోల్డ్ స్టాండర్డ్ వరకీ జపనీస్ వ్యవస్థలు, సంస్థలన్నీ వెస్టర్న్ స్టైల్ ని అనుసరించాయి. ఆర్మీ జర్మన్ మోడల్ నీ, నేవీ బ్రిటన్ మోడల్ నీ, ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్స్ అమెరికన్ మోడల్స్ బాట పట్టాయి.

అన్నిటికన్నా పెద్ద మార్పు ఆహార్యం లో సంభవించింది. 1870 లో blackening of teeth ని , eyebrows ని షేవ్ చేసుకోవటాన్నీ నిషేదించారు. మినిస్టర్స్ వెస్టర్న్ స్టైల్ లో పొట్టిగా హెయిర్ కట్ చేసుకోవటం ప్రారంభించారు. 1871 లో పబ్లిక్ అఫిషియల్ అధికారులంతా యురోపియన్ ఫ్రాక్ కోట్, వైట్ షర్ట్ మీద ధరించాలన్ని imperial decree జారీ చేసారు. మిలటరీ, నేవీ యూనిఫామ్స్ వెస్టర్న్ కోవలోకి మారిపోయాయి. Elite women, children అందరూ వెస్టర్న్ డ్రెస్సెస్ ధరించటమారంభించారు.

ఈ మార్పుని వ్యతిరేకించిన సంప్రదాయవాదులు లేకపోలేదు. Meiji ని వెస్టర్న్ తరహాలోకి మార్చేయటానికి కృషి చేసిన నిర్మాణవేత్త Okubo Toshimichi ని 1878 లో సంప్రదాయవాద ఆతంకులు హత్య చేసారు. జపాన్ ఆర్మీ ని వెస్టర్న్ బాట పట్టించిన Omura Masujiro ని చంపేసారు. అయినప్పటికీ ఈ మార్పులేవీ ఆగలేదు.

ఇంకా ఇతర మార్పులతో జపాన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ తరువాతి అత్యధిక లాభం పొందిన మొట్టమొదటి పశ్చిమేతర దేశంగా నిలచింది. జపాన్ లో ఇదే సమయంలో టెక్స్ టైల్ ఇండస్ట్రీ శరవేగంగా అభివృద్ది చెందింది. 1907-1924 మధ్యలో కాటన్ మిల్స్ రెండు రెట్లయ్యాయి (118-232), స్పిండిల్స్ నాలుగింతలూ, లూమ్స్ ఏడు రెట్లు అయ్యాయి. 1900 కల్లా జపాన్ లోని మొత్తం పరిశ్రమలలో పని చేసే శ్రామికులలో టెక్స్ టైల్స్ ఫాక్టరీ లలో పనిచేసే వారు 63 శాతానికి చేరుకున్నారు. తరువాతి పది సంవత్సరాలలో జపాన్ ఎగుమతులు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లని అధిగమించాయి. ప్రొడక్టివిటీ ఎనభైశాతం పెరగటమే కాక , వర్క్ ఫోర్స్ లో మహిళలు అధిక సంఖ్యలో చేరటం ప్రారంభమయింది.
వెస్ట్ లో లాగే, జపాన్ లో ఇండస్ట్రియల్ ప్రగతి ఒక రంగాన్నుంచి , ఇంకో రంగానికి విస్తరించింది. 1870 లో Tokyo-Yokohama మధ్య మొట్టమొదటగా బ్రిటీష్ డిజైన్ చేసిన రైల్వే లేను పడింది. అతి త్వరలోనే నగరాలలో టెలిగ్రాఫ్ వైర్స్, వీధి దీపాలు, ఐరన్ బ్రిడ్జెస్, పేపర్ గోడల స్థానంలో బ్రిక్ వాల్స్ వచ్చాయి. ఇంకా ముందుకెళ్తే ఎకానమీ లో Mitsui, Mitsubishi, Sumitomo & Yasuda లు ఆధిపత్య పాత్రని పోషించటం ప్రారంభమయింది. స్టీమ్ లోకోమేటివ్స్ ని కొనటం దశనుంచి, జపనీస్ బ్రిటీష్ వారి సహాయంతో వాటిని నిర్మించేదశకి చేరుకున్నారు.

బహుశా వెస్టర్న్ ప్రగతిని జపాన్ అక్కున చేర్చుకున్నంత మక్కువతో మరే ఇతర ఏషియా దేశమూ చేర్చుకోలేదన్నది అతిశయం కాదు. దీనికి మంచి ఉదాహరణ ఇండియా. బ్రిటీష్ పరిపాలనలోంచి బయటకొచ్చాక ఇండియా లో జాతీయవాదులైన నెహ్రూ, గాంధీ లు దేశీయ వస్త్రధారణకి దగ్గరగా ఉండడానికి ప్రాముఖ్యతనిచ్చారు.

RAGTIME TO RICHES

చరిత్రని వెనక్కి తిరిగి చూస్తే కొన్ని సామ్రాజ్యాల మధ్య ఘర్షణే మొదటి ప్రపంచ యుద్దంగా చెప్పుకోవచ్చు. నాలుగు డైనాస్టీలని కూలదోసి, ఆ సామ్రాజ్యాలని చెల్లాచెదురు చేసిన యుద్దం మొదటి ప్రపంచయుద్దం. Czechs, Estronians, Georgians, Hungarians, Lithuanians, Latvians, Poles, Slovaks and Ukrainians స్వాత్రంత్రపు వాసనలు చూసారు. వీటన్నిటిలో ఒక్క ఐరిష్ తప్ప మిగతా ఎవరూ కూడా యుద్దంలోంచి బయటపడ్డాక అర్ధవంతమైన స్వాతంత్రాన్ని నిలుపుకోలేకపోయారు. Giuseppe Mazzini ఊహించిన యూరప్ మాప్ మెరిసి మాయమయింది.

యుద్దానంతరం లెనిన్ ఊహించిన దృశ్యం భిన్నమైనది. అది యూరేషియా లోని సోవియట్ సోషలిస్ట్ రిప్లబ్లిక్స్

అన్నిటిని కలుపుకోని యూనియన్ గా ఏర్పాటు చేయటం వైపు కొనసాగింది. యుద్దానంతర ఆర్ధిక పరిస్థితులు క్షీణించటంతో ఆ ప్రయత్నం సులభమయింది. అన్ని ప్రభుత్వాలు తమ తమ సెంట్రల్ బ్యాంక్స్ లో తాత్కాలిక రుణాల ద్వారా నగదు సేకరించి, డబ్బు ముద్రించి యుద్దాలకి మద్దతివ్వడంతో ద్రవ్యోల్భణం తారాస్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులు యుద్దసైన్యం లో చేరాల్సి రావటంతో, లేబర్ కొరత ఏర్పడి అధిక వేతనాల కోసం వర్కర్స్ డిమాండ్ చేసే వెసులుబాటు కలిగింది. 1917 కల్లా ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలలో ఎన్నో లక్షల కొద్దీ శ్రామికులు సమ్మెకి దిగారు. మొదట స్పానిష్ ఫ్లూ, పిదప రష్యన్ బోల్షివిజం ప్రపంచమంతా పాకింది. 1848 లో లాగానే నగరజీవనం దెబ్బతింది. ఈ ప్రభావం బోయ్నెస్ ఐరస్ నుండి బెంగాల్ వరకీ, సియాటిల్ నుండి షాంగయ్ వరకీ విస్తరించింది. అయినప్పటికీ శ్రామికవర్గ విప్లవం, బోల్షివిక్స్ పునర్మిర్మాణించిన రష్యాలో తప్ప మిగతా చోట్ల విఫలమయింది. కరడుగట్టిన సోషలిస్ట్ అయిన లెనిన్ తన ప్రత్యర్ధుల మీద పాల్పడిన కిరాతక చర్యలకి బహుశా ఏ ఇతర సోషలిస్టు సాటిరాడు. "శ్రామిక వర్గ నియంత్రత్వం" అనగా "బోల్షివిక్ నియంత్రత్వం" లెనిన్ లోకానికిచ్చిన పుణ్యమే!!


తూర్పున బోల్షివిక్ ఉప్పెన కి ఎదురేలేకుండాపోయింది. కానీ, Jozef Pilsudski-Poland , Kemal Ataturk- Turkey, Benito Musssolini-Itlay ల త్రయం పుణ్యమా అని, అది పశ్చిమాన Vistula నీ, దక్షిణాన Caucasus నీ దాటి ముందుకెళ్ళలేకపోయింది. Warsaw బయట Red Army(1920) ఓటమి, Anatolian Greeks ల బహిష్కరణ (1922), Facist March on Rome (1922) లతో కొత్త కాలానికి తెర లేస్తున్న రోజులవి. మిలటరీ యూనిఫామ్స్ కాకుండా బ్లాక్ షర్ట్స్, జోధ్ పూర్స్, మోకాలి ఎత్తువరకీ ఉండే బూట్సూ ల వస్త్రధారణలతో రోమ్ మీద జరిగిన మార్చ్ చేయడం ద్వారా యుద్దకాలంలో పరిస్థితులు అంతమయి, శాంతియుత కాలంలోకి వెళ్తున్నామన్న సందేశమందించడం ఆ మార్చ్ ఉద్దేశం. ఇటాలియన్ నేషనలిస్ట్ Giuseppe Garibaldi మొదటిసారిగా పొలిటికల్ మూవ్ మెంట్స్ కోసం రెడ్ షర్ట్స్ వాడడం మొదలుపెట్టాడు. ఇటాలియన్ ఫాసిస్టులు బ్లాక్ నీ, జర్మన్ సోషలిస్టులు బ్రౌన్ కలర్ నీ ఉపయోగించడం ప్రారంభించారు.

అయితే ఈ ఉద్యమాలన్నీ మరుగునపడిపోయేవే కానీ అమెరికాలో గ్రేట్ డిఫ్రెషన్ రావడంతో పరిస్థితులు మారిపోయాయి.


 1920 లలో వచ్చిన Inflation వెంటనే, 1930 లలో వచ్చిన Deflation, జాతీయతా భావం, డెమొక్రసీ ల మీద ఆధారపడ్డ Wilsonian image ని దెబ్బతీసింది. అమెరికన్ కాపిటలిజంలో వచ్చిన ఈ సంక్షోభం, స్టాక్ మార్కెట్ లో 89 శాతం క్షీణత నీ, ఉత్పత్తి లో మూడవవంత తగ్గుదలనీ, వినియోగవస్తువుల ధరల్లో భారీ పతనాన్నీ, నిరుద్యోగం ఇరవైఅయిదు శాతం పైగా పెరగడాన్ని చవిచూసింది. యూరోపియన్ దేశాలన్నిట్లో ఇంత దారుణమైన ప్రభావం కనపడకపోవచ్చు, కానీ ఏ దేశము కూడా ఎంతోకొంత దెబ్బతినకుండా తప్పించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమతమ దేశీయ పరిశ్రమల చుట్టూ, ఇంపోర్ట్స్ మీద అధిక టారిఫ్ ల రక్షణ కవచం చుట్టటం ప్రారంభించాయి. అమెరికన్ స్మూట్-హాలీ టారిఫ్ బిల్ కాటన్ ఇంపొర్ట్స్ మీద రుసుముని 46 శాతానికి పెంచింది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్లోబలైజేషన్ కూలిపోయింది. 1929-1932 ల మధ్య ప్రపంచవాణిజ్యం రెండింట మూడువంతులకి తగ్గిపోయింది.

చాలా దేశాలు Debt Default, currency depreciation, protectionist tariffs, import quotas, prohibitions, import monopolies, export premia ల బాటపట్టాయి. ప్రపంచమంతా అలుముకున్న ఈ పరిస్థితులతో Nationalist-Socialist రాజ్యాల యుగం రాబోతున్నదన్నట్లుగా గోచరించింది.

అయితే అది భ్రమ మాత్రమే అని కాలం నిరూపించింది. US Federal Reserve Board అమలుపరచిన వినాశకర ఆర్థికవిధానాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ సగం కూలిపోయిందే తప్ప, పారిశ్రామిక ప్రగతికి మూలస్థంబమయిన ఇన్నోవేషన్ 1930 లలో మందగించలేదు. కొత్త ఆటొమోబైల్స్, రేడియోలు, మరియు ఇతర వినియోగవస్తువులు మార్కెట్లోకి ప్రవేశిస్తూనేవచ్చాయి. కొత్త కొత్త కంపెనీలు ఆవిర్భవిస్తూ కొత్త ప్రొడక్ట్ లని ఉత్పత్తిచేస్తూనే వచ్చాయి. DuPont (nylon), Revlon(cosmetics), Proctor&Gamble(Dreft soap powder), RCA (radio and telivision) and IBM (accounting machines).






ఇదే సమయంలో కొత్త బిజినెస్ మానేజెమెంట్ విధానాలని ఈ కంపెనీలు ప్రవేశపెట్టాయి. కన్స్యూమర్ కంపెనీలే కాదు, హాలీవుడ్ లో కూడా 1930 లలో కాపిటలిజం కిమూలస్థంభమయిన క్రియేటివిటీ వర్థిల్లుతూ వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే కాపిటలిజం లోని లోపాలు దాని మృతికి దారితీసేంత పెద్దవికాదని తెలిసొచ్చింది. దివాలకోరు మానేజ్మెంట్ విధానాలూ, తద్వారా ఉద్భవించిన అనిశ్చితి వల్ల సంభవించిన దురవస్థే తప్ప కాపిటలిజం అనే భూతం వల్ల వచ్చిన దురవస్థ కాదని అర్ధమయింది. కాని ఈ లోపు 1930 లలోని Great Depression, కనీవిని ఎరుగని దుర్భరావస్థలని తీసుకొచ్చింది. వీటికి సగం కారణం సెంట్రల్ బ్యాంకర్స్. ఆర్ధిక విధానాలని మితిమీరి సరళించడం వల్ల పెరిగిపోయిన స్టాక్ ఎక్చేంజ్ బుడగ, అది బద్దలయ్యాక అవసరానికి మించి కట్టుదిట్టం చేసిన సెంట్రల్ బ్యాంక్ విధానాల వల్ల 1929-1933 ల మధ్య 15,000 ల బ్యాంకులు దివాలా తీసాయి. దీనివల్ల డబ్బు , రుణాలు దొరకడం దుర్భలమయిపోయింది. ధరలు నేలకూలి, Deflation తాండవమాడింది. వాణిజ్యం దెబ్బతిని పెట్టుబడి నిలచిపోయింది. ఈ ఉచ్చులోంచి ఎలా బయటపడాలో ప్రభుత్వానికి అర్ధం కాని దశలో ఆ కాలం లోని ఆర్ధిక మేధావి John Keynes సూచించిన ఉపాయాలు అర్ధవంతమయినవిగా కనిపించాయి. ప్రభుత్వం రుణం తీసుకోని పబ్లిక్
వర్క్స్ చేపట్టటం, గోల్డ్ స్టాండర్డ్ ని రద్దు చేయటం తద్వారా కరెన్సీ ల మధ్య fixed exchange rates ఉండటం, ఎగుమతులని ప్రోత్సహించటం అనే విధానలని అమలుపరచటం జరిగింది. అయినప్పటికీ ఏ దేశం లోని పార్లమెంటరీ ప్రభుత్వాలు ఈ విధానాలు అమలు పరచిన తరువాత కూడా నామమాత్రమైన వృద్ది తప్ప గణనీయమైన ఆర్థికాభివృద్ది లభించలేదు. ఇదే సమయంలో నియంత్రత్వ ప్రభుత్వాలు పారిశ్రామిక సంస్కృతిని మరింత విస్తరించి , నిరుద్యోగ శాతాన్ని తగ్గించటంలో సఫలమయ్యాయి. సోషలిస్టు దేశమైన రష్యా, నేషనల్ సోషలిజం అమల్లో ఉన్న జర్మనీ, బ్రిటన్, అమెరికాల కన్నా మెరుగైన ఉపాయాలనీ, విధానాలనీ కనిపెట్టినట్లుగానే కనిపించింది. మిగతా ప్రపంచమంతా ఆర్థిక క్షీణతా, ఉత్పత్తి శాతం తరుగుదలతో సతమతవుతున్న 1929-1932 మధ్య కాలంలో, రష్యా ఒక్క దేశమే ప్రొడక్టివిటీ లో పెరుగుదలని సాధించింది. కాని స్టాలిన్ కింద, ప్రతీ టన్ను స్టీల్ ఉత్పత్తికి ఎంతమంది కార్మికులు బలయ్యారో అన్నది ఎవరూ ప్రశ్నించలేదు ( సమాధానం:19)

స్టాలిన్ పంచవర్ష ప్రణాళిక లని చూసి ప్రేరేపితుడయిన హిట్లర్ చతుర్వర్ష ప్రణాళికలని రూపొందించాడు. రెండు దేశాలు మధ్య పోటీ తీవ్రతరమయింది.

హిట్లర్, స్టాలిన్ ఇద్దరూ నేషనలిజం, సోషలిజం ల ద్వారా ఆర్థికాభివృద్దినీ, ఉద్యోగాలనీ సాధిస్తామని ప్రమాణాలు చేయటమే కాక, వాటిల్లో సఫలీకృతమయి, తమ దేశాలకి ఫలితాలు చూపించారు. 1938 లో అమెరికా, 1929 లో వచ్చిన సంక్షోభం కన్నా కేవలం 6 శాతం ఆర్ధిక వృద్దిని సాధిస్తే, అదే కాలంలో జర్మనీ 23 శాతం పెరుగుదలని సాధించింది. సోవియట్ యూనియన్ అంతకన్నా మెరుగైన ఫలితాలని సాధించింది . జర్మనీలో 1933 లో నలభైలక్షల నిరుద్యోగుల సంఖ్య, 1937 కల్లా కేవలం పదిలక్షలకి పడిపోయింది. 1939 కి అది కేవలం ఒక లక్ష కి దిగిపోయింది. ఈ రెండు దేశాలతో పోలిస్తే అమెరికా ఎంతో వెనకపడిపోయింది. 1938 లో కూడా 12.5 శాతం నిరుద్యోగం తో అమెరికా సతమతమవుతూ ఉంది. అయితే వచ్చిన సమస్యల్లా నియంత్రవ్యవస్థల్లోని దేశాల్లో ఉత్పత్తిలోనూ, ఉద్యోగశాతం లోనూ సాధించిన ప్రగతి, ప్రజల జీవన ప్రమాణాలని పెంచడంలో విఫలమయింది.

ప్రజాసమూహాలని చేరదీసి భారీ పరిశ్రమల్లోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయుధ పరిశ్రమల్లోనూ పనిచేపించటం వల్ల, ప్రజలకి ఆయాదం లభించింది కానీ షాప్స్ లో కాలం గడచిన కొద్దీ వినియోగ వస్తువులేమీ ఉండక, ఆ ఆయాదం ఖర్చయ్యి మార్కెట్లోకి సర్కులేట్ అవక, పొదుపు రూపంలోకి మారి సేవింగ్స్ అకౌంట్స్ లోకి చేరింది. ఇలా సమకూరిన నగదు వల్ల చివరికి ప్రభుత్వానికి ఫండింగ్ లభించింది.

నాజీ ప్రాపగాండా సమస్తం, ఆర్ధికంగా వర్ధిల్లుతున్న చిన్న కుటుంబాలు, వారి పిల్లలకి సమృద్దికరమయిన పోషకార
ఆహారమూ, ఫ్యాషనబుల్ దుస్తులూ, ఆటొబాన్ల మీద వారి కార్ల చిత్రాలతో నిండి ఉంటుంది. కానీ గణాంకాలు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తాయి. 1934 తర్వాత ఆయుధపరిశ్రమని వృద్ది చేయటం మీద దృష్టి పెరిగాక జర్మనీలో టెక్స్టైల్స్ ఉత్పత్తులు స్థంభించిపోయాయి, దిగుమతులు పడిపోయాయి. అతికొద్ది మంది ప్రజలకి మాత్రమే కార్లని కొనుగోలు చేయగలిగే స్థోమత కలిగింది. Third Reich ఆజమాయిషీలో ప్రతీ సంవత్సరానికీ కనీసావసరాలయిన కాఫీ బీన్స్ దొరకటం కూడా కష్టమయిపోయింది. 1938 లో జర్మనీ లో Men స్మార్ట్ గా కన్పించాలంటే వారు మిలటరీ యూనిఫామ్ ధరించాల్సిందే!. Hugo Boss తయారుచేసిన యూనిఫామ్ తో జర్మనీ మిలటరీ దుస్తులు elegance తో నిండి ఉండేవి.

కాని హిట్లర్ ఎకనామిక్ మోడల్ Hossbach Memorandum ,  వినాశనమే తప్ప వినియోగం కాదు. ఆయిధసామాగ్రిని పెంచడం మీద హిట్లర్ పెట్టిన దృష్టి, ఆయుధ పరిశ్రమల ద్వారా ఉద్యోగాభివృద్దిని సాధించిందేమో కానీ, అది జర్మనీ ని యుద్దం లో మునిగే అవకాశాలని పెంచింది. స్థూలంగా చూస్తే రెండవ ప్రపంచ యుద్దం, వెస్టర్న్ సివిలైజేషన్ లోని నాలుగు విశిష్టమయిన, విభిన్నమయిన తరగతుల మధ్య జరిగిన యుద్దం. నేషనల్ సోషలిజం, సోవియట్ కమ్యూనిజం, యూరోపియన్ ఇంపిరీయలిజం(జపాన్ అనుసరించిందిదే) , అమెరికన్ కాపిటలిజం. ప్రారంభంలో మొదటి రెండూ ఏకమయ్యి, మూడవ దానితో పోరాడినప్పుడు నాలుగవది తటస్థంగా ఉండిపోయింది.

కానీ, కీలకమయిన 1941 తర్వాత సోవియట్ యూనియన్ మీద నాజీల దాడి, అమెరికా మీద జపాన్ దాడి జరిగినప్పుడు, పరిస్థితి మారింది. Axis Powers గా పిలవబడిన జర్మనీ, ఇటలీ, జపాన్ లతో ఉన్న కూటమి, Big-Three అయిన బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్ లతోనూ, వాటితో నిలచిన మిగతా దేశాలతోనూ తలపడ్డాయి. దాదాపు ప్రతీ మనిషి యూనిఫామ్ లోనే ఉన్నట్లుగా గోచరించింది. పైనున్న ఆరు పెద్ద మిలటరీల సైన్యం సంఖ్యే నాలుగున్నర కోట్లకి చేరుకుంది. ప్రపంచ యుద్దంలో పాల్గొన్న దేశాలన్నీ కలిపితే ఆ సంఖ్య పదికోట్లకి పైమాటే.Soviet Union, Germany, America, Britain, Japan లలో GI(government-issue) clothes ధరించని యువకులు మైనారిటీ సంఖ్యలోనే ఉండేవారు. దీనివల్ల ప్రపంచంలోని చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి మిలటరీ యూనిఫామ్స్ వస్త్రాన్ని తయారుచేసే ఆర్డర్స్ ఇవ్వబడ్డాయి.

రెండవ ప్రపంచ యుద్దం లో బ్రిటీష్ వారు జర్మనీ ఇంటెలిజెన్స్ ని డీకోడ్ చేయటం, రష్యన్స్ జర్మన్ సైనికులని తుదముట్టించటం, అమెరికన్స్ జర్మన్ నగరాల మీద బాంబులతో దాడిచేయటం ద్వారా, జర్మనీ మీద గెలుపు సాధ్యమయింది.
**********

అమెరికా-సోవియట్ యూనియన్ ల మధ్య Cold-war ఎప్పటికైనా వేడెక్కితే బహుశా సోవియట్ యూనియన్ ఆ యుద్దాన్ని నెగ్గేది. భారీ యుద్ద నష్టాల్ని తట్టుకొనే పొలిటీకల్ సిస్టమ్ సోవియట్ లోఉండటమే కాక, సోవియట్ ఆయుధాలని భారీ ఎత్తున మాస్ - ప్రొడక్షన్ లో ఉత్పత్తి చేయగలిగిన ఎకనామిక్-మానుఫాక్చరింగ్ వ్యవస్థని కూడా కలిగి ఉండింది. 1974 కల్లా సోవియట్ యూనియన్ లో ఉన్నన్ని స్ట్రాటజిక్ యుద్ద బాంబులు, బాలిస్టిక్ మిసైల్స్ అమెరికా వద్ద లేవు. సైంటిఫికల్ గా కూడా అమెరికా కన్నా చాలా కొద్దిదూరంలోనే వెనకబడి ఉన్నారు. అదే కాక, ఐడియాలజికల్ గా సోవియట్ ప్రచారం చేస్తున్న కమ్యూనిస్ట్ భావప్రసారం, ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజలని ఆకర్షిస్తూ సోవియట్ యూనియన్ ఒక శక్తివంతమైన ఐడియాలజీకి అధినేత అయింది. నిజానికి Third-World దేశాల యొక్క యుద్దంలో సోవియట్ యూనియన్ గెలుపొందిందని చెప్పొచ్చు. సాంఘికతరగతుల మధ్య అంతరాలు పేట్రేగిపోయిన సమాజలలో కమ్యూనిజం నిలపడగలిగే అవకాశాలు పుష్కలంగా కన్పించాయి.

అయినప్పటికీ, కోల్డ్-వార్ ని, చివరికి గన్స్, బాంబ్స్ కన్నా బటర్, బాల్ గేమ్స్ ఏ వ్యవస్థ ఎక్కువివ్వగలగదన్న విషయం ప్రభావితం చేసింది.

ఒక చిన్న ఉదాహరణ తో ఇది ఎంత పెద్దున మార్పు తీసుకొచ్చిందో చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు మనుషులు ధరించే బట్టలని , వారివారి కొలతలు తీసుకోని టైలర్స్ కుట్టేవాళ్ళు. కాని లక్షలకొద్దీ మిలటరీ యూనిఫామ్స్ తయారీ చేయాల్సి రావటం వల్ల స్టాండర్డ్ సైజులని తయారు చేయాల్సిన అవసరం కల్పించింది. నిజానికి మనుషుల సైజెస్ మరీ అంత భారీ తేడాలతో ఉండవు. మనిషి పొడవూ, వెడల్పూ Normal Distribution రేఖ మీద Median కి చుట్టుపక్కలే ఉంటాయి. 1939 - 1940 మధ్యలో 15000 అమెరికన్ వుమెన్ USDA National Bureau of Home Economics నిర్వహించిన సర్వే లో పాల్గొన్నారు. ప్రతీ వాలంటీర్ దగ్గర్నుంచీ 59 measurements తీసుకోని ఆ రిజల్ట్స్ Women's Measurements for Garment and Pattern Construction లో
పబ్లిష్ చేయడం జరిగింది. ఇలా సేకరించి తయారు చేసిన స్టాండర్డ్ సైజుల వల్ల మిలటరీ యూనిఫామ్సే కాక, సాధారణ పౌరుల దుస్తులని కూడా mass-production ద్వారా ఉత్పత్తి చేసి వాటిని ready-to-wear దుస్తుల లాగా మార్కెట్ చేసే వీలు కలిగింది. కొద్ది దశాబ్ధాలలోనే మనుషుల కొలతలు తీసుకోని దుస్తులు టైలరింగ్ చేయటం కేవలం ధనికవర్గాలకి మాత్రమే పరిమితమయింది.

యుద్దం తరువాత అమెరికాలో వినియోగ సంస్కృతి పెరిగి, దుస్తుల ద్వారా కనిపించే సమాజంలోని తరగతుల మధ్య ఆర్ధిక అంతరాలని తగ్గించింది. యుద్దం నుంచి తిరిగివచ్చిన సైనికులకి మంచి విద్యనందించే అవకాశాలతో పాటూ, నగర శివార్లలో పెద్ద ఎత్తున మొదలెట్టిన ఇళ్ల నిర్మాణం వల్ల జీవననాణ్యత గణనీయంగా పెరిగింది. ఇళ్ళనీ, కార్లనీ, రిఫ్రిజిరేటర్స్ , టెలివిజన్స్, వాషింగ్ మషిన్స్ ఇలా వినియోగవస్తువులన్నిటినీ కూడా క్రెడిట్ మీద సమకూర్చోవటం మొదలుపెట్టారు.

  • 1930 లో అమెరికాని కమ్మేసి, క్రుంగదీసిన, చరిత్రలోనే అతిపెద్ద depression కాలంలో కూడా సగానికి పైగా అమెరికన్స్ ఎలక్ట్రిసిటీ, ఆటోమొబైల్, రెఫ్రిజిరేటర్స్ ని కలిగి ఉన్నారంటే వినియోగసంస్కృతి ఎంత పెద్ద ఎత్తున విప్లవానికి దారితీసిందో అర్ధం చేసుకోవచ్చు.1960 కల్లా 80 శాతం అమెరికన్ ప్రజలు వాటన్నిటితో పాటు టెలిఫోన్ కూడా సమకూర్చుకున్నారు.
  • వాషింగ్ మషీన్ 1926 లో depression కన్నా ముందే కనిపెట్టారు, కేవలం 39 సంవత్సారలలో 1965 కల్లా సగం జనాభా కనీసం ఒక వాషింగ్ మషిన్ ని సొంతం చేసుకున్నారు.
  • ఎయిర్ కండీషనింగ్ 1945 లో కనిపెట్టబడింది. 29 సంవత్సరాలలో 1974 కల్లా 50 శాతం ప్రజలకి అది లభ్యమయింది. Clothes Dryer 1949 లో వచ్చింది, 23 ఏళ్ళలో 1972 కల్లా సగం జనాభా ఇళ్ళల్లో చేరింది.
  • గమ్మత్తేమిటంటే dish washer 1949 లో వచ్చినప్పటికీ, మిగతావాటికన్నా నెమ్మదిగా అమెరికన్స్ ఇళ్ళల్లో చేరిన వస్తువిదే. 1997 కి కానీ 50 శాతం ఇళ్ళ మార్కుని దాటలేదు.
  • కలర్ టెలివిజన్ అన్ని రికార్డులనీ బ్రేక్ చేసింది. 1959 లో కనిపెట్టబడినది, కేవలం 14 ఏళ్ళలో 1973 కల్లా దేశం లోని ప్రతి రెండవ ఇంటిలోనూ చేరింది.
  • 1989 లో కోల్డ్ - వార్ అంతమయ్యేప్పటీకల్లా మూడింట రెండు వంతుల జనభా పైవన్నీ కలిగి ఉన్నారు.
  • అవే కాదు. మైక్రో-ఓవెన్( 1972 లో కనిపెట్టబడింది), వీడియో-కాసెట్-రికార్డర్ ( 1977) లని కూడా కలిగి ఉన్నారు. 15 శాతం ప్రజలు అప్పటికే పర్సనల్ - కంప్యూటర్ ( 1978) ని కూడా స్వంతం చేసుకున్నారు. మొబైల్ ఫోన్స్ సైతం రెండు శాతం ప్రజల వద్ద చేరింది. ఇరవై శతాబ్ధం చివరికల్లా ఇవి కూడా సగం జనాభా మార్కుని దాటేసాయి. అలాగే ఇంటర్నెట్ కూడా










పైవన్నీ సాధించుకోగల అవకాశం ఉన్న సమాజలలో సోవియట్ యూనియన్ మోడల్ కమ్యూనిజం పట్ల ఆకర్షణ తొందరగా తగ్గిపోయింది. వెస్టర్న్ యూరప్ , డిప్రెషన్ కన్నా ముందున్న వృద్ది రేటు తిరిగి సాధించటం మొదలుపెట్టింది. ఫాసిస్ట్ కాలం యూరప్ లో యూనియన్ల ని బలహీనపరచింది. లేబర్ రిలేషన్స్ లో గొడవలు తగ్గాయి. సమ్మెల కాలం తగ్గింది (కానీ దాంట్లో పాల్గొన్న వారి సంఖ్య పెరిగింది). బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లలో ఇండస్ట్రియల్ యాక్షన్ పెరిగింది.

Corporate collective bargaining, Economic Planning, Keynesian demand management and Welfare states ఇవన్నీ కూడా వెస్టర్న్ యూరప్ , కమ్యూనిజం భూతం కి వ్యతిరేకంగా వాక్సినేషన్స్ లా పనిచేసాయి. సోవియట్ యూనియన్ లోని నియంతృత్వ పాలసీలూ, ఖశ్చితమయిన సర్వీస్ డిమాండ్లు, భారీ పరిశ్రమల మీద నిరంతర ప్రాముఖ్యత, సామూహిక అగ్రికల్చర్, పార్టీ లో ఎగువన చేరిన 'The New Class Party Hacks" (as said by Milovan Djilas) ఇవన్నీ కలిపి బెర్లిన్ (1953) బుడపెస్ట్ (1956) లలో తిరుగుబాట్లని తీసుకొచ్చింది.

నిజమైన ఎకనామిక్ అద్భుతాలు ఏషియా లో జరిగాయి. జపాన్ ఒక్కటే కాదు, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్, థాయ్ లాండ్ లన్నీ కూడా నిలకడగా ఉండే ఆర్ధికాభివృద్దిని సాథించడమే కాక, కొన్ని కేసులలో రెండవప్రపంచ యుద్దం కన్నా ముందుకన్నా మెరుగైన అభివృద్దిని సాధించాయి. 1950 , 1990 ల మధ్య గ్లోబల్ జిడిపి లో ఏషియా శాతం 14 నుంచి 34 కి చేరుకుంది.

1970 , 1980 లలో ఏషియా లో అభివృద్ది పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో ఆర్ధికాభివృద్ది కుంటుపడింది. ముఖ్యంగా సౌత్-కొరియా ఆర్ధిక ప్రగతి కొనియాడతగింది. 1960 లో Ghana కన్నా తక్కువ per-capita income తో ఉన్న సౌత్-కొరియా , 1996 లో Organization of Economic Co-opeartion and Development(rich-countries' club) లో చేరే స్థాయికి ఎదిగింది. 1973, 1990 ల మధ్య మొత్తం ప్రపంచం లోనే అత్యంత వేగంగా ఆర్ధికాభివృద్దిని సాధించిన దేశమది.

తూర్పు ఏషియా సాధించిన ఆర్ధిక ప్రగతి అనే అధ్బుతం, కోల్డ్-వార్ కి కీలకమయినది. వియత్నాంలో అమెరికా మిలటరీ ఇంటర్వెన్షన్ విఫలమయిందన్న సంగతి జగద్విదితమే. కొరియా నమూనా కాకుండా వియత్నాం నమూనాలో ఆర్ధిక ప్రగతి సిద్దించినట్లయితే, ఫలితం ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. మరి కొరియా లాంటి దేశాల్లో తేడా ఎందుకొచ్చింది? మొదటగా, యునైటెడ్-స్టేట్స్ మరియు మిత్రదేశాలు వారు మిలటరీ ఇంటర్వెన్షన్ చేసిన దేశాలలోని ప్రభుత్వాలకి సెక్యూరిటి గ్యారంటీస్ ని సమకూర్చారు. రెండవకారణం, యుద్దం తరువాత చేసిన సంస్కరణలు నిలకడయిన ఆర్ధికప్రగతి సాధించే దిశగా వ్యవస్థలు నిర్మించబడ్డాయి. దీనికి సరైన ఉదాహరణ: జపాన్ లో చేపట్టబడిన భూసంస్కరణ. 1946 లో జరిగిన land reform ఫ్యూడలిజం అవశేషాలు లేకుండా నిర్మూలించి, ప్రాపర్టీ-ఓనర్షిప్ ని గణనీయంగా ప్రజలకి చేరవేసింది(Meiji reformers ఈ సంస్కరణలని వ్యతిరేకించారు). మూడవ కారణం: ఓపెన్ గ్లోబల్ ఎకనమిక్ పాలసీలకి అమెరికా వెన్నంటి నిలపడటం, ఏషియన్ దేశాలకి కలసి వచ్చింది. గవర్నమెంట్ పాలసీల వల్ల సేవింగ్స్ అన్నీ ఎగుమతి పరిశ్రమల ఉత్పత్తుల్లోకి వెళ్ళిపోవటంతో మొదటగా బాగుపడింది టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ. ఈస్ట్ ఏషియన్ దేశాల్లోని టెక్స్ టైల్స్ ఇండస్ట్రీల ఎగుమతులకి అమెరికాలోని వినియోగ సమాజం ఎనలేని డిమాండ్ ని నిలబెట్టడం ద్వారా , ఆ పరిశ్రమలకి మార్కెట్ ని సమకూర్చటమే కాక, కన్స్యూమర్ సొసైటీ కి ఒక నమూనా ని నిర్మించిపెట్టింది.

అయితే గమనించాల్సిన విషయమేమిటంటే, జపాన్ తప్ప మిగతా ఏ "ఏషియన్ టైగర్స్ " కూడా డెమొక్రటిక్ వ్యవస్థల ద్వారా పైన ఉదహరించిన ఇండస్ట్రియలైజేషన్ ని సాధించలేదు. Generals Chung-hee(1960-79), Chun Doo-hwan(1980-87) లు సౌత్-కొరియా ని ఇండస్ట్రియలైజేషన్ మార్గం ద్వారా లాక్కొచ్చారు. Singapore లోని Lee Kuan Yew, Indonesia లోని Suharto లు Absolutists. Taiwan, Japan లలో Monopoly parties రాజ్యమేలాయి ఆ కాలంలో. హాంగ్-కాంగ్ బ్రిటన్ పాలనలో ఉండేది. అయితే ప్రతీ కేసులో కూడా డెమొక్రటైజేషన్ మొదలుపెట్టిన కొద్దికాలం తరవాతే ఆర్ధికవిజయాలు సంభవించాయన్న విషయం చరిత్రలో గమనించవచ్చును. అమెరికన్ కన్స్యూమర్ సొసైటీ మీద ఆధారపడిన తూర్పు ఏషియా, సోవియట్ యూనియన్ చట్రం లోంచి తప్పించుకోని తన మార్గం ద్వారా ప్రయాణించడం మొదలుపెట్టింది. తూర్పు ఏషియాతో పోలిస్తే అమెరికా ఇంటర్వెన్షన్ తక్కువున్న Iran, Guatemala, Congo, Brazil, Dominican Republic and Chile లలో ఆర్ధికాభివృద్ది ఎలా ఉందో చరిత్రే చెపుతుంది. వీటన్నిటికన్నా దయనీయమైన గాధలు సోవియట్ యూనియన్ ప్రాబల్యం ఎక్కువున్న క్యూబా, వియత్నాం, అంగోలా, ఇధియోపియా లవి.

Mass-Consumerism తీసుకొచ్చిన standardization , వ్యక్తి కేంద్ర భావనతో అనుసంధానం చేయడమనేది వెస్టర్న్ సివిలైజేషన్ సాధించిన అతి గొప్ప ట్రిక్. దానికి కిటుకు 'వెస్టర్న్ " అనే పదం లోనే దాగుంది. కలర్ టెలివిజన్ నీ, మైక్రోఓవెన్ ని కనిపెట్టకపోయినందుకు సోవియట్ యూనియన్ ని మనం క్షమించగలమేమో కానీ workers-trousers గా పేరొందిన జీన్స్ ని, వర్కర్స్ పారడైజ్ గా పేరొందిన సోవియట్ యూనియన్ ఎందుకు కనిపెట్టలేకపోయిందన్నది అతిపెద్ద మిస్టరీ.

THE JEANS GENIE

America లో wild west లో జీన్స్ వస్త్రావిర్భావం జరిగింది. మైన్స్ లో పనిచేసే కార్మికులకీ, కౌబాయ్స్ కీ ఎల్లవేళలా సౌకర్యంగా ఉండేందుకు ప్రాణం పోసుకున్న జీన్స్ , 1970 కల్లా ప్రపంచమంతా పాపులర్ అవడమే కాక, సోవియట్ యూనియన్ వ్యవస్థలో లోపాలకి ఉదాహరణగా నిలిచింది.

ఆటమిక్ బాంబ్ ని నకలు చేయగలిగిన సోవియట్ యూనియన్, సాధారణమైన Levi 501 ల నమూనాలని ఎందుకు స్వంతం చేసుకోలేకపోయింది?

1873 లో మైనర్స్ వేసుకునే ఓవరాల్స్ జేబులని మరింత గట్టిపరచేందుకు వాటికి కాపర్ రివెట్స్ ని జోడించడంతో , మనకీ రోజున తెలిసిన జీన్స్ కి అంకురార్పణ జరిగింది. దానికి ఉపయోగించిన వస్త్రం పేరు "డెనిమ్ (denim)".






Denim మొదటగా Manchester, New Hampshire లో మొదటి సారిగా ఉత్పత్తి చేసారు. అందరికీ సుపరిచితమైన జీన్స్ లెదర్ లేబుల్(Levi వస్త్రాన్ని చింపేద్దామని రెండుగుర్రాలు చెరోవైపు లాగుతూ, విఫలమవుతున్న బొమ్మ) మొట్టమొదటగా San Francisco లోని Levi ఫ్యాక్టరీలో వాడటం జరిగింది. కింద ఉండే red tab 1936 లో వచ్చి చేరింది. బ్లూ జీన్స్ ని తయారు చేయటం చౌక, శుభ్రం చేయటం సులభం, పాడు చేయటం కష్టం, తొడుక్కోవటం సౌకర్యం. కాని బ్రిటన్ లో వాడే ఓవరాల్స్ (వార్ సమయంలో చర్చిల్ ఇవే వేసుకునేవాడు), ఇండియా నుంచి వచ్చే Dongri వస్త్రం తో తయారుచేయబడిన dungarees లకి కూడా బ్లూ జీన్స్ లకి ఉండే లాభాలే ఉన్నాయి. మరి బ్లూజీన్స్ ప్రపంచ ఫ్యాషన్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది?
దానికి సమాధానం ఇరవై శతాబ్ధం లోని అత్యంత విజయవంతమైన రెండు ఇండస్ట్రీస్ అయిన మూవీస్, మార్కెటింగ్ లలో దాగుంది.


  •  Stagecoach (1939) లో John Wayne వేసుకున్న plain jeans
  • The Wild One( 1953) లో Marlon Brando వేసుకున్న jeans
  • Rebel without a Cause (1955) లో James Dean's red (jacket), white(t-shirt), blue (jeans) వేసుకున్న outfits
  • Jailhouse Rock (1957) లో Elvis Presley వేసుకున్న black jeans
పై వాటికన్నీ తోడుగా Leo Burnett(1954) ఆద్వర్యంలో మార్కెటింగ్ టీమ్ , సిగరెట్ తాగుతూ, డెనిమ్ వస్త్రాలు వేసుకున్న 'Marlboro Man" ని సృష్టించాయి. మార్లిన్ మన్రో కూడా తోడయింది. తన మొట్టమొదటి మోడలింగ్ షూట్ , డెనిమ్ వస్త్రాల్లో జరిగింది. యుక్తవయసులో చేసే ధిక్కారపూరిత ప్రవర్తనకీ, బ్లూజీన్స్ కి దగ్గరి సంబంధం ఉండేలా ఇమేజ్ సృష్టించబడింది. 1830 ల లోనే, క్రిస్టియానిటీలోని ఒక వర్గం mormons కి నాయకుడయిన Brigham Young బ్లూజీన్స్ ని, అనామోదిత శృంగారానికి సింబల్స్ గా అభివర్ణించి వాటిని తిరస్కరించాల్సిందిగా పిలుపినిచ్చాడు. 1944 లో Life Magazine, జీన్స్ లో ఉన్న Wellesley College లోని ఇద్దరు యువతుల ఫోటోస్ ప్రచురించి పెద్ద దుమారమే లేపింది. Levi competitor అయిన Lee zippers ని మార్కెట్ లో ప్రవేశించేప్పటికల్లా , Levi Jeans ఒక శృంగార ప్రేరేపిత ఇమేజ్ ని సంపాదించుకుంది.

సమాజం లోని కింది వర్గాలైన ranch-hands నుంచీ, జైళ్ళల్లో ఉండే నేరస్తుల యూనిఫామ్స్ దగ్గర్నుంచీ మొదలైన Levi Jeans ప్రయాణం, పై వర్గాలవైపు సాగింది. కొద్ది కాలంలోనే డిఫెన్స్ వర్గాల్లో యుద్దసమయంలో తప్పనిసరయిన యూనిఫాం గా, యుద్దానంతర కాలంలో బైకర్స్ గ్యాంగ్స్ ప్రీతిపాత్రంగా మారి, మరికొద్ది కాలానికి వెస్ట్ కోస్ట్ కీ, Ivy League college students కీ మక్కువయి, 1960 ల కల్లా రచయితల, మ్యూజిషియన్స్, పాప్ సింగర్స్ ల వర్గాలకి ఎదిగి, చివరకి అమెరికన్ ప్రసిడెంట్ నిక్సన్ పబ్లిక్ గా Jeans ని ధరించడంతో తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. Jeans ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. 1948 లో కంపనీ 40 లక్షల జీన్స్ ని అమ్మింది. 1959 కల్లా కోటికి చేరింది. 1964 నుంచి, 1975 మధ్యలో పదింతలయి, రెవెన్యూ $1 Billion Dollars కి చేరుకుంది. కేవలం నాలుగు సంవత్సరాలలో 1979 కల్లా అమ్మకాలు రెండింతలయ్యాయి.
అమెరికన్ వస్త్రాలయిన జీన్స్, అమెరికాయేతర దేశాలలోని ప్రజల్ని కూడా బాగా ఆకర్షించాయి. ప్రపంచవ్యాప్తంగా యువత, బోరింగ్ గా ఉండే సనాతన వస్త్రాల మీద తిరుగుబాటుగా జీన్స్ ని పరిగణించారు. "The World is Blue Jeans Country Now" అని Life Magazine 1972 లో తీర్మానించింది. జీన్స్ లాగే ఊర్ధ్వముఖాన ప్రయాణించిన మరొక ప్రొడక్ట్ కోకా-కోలా. జీన్స్ భూతం సీసాలోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని ఆక్రమించింది. ఆ సీసా కోకా-కోలా ఆకారాన్ని ధరించింది. 1929 లలోనే 78 దేశాలలోని అమ్మకాలతో Coca-Cola 'The International Beverage" గా తనని తాను అభివర్ణించుకునేదంటే ప్రపంచవ్యాప్తంగా వీటి విజయం పరిధిని అంచనా వేసుకోవచ్చు. చిట్టచివరకి 1973 లో వియత్నాం మీద అమెరికా యుద్దం చేస్తున్న కాలంలో కూడా Laos లో కోకా-కోలా తన ప్లాంట్ ని నిర్మించుకోగలిగినంత పాపులారిటీని సంపాదించుకుంది. కానీ, జీన్స్ కీ, కోకా-కోలాకి సోవియట్ యూనియన్ తూర్పు యూరప్ మీదుగా జార్చిన ఐరన్ - కర్టెన్ కన్నా మించిన అవరోధమింకోటి లేదు. ప్రపంచవ్యాప్తంగా యువతలాగే, సోవియట్ యూనియన్ లోని యువత కూడా జీన్స్ కావాలనుకుంది. కార్మిక వర్గ స్వర్గంగా ప్రచారం చేసుకునే సోవియట్ యూనియన్ , వారికి ఎంతో సౌకర్యంగా ఉండే జీన్స్ ని నకలు చేయటంలో ఎందుకు విఫలమయిందో అర్ధం కాని విషయం. నిజానికి సోవియట్ యూనియన్ , అమెరికా ఉత్పత్తులకి ధీటుగా, పోటీగా తన ప్రొడక్ట్ లని అభివృద్ది చేయాలని భీష్మించుకున్న దేశమే. నిక్సన్ తో డిబేట్ లో , కృశ్చేవ్ ఆ విషయం బహిరంగంగానే వెల్లడించాడు. అయినప్పటికీ కమ్యూనిస్ట్ బ్లాక్ బ్లూజీన్స్ కి ఉన్న అప్పీల్ ని, ఆకర్షణనీ అంచనా వేయటంలో విఫలమయ్యాయి.

బ్లూ జీన్స్, పాప్-మ్యూజిక్ వెస్ట్రన్ ప్రపంచం సింబల్స్ గా ఆధిపత్యం సాగించాయి. అమెరికా సోవియట్ మీద న్యూక్లియర్ బాంబ్స్ ని ప్రయోగించలేదేమో కానీ, బ్లూ జీన్స్ ని మాత్రం వదిలింది. 1959 లో మొదటిసారిగా, 1967 లో మరోసారి Moscow లో Levi తన Jeans ని ప్రదర్శించింది.

1960s లో ఐరన్ - కర్టెన్ వెనకాల ఉన్న దేశాల్లోని యువత, బోరింగ్ సబ్-బాయ్ స్కౌట్స్ యూనిఫామ్ ని ధరించటం కన్నా , బ్లూజీన్స్ ధరించాలని అర్రులు చాచారు. East German student Stefan Wolle తన కాలంలోని తోటియువత వాటికోసం ఎలా పాకులాడిందీ, వెస్ట్ లో ఉన్న బంధువుల ద్వారా దొంగచాటుగా తెప్పించుకోని ధరించి టీచర్స్, పెద్దల ఆగ్రహానికెలా గురయ్యిందో రాసుకున్నాడు. ఈ కోరిక ఎంత వరకీ వెళ్ళిందంటే సోవియట్ యూనియన్ 'Jeans Crimes " (జీన్స్ సాధించటం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా, చట్టనియమాల్ని ఉల్లంఘించటం) అనే ఒక చట్టాన్ని రూపొందించింది. 1986 లో, Che Guevara మిత్రుడూ, ప్రెంచి వామపక్ష ఫిలసాఫర్ అయిన Regis Debray ఇలా రాసుకున్నాడు. "There is more power in rock music, videos, blue jeans, fast food, news networks and TV satellites than in the entire Red Army".


1980 ల కల్లా అంతమాత్రం స్పష్టమయింది, కానీ 1968 లో పరిస్థితి వేరే.

1968 ఎన్నో విధాలుగా విప్లవాల సంవత్సరం. పారిస్ నుంచి ప్రేగ్ వరకీ, బెర్లిన్ నుంచి బర్కిలీ , బీజింగ్ ల వరకీ.

కోల్డ్ -వార్ కి ఆటంకాలు కలిగించిన ఈ విప్లవాలన్నిటిలోనూ కామన్ గా ఉన్న అంశం "యువత". ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో యువత శాతం గణనీయంగా ఉన్న సంవత్సరం.

1928 లో మొత్తం జనాభాలో ఒక్క శాతమున్న యూనివర్సిటీ స్టూడెంట్స్, 1968 కల్లా మూడు శాతానికి చేరుకున్నారు. ఈ కాలంలోని యువత తిరుగుబాటు ధోరణిని అలవాటు చేసుకున్నారు.



1968 లో:
  • . French students పారిస్ యూనివర్సిటీలో ఫాకల్టీని ముట్టివేయటంతో ఆరంభమయిన అలజడులు, అదే సంవత్సరం మే కల్లా పదుల వేల సంఖ్యలో విద్యార్థులు పోలీస్ బలగాలతో తలపడ్డారు.


  • . బలహీనమయిన ప్రభుత్వాన్ని గమనించి అందివచ్చిన అవకాశమని, అధిక వేతనాల కోసం దేశమంతా ట్రేడ్ యూనియన్స్ సమ్మెలు మొదలెట్టాయి.
  • యూనివర్సీటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ , ఫ్రీ యూనివర్సిటీ, బెర్లిన్ లలో కూడా . ఇలాంటి దృశ్యాలకు తెర లేచింది. చివరకి హార్వర్డ్ లో సైతం స్టూడెంట్ ఫర్ డెమొక్రటిక్ సొసైటీ సభ్యులు , యూనివర్సిటీ ప్రసిడెంట్ ఇంటిని ఆక్రమించారు. అదే సమయంలో మెంబర్స్ ఆఫ్ వర్కర్-స్టూడెంట్ సమితి సభ్యులు యూనివర్సిటీ హాల్ ని ముట్టడించి యూనివర్సిటీ డీన్ ని తరిమేసి, తాత్కాలికంగా యూనివర్సిటీ హాల్ కి చెగువేరా నామకరణం చేసారు.
అమెరికా వియత్నాం మీద సాగిస్తున్న యుద్దం, అమెరికా ఓడిపోతున్న ఆ యుద్దంలో జరిగిన అమెరికా భారీ ప్రాణనష్టం, ఆ కాంపస్ తిరుగుబాటుకి కారణాలు. 1968 యువత, race equality కోసం సాగుతున్న అమెరికన్ సివిల్ హక్కుల ఉద్యమానికి కూడా చేయూతనిచ్చింది. కానీ, 1968 లో జరుగుతున్న ఈ ఉద్యమాలలో సాహిత్యం అంతా మార్క్సిస్ట్ భాషతో నిండుకున్నది. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఘర్షణకీ, ఇజ్రాయిల్ నుంచి ఇండో-చైనా వరకీ జరుగుతున్న సంఘర్షణలని anti-imperialist struggle గా ముద్రవేయడం జరిగింది.

సిద్దాంతాలని రుద్దే student leaders అయిన Cohn-Bendit , Rudi Dutschke ల లక్ష్యం, కాపిటలిజం అంతర్గత కేంద్రాల్లోకి చొచ్చుకొనిపోవటం. ప్రతి కాపిటలిస్టుని ఉరి తీసేంతవరకీ మానవజాతి సంతోషంగా ఉండలేదని enrages ప్రకటించాడు. anarchists అయిన Situationists అసలు Labour నే నిర్మూలించాలనుకున్నారు. తమ స్టూడెంట్ సపోర్టర్స్ కి Ne travailez, jamais - Never work అని పిలుపినిచ్చారు. కానీ వీరు డిమాండ్ చేసిన unlimited access to female dormitories, "unbutton your mind as often as your fly " అన్న పిలుపు వారి విప్లవరంకెల అసలు ఉద్దేశాలకి అద్దం పట్టింది. అప్పటివరకీ ఎక్స్ పోజింగ్ బట్టల మీద ఉన్న వ్యతిరేకత భావాన్ని బద్దలుకొట్టి, వివిధ రకాలైన ఎక్స్ పోజింగ్ వస్త్రధారణ కోసం ప్రయత్నించమని విద్యార్ధినులని ప్రోత్సహించారు. ఒక ఆకారం లేని పైజామాలు ధరించే Mao Red guard నుంచి, Hippies ధరించిన బెల్-బాటమ్స్ వరకీ, మిని-స్కర్ట్స్, బికినీస్ ల వస్త్రధారణ విప్లవాలతో 1968 నిండిపోయింది.

గమ్మత్తేమిటంటే వియత్నాం లో అమెరికన్ ఇంపిరీయలిజమ్ ని తూర్పారబట్టిన 1968 యువత, అమెరికన్ పాప్ కల్చర్ కి ప్రతీకలయిన బ్లూ-జీన్స్, మ్యూజిక్ లకి addicts అయిపోయారు. నడుం కిందకి జారి ఉన్న జీన్స్ తిరుగుబాటు యువత యూనిఫామ్ అయ్యింది. రికార్డింగ్ కంపనీస్ Rolling Stone-'Street Fighting Man', Beatles-'Revolution' లాంటి పాటల్ని విడుదలచేస్తూనే వచ్చాయి. రివల్యూషన్ లో పాల్గొంటున్న French Situationists మెటీరియలిజం, అడ్వర్టైజింగ్ కల్చర్ ని విమర్శించవచ్చు గాక, కానీ కాపిటలిజం అంతుకోసం పోరాడుతున్న వర్గాలు, అదే కాపిటలిజం వ్యవస్థల ద్వారా తాము పొందుతున్న హక్కులని తక్కువ అంచనా వేసారు. ఈ Long-hair youth ని ఈసడించుకున్న పోలీసులు అడపాదడపాగా జరిపిన లాఠీ-చార్జ్ లు తప్ప, వెస్టర్న్ ప్రపంచంలో ఈ యువత ఉద్యమాల స్వేచ్చాహక్కులకి ప్రభుత్వాలు ఆటంకం చెప్పలేదు.

పారిస్ తరహాలోనే, Prague లో కూడా యూనివర్సిటీలు ఘర్షణజ్వాలల తొలికేంద్రాలయ్యాయి. Prague దేశంలో ఏప్రిల్ 1968 లో Alexander Dubcek , ఆర్ధిక, రాజకీయ స్వేచ్చావాదానికి Action Programme అనే కార్యాచరణ పథకంతో స్వాగతం పలికాడు. కానీ సోవియట్ యూనియన్, ప్రేగ్ లో చిగురొడుతున్న మూలాలని తనకి ముందు రాబోయే అపాయంగా తలచింది. 21st August 1968 న పొద్దున్న నాలుగింటికి చెకోస్లేవియా కమ్యూనిస్ట్ భవనాన్ని సోవియట్ యూనియన్ యుద్ద టాంకులు ముట్టడించాయి. తొమ్మిదింటికి Alexander Dubcek సోవియట్ యూనియన్ కి తీసుకెళ్ళబడ్డాడు. (చివరకి అతను ప్రాణాలతోనే తిరిగి వస్తాడు). Wenceslass square వద్ద రోజూ చెకోస్లేవియా ప్రజలు గుమికూడి ఆందోళనలు చేయడం నిత్యమైపోయింది. Jan Palach అనే విద్యార్థి తనకి నిప్పంటించుకుంటాడు. అదే కాలంలో పారిస్ లో విద్యార్ధుల ఆందోళనలు పోలీస్ మీదకి మండుతున్న కాక్-టెయిల్స్ విసరడం వరకీ చేరుకున్నాయి. West లో విద్యార్థులు మార్క్సిస్ట్ పదజాలాన్ని వల్లెవేయటం ఆరంభించారు, కానీ వారి నిజమైన లక్ష్యం ఫ్రీడం కాదు, ఫ్రీ-లవ్.

ఇదే సమయంలో ఐరన్-కర్టెన్ కావాల పరిస్థితి గంభీరంగా ఉంది. అక్కడ సమస్య ఫ్రీ-లవ్ కాదు, కనీస ఫ్రీడం సంపాదించుకోవడమే ముందున్న లక్ష్యం. 1968 తర్వాత వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం, చెకోస్లేవియా రాక్ మ్యూజిషియన్స్ అందరికీ మార్క్సిజమ్-లెనినిజం మీద రాత పరీక్ష నిర్వహించింది. ఇది మింగుడుపడని Plastic People of the Universe అనే ఒక బ్యాండ్ 100 Points అనే ఒక ఆల్బం ద్వారా "They are afraid of freedom/They are afraid of democracy/They are afraid of Human RIghts charter, So why the hell we are afraid of them " అన్న విమర్శబాణాల్ని ఎక్కుపెట్టింది. దీని ఫలితం ఊహించినట్ళే జరిగింది. 1970 లో వారి ప్రొఫెషనల్ లైసెన్సెలు రద్దు చేయబడ్డాయి. 1976 లో బాండ్ లీడర్ తో సహా, అందర్నీ అరెస్ట్ చేయటం జరిగింది. తరువాత జరిగిన విచారణలో పద్దెనిమిది నెలల కారాగారశిక్ష విధించటం కూడా జరిగింది. ఈ విచారణ తత్ఫలితాల్లోంచే Chapter 77 అనే ఒక అసమ్మతి గ్రూప్ మొదలయి , దాని నాయకుడు, నాటకరచయితా అయిన Vaclav Havel , చెకొస్లేవియా కి భవిష్యత్తు ప్రసిడెంట్ అవుతాడు. రాక్ మ్యూజిక్ Prague లో 1970s లో పొలిటికల్ అయినంతగా, బహుశా చరిత్రలో మరెప్పుడూ, ఎక్కడా అవలేదేమో!?

మరి చెకొస్లేవియా విద్యార్థులకి వారు కోరుకున్న రాక్ మ్యూజిక్, జీన్స్ లని , కోరుకున్నంతగా లభ్యమయ్యే అవకాశాన్నివ్వకుండా ఎందుకు ఆటంకాలని కల్పించటం? దానికి సమాధానం సులభమే. మార్కెట్-ఆధారిత కన్స్యూమర్-సొసైటీ సోవియట్ యూనియన్ కి ప్రమాదకరం. Flannel Trousers కన్నా Jeans, Burt Bacharach కన్నా Mick Jagger లు కోరుకునే కన్స్యూమర్స్ ప్రాముఖ్యతలకి తగ్గట్లుగా సొసైటీ లో ఉన్న వనరులు ప్రతిస్పందించటం సోవియట్-యూనియన్ భావజాలానికి సరిపడని విషయం.

సోవియట్ వ్యవస్థలో పార్టీకి తెలుసు ఎవరికేం కావాలో. Brown Polyester Suits . వాటిని తయారు చేయమని ప్రభుత్వరంగ పరిశ్రమలకి ఆర్డర్ ని ఇచ్చేది.

కృశ్చేవ్ కలర్-టెలివిజన్ ని కాపీ చేయాలని అర్రులు చాచిఉండవచ్చేమో కానీ, Beatles ని మాత్రం ఖశ్చితంగా వద్దనుకున్నాడు . "సోవియట్ యువత కి ఇలాంటి Cacophonous rubbish " వద్దని పిలుపినిచ్చాడు.

ఏదేమైనా ఒకవైపు ధనికమవుతున్న అమెరికాతో Cold War లో ఆయుధాల్లో పోటీపడాలంటే సోవియట్ యూనియన్ కి కావలసింది Tanks, Tank-Tops కాదు, Strategic Bombers కావాలి, Stratocaster guitars కాదు. అని సోవియట్ నాయకులు అనుకున్నారు. కానీ అవేవీ జీన్స్ సోవియట్ యూనియన్ లోకి బ్లాక్-మార్కెట్(dealer fartsovshchiki ) ద్వారా స్మగుల్ అవటాన్ని ఆపలేకపోయాయి. సగటు నెల జీతం 200 రూబుల్స్ ఉన్న కాలంలో, ప్రభుత్వరంగ పరిశ్రమ తయారు చేసిన trousers పది రూబుల్స్ పలికితే, స్మగుల్ చేయబడిన ఒక్క జీన్స్ పెయిర్ 150-250 రూబుల్స్ వరకీ పలికేది. Prague లో ఎగసిన స్వేచ్చావాద ఉద్యమాలని ఉక్కుపాదంతో నలిపేసి, బెర్లిన్ నగరాన్ని తూర్పు, పశ్చిమ జర్మనీ ల కింద విడగొట్టడంతో కమ్యూనిజం ఎదురులేని, శాశ్వతంగా ఉండిపోయే వ్యవస్థగా కనపడింది. అయితే కమ్యూనిస్టు నాయకులు పొలిటికల్ ప్రత్యర్థులని అణచటంలో నిష్ణాతులయి ఉండవచ్చేమో కానీ, వెస్టర్న్ కన్స్యూమర్ సొసైటీ మోడల్ కి వారి ప్రతిఘటన బలహీనమయినదిగా మిగిలింది. ముఖ్యంగా ఈస్ట్-జర్మనీ ప్రజలు, పక్కనే ఉన్న వెస్ట్-జర్మనీ టెలివిజన్ల లోంచి ప్రసారమవుతున్న వెస్టర్న్-ఫ్యాషన్ ట్రెండ్స్ ని గమనిస్తున్నప్పుడు, ప్రజల మీద ఆ ప్రభావాన్ని అరికట్టటంలో సోవియట్ నాయకులు అచేతనులయ్యారు.

వెస్టర్న్ కన్స్యూమర్ ఇండస్ట్రీస్ లాభాలు గడిస్తూంటే , సోవియట్ లో వాటి పరిస్థితి దిగజారటం మొదలెట్టింది. 1973 కల్లా ఆర్ధిక వృద్ది ఒక శాతం కన్నా కిందకి దిగజారింది. ప్రొడక్టివిటీ పడిపోయింది. ప్రభుత్వరంగ పరిశ్రమలు తాము వాడుతున్న ముడిసరుకు విలువంత కూడా ధరలని రాబట్టులేకపోయాయి. Hayek హెచ్చరించినట్లుగానే, ఎక్కడయితే అర్దవంతమైన ధరలు ఉండక, కృత్రిమంగా నిర్ణయించబడతాయో, అక్కడ వనరులు అవసరమయినచోటకాక, ఇతర చోట్ల నిర్వియోనియోగం చేయబడ్డాయి. అవినీతి అధికారులు ఉత్పత్తి మీద ఆంక్షలు విధించి వారి లాభాల్ని పెంచుకున్నారు. కార్మికులు పని చేసినట్లుగా నామమాత్రం పని చేసేవారు. మానేజర్స్ జీతాలు నామమాత్రంగా ఇచ్చేవారు. ఇండస్ట్రియల్ కాపిటల్ స్టాకే కాకుండా, హ్యుమన్ కాపిటల్ స్టాక్ ని కూడా శ్రద్దగ్గా పట్టించుకోవటం మానేసారు. న్యూక్లియర్ ప్లాంట్స్ పాడవటం మొదలెట్టాయి. ఆల్కహాలిజం మితిమీరి పెరిగింది. అమెరికాతో ధీటుగా పోటీ పడదామన్న కృశ్చేవ్ కలలు కల్లలయ్యాయి. అమెరికా సగటు వ్యక్తిగత వినియోగం లో, కేవలం ఇరవైనాలుగు శాతం మాత్రం సోవియట్ అందుకోగలిగింది. అదే స్థాయిలో టర్కీ దేశంతో కూడా పోటీ పడలేకపోయింది. అదే సమయంలో సూపర్ పవర్స్ మధ్య అణ్వాయుధాల నియంత్రణ పట్ల కుదుర్చుకున్న పరస్పర అవగాహన వల్ల సోవియట్ యూనియన్ ఒక్క ఆయుధ పరిశ్రమలో మాత్రమే ఏర్పరుచుకున్న మాస్-ప్రోడక్షన్ సామర్ధ్యం అంతా నిరుపయోగమయింది. 1970 లలో పెరిగిన ఆయిల్ ధరలు, ఇంపోర్ట్ ఖర్చులని పెంచి వ్యవస్థలని స్థంభింపచేసాయి. 1980 లలో పడిపోయిన ఆయిల్-ధరలు, సోవియట్ బ్లాక్ ని కరెన్సీ రుణాల్లో వదిలేసాయి.


ఏ వ్యవస్థని అయితే కృశ్చేవ్ భూస్థాపితం చేస్తానని ప్రణామం చేసాడో , అదే వ్యవస్థ నుంచి సోవియట్ రుణం తెచ్చుకోవాల్సి వచ్చింది. 1985 లో ఎన్నికయిన మిఖాయిల్ గోర్భచేవ్ ఇక ఏ ఇతర మార్గమూ లేదనీ, ఆర్ధిక, పొలిటికల్ సంస్కరణల మార్గం పట్టక తప్పదని అభిప్రాయపడ్డాడు. పెరిస్త్రొయికా, గ్లాస్-నోస్త్ లాంటి పదాలు వాడుక పదాలయ్యాయి. తూర్పు బెర్లిన్ లోని మితవాదులకి ఏం చేయాలో పాలుపోక వెస్ట్ లోంచి వచ్చే పత్రికలని సెన్సార్ చేయటమే కాక, సోవియట్ లోపలి నుంచి పబ్లిష్ అవుతున్న ప్రచురణలని కూడా సెన్సార్ చేసారు.

1848, 1918 లలో లాగే 1989 లో వచ్చిన విప్లవం దావానలంలా వ్యాపించింది. ఫిబ్రవరి 1989 లో పోలండ్ ప్రభుత్వం Solidarity అనే ట్రేడ్ యూనియన్ తో చర్చలకి ఒప్పుకుంది. ఆ తర్వాత అతి త్వరలోనే దేశం స్వేచ్చాయుత ఎలక్షన్స్ కి వైపు అడుగులు వేయటం మొదలెట్టింది. అదే సంవత్సరం మే లో బుడాపెస్ట్, హంగేరీ కమ్యూనిస్టులు, ఆస్ట్రియా బోర్డర్ ని తెరవడానికి నిర్ణయించుకున్నారు. ఐరన్ కర్టన్ కి తుప్పు పట్టి శిథిలమవటం ప్రారంభమయింది. తూర్పు జర్మనీ ప్రజలు పశ్చిమ యూరప్ కి వలస మొదలెట్టారు. జూన్ లో Solidarity ఎలక్షన్స్ గెలిచి డెమొక్రటిక్ ప్రభుత్వాన్ని ఏర్పరచారు. సెప్టెంబర్ లో హంగేరీ లో కమ్యూనిస్టులు ప్రజాస్వామ్య రీతిలో ఎలక్షన్స్ నిర్వహించడానికి కి ఒప్పుకున్నారు. GDR నలభై వార్షికోత్సవం జరపడానికి ప్రణాళికలు జరుగుతున్నప్పుడు, వందలు, వేలతో మొదలయ్యి, పదుల వేలలో, వందల వేలల్లో ప్రజలు Leipzig వీధుల్లోకి వచ్చి Wir sind das Volk (We are the people) అని , పిదప Wir sind win Volk (We are One People ) అని ఊరేగింపుల్లో పాల్గొన్నారు. అయితే ఈసారి, 1956-Budapest, 1968-Prague, 1981-Gdansk, Beijing-1989 లలో మాదిరిగా కాక, పోలీసు దళాలు వారికి కేటాయించిన బరాక్స్ లలో డ్యూటీ చేసాయి. తూర్పు జర్మనీ లో దేశం bankruptcy లోకి వెళ్ళబోతోందని అర్ధం కాగానే Honecker ని పక్కకు నెట్టేసి ఆర్ధిక సంస్కరణలు చేయడానికి యువనాయకత్వం అడుగులు వేయటం మొదలెట్టారు. కానీ అప్పటికే ఆలస్యమయిపోయి సంస్కరించటానికి ఏమీ మిగల్లేదు. రొమేనియా లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వ అధికారులు అప్పటికే మార్కెట్ సంస్కరణల వల్ల రాబోయే లాభాలని అంచనా వేయటం మొదలెట్టారు.

9 Novermber 1989 న తూర్పు బెర్లిన్ ప్రజలకి అధికార బోర్డర్ మార్గాల గుండా స్వచ్చందంగా దేశం వదలి వెళ్ళగలిగే హక్కులని జారీ చేస్తున్నట్లుగా వార్త వెలువడింది. ఈస్ట్ బెర్లిన్ ప్రజలు వెల్లువెత్తి బోర్డర్ ని దాటారు. బెర్లిన్ గోడ కూలిపోవటంతో కోల్డ్ వార్ అంతమయిపోయినట్లేనని ప్రపంచానికి అర్ధమవటం ప్రారంభమయింది. కానీ 1991 లో మాస్కోలో జరిగిన అంతర్గత తిరుగుబాటు విఫలమయ్యి సోవియట్ యూనియన్ విచ్చిన్నమయ్యాక కానీ అధికారికంగా కోల్డ్ వార్ ముగిసిపోలేదు.



కొంతమందికి ఈ పరిణామాలు శరాఘాతం లాగా తగిలాయి. ప్రపంచం అంతమయిపోయినట్లుగా భావించారు. మరికొందరికిది రీగన్, థాచర్, పోప్ నాయకత్వంలో జరిగిన వెస్టర్న్ ప్రపంచపు తిరుగులేని విజయంగా కనపడింది.

ఇవి రెండూ కాక, మరికొంతమంది జాతీయతా భావం నెగ్గిందని అభిప్రాయపడ్డారు.

కానీ కన్స్యూమర్ సొసైటీలుగా సోవియట్ యూనియన్ విఫలమవ్వడమే వాటి అంతానికి దారితీసిందన్నది చరిత్రలో గమనించవచ్చు.

PYJAMAS AND SCARVES

మావో కమ్యూనిస్టు విప్లవం వస్తున్న రోజుల్లో(1949) , బహుశా ప్రపంచం మొత్తమ్మీద బోరింగ్ వస్త్రధారణ ఉన్న దేశం చైనా ఒక్కటేనేమో. Qing కాలం నాటి సిల్క్ మాయమయింది. చైనా చక్రవర్తుల వెస్టర్ దుస్తుల మోజున్న రోజులు వెళ్ళిపోయాయి. అందరికీ సమానత్వం పేరిట లైట్ గ్రే కలర్ పైజామాల్లా ఉండే దుస్తుల్ని చైనా ప్రజల మీద రుద్దడం జరిగింది.

అయినప్పటికీ, ఈరోజు ఏ చైనీస్ వీధిలోకి వెళ్ళి చూసినా ఎన్నో రంగుల్లో మెరిసిపోయే వెస్టర్న్ వస్త్రధారణతో చైనా
ప్రజలు కనపడతారు. Armani నుంచి Ermenegildo Zegna వరకీ హోర్డింగ్స్ కనపడతాయి. మిగతా ఇండస్ట్రియల్ రివల్యూషన్ ల లాగే, చైనా కూడా టెక్స్ టైల్ ఉత్పత్తులతోనే తన ప్రయాణం ప్రారంభించింది. మొన్న మొన్నటివరకీ కూడా SEZ జోన్లన్నీ కూడా వెస్టర్న్ ప్రపంచానికి ఎక్స్ పోర్ట్ ల కోసం ప్రారంభింపబడినవే. గత కొద్ది కాలంగా వెస్ట్ లో డిమాండ్ పడిపోవటంతో, చైనా ప్రభుత్వం , ప్రజలతో వినియోగాన్ని ఎలా పెంచి ఈ ఉత్పత్తులని కొనిపించాలా అని ఆలోచిస్తోంది. అంటే వెస్ట్ బాట పట్టినట్లేనా? ఏమో, తొందరపడి సమాధానం చెప్పలేము.

టర్కీ లోని ఇస్తాన్బుల్ కాస్మోపాలిటన్ నగరం . ఎంతో కాలంగా వెస్టర్న్ వస్త్రధారణ అక్కడ సాధారణం. కానీ గత కొద్దికాలంగా ఆడవాళ్లు headscarf, the veil ధరించాలన్న నియమాలు ప్రజాస్రవంతుల్లోకి వస్తున్నాయి. 1982 లో


ఎన్నికయిన మిలటరీ గవర్నమెంట్ యూనివర్సిటీ విద్యార్థినులందరూ తప్పనిసరిగా headscarf ధరించాలని శాసనాలు జారీ చేసారు. అది 1997 వరకీ ఖశ్చితమయిన అమల్లోకి రాలేదు, కానీ సుప్రీం కోర్టు ఈ విధమైన శాసనాలు రాజ్యాంగ ఉల్లంఘన క్రియలు అని తీర్పునిచ్చినప్పుడు, 1998 లో దేశవ్యాప్తంగా 140,000 ప్రజలు ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇస్తాన్బుల్ లో వేల కొద్దీ యువతులూ, విద్యార్ధినులూ, మేము క్లాస్ లని అయినా వదులుకుంటాం తప్ప, headscarves ని వదులుకోమని ఊరేగింపు చేసారు. కొంతమంది అమ్మాయిలు ఈ శాసనాన్ని అమలుపరచాల్సిందే అని ఆత్మహత్యలు చేసుకున్నారు. శాసనం రాజ్యాంగవిరుద్దం అని తీర్పునిచ్చిన జడ్జిని తుపాకితో పేల్చి చంపేసారు.
 
ఇలాంటి ఘటనల్ని చూసినప్పుడు మన వస్త్రధారణ కున్న లోతైన ప్రాముఖ్యత అవగాహనలోకి వస్తుంది. headscarf or veil ధరించడమన్నది వెస్టర్న్ సొసైటీ కి మూల స్థంభమయిన freedom-of-expression సూత్రం కింద పరిగణించి ఆహ్వానించాలా లేక ఇస్లాం లో, స్త్రీల పట్ల ఉండే లింగవివక్ష కి ప్రతీక అని తిరస్కరించాలా?

మిగతా వస్త్రాల్లాగే headscarves, veils లు కూడా ఇస్తాన్బుల్ వస్త్రధారణలో భాగమని ఇస్లామిస్టులు సమర్ధించవచ్చు గాక, కానీ షరియా లా అజెండా లో స్త్రీల హక్కులని నియత్రించడానికి ఉద్దేశించిన ఒక విస్తారమైన పధకంలో భాగమన్నది నిర్వివాదాంశం.
ఇస్తాన్బుల్ వీధుల్లో బురఖాలు భారీగానే దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో టర్కీ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులు యాధ్రిచ్చికమైనవేమీ కాదు. NATO లో భాగస్వామిగా, అమెరికా మిత్రదేశంగా, యూరోపియన్-యూనియన్ లో సభ్యురాలిగా ఉన్న టర్కీ, ఇప్పుడు తూర్పు వైపు మొగ్గు చూపుతోంది. ఒకప్పటి ottoman empire జ్ణాపకాలని తలచుకుంటూ, ఇరానియన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తో పాటుగా ముస్లిం ప్రపంచం నాయకత్వం కోసం దృష్టి సారిస్తోంది.
క్లుప్తంగా చెప్పాలంటే, మనం ఏం ధరిస్తామో అన్నది ముఖ్యమైన విషయం. వెస్టర్న్ ప్రపంచం తీసుకున్న రెండు భారీ ముందడుగుల్లో industrial evolution, consumer society లు అతి ముఖ్యమైనవి. అవి రెండూ కూడా వస్త్రాలకి సంబంధించినవే.
తక్కువ శ్రమతో ఎక్కువ వస్త్రాలని ఉత్పత్తిని చేయటం మొదటిదైతే, ఎక్కువ కనిపించేలా ధరించటం రెండవది. వెస్టర్న్ జీవనవిధానాలు మిగతా ప్రపంచానికి విస్తరించడంలోంచి వెస్టర్న్ వస్త్రధారణని విడదీసి చూడలేము.
యూరప్ లో పెరుగుతున్న ముస్లిం జనాభా వల్ల, లండన్ మరియు ఇతర యూరప్ నగరవీధుల్లో నిండైన బురఖాలు కన్పించటం సాధారణమైపోయింది. మరి బ్రిటన్ కూడా ఫ్రెంచ్ లాగే బురఖాలని పబ్లిక్ ప్లేసెస్ లో ధరించటం నిషేదించాలా? ఒకప్పడు మావోయిస్టు పైజామాలకి విరుగుడుగా శక్తివంతంగా పని చేసిన "జీన్స్ " లాగా, బురఖాకి మందుని వెస్టర్న్ ప్రపంచం ఏమైనా తీసుకురాగలదా?

బహుశా ఇవి సరైన ప్రశ్నలు కావేమో? ఇలాంటి ప్రశ్నలు వెస్టర్న్ సివిలైజేషన్ సాధించిన అతి గొప్ప విజయాలైన Capitalism, Science, Rule-of-law, Democracy లని కేవలం షాపింగ్ స్థాయికి దిగజార్చటం సబబు కాదేమో. Retail Therapy అన్నది మనముందున్న సమస్యలకి సమాధానమ్ కాకపోవచ్చు. బహుశా మన ముందున్న శత్రువు radical islamism కాదేమో, మన సాంస్కృతిక వారసత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం, మనమీద మనకున్న నమ్మకం దిగజారడమే వీటన్నిటికన్నా పెద్దశత్రువేమో?





3 comments:

  1. "జాతీయత" అనేది మిడిల్ క్లాస్ ప్రజల 'కొకెయిన్ '
    ---------------------------------------
    హ హ :-)

    సింగర్ మెషిన్ కి ఇంత చరిత్ర ఉందా ? భలే ఇంటరెస్టింగ్ గా ఉంది !
    ఇక జీన్స్ హిస్టరీ భలే !
    చాలా చాలా ఇంటరెస్టింగ్ గా ఉండిది కుమార్ జీ ! Thank you !

    ReplyDelete
  2. డ్రెస్సింగ్ తో మొదలెట్టి, తయారీదార్లూ, కుట్టుమిషన్లూ, జీన్సూ, జపానూ దాని ఎదుగుదలే కాకుండా రష్యా పతనం , బెర్లిన్ గోడ కూలడం తో సహా ఏదీ వదల్లేదుగా..అట్లాస్ ష్రగ్గెడ్ ఏమైనా గుర్తుందా? బాగా రాసారు అనేది చిన్నమాట:)))

    ReplyDelete